Sathgurudathakrupalayam

Sathgurudathakrupalayam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sathgurudathakrupalayam, Hindu temple, Ameen Abbas Nagar, Kurmul.

18/02/2017

నాయన! శ్రీగురుపరమాత్మ మహాజ్ఞాని. తనయొక్క జ్ఞాన శక్తి సామర్థ్యము చేత తత్వమును సృజించి మరియు శ్రీగురుదేవుడు తాను సృజించిన ఈ తత్వమునుండి వేదములను తద్వారా ఉపనిషత్తులు, శాస్త్రములను జీవుల నుద్ధరింప తత్వమాలా విభూషితుడుగా ఈజగమునందు కీర్తింపబడు చున్నాడని మహాత్ములు, గురువుల ద్వారా స్పష్టమగు చున్నది.

1. వేదములు:- ఆయా దేశకాల వాతావరణముల ననుసరించి ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండగా స్థిరముగా సర్వకాలములయందును ఈజగమునందు జీవుల స్థితి గతులను చక్కగా నడిపించు విధముగా యున్నవి.

2.ఉపనిషత్తులు:- వేదములయందు చెప్పబడిన విషయములను ఈజగమునందు మహాత్ములు, గురువుల ద్వారా జీవులను పరివర్తనను కలిగించునవిగా యున్నవి.

3.శాస్త్రములు:- మహాత్ముల చేత ఉచ్చరింప (వివరింప) బడిన ఉపనిషద్విషయములను శాసనములుగాను వాటినే ప్రామాణికముగా జేసుకొని ఈజగమునందు జీవులను ఆచరణాత్మకముగా సన్మార్గమున నడిపించు విధముగా శాస్త్రములుగా యున్నవి.

ఈవిధముగా శ్రీగురుదేవుడు తనయొక్క తత్వ విజ్ఞానముచేత జీవుల నుద్ధరింప పరమ దయతో భుక్తిని, మరియు ముముక్షువులకు ముక్తిని ప్రసాదించు చున్నాడు.

కావున అటువంటి పరమ దయాళువైన శ్రీగురుదేవుని జీవులు/ సాధకులు/ శిష్యులు ఆయా మార్గముల ననుసరించి సేవించి తరించవలసి యున్నది.

శుభమస్తు నాయన.

03/02/2017

నాయన! శ్రీగురుపరమాత్మ (భగవంతుడు) నిరాకారుడు అనగా ఆకారమనునదియే లేక యున్నాడనియు అందుకే ఆ శ్రీగురుపరమాత్మను సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ యనియు మహాత్ములు, గురువుల ద్వారా మనకు స్పష్టమగుచున్నది.

1 . సత్యం:- దేశ,కాల, వాతావరణ పరిస్థితులకు లోనుగాకుండగా అనగా ఎలాంటి మార్పులు, చేర్పులు గాని లేకుండగా స్థిరముగా యున్నందున సత్యముగాను.

2 . జ్ఞానం:- మరపు అనునది లేనిది (తెలియనిది) గా యున్నది. అనగా సర్వకాల, సర్వావస్థల యందును మెలకువగా, జ్ఞాపకముగా తెలియబడు చున్నందున జ్ఞానముగాను.

3 . అనంతం:- పరిమితులు (ఎల్లలు, హద్దులు) లేనిదిగా అనగా ఆద్యంతములు లేక అపరిమితముగా ఈవిశ్వమంతయు ఆవరించి (వ్యాపించి) యున్నందున అనంతముగాను.

4 .బ్రహ్మ:- ఇక్కడ, అక్కడ, ఎప్పుడు, ఎక్కడ అనెడి తారతమ్యములు లేక త్రికాలములందును అనగా సర్వదా ఈ బ్రహ్మాండమునందు ఆవరించి (వ్యాపించి) యున్నందున బ్రహ్మముగాను యున్నాడు.

అటువంటి శ్రీగురుపరమాత్మను ఎవరైతే దర్శించి యున్నారో వారలే కదా మార్గదర్శకులు, గురువులుగా జీవుల నుద్ధరింప ఈప్రపంచమునందు నేటికిని యున్నారు.

కావున జీవులు/ సాధకులు/ శిష్యులు అట్టి మార్గదర్శకు లైన గురువులను సేవించి తరించవలయును.

శుభమస్తు నాయన.

27/01/2017

నాయన ! శ్రీగురుపరమాత్మ మరియు భగవంతుడు వేరు వేరు కాదు. ఈసమస్త జగత్తునకు శ్రీగురుపరమాత్మ (భగవంతుడు) ఆధారభూతుడనియు అనగా ఈ సమస్త విశ్వమంతయు భగవంతుని ఆధారముగా జేసుకొని ప్రకాశించుచున్నదనియు మహాత్ములు,గురువుల ద్వారా మనకు స్పష్టమగుచున్నది.

ఈ జగత్తు అంతయు భగవానుడే తన అవతారము (రూపము) గా వ్యాపించి యున్నాడు. అనగా సకల దేవతా స్వరూపములు గాను, సకల సాధు స్వరూపములు గాను, స్థావరములు గాను, జంగమములు గాను, అంతేగాకుండగా,ఈ అనంత విశ్వమంతయు తానేయై యున్నారనియు మరియు ఇది సత్యము, సత్యము, సత్యము యని ముమ్మారులు మహాత్ములు, గురువులు నొక్కి వక్కాణించినట్లుగా మన పెద్దల ద్వారా మనకు తెలియబడుచున్నది.

కావున ఈ సమస్త విశ్వము అంతయు భగవంతుడు తానేయై యున్నారనెడి సత్యమును తెలిసికొని (దర్శించి) తరించవలసి యున్నది. ఆలా ఎవరైతే భగవంతుడిని దర్శించి యున్నారో వారలే కదా గురువులు, మహాత్ములు, మార్గదర్శకులుగా మరియు గురు పరంపరగా జీవుల నుద్ధరింప నేటికిని ఈ ప్రపంచము నందు యున్నారు.

కావున జీవులు/ సాధకులు/ శిష్యులు అట్టి మార్గదర్శకు లైన గురువులను సేవించి తరించవలయును.

శుభమస్తు నాయన.

25/01/2017

SATHGURU DATHA KRUPALAYAM KURNOOL.
Subhamasthu Nayana :

26-01-2017 Thursday SRI ANNAPURNESWARI MATHA 5th varshikothsavam sandarbhamuga CHANDI HOMAM 8:30 AM nundi 12:00 PM varaku Nithyanna Khestram Sathguru Datha Krupalayam Kurnool (NH 7 Beside Eenadu Office , Behind Bharat Petroleum Pump) nandu jarugunu.

Kavuna meeru mee kutumba sabhyulu andaru ee CHANDI HOMAM karyakramamulo palgone mariyu Ammavari thertha prasadamulanu swekarinchagalaraniyu mariyu CHANDI MATHA ,ANNAPURNESWARI MATHA krupaku pathrulu kagalarani koradamainadi.
Subhamasthu.
Chandra Sekhara Reddy K
Founder SDK-KNL.

20/01/2017

నాయన! శ్రీగురుపరమాత్మ అఖండ, అద్వితీయ, పరిపూర్ణుడుగా ఈజగత్తు (ప్రపంచము) నందు తానేయై జీవ, జడ విషయ పదార్థముల యందు విస్తరించి యున్నాడు.

1 . అఖండ స్వరూపుడు :- శ్రీగురుపరమాత్మ తనయొక్క చైతన్యము చేత ఈజగత్తును సృజింపజేసి ఈసమస్త (జీవ, జడాత్మక) విషయ విశ్వము తానేయై ( తనరూపముగా) మరియు తనకన్న భిన్నమగు వస్తు పదార్థము తెలియక (లేకుండ) యుండుటచేత అఖండ స్వరూపుడుగా యున్నాడు.

