01/08/2025
శ్రీశ్రీశ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ(ఖత్రి)కర్నూల్ సమాజ్
శ్రీ శ్రీ శ్రీ మాత అంబా భవాని భజన కర్నూలు బృందం,
శ్రావణమాసం మన మాత అంబా భవాని భజన బృందం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు వెలిసిన శ్రీశైలంలో భజన చేయడం జరిగినది.
మన భజన బృందం ఎన్నో సంవత్సరాలుగా నిరంతరంగా శ్రద్ధగా భజనలు చేసుకుంటూ,శ్రీశైలం దేవస్థానంలో మంచి గుర్తింపు సాధించింది.ఇది మన సమాజ్‌కి గౌరవం, మన భక్తి పరంపరకి మహత్తు తీసుకువచ్చే కార్యక్రమం.
శ్రీశైల క్షేత్ర భక్తినీయమైన
శక్తి పీఠం – జ్యోతిర్లింగం వెలసిన చోట,
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున పాదాల వద్ద
మన భజన బృందం గానం చేయుట పరమ భాగ్యం!
ఏక స్వరాలతో, నిశ్చల భక్తితో,
నిరంతర సాధన గళములతో,
మన సమాజ గొప్పతనాన్ని ఘనంగా చాటే
తరతరాల భక్తి సంప్రదాయానికి నిలువెత్తు సాక్ష్యం!
ఈసారి భజన కార్యక్రమం సఫలముగా ముగిసినది.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కృప మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ,
అందరికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాము.