07/07/2026
1940 1980 ప్రాంతంలో, హైదరాబాద్ శంకర్పల్లి, పరిసర ప్రాంతాల్లో, మోమిన్ పెట్ గ్రామానికి సమీపంలో, మోరియా మఠం మఠాధిపతి, మహా తపోసంపన్నుడు, దమయప్పస్వామి గారు ఉండేవారు. వీరు అత్యంత ధర్మ నిష్ఠగరిష్ఠులు. నాటి రోజుల్లో వీరు గ్రామ గ్రామాల్లో సంచరిస్తూ, భక్తుల ఇండ్లకు వెళ్లి,భక్తులకు దిశా దశా నిర్దేశము చేసేవారు. అందువల్ల వీరికి ఎందరో భక్తులు ఉండేవారు. కొందరు భక్తులు గురువుగారికి, ఇష్టపూర్వకంగా, వస్తువులను ధనధాన్యాధులను వ్యవసాయ పొలాలను దానంగా ఇచ్చేవారు.వీరు త్రికాల ఇష్టలింగ పూజా దురంధరులు. వీరి తపోనిష్ట వల్ల వీరికి వాక్షుద్ది ఎంతో ఉండేది. మా తండ్రిగారు చెప్పిన ఒక జ్ఞాపకం ప్రకారం," ఈ గురువుగారు ఒక ఊరికి వెళితే ఆ సందర్భంలో ఊరిలో కొన్ని గుడిసెలకి నిప్పు అంటుకున్నదట. గురువుగారి ముందు కొందరు భక్తులు కూర్చున్నారట. కానీ గ్రామంలోని ప్రజలు నిప్పు అంటుకున్న ఇండ్ల వైపుకి , ఆత్రుతతో, పరుగులు తీశారట. గురువుగారి దగ్గర ఉన్న కొందరు శిష్యులు కూడా భయంతో, ఆదుర్దాతో, గుడిసెల వైపు పరిగెత్తటానికి సిద్ధమవుతుండగా," గురువుగారు వారిని పిలిచి "ఎందుకు వెళ్తున్నారు" అని అంటే "ఊర్లో గుడిసెలకు నిప్పు అంటుకోవడంతో ప్రజలు భయభ్రాంతులతో, అక్కడికి ,అందుకే వెళ్తున్నారు,"అనగానే, గురువుగారు వారిని సముదాయిస్తూ, "ఏ ఒక్క గుడిసె కూడా కాలడం లేదు. అంతా సవ్యంగానే ఉంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు" అని చెప్పటంతో వారు అక్కడే కూర్చున్నారట. తరువాత గ్రామస్తులు వచ్చి గుడిసెలకు నిప్పు అంటుకోవడం నిజమే! కానీ అంటుకున్న నిప్పు మాత్రం అప్పటికప్పుడు, చూస్తుండగానే ఆరిపోయింది. ఇది ఏమి మాయనో ఏమో" అని అక్కడి గ్రామస్తులు అనుకున్నారట.. అక్కడున్న గురువు గారి శిష్యులు గురువుగారీ మాటలను అర్థం చేసుకొని, నిప్పుంటుకున్న గుడిసెలు మళ్లీ అవంతటా అవే ఆరిపోవడం, గుడిసెలకు ఏమాత్రం నష్టం కలగకపోవడం, ఈ గురువుగారి మాట ప్రభావమే అని అనుకొని, ఆశ్చర్యపోయి, ఆ గురువుగారి పాదాలకు నమస్కరించారట. ఇది నాటి రోజుల్లో ఉన్న దమ్మయప్ప స్వామి గారి వాక్ శుద్ధి. దూరంలో ఎక్కడో నిప్పు అంటుకున్నప్పటికీ, ఇంటి నుండి కదలక, వాటిని ఆర్పిన ఘనత గురువుగారి మహిమేనని భావిస్తూ, గురువుగారి పట్ల అత్యంత విశ్వాసాన్ని పెంచుకున్నారట. నాటి రోజుల్లో మఠాధిపతుల వాక్షుద్ధి ప్రభావం ఆ విధంగా ఉండేది.దీన్నే గురువులవారికి గల అతీంద్రియశక్తుల ప్రభావమని అంటారు. ఎందుకంటే, వారి జీవన విధానంలో, ఆధ్యాత్మికతతో పాటు నిష్ట, నియమము, పట్టుదలతో దైవారాధన, దైవం పట్ల, ధర్మము పట్ల అత్యంత విశ్వాసము, వారు గడిపిన ఆధ్యాత్మిక పరిపూర్ణ జీవన విధానము, వారి మాటల్లో, చేతుల్లో, చేతుల్లో దాగివున్న ఆధ్యాత్మికపరమైన మహిమాన్విత శక్తి అని అనవచ్చు.. మీ శ్రేయోభిలాషి లాల్కోట వీరప్ప.1940 1980 ప్రాంతంలో, హైదరాబాద్ శంకర్పల్లి, పరిసర ప్రాంతాల్లో, మోమిన్ పెట్ గ్రామానికి సమీపంలో, మోరియా మఠం మఠాధిపతి, మహా తపోసంపన్నుడు, దమయప్పస్వామి గారు ఉండేవారు. వీరు అత్యంత ధర్మ నిష్ఠగరిష్ఠులు. నాటి రోజుల్లో వీరు గ్రామ గ్రామాల్లో సంచరిస్తూ, భక్తుల ఇండ్లకు వెళ్లి,భక్తులకు దిశా దశా నిర్దేశము చేసేవారు. అందువల్ల వీరికి ఎందరో భక్తులు ఉండేవారు. కొందరు భక్తులు గురువుగారికి, ఇష్టపూర్వకంగా, వస్తువులను ధనధాన్యాధులను వ్యవసాయ పొలాలను దానంగా ఇచ్చేవారు.వీరు త్రికాల ఇష్టలింగ పూజా దురంధరులు. వీరి తపోనిష్ట వల్ల వీరికి వాక్షుద్ది ఎంతో ఉండేది. మా తండ్రిగారు చెప్పిన ఒక జ్ఞాపకం ప్రకారం," ఈ గురువుగారు ఒక ఊరికి వెళితే ఆ సందర్భంలో ఊరిలో కొన్ని గుడిసెలకి నిప్పు అంటుకున్నదట. గురువుగారి ముందు కొందరు భక్తులు కూర్చున్నారట. కానీ గ్రామంలోని ప్రజలు నిప్పు అంటుకున్న ఇండ్ల వైపుకి , ఆత్రుతతో, పరుగులు తీశారట. గురువుగారి దగ్గర ఉన్న కొందరు శిష్యులు కూడా భయంతో, ఆదుర్దాతో, గుడిసెల వైపు పరిగెత్తటానికి సిద్ధమవుతుండగా," గురువుగారు వారిని పిలిచి "ఎందుకు వెళ్తున్నారు" అని అంటే "ఊర్లో గుడిసెలకు నిప్పు అంటుకోవడంతో ప్రజలు భయభ్రాంతులతో, అక్కడికి ,అందుకే వెళ్తున్నారు,"అనగానే, గురువుగారు వారిని సముదాయిస్తూ, "ఏ ఒక్క గుడిసె కూడా కాలడం లేదు. అంతా సవ్యంగానే ఉంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు" అని చెప్పటంతో వారు అక్కడే కూర్చున్నారట. తరువాత గ్రామస్తులు వచ్చి గుడిసెలకు నిప్పు అంటుకోవడం నిజమే! కానీ అంటుకున్న నిప్పు మాత్రం అప్పటికప్పుడు, చూస్తుండగానే ఆరిపోయింది. ఇది ఏమి మాయనో ఏమో" అని అక్కడి గ్రామస్తులు అనుకున్నారట.. అక్కడున్న గురువు గారి శిష్యులు గురువుగారీ మాటలను అర్థం చేసుకొని, నిప్పుంటుకున్న గుడిసెలు మళ్లీ అవంతటా అవే ఆరిపోవడం, గుడిసెలకు ఏమాత్రం నష్టం కలగకపోవడం, ఈ గురువుగారి మాట ప్రభావమే అని అనుకొని, ఆశ్చర్యపోయి, ఆ గురువుగారి పాదాలకు నమస్కరించారట. ఇది నాటి రోజుల్లో ఉన్న దమ్మయప్ప స్వామి గారి వాక్ శుద్ధి. దూరంలో ఎక్కడో నిప్పు అంటుకున్నప్పటికీ, ఇంటి నుండి కదలక, వాటిని ఆర్పిన ఘనత గురువుగారి మహిమేనని భావిస్తూ, గురువుగారి పట్ల అత్యంత విశ్వాసాన్ని పెంచుకున్నారట. నాటి రోజుల్లో మఠాధిపతుల వాక్షుద్ధి ప్రభావం ఆ విధంగా ఉండేది.దీన్నే గురువులవారికి గల అతీంద్రియశక్తుల ప్రభావమని అంటారు. ఎందుకంటే, వారి జీవన విధానంలో, ఆధ్యాత్మికతతో పాటు నిష్ట, నియమము, పట్టుదలతో దైవారాధన, దైవం పట్ల, ధర్మము పట్ల అత్యంత విశ్వాసము, వారు గడిపిన ఆధ్యాత్మిక పరిపూర్ణ జీవన విధానము, వారి మాటల్లో, చేతుల్లో, చేతుల్లో దాగివున్న ఆధ్యాత్మికపరమైన మహిమాన్విత శక్తి అని అనవచ్చు.. మీ శ్రేయోభిలాషి లాల్కోట వీరప్ప.