20/08/2022
🔥 *బాబోయ్!! ఇక నుండి నేను ఈ చర్చికి వెళ్లను.!!!* 🔥
*ఎందుకంటే పాస్టర్ గారు* .......
👉 *ప్రతీ సారి పరిశుద్ధత గురించి నొక్కి చెబుతాడు. పరిశుద్ధముగా ఉండాలి అంటాడు. అది మా వ్యక్తిగతం కదా !*
👉 *రోజుకు కనీసం ఒక గంటైన ప్రార్ధించాలి అంటాడు. అస్సలు మాకు సమయం ఎక్కడ ఉంది ?*
👉 *రోజు బైబిల్ చదవాలంట. అస్సలు అది జరిగే పనియేనా ? నాకు సీరియల్స్ / సినిమాలు చూడటానికి సమయం సరిపోక మా ఆయన నా పనిలో సహకరిస్తారు.*
👉 *నియామక కూడికలకు ( శనివారం విజ్ఞాపన కూడిక , స్త్రీల కూడిక, పురుషుల కూడిక, యవ్వనస్థుల కూడిక ) రావాలంట. అస్సలు ఆదివారం రావడమే కష్టమంటే ఇవి ఒకటి.*
👉 *మందిరంలో పరిచర్య చేయాలంట. ఇంట్లోనే మా పని చేసుకోవడానికి తీరిక లేదంటే ఇది ఒకటి.*
👉 *దైవసేవకుల మాట వినాలంట. అస్సలు దేవుని మాటే వినడం లేదంటే ఇది ఒకటి ( వాక్యానికి లోబడటం ).*
👉 *పొరుగువాళ్లను ప్రేమించాలట మరియు సహాయం చేయాలట. మమ్ములను కన్న మా ముసలి అమ్మా నాన్నాలకే దిక్కులేదు. వాళ్లనే నెలకు ఒకరు చొప్పున మా అన్న తమ్ముళ్ళం పంచుకుంటే.*
👉 *అనాధలకు, విధవర్రాళ్లకు సహాయం చేయాలంట. మా సంఘం ద్వారా నడపబడుతున్న దానికే చేయాలంట. అస్సలు ఇది జరిగే పనేనా. మా పిల్లల కార్పొరేట్ చదువులకు దాచొద్ద డబ్బులు.*
👉 *సమయానికి రావాలంట. ఏమండీ సమయానికి వస్తే మాకు ఏదో కిరీటమో లేక బహుమతి ఇచ్చినట్లు. అస్సలు గుడికి పోవడమే కష్టమంటే ఇది ఒకటి. ఏదో వచ్చిండ్రు పోయిండ్రు అనుకోవొచ్చుగా.* *ఆశీర్వాదము ఇచ్చే సమయముకు వెళ్లి , హాజరు పడ్డదా లేదా, అని మేము అనుకుంటుంటే ఇది ఒకటి.*
👉 *కన్వెన్షన్స్ అంటