Amrutheshwara Alayam-Lingamaiah Gutta, Pothangal

Amrutheshwara Alayam-Lingamaiah Gutta, Pothangal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Amrutheshwara Alayam-Lingamaiah Gutta, Pothangal, Religious organisation, Pothangal, Kotagiri.

21/04/2023
20/04/2023
ఈరోజు పోతంగల్ గ్రామానికి విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ ధర్మగూరు ఆనంద సరస్వతి శ్రీ మహాకాల్ అఖాడా.ఉజ్జయినీ గారు గ్రామంలోని అతి ...
14/07/2022

ఈరోజు పోతంగల్ గ్రామానికి విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ ధర్మగూరు ఆనంద సరస్వతి శ్రీ మహాకాల్ అఖాడా.ఉజ్జయినీ గారు గ్రామంలోని అతి పురాతన దేవాలయం శ్రీ అమృతేశ్వరాలయం మరియు శ్రీ వీరభద్ర దేవస్థానం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి గారిని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది

🌼🌿రామ నామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు.🌼🌿 తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు.. జీవితం సాఫీగా సాగుతు...
08/04/2020

🌼🌿రామ నామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు.🌼🌿

తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు.. జీవితం సాఫీగా సాగుతుందని వివరిస్తుంది. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉండాలి.
తారక మంత్రంగా పిలిచే రామ మంత్రం.. రెండు మహా మంత్రాల నుంచి పుట్టింది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో రా అనే అక్షరం జీవాక్షరం. అలాగే ఓం నమ: శివాయ అనే పంచాక్షరి మంత్రంలో మ అనేది జీవాక్షరం.
రామ రామ రామ అని మూడు సార్లు జపం చేస్తే.. విష్ణు సహస్ర నామం చేసినంత ఫలితం వస్తుంది
పూర్వం ఒకసారి హనుమంతుడిని కష్టాలపాలు చేయాలని శనీశ్వరుడు అతని దగ్గరకు వచ్చాడు. అప్పుడు హనుమంతుడు రామనామం జపిస్తున్నాడు. శనీశ్వరుడు హనుమంతుడికి విషయం చెప్పగా.. తాను రామనామ జపంలో ఉన్నానని... అది పూర్తయిన తర్వాత రమ్మని చెప్పాడు. శనీశ్వరుడు ఎంతసేపు నిరీక్షించినా.. రామనామ జపం పూర్తవలేదు. దీంతో.. శనీశ్వరుడు.. రామనామం జపించేవాళ్ల దరిచేరడం కష్టమని వెనక్కి వెళ్లిపోయాడు. కాబట్టి రామ నామాన్ని జపించేవాళ్లకు శనిబాధలు ఉండవు.

రామ అనే పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నికి ఆహుతి అవుతాయి. అలాగే మ అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోకి ప్రవేశించవని వివరిస్తుంది.
ఇవి రామ నామ జపం చేయుట వలన కలుగు లాభాలు🙏🏻

🌼🌿శివడు లింగాకారం పైన మూడు తిలకాలను దిద్దుతారు వాటి యొక్క రహస్యము.🌼🌿1. మొదటిది బ్రహ్మ కి గుర్తు2. రెండవది విష్ణువు కి గు...
20/01/2020

🌼🌿శివడు లింగాకారం పైన మూడు తిలకాలను దిద్దుతారు వాటి యొక్క రహస్యము.🌼🌿

1. మొదటిది బ్రహ్మ కి గుర్తు
2. రెండవది విష్ణువు కి గుర్తు
3. మూడవది శంకరుడు కి గుర్తు

మద్యలో గంధాన్ని బిందువుగా పెడతారు, అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు అదే పరమాత్మని యొక్క యథార్థ స్వరూపం.

1. పరమాత్ముని నామం సదా శివ,

2. సదా శివ అంటే
సదా - ఎల్లప్పుడూ , శివ అనగా కళ్యాణకారి " మంగళకారి " మరియు "శుభకారి"

3. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన చైతన్య మూర్తి ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపములు రెండూ లేవు.

4. పరమాత్మ బ్రహ్మా-విష్ణు-శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో (ముక్తిధామంలో) ఉంటారు.

5. పరమాత్మ త్రిమూర్తి, అనగా బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడ సృష్టించినవాడు.

6. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా సృష్టి స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా మహావినాశనము,
ఈ ముగ్గురు చేత మూడు కర్తవ్యాలను చేయించువాడు పరమాత్మడు అందుకే ఇంగ్లీష్ లో GOD అంటారు.

7. లింగం శబ్ధము లీనము అనగా వస్తువును తెలియపరచు చిహ్నమని మరియు లక్షణములు చూపించేది అని
అర్థము. పరమాత్మ లక్షణములు చూపించేది కావున శివలింగం అని అంటారు .

8. ఓం నమః శివాయ అంటే
ఓం - నేను ఆత్మను
నమః - నమస్కారం
శివాయ -పరమాత్మడు
ఆత్మనైనా నేను పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను అని అర్ధం.,

ఓం నమః శివాయ

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానన్దభాజమ్ | భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శఙ్కరం శంభుమీశానమీడే ll
25/11/2019

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానన్దభాజమ్ |
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శఙ్కరం శంభుమీశానమీడే ll

23/09/2019

🌼🌿పరమేశ్వరుని కీలకమైన పంచలింగాలు.🌼🌿 పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

1. పృథ్విలింగం:
ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి. —

🌼🌿..సోమవారం..🌼🌿శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. ముక్తి ప్రదాత ముక్కంటికి సోమవారం ఎం తో ప్రీతికర...
05/08/2019

🌼🌿..సోమవారం..🌼🌿

శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. ముక్తి ప్రదాత ముక్కంటికి సోమవారం ఎం తో ప్రీతికరమైనది. ఈ రోజున స్వామిని పూజించినంతనే స్వామి కటాక్షాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. లింగస్వరూపుడైన ఆ దేవదేవుని అభిషేకాలతో, అర్చనలతో నమస్కరిస్తే శుభాలు కలిగి సకల పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం.

🌼🌿శివుడు అభిషేక ప్రియుడు🌼🌿

శివో అభిషేక ప్రియ: (అంటే శివుడు అభిషేక ప్రియుడు). "శివుడు అభిషేక ప్రియుడు" కాసిని నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు !!

"నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు
గామధేనువు వానింట గాడి పసర
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు"

తా:- శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు 'కామధేనువు' కాడి పశువుగా పడి వుంటుందట, 'కల్పవృక్షం' అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట !!శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి !! సకలైశ్వర్యములు సమకూరతాయి !!

నిశ్చల భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఆ సమాచారం ఇదిగో మీ కోసం...
అభిషేక ద్రవ్యాలు... ఫలితాలు
----------------------------------------
ఆవు పాలతో..... సర్వ సౌఖ్యాలు
ఆవు పెరుగు... ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి.... ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార) .... దుఃఖ నాశనం, ఆకర్షణ
తేనె .. తేజో వృద్ధి
భస్మ జలం.. మహా పాప హరణం
సుగంధోదకం ... పుత్ర లాభం
పుష్పోదకం... భూలాభం
బిల్వ జలం ... భోగ భాగ్యాలు
నువ్వుల నూనె... అపమృత్యు హరణం
రుద్రాక్షోదకం ... మహా ఐశ్వర్యం
సువర్ణ జలం ... దరిద్ర నాశనం
అన్నాభిషేకం .. సుఖ జీవనం
ద్రాక్ష రసం .... సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం ... సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం .... శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం)... ద్రవ్య ప్రాప్తి
ధవళొదకమ్ ... శివ సాన్నిధ్యం
గంగోదకం ... సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం .. చక్రవర్తిత్వం
నేరేడు పండ్ల రసం .. వైరాగ్య ప్రాప్తి
నవరత్న జలం... ధాన్య గృహ ప్రాప్తి
మామిడి పండు రసం... దీర్ఘ వ్యాధి నాశనం
పసుపు, కుంకుమ... మంగళ ప్రదం
వీబూది .... కోటి రెట్ల ఫలితం

విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు.ఆయన శిరస్సు పై గంగ వుంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోను, శివుని అష్టమూర్తులలోను ఒకటి. " అప ఏవ ససర్జాదౌ " అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాగ్నే సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే.

మంత్రంపుష్పంలోని " యోపా మాయతనంవేద " ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యం విశదీకరించబడివున్నది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. భగవంతున్ని 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాలకంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది.

"ప్రజపాన్ శతరుద్రీయం అభిషేకం సమాచరేత్" అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయం పటిస్తూ అభిషేకం చేయాలి." పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్ " పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.

Address

Pothangal
Kotagiri
503207

Website

Alerts

Be the first to know and let us send you an email when Amrutheshwara Alayam-Lingamaiah Gutta, Pothangal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share