Eshcol House of worship

Directions

Eshcol House of worship నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయు దును .. నేను నిత్యము కీర్తించెదను. కీర్తనల 75:9

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ తన అనాది కాల సంకల్పం చొప్పున తన సిలువ బలి యాగం ద్వారా మనలను రక్షించుకొనిన మ...
14/08/2026

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ తన అనాది కాల సంకల్పం చొప్పున తన సిలువ బలి యాగం ద్వారా మనలను రక్షించుకొనిన మన ప్రభువైన యేసు క్రీస్తు వారి దివ్య నామమున మీకు నా శుభాశీస్సులు.
ఈ రోజు (శుక్రవారం 14-08-2026) క్యాలెండర్లో ప్రభువు మనకిచ్చిన తన మంచి వాగ్దానం కొద్ది సేపు ధ్యానిద్దాము. నేటి వాగ్దాన ధ్యానాన్ని దేవుడు అంగీకరించును గాక!
"నేను నిన్ను ఏర్పరచుకొని నియమించితిని", (యోహాను15:16).
ప్రభువు నందు నా కత్యంత ప్రియులారా, రోమా 8:29,30 ప్రకారం దేవుడు భూమిని ఆకాశాలను సముద్రాలను వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించక ముందే, తన రాజ్యంలో ఎవరెవరు చేరాలో అనే దానిని ఎప్పడో ఎప్పడో ఏర్పాటు చేశాడు. ఆ దేవుని సంకల్పం చొప్పుననే సమస్తం కార్యరూపం దాల్చు చున్నవి. అంతే కాదు, మనం ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆనాటి తన ఏర్పాటును ఈనాడు ధృవీకరిస్తున్నాడు. దానిని మనకు తన ఆత్మ ద్వారా, తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా తెలియచేస్తున్నాడు.
అంతే కాదు, తన రాజ్యం కొరకు, తన మహిమ కొరకు, తన సింహాసనం కొరకు ఏర్పరచబడిన మనలను ఆయా పనుల మీద నియమిస్తున్నాడు కూడా. ఎఫెసీ 4:13 ప్రకారం సంఘంలో కొందరిని కాపరులుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని శిష్యులుగా నియమించాడు. అంతే కాదు, ఇతర రాజకీయ, ప్రభుత్వ ప్రైవేటు, సాంఘీక, సామాజిక, వ్యాపార, టెక్నికల్ రంగాలలో కూడా దేవుడు తన బిడ్డలైన వారిని ఆయా స్థానాల్లో తనకు సాక్షులుగా నియమించాడు.
అయితే అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, దేవుడు మనలను ఎందులో నియమించినా సరే, మనం అందులో అంతం వరకు పూర్తిగా నమ్మకంగా ఉండడం అవసరం. అప్పుడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషంలో పాల్గొను అని మెచ్చు కుంటాడు (మత్తయి 25:23). ఆ విధంగా మనలను తన పర సంబంధమైన పని కొరకు నియమించిన దేవునికి నమ్మకంగా ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయును గాక!
మన తండ్రియైన దేవుని ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ నిరంతరం తోడై నడిపించును గాక!

🙏Praise the Lord Everyone 🙏"""" 🙏⛪Pray for Manipur🙏⛪ """""________________________________Follow for more Spiritual word...
12/08/2026

🙏Praise the Lord Everyone 🙏

"""" 🙏⛪Pray for Manipur🙏⛪ """""

________________________________

Follow for more Spiritual words👇
__________________________________

🅴🆂🅷🅲🅾🅻 🅷🅾🆄🆂🅴 🅾🅵 🆆🅾🆁🆂🅷🅸🅿 Faith Path Of Hebron 𝘽𝙧𝙤 𝙅𝙖𝙮𝙖𝙧𝙖𝙟 𝙎𝙝𝙤𝙧𝙩 𝙈𝙚𝙨𝙨𝙖𝙜𝙚𝙨 Nitya_jivapu_matalu
»»» 𝕃𝕚𝕧𝕖 𝕗𝕠𝕣 ℂ𝕙𝕣𝕚𝕤𝕥 33 Sukidesu Jesus ❤️
Hebron Daily SMK Hebron ministries for all ZION SONGS .mp3
Hebron Daily
_____________________________
Follow for more Hastags 👇
_____________________________


hebronspiritualmessages
nityajeevapumaatalu yesayyaganatha
yesayyaadharana
hebrondaily hebron zions
songsofziontelugu
spiritualword teluguquotes teluguverse telugudaily dailyverse dailyverses dailyquotes telugumotivationalquotes motivation growth growthwords spiritualgrowthingwords

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ మన కొరకు తండ్రి కుడి పార్శమున కూర్చొని నిత్యం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్న...
11/08/2026

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ మన కొరకు తండ్రి కుడి పార్శమున కూర్చొని నిత్యం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప గల నామమున మీకు నా శుభాశీస్సులు.
ఈ రోజు (మంగళవారం 11-08-2026) క్యాలెండర్లో ప్రభువు మనకిచ్చిన తన మంచి వాగ్దానం కొద్ది సేపు ధ్యానిద్దాము. నేటి వాగ్దాన ధ్యానాన్ని దేవుడు అంగీకరించును గాక!
"నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను", (లూకా 17:19).
ప్రభువు నందు నా కత్యంత ప్రియులారా, బైబిల్ లో దేవుడు మన విశ్వాసానికి పెద్ద పీట వేశాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా దానినే ధృవీకరణ చేస్తున్నాడు. దేవుడు కూడా కేవలం విశ్వాసం ద్వారానే, తన అనంత జ్ఞానం ద్వారా భూమిని, ఆకాశాలను, సకల సముద్రాలను వాటిలో ఉన్న సకల దృశ్యాదృశ్య జీవ రాశులను, సమస్త సృష్టిని సృష్టించాడు అలాంటి విశ్వాసమే మనలో కూడా ఉండాలని ఎంతో కోరు చున్నాడు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు "నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను", అని లూకా 8:48 లో, "నీ విశ్వాసం నిన్ను బాగుపరచెను", అని, మత్తయి 9:22 లో, "నీ విశ్వాసం నిన్ను రక్షించెను", అని లూకా 7:50 లో చెప్పాడు. మీరు దేవుని యందు విశ్వాసముంచి, ఈ కొండను చూచి నీవు సముద్రంలో పడుమని చెప్పి, మీ హృదయంలో సందేహించకుండా ఉంటే, అది జరుగుతుంది అని మార్కు11:22-24 లో చెప్పాడు. దేవునిలో విశ్వాసముంచు చున్నాం కాబట్టి మనం విశ్వాసులం. మనం దేవునిలో విశ్వాసముంచకపోతే, మనం ఏమాత్రం విశ్వాసులమే కాదు.
అందుకే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక్కొక్క సారి "అల్ప విశ్వాసులారా" అని మత్తయి 6:30; 16:8 లో అనే వాడు. "విశ్వాసం లేని మూర్ఖ తరం వారలారా", అని మత్తయి 17:17 లో అన్నాడు. అంటే, విశ్వాసం లేకపోతే, మనకు మూర్ఖత్వం ఉంటుంది అని అర్థం. "అమ్మా, నీ విశ్వాసం గొప్పది", అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక స్త్రీతో మత్తయి 15:28 లో చెప్పాడు. "నేను ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు", అని లూకా 7:9 లో చెప్పాడు.
ఇక పోతే, "దృఢ విశ్వాసం" అని హెబ్రీ 3:15 లో, "నిష్కపటమైన విశ్వాసం" అని 2తిమోతీ 1:4 లో, "అమూల్యమైన విశ్వాసం" అని "పేతురు 1:1 లో వ్రాయబడి యున్నది. కాబట్టి మన విశ్వాసం ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యం దిన దినం మనలను హెచ్చరిక చేస్తోంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సమాధిలో నుండి లేపిన దేవుడు మనలను కూడా లేపునని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం (2కొరి 4:15). ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయును గాక!
మన తండ్రియైన దేవుని ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ నిరంతరం తోడై నడిపించును గాక!

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ ఈ వారమంతా మనలను కాచి కాపాడి సంరక్షించి పోషించి బలపరచి భద్రపరచి ఇంత వరకు నడి...
08/08/2026

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ ఈ వారమంతా మనలను కాచి కాపాడి సంరక్షించి పోషించి బలపరచి భద్రపరచి ఇంత వరకు నడిపించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు నా శుభాశీస్సులు.
ఈ రోజు (రెండవ శనివారం 08-08-2026) క్యాలెండర్లో ప్రభువు మనకిచ్చిన తన మంచి వాగ్దానం కొద్ది సేపు ధ్యానిద్దాము. నేటి వాగ్దాన ధ్యానాన్ని దేవుడు అంగీకరించును గాక!
"ఆహారము కంటే ప్రాణమును .... గొప్పవి కావా?", (లూకా 12:23).
ప్రభువు నందు నా కత్యంత ప్రియులారా, నిజమే, బయటికి కనిపించే మన శరీర అవయవాల కంటే, బయటికి ఏ మాత్రం కనిపించని మన అంరింద్రియాలు ఎంతో ప్రాముఖ్యత కలవి. శరీరం కనిపిస్తుంది కానీ, ఆత్మ, ప్రాణం, హృదయం, మనసు బయటికి ఏ మాత్రం కనిపించవు. అవి అత్యంత విలువైనవి. అదే విధంగా మన మేమో బయటికి కనిపించే వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అయితే దేవుడు సృష్టించిన మన శరీరం కానీ, బయటికి కనిపించే సకల ప్రకృతి కానీ, సమస్తం మన అంతరంగమైన వాటిని జాగ్రత్త చేయటానికి మాత్రమే. కాబట్టి మనం బయటికి కనిపించే శరీర సంబంధమైన ఆహారం, వస్త్రాలు, వగైరా వసతులను ఉపయోగించుకొని మన ఆత్మ, హృదయం, మనసు ఎంతో పవిత్రంగా ఉంచుకొనుటకును, పవిత్రుడైన దేవుని చేరుకొనుటకును గురిగా పెట్టుకుని జీవించాలి. ఇదంతా మరచిపోయి మనం పాపంలో జీవిస్తున్నాం కాబట్టి, మొదటిగా మన పాప విమోచన కొరకు సిలువపై బలియై మన పాపాలకు ప్రాయశ్చిత్తం పరిహారం నివృత్తి చేసిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మన పాపాన్ని ఒప్పుకుంటే, ఆయన మనలను క్షమించి, రక్షించి, పరిశుద్ధపరచి, తిరిగి తిరిగి మన అవయవాలను పాపానికి వినియోగించకుండా దేవుడు మనకు జాగ్రత్త నేర్పిస్తాడు. అంటే, దేవుడు తన ఆత్మను మనలో ఉంచి, తన వాక్యం, తన సన్నిధి, తన బిడ్డల సహవాసం ఆయా ఆత్మ సంబంధమైన సకల ఉపదేశాలతో మన ఆత్మను శుద్ధిగా ఉంచుచూ తన మహిమ గల రాజ్యం కొరకు సిద్ధం చేస్తాడు (1థెస్స 5:23,24). అంతే కాదు, మనం మొదట దేవుని రాజ్యం దేవుని నీతి వెదికితే, ఆయన మన శరీర, దైనందిన అవసరాలు కూడా తీర్చి, ఎంతో గొప్ప సహాయం చేస్తాడు (మత్తయి 6:33). ఎందుకంటే బయటికి కనిపించే సమస్తం అశాశ్వతం అయితే బయటికి కనిపించనివి శాశ్వతమైనవి. అవి నిదానించి జాగ్రత్తగా చూస్తూ (2కొరి 4:16-18). ఆత్మ సంబంధమైన జీవితంలో ముందుకు సాగి పోవుటకు దేవుడు మనకు సహాయం చేయును గాక!
🙏Praise the Lord Everyone 🙏

"""" 🙏⛪Pray for Manipur🙏⛪ """""

________________________________

Follow for more Spiritual words👇
__________________________________

🅴🆂🅷🅲🅾🅻 🅷🅾🆄🆂🅴 🅾🅵 🆆🅾🆁🆂🅷🅸🅿 Faith Path Of Hebron

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ అపారమైన ఎనలేని ప్రేమను సిలువపై చూపిన మన ప్రభువైన యేసు క్రీస్తు వారి మహా పరి...
07/08/2026

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ అపారమైన ఎనలేని ప్రేమను సిలువపై చూపిన మన ప్రభువైన యేసు క్రీస్తు వారి మహా పరిశుద్ద దివ్య నామమున మీకు నా శుభాశీస్సులు.
ఈ రోజు (శుక్రవారం 07-08-2026) క్యాలెండర్లో ప్రభువు మనకిచ్చిన తన మంచి వాగ్దానం కొద్ది సేపు ధ్యానిద్దాము. నేటి వాగ్దాన ధ్యానాన్ని దేవుడు అంగీకరించును గాక!
"వీటి కంటే గొప్ప కార్యములు చూతువు", (యోహాను 1:50).
ప్రభువు నందు నా కత్యంత ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారు నతనయేలుకు ఇచ్చిన వాగ్దానం ఇది. నతనయేలు అంటే "దేవుని వరం" అని అర్థం. దేవుని వరం అంటే "నిత్య జీవం" అని అర్థం (రోమా 6:23). ఈ నిత్య జీవం ఎలా వస్తుంది? యోహాను 5:24 లో ఉన్నట్లు, మన ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి మన పాపాన్ని ఒప్పుకుంటే ఆయన మనకు పాప విమోచన నిత్య జీవం దయచేస్తాడు ఈ నతనయేలు మన ప్రభువైన యేసు క్రీస్తు వారిని చూడగానే ఆ విధంగా ఈ గొప్ప రక్షణ పొందాడు. గనుక మన ప్రభువైన యేసు క్రీస్తు వారు అతని వలే రక్షణ పొందిన వారందరికీ కూడా ఈ వాగ్దానం చేస్తున్నాడు.
అనగా రక్షణ పొందిన వారు ఒక దానిని మించిన మరి యొకటి గొప్ప కార్యాలు తమ జీవితంలో అను నిత్యం చూస్తూనే ఉంటారు.
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి అనగా పాపంలో నుండి, లోకంలో నుండి విడుదల పొందక ముందు దేవుడు ఎన్నో అద్భుతాలు చూపించాడు. ఇవి దేనికి? వారు అవి చూచి, కేవలం దేవునిలో విశ్వాసం, ముందు ముందు గొప్ప రక్షణ పొందటానికి మాత్రమే. దానిని బట్టి వారు మోషే మాట విని ఐగుప్తులో నుండి అనగా పాపంలో నుండి లోకంలో నుండి విడుదల అనగా గొప్ప రక్షణ పొందారు. ఆ తర్వాత వారు ఒక దానిని మించిన మరి యొకటి గొప్ప కార్యాలు చూశారు.
1). మొదట అగ్ని స్తంభం మేఘ స్తంభం చూశారు (నిర్గ 13:21).
2). ఆ తర్వాత దానిని మించింది ఎర్ర సముద్రం పాయలు కావటం చూశారు (నిర్గ 14:16).
3). ఆ తర్వాత అందులో ఆరిన నేలను చూచి, దాని మీద 143 మైళ్లు నడిచి, అవతలి ఒడ్డుకు చేరారు.
4). ఆ తర్వాత మారా నీళ్ళు మధురంగా మారటం చూశారు (నిర్గ 15:23,24).
5). ఆ తర్వాత ఆకాశం నుండి దిన దినం మన్నా ఆహారం కురవటం చూశారు (నిర్గ 16:30,31).
6). ఆ తర్వాత బండలో నుండి నీళ్ళు జలజలా రావటం చూశారు (నిర్గ 17:6).
7). ఆ తర్వాత భూమి నెర విడిచి కోరహు దాతాను అబీరాములను మ్రింగివేయటం కళ్ళారా చూశారు (సంఖ్య 16:31).
8). ఆ తర్వాత స్తంభం మీద ఉన్న ఇత్తడి సర్పాన్ని చూచి బ్రతికిన విస్తార జనాన్ని చూశారు (సంఖ్య 21:9).
9). ఆ తర్వాత భయంకరమైన ఓగు సీహోను రాజులను జయించటం చూశారు (సంఖ్య 21వ అధ్యాయం)

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ దేవుని వాక్య స్వరూపుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప గల నామమున మీకు నా...
06/08/2026

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ దేవుని వాక్య స్వరూపుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప గల నామమున మీకు నా శుభాశీస్సులు.
ఈ రోజు (గురువారం 06-08-2026) క్యాలెండర్లో ప్రభువు మనకిచ్చిన తన మంచి వాగ్దానం కొద్ది సేపు ధ్యానిద్దాము. నేటి వాగ్దాన ధ్యానాన్ని దేవుడు అంగీకరించును గాక!
"నేడు వారి కన్నుల యెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను", (యెహోషువా3:7).
ప్రభువు నందు నా కత్యంత ప్రియులారా,
(1).వాస్తవంగా యెహోషువా మోషేకు ఒక పరిచారకుడు లేదా దాసుడు (నిర్గ 33:11).
(2). ఆ తర్వాత అతడు ఎఫ్రాయిము గోత్రానికి ప్రాతినిధ్యం వహించిన వాడు (సంఖ్యా 13:8,16).
(3). అతడు కనాను దేశం విషయంలో దేవుని కొరకు ఎంతో రోషం చూపించాడు (సంఖ్యా 14:6-9).
(4). యెహోషువా దేవుని ఆత్మను పొందిన వాడు (సంఖ్యా 27:18).
(5). దేవుని సెలవు ప్రకారం మోషే అతనిని తన తర్వాత నాయకునిగా చేశాడు (సంఖ్యా 27:22,23).
(6). అతడు ఇశ్రాయేలీయులను యఛర్దాను నదిని దాటించి, కనానులో ప్రవేశపెట్టిన వాడు (యెహోషువా 3:6-17).
(7). అతడు 31 మంది రాజులను జయించి, ఆ దేశాన్ని వారికి పంచి పెట్టాడు (యెహోషువా 12: 24; 18:15).
ఈ విధంగా దేవుడు అతనిని అంచెలంచెలుగా గొప్ప చేశాడు
అదే విధంగా దేవుడు పాపులమైన మనలను కూడా రక్షించి, తన బిడ్డలుగా చేసికొని, మన పేర్లు జీవ గ్రంధంలో వ్రాసి, పరలోకంలో మనకు అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యమును మనకిచ్చి, తన మహిమను, తన స్వరూపాన్ని, తన సింహాసనాన్ని ఇచ్చి మనలను కూడా బహుగా ప్రేమించి గొప్ప చేశాడు. కాబట్టి మనం కూడా దానికి తగినట్టుగా దేవునికి ఎంతో నమ్మకంగా సేవ చేయునట్లు దేవుడు మనకు సహాయం చేయును గాక!
మన తండ్రియైన దేవుని ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ నిరంతరం తోడై నడిపించును గాక!
🙏Praise the Lord Everyone 🙏

"""" 🙏⛪Pray for Manipur🙏⛪ """""

________________________________

Follow for more Spiritual words👇
__________________________________


🅴🆂🅷🅲🅾🅻 🅷🅾🆄🆂🅴 🅾🅵 🆆🅾🆁🆂🅷🅸🅿 Faith Path Of Hebron 𝘽𝙧𝙤 𝙅𝙖𝙮𝙖𝙧𝙖𝙟 𝙎𝙝𝙤𝙧𝙩 𝙈𝙚𝙨𝙨𝙖𝙜𝙚𝙨 Nitya_jivapu_matalu
»»» 𝕃𝕚𝕧𝕖 𝕗𝕠𝕣 ℂ𝕙𝕣𝕚𝕤𝕥 33 Sukidesu Jesus ❤️
Hebron Daily SMK Hebron ministries for all ZION SONGS .mp3
Hebron Daily
_____________________________
Follow for more Hastags 👇
_____________________________

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున మీకు నా శుభాశీస్సులు.   ఈ రోజు (...
05/08/2026

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున మీకు నా శుభాశీస్సులు.
ఈ రోజు (బుధవారం 05-08-2026) క్యాలెండర్లో ప్రభువు మనకిచ్చిన తన మంచి వాగ్దానం కొద్ది సేపు ధ్యానిద్దాము. నేటి వాగ్దాన ధ్యానాన్ని దేవుడు అంగీకరించును గాక!
"ఇదిగో నేను...సఛా కాలము మీతో కూడ ఉన్పాను", (మత్తయి 28:20).
ప్రభువు నందు నా కత్యంత ప్రియులారా, "మేలు చేయుటకై యెహోవా మీతో కూడ ఉండును", అని 2దిన 19:11 లో వ్రాయబడి యున్నది. పాత నిబంధనలో యెహోవా దేవుడు చెప్పినా, క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పినా ఒకే మాట, ఒకే అర్థం, ఒకే ఉద్దేశం.
అపో. పౌలు 1తిమోతీ 1:12 లో చెప్పినట్లు, మనం కూడా దూషకులం, హానికరులం, హింసకులం. దుర్నీతి పౌరులు, స్వనీతిపరులం, అవినీతిపరులం, నిత్య నరకానికి పాతృలం. మనలో, మన హృదయంలో, మన శరీరంలో ఏ మంచి లేనివారం, మరణ పాతృలం (రోమా 7:18, 24). సత్క్రియల యందు ఆసక్తి ఉన్నా, వాటిని చేసే శక్తి లేని వారం (తీతు 2:14). ఇటు వంటి మనలను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువపై మన సకల పాపాలకు ప్రాయశ్చిత్తం పరిహారం నివృత్తి చేసి మనలను బహుగా ప్రేమించి, క్షమించి, రక్షించి, పరిశుద్ధపరచి, నీతిమంతులుగా చేశాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా ఇంత గొప్ప మేలు పొందిన మనం ఇతరులకు కూడా మేలు చేయ బద్దులం. మనం మేలు చేయటానికి యెహోవా దేవుడు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యం మనకు తోడుగా ఉంటాడు.
(1). సువార్త ప్రకటించుట ద్వారా మనం ఇతరులకు మేలు చేస్తున్నాం (మార్కు16:15,16).
(2). విశ్వాస గృహానికి సంఘానికి చెందిన వారికి మనం మేలు చేయాలి (గలతీ 6:8-10).
(3). వాక్యం చెప్పి ఇతరులను బలపర్చి, స్థిరపర్చి, మేలు చేయాలి (అపో. కా 14:22).
(4). వారి ఆత్మలను రక్షించుట ద్వారా మనం ఇతరులకు మేలు చేస్తున్నాం (యాకోబు 5:20).
(5). మంచి సమరయుని వలే మనం ఇతరులకు మేలు చేయాలి (లూకా 10:30-37).
మనం మేలు నిత్యం చేస్తుంటే, దేవుడు మనకు తోడుగా ఉండి మనలను ఇంకా ఇంకా సమృద్ధిగా బలపరుస్తాడు. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయును గాక!
మన తండ్రియైన దేవుని ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ నిరంతరం తోడై నడిపించును గాక!
🙏Praise the Lord Everyone 🙏

"""" 🙏⛪Pray for Manipur🙏⛪ """""

________________________________

Follow for more Spiritual words👇
__________________________________


🅴🆂🅷🅲🅾🅻 🅷🅾🆄🆂🅴 🅾🅵 🆆🅾🆁🆂🅷🅸🅿 Faith Path Of Hebron 𝘽𝙧𝙤 𝙅𝙖𝙮𝙖𝙧𝙖𝙟 𝙎𝙝𝙤𝙧𝙩 𝙈𝙚𝙨𝙨𝙖𝙜𝙚𝙨
-

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ తన పరిశుద్ధమైన కార్యాలు చేసేందుకు తన మార్గంలో మనం నడిచేందుకు తన కొరకు నమ్మక...
03/08/2026

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ తన పరిశుద్ధమైన కార్యాలు చేసేందుకు తన మార్గంలో మనం నడిచేందుకు తన కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించేందుకు తన సువార్త ప్రకటించేందుకు మన జీవితాలను దిన దినం పొడిగిస్తున్న మన ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు నా శుభాశీస్సులు.
ఈ రోజు (సోమవారం 03-08-2026) క్యాలెండర్లో ప్రభువు మనకిచ్చిన తన మంచి వాగ్దానం కొద్ది సేపు ధ్యానిద్దాము. నేటి వాగ్దాన ధ్యానాన్ని దేవుడు అంగీకరించును గాక!
"నేను నీకు (ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం "నిశ్చయముగా") తోడై యుందును", (న్యాయా 6:16).
ప్రభువు నందు నా కత్యంత ప్రియులారా, మన దేవుడు నీతిగా నిజాయితీగా జీవిస్తూ, కుటుంబ పరంగా, సంఘ పరంగా, ఆర్ధికంగా, సామాజికంగా, దేశ పరంగా అణచివేతకు గురియౌతున్న తన బిడ్డలను ఎంతో ధైర్యపరచి బలపరుస్తాడు. అదే గిద్యోను జీవిత వృత్తాంతం.
ఆనాడు ఇశ్రాయేలు జనాంగం దేవునికి విరోధులైరి. అందు చేత దేవుడు వారిని మిద్యానీయులకు బానిసలుగా చేశాడు. వారు వీరిని 18 సం. నానా విధములుగా హింసించి, అణచి వేశారు. ఆ సమయంలో వారు తమ పాపాలు తమ దేవుని దగ్గర ఒప్పుకొనగా దేవుడు వారిని క్షమించి భయ భీతులలో ఉన్న గిద్యోనును బలపరచి, అతని చేత వారిని రక్షించాడు. ఇదీ కధా వృత్తాంతం.
దీనిని బట్టి మనం దేవుడు పాపంలో ఉన్న వారిని ఏ మాత్రం బలపరచడనీ, దానిని ఒప్పుకొంటే దేవుడు మనలను క్షమించి తిరిగి బలపరుస్తాడనీ, దేవునితో మంచి సమాధానం, సహవాసం మనకు ఉంటుందనీ అర్ధం అవుతుంది.
కాబట్టి మనకు జీవితంలో దేవునితో సమాధానం, సహవాసమే అత్యంత ప్రాముఖ్యం. అవి నమ్మకంగా మనం కాపాడుకొంటే మన జీవితంలో నిత్యం ఆనంద సంతోషాలే. మన జీవితమంతా విజయ పరంపరలే. దావీదు వాటిని కాపాడుకొన్నాడు గనుకనే తన జీవితంలో ఎక్కడా ఓడిపో లేదు. దేవుడు అతనిని ఎంతో గొప్పగా ఆశీర్వాదించాడు.
🙏Praise the Lord Everyone 🙏

"""" 🙏⛪Pray for Manipur🙏⛪ """""

________________________________

Follow for more Spiritual words👇
__________________________________


🅴🆂🅷🅲🅾🅻 🅷🅾🆄🆂🅴 🅾🅵 🆆🅾🆁🆂🅷🅸🅿 Faith Path Of Hebron 𝘽𝙧𝙤 𝙅𝙖𝙮𝙖𝙧𝙖𝙟 𝙎𝙝𝙤𝙧𝙩 𝙈𝙚𝙨𝙨𝙖𝙜𝙚𝙨 Nitya_jivapu_matalu
»»» 𝕃𝕚𝕧𝕖 𝕗𝕠𝕣 ℂ𝕙𝕣𝕚𝕤𝕥 33 Sukidesu Jesus ❤️
Hebron Daily SMK Hebron ministries for all ZION SONGS .mp3
Hebron Daily
_____________________________
Follow for more Hastags 👇
_____________________________


నేటి వాగ్దానం: "నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించెదను", (హెబ్రీ 6:14).   ప్రభువు నందు నా కత్యంత ప్రియులారా, మన తాత ముత్త...
01/08/2026

నేటి వాగ్దానం: "నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించెదను", (హెబ్రీ 6:14).
ప్రభువు నందు నా కత్యంత ప్రియులారా, మన తాత ముత్తాతలు, తలిదండ్రులు, ప్రాణ ప్రియులు ఎవరూ ఇవ్వ లేని ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇస్తాడు. అసలు "ఆశీర్వాదం" అంటే ఏమిటి? అపో కా 3:26 లో "మనలో ప్రతి వానిని, వాని దుష్టత్వః నుండి విడిపించుటయే నిజమైన గొప్ప ఆశీర్వాదం", అని వ్రాయబడి యున్నది. అనగా గొప్ప రక్షణయే, పాప విమోచనయే నిజమైన, అసలైన ఆశీర్వాదం అని అర్థం. అటువంటి గొప్ప ఆశీర్వాదం ఇవ్వటానికి వచ్చిన ఏకైక మహా దేవుడును, మన రక్షకుడునునైన, యేసుక్రీస్తు ప్రభువే. కేవలం మన పాపాలను మనం ఒప్పుకొనిన యెడల యేసుక్రీస్తు నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను రక్షించును (1యోహాను 1:9; మత్తయి 1:21). ఆ విధంగా దేవుని ఆశీర్వాదాలు మనకు లభిస్తుంది. కాబట్టి
(1). కాబట్టి కృప ద్వారా మనకు గొప్ప రక్షణ,
(2). విశ్వాసం ద్వారా రక్షణ
(3). పాపాన్ని ఒప్పుకొనుట ద్వారా గొప్ప రక్షణ.
ఈ విధంగా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుట ఎంతో నిశ్చయం. ఇట్టి గొప్ప ఆశీర్వాదం మనకిచ్చినందుకై దేవునికి స్తోత్రములు.
🙏Praise the Lord Everyone 🙏

"""" 🙏⛪Pray for Manipur🙏⛪ """""

________________________________

Follow for more Spiritual words👇
__________________________________


🅴🆂🅷🅲🅾🅻 🅷🅾🆄🆂🅴 🅾🅵 🆆🅾🆁🆂🅷🅸🅿 Faith Path Of Hebron 𝘽𝙧𝙤 𝙅𝙖𝙮𝙖𝙧𝙖𝙟 𝙎𝙝𝙤𝙧𝙩 𝙈𝙚𝙨𝙨𝙖𝙜𝙚𝙨 Nitya_jivapu_matalu
»»» 𝕃𝕚𝕧𝕖 𝕗𝕠𝕣 ℂ𝕙𝕣𝕚𝕤𝕥 33 Sukidesu Jesus ❤️
Hebron Daily SMK Hebron ministries for all ZION SONGS .mp3
Hebron Daily
_____________________________
Follow for more Hastags 👇
_____________________________


hebronspiritualmessages
nityajeevapumaatalu yesayyaganatha
yesayyaadharana
hebrondaily hebron zions
songsofziontelugu
spiritualword teluguquotes teluguverse telugudaily dailyverse dailyverses dailyquotes telugumotivationalquotes motivation growth growthwords spiritualgrowthingwords