2. అద్వితీయుడు :- శ్రీగురుపరమాత్మ సకల ప్రాణికోటి యొక్క అంతరంగమున ఆత్మస్వరూపుడుగా తానేయై భిన్నత్వములో ఏకత్వముగా యున్నందున ఏకాత్మస్వరూపుడు,అద్వితీయుడు(అద్వైతము) గా యున్నాడు.

3. పరిపూర్ణుడు:- ఈసమస్త విశ్వమునందు శ్రీగురుపరమాత్మ తానేయై యుండి ఎలాంటి ఆశ, పాశములకు లోనుగాకుండగను మరియు ఇంకను కావలయుననెడి కోరిక ఏమాత్రము లేనివారుగా అనగా వైరాగ్యమునే ఆభరణముగా కలిగి జ్ఞానిగా, పరిపూర్ణుడుగా ఈవిశ్వమునకు గురుస్వరూపముగా శ్రీదక్షిణామూర్తి అవతరించి యున్నారు.

అటువంటి అఖండ, అద్వితీయ,పరిపూర్ణుడైన శ్రీగురుపరబ్రహ్మను దర్శించి తరించవలసి యున్నది.

కావున జీవుడు/ సాధకుడు/ శిష్యుడు ప్రత్యక్ష శ్రీగురుదేవుని సేవించి/ ధ్యానించి తరించవలయును.

శుభమస్తు నాయన.

16/01/2017

నాయన! “శ్రీగురు పరమాత్మ 1 . సర్వవ్యాపి అనగా అనేకత్వములో ఏకత్వముగా సకల ప్రాణికోటియందు తానేయై వ్యాపించి (ఆవరించి) యున్నందున సర్వవ్యాపిగాను, 2. సర్వాన్తర్యామి అనగా శ్రీగురు పరమాత్మ సకల ప్రాణికోటి యొక్క అంతరంగమున ఆత్మస్వరూపముగా తానేయై యున్నందున సర్వాన్తర్యామిగా, ఏకాత్మస్వరూపుడుగా ప్రాణికోటికి సాక్షిభూతుడు, కారణభూతుడుగాను ఈజగత్తు నందు యున్నాడు .

అయితే జీవుడు తన బుద్ధ్యహంకారముల చేత సంకల్ప, వికల్పములతో స్వపర భేదములను కూడి జీవుడు వేరు, ఈ అనంత విశ్వము వేరు అనెడి భేద భావముచే అరిషడ్వర్గములకు లోనై ఈమిధ్యా ప్రపంచమున అజ్ఞానము (ఏమియూతెలియని తనము) చేత జాగ్రత్త, స్వప్న, సుషుప్తి యవస్థల యందు తిరుగాడుచూ జ్ఞానమూర్తియైన శ్రీగురు పరమాత్మను తెలియకున్నాడు.

శ్రీగురు పరమాత్మ ఈవిశ్వమునందు జ్ఞానమనెడి విభూతి (ఐశ్వర్యము) చేత ఏకాత్మ స్వరూపుడుగా, జ్ఞానిగా ముముక్షువుల నుద్ధరింప శ్రీగురుస్వరూపము దక్షిణామూర్తిగా అవతరించి యున్నారు. అటువంటి శ్రీగురు పరమాత్మను దర్శించ వలయుననిన మార్గదర్శకుడైన శ్రీగురుదేవుని సేవించి తరించవలసియున్నది.

కావున జీవుడు/ సాధకుడు/ శిష్యుడు ప్రత్యక్ష గురుదేవుని సేవించి/ ధ్యానించి తరించవలయును.” శుభమస్తు నాయన.

16/01/2017

నాయన! “శ్రీగురుపరమాత్మ సర్వాధికుడై తనయొక్క చైతన్యము చేత ఈచరాచర సృష్టిలోగల సకల ప్రాణికోటిని అదృశ్యముగా అనగా ఆత్మస్వరూపుడై సాక్షిభూతుడుగా తానేయై చక్కగా నడిపించుచున్నాడు.

అయితే ఈ ప్రాణికోటియందు జీవుడు బుద్ధి జీవిగా ఉత్తమ జన్మమును పొంది స్వతంత్రుడుగా ఈప్రకృతియందు జీవన యాత్రను గావించుచున్నాడు.

అనగా జీవుడు తనయొక్క బుద్ధి, మనస్సు,అహంకారము (దేహాభిమానము) , ఇంద్రియములు 10 .( జ్ఞానేంద్రియములు 5 + కర్మేంద్రియములు 5 ) మరియు సంకల్ప, వికల్పములు వీటిచేత నేను అనెడి భావముతో స్వతంత్రించి కర్మముల నాచరించుచూ సుఖ, దుఃఖముల వలయమనెడి, ఈ జనన,మరణ చక్ర బంధనమునందు చిక్కుకొని దిక్కుతెలియక తనయొక్క స్వస్వరూప (ఆత్మ సాక్షాత్కార) స్థితిని తెలియక యున్నాడు.

కావున ఆత్మ స్వరూపుడైన శ్రీగురుపరమాత్మను దర్శించవలయుననిన మార్గదర్శకుడైన ప్రత్యక్ష గురువు అత్యవసరముగా యున్నాడు. కావున జీవుడు/ సాధకుడు/ శిష్యుడు ప్రత్యక్ష గురుదేవుని సేవించి/ ధ్యానించి తరించవలయును” శుభమస్తు నాయన.

16/01/2017

30.12.2016

నాయన! "శ్రీగురుపరమాత్మ 1 .సర్వవ్యాపి :- ఈసమస్త జగత్తు యంతయూ శ్రీగురుపరమాత్మ చైతన్యముగా తానేయై నిండి (ఆవరించి) యున్నందున సర్వవ్యాపిగాను,

2. చైతన్యమూర్తి :- ఈజగత్తు శ్రీగురుపరమాత్మచే స్థిరమై నిండియున్నందున స్వయం ప్రకాశమానమై ఈజగత్తు చైతన్యవంతముగా యున్నది.

3. సర్వాధికుడు:- పంచభూతాత్మకమైన ఈప్రపంచము శ్రీగురుపరమాత్మ నుండియే ఉద్భవించినందున శ్రీగురుదేవుడు ఈజగత్తు(ప్రపంచము) నకు ఆధారభూతుడై యున్నాడు. ఇందు మూలముగా శ్రీగురుదేవుడు సర్వాధికుడుగా యున్నాడు.

4. ప్రేమమూర్తి :- ఈజగత్తు శ్రీగురుపరమాత్మ నుండియే ఉద్భవించుటయు మరియు ఈజగత్తునందు తానేయై యుండి పరస్పర ప్రేమానురాగముగా యున్నందున ప్రేమమూర్తిగా యున్నాడు.

కావున శ్రీగురుపరమాత్మ ఈచరాచర జగత్తునందు సర్వవ్యాపకుడు, చైతన్యమూర్తి, సర్వాధికుడు, ప్రేమమూర్తి గా యున్నాడు.అటువంటి శ్రీగురుదేవుని సేవించు మార్గము ధ్యానమొక్కటేయై యున్నందున జీవుడు/ సాధకుడు/ శిష్యుడు శ్రీగురుదేవుని ధ్యానించి తరించవలయును." శుభమస్తు నాయన.

23/12/2016

నాయన ! ఏ శ్రీ గురుపరమాత్మ యొక్క చైతన్యము చేత కార్య, కారణ రూపములుగా ప్రకృతి ( పంచభూతములు) గా నిరంతరము ఈ జగత్తు అంతయూ నిలిచియున్నదనియు అనగా ఈసమస్త జగత్తు (ప్రపంచము) నకు శ్రీగురు పరమాత్మయే ఆధారభూతమై యున్నారనియూ మహాత్ములు, గురువుల ద్వారా మనకు స్పష్టముగా తెలియబడుచున్నది.

శ్రీగురుపరమాత్మ యొక్క స్వరూపలక్షణము సచ్చిదానందముగా యున్నది. కావున శ్రీగురుపరమాత్మ తనయొక్క ఆనందము చేతనే ఈజగత్తు నందు గల సకల జీవులు ఆనందింపబడుచున్నారు.

ఈవిధముగా జీవుడు కూడా ఆనందస్వరూపుడే యనియు తెలియబడుచున్నది. అనగా జీవబ్రహ్మైక్య స్థితి యనెడి ఆనందమయ స్థితిని పొందుచున్నాడు.

కావున జీవుడు/ సాధకుడు/ శిష్యుడు శ్రీగురుదేవుని త్రికరణశుద్ధిగా సేవించి అట్టి జీవబ్రహ్మైక్య స్థితిని పొందవలసియున్నది.

శుభమస్తు నాయన.

08/12/2016

నాయన! "మనకు ( జీవునకు) జన్మకు కారణముగా తల్లి , తండ్రులు తద్వారా బంధు, మిత్రాదులు ఇందరు ఈజగత్తునందు సహజీవనముగా సంసారమనెడి కర్మబంధనములతో కూడి సమస్యలకు లోనై భేదాభిప్రాయములతో సందర్భానుసారముగా విచక్షణారహితముగా జీవనము చేయుచున్నారము. అందుకు పరిష్కార మార్గముగా తమ, తమ ఇష్టదైవమును ఆరాధించి సమస్యలకు తాత్కాలిక ఉపశమనమును పొందుచున్నారము.

అందుకే జీవుల నుద్ధరింప శ్రీగురుపరమాత్మ ఈభువియందు గురువుగా శ్రీ దక్షిణామూర్తిగా అవతరించి యున్నారు.

అటువంటి శ్రీగురుదేవులు మనలను (జీవులు/ సాధకులు/ శిష్యులను) సర్వవిధములుగా రక్షించునట్టి తండ్రిగాను, ప్రేమతో ఆదరించి పోషించునట్టి తల్లిగాను, హితా,హితములను తెలియపరచి చక్కగా నడిపించు బంధువుగానూ, మరియు సుఖజీవన నిమిత్తమై సమస్తసంపదలకు నిలయమైన పుణ్యమూర్తిగా చెప్పబడు ఇష్టదైవముగాను

అంతేగాకుండగా సంసారమనెడి మోహభ్రాంతి నుండి అనగా కర్మబంధనములను పూర్తిగా నశింప (తొలగింప) జేసి చక్కగా సాధనమార్గములో పయనింపజేసి జ్ఞానసిద్ధిని ప్రసాదించు జ్ఞానమూర్తి (శ్రీగురుదేవులు) గా యున్నారు.

అటువంటి ప్రత్యక్ష గురుదేవుని త్రికరణశుద్ధిగా సేవించి తరించవలయును."

శుభమస్తు నాయన.

01/12/2016

నాయన! "చైతన్యమూర్తి (తత్వమసి) గా ఈచరాచర జగత్తు అంతయు తానెయై శ్రీగురు పరమాత్మచే సృజించ బడినదనియు, అటువంటి శ్రీగురుపరమాత్మ

1. నిరాకారుడు అనగా ఎలాంటి ఆకారమనునదియేలేక (తత్వమసిగాను)

2 . నిర్గుణుడు అనగా ఎలాంటి గుణములు లేక గుణాతీతుడై ( సత్వ , రజో, తమో గుణములకతీతుడై త్రిగుణాతీతుడుగాను )

3 . నిర్మలుడు అనగా కర్మబంధములుగా చెప్పబడు ఈ మాయ, మాలిన్యములకు అతీతుడై పరిశుద్దుడుగాను

4 . శాంతుడు అనగా సంకల్ప , వికల్పములు లేక నిశ్చలుడై ఎలాంటి కదలికలు లేక పరమ శాంతస్వరూపుడుగాను

5 . జంగమము అనగా కదలికలతో కూడి తిరుగాడునట్టి మనుష్య మరియు మానవేతర జన్మములుగా, సకలప్రాణికోటిగా ను మరియు

6 . స్థిరము అనగా ఎలాంటి కదలికలు లేక స్థిరముగా నున్నట్టి పర్వతాదులుగా చెప్పబడు ఈ సమస్త లోకము (ప్రపంచము) నందును వ్యాపించి సర్వాంతర్యామిగా యున్నారు.

ఈ శ్రీగురు పరమాత్మను తెలిసికొని సేవించుట జీవులు / సాధకులు/ శిష్యులకు చాల అనితర సాధ్యము. కావున ఆపరమాత్మ మనలను (జీవులు/సాధకులు/ శిష్యులు) ఉద్ధరింప అనాదిగా శ్రీ గురుస్వసరూపముగా
శ్రీ దక్షిణామూర్తిగా ఈ భువిపై అవతరించి యున్నారు. అప్పటినుండి ఈరోజు వరకు కూడా ఇది ఈ గురుపరంపరగా స్థిరముగా వచ్చుచున్నది .

కావున ఈ గురు పరంపరలో ప్రస్తుతమున్నట్టి ప్రత్యక్ష గురువులను జీవులు/సాధకులు/ శిష్యులు సేవించి తరించవలయును. "

శుభమస్తు నాయన .

24/11/2016

నాయన! "ఈ మిధ్యా జగత్తు (ప్రపంచము) నందు ఏమియూ దిక్కుతెలియని స్థితిలో కొట్టుమిట్టాడుచున్నట్టి జీవులు / సాధకులు/ శిష్యులను శ్రీగురుదేవుడు తన కృపాకటాక్షములచేత వేదాంత శాస్త్రముల యందు చెప్పబడిన ఆత్మ తత్వజ్ఞాన బోధనల చేతను మరియు సాధనా మార్గముల నుపదేశించి, సాధనమార్గములు అనగా నిస్వార్థ,నిష్కామ కర్మసేవలు, ధ్యాస, ధ్యానాదులు, మరియు ఆత్మానాత్మ (నేనెవరు యనెడి) విచారణముల నాచరింప జేయుచు,

విశేషించి సాధన పరిపక్వతను కలిగిన ముముక్షువునకు నిముషము,ఆరనిముషము, లేదా క్షణకాలములో అనగా అతిశీఘ్రముగా తనకు (జీవునకు/సాధకునకు/శిష్యునకు) ఆవరించి యున్నట్టి జన్మకర్మ బంధనములుగా చెప్పబడు సకల అజ్ఞాన ఆవరణము లనెడి సంసారబంధనముల నుండి విముక్తుని గావించి జ్ఞానినిగా చేయుచున్నాడు.

అనగా జీవుడు తనను తానే శివునిగా తెలిసికొనునట్లు గా జేసి జీవుని పరబ్రహ్మమునందు ఐక్యము గావించుచున్నాడు. దీనినే జీవ బ్రహ్మైక్య స్థితి యని మహాత్ములు, గురువుల ద్వారా తెలియబడినది.

కావున జీవులు/ సాధకులు/ శిష్యులు అట్టి పరమ దయాళువగు శ్రీగురుదేవుని త్రికరణశుద్ధిగా సేవించి తరించవలయును."

శుభమస్తు నాయన .

Address

Ameen Abbas Nagar
Kurmul
518002

Alerts

Be the first to know and let us send you an email when Sathgurudathakrupalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sathgurudathakrupalayam:

Share

Category