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ గత ఏడు నెలలు మనలను కాచి కాపాడి సంరక్షించి పోషించి బలపరచి భద్రపరచి నేడు ఎనిమ...
01/08/2026

ప్రభువు నందు ప్రియమైన నా సహోదర సహోదరీలందరికీ గత ఏడు నెలలు మనలను కాచి కాపాడి సంరక్షించి పోషించి బలపరచి భద్రపరచి నేడు ఎనిమిదవ నెల ఆగస్టులో ప్రవేశపెట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దయ గల నామమున మీకు నా శుభాశీస్సులు.
కాబట్టి ఈ ఆగస్టు నెలకు ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానం కొద్ది సేపు ధ్యానిద్దాము.
"చేతి పని కాక, దేవుని చేత కట్టబడినదియు, నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము", (2కొరి 5:1).
ఇది పూర్తిగా వాస్తవం. మన సకల పాపాలు క్షమించి, తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము చేత మనలను పవిత్ర పరిచి తన సొంత బిడ్డలుగా చేసికొని అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యమును (1పేతురు1:4) అనగా అత్యంత శ్రేష్టమైన, సుస్థిర "నివాసము"ను దేవుడు మన కొరకు తన పరలోకంలో ఏర్పాటు చేస్తున్నాడు (నేటి వాగ్దానం ప్రకారం). మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా యోహాను 14:3 లో "నేను వెళ్లి మీ కొరకు స్థలం సిద్ధపరచిన తర్వాత, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరల వచ్చి మిమ్మును తీసికొని పోవుదును", అని చెప్పాడు. అందుకే "దావీదు నేను యుగ యుగాలు ఆయన గుడారంలా నివాసం చేసెదను", అని కీర్తన 61:4 లో చెప్పాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తం మన మీద చూచిన దూతలు మనలను పరలోకంలోనికి చేర్చుకున్న తర్వాత మన "ప్రభువే తన గుడారమును (సుస్థిర, శాశ్వత నివాసమును) మన మీద కప్పును", అని ప్రకటన 7:13-15 లో వ్రాయబడి యున్నది. అసలు తన సింహాసనం మీదనే మనకు స్థలం ఇస్తానన్నాడు కదా! అప్పుడు దేవుని దూతలంతా భూమి మీద నుండి వచ్చిన మనకు సకల పరిచర్యలు చేస్తారు. పరలోక వైభవమంతా ఆ బంగారు వీధుల్లో, సువర్ణ సుందర నివాసాల్లో మనం అప్పుడు నిత్యం అనుభవిస్తాము. దాని కొరకు దేవుడు మనలను సిద్ధం చేయును గాక! (1థెస్స 5:23,24).
మన తండ్రియైన దేవుని ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ నిరంతరం తోడై నడిపించును గాక!
🙏Praise the Lord Everyone 🙏

"""" 🙏⛪Pray for Manipur🙏⛪ """""

________________________________

Follow for more Spiritual words👇
__________________________________


🅴🆂🅷🅲🅾🅻 🅷🅾🆄🆂🅴 🅾🅵 🆆🅾🆁🆂🅷🅸🅿 Faith Path Of Hebron 𝘽𝙧𝙤 𝙅𝙖𝙮𝙖𝙧𝙖𝙟 𝙎𝙝𝙤𝙧𝙩 𝙈𝙚𝙨𝙨𝙖𝙜𝙚𝙨 Nitya_jivapu_matalu
»»» 𝕃𝕚𝕧𝕖 𝕗𝕠𝕣 ℂ𝕙𝕣𝕚𝕤𝕥 33 Sukidesu Jesus ❤️
Hebron Daily SMK Hebron ministries for all ZION SONGS .mp3
Hebron Daily
_____________________________

Address

SH-31
Kodur
516101

Website

Alerts

Be the first to know and let us send you an email when Eshcol House of worship posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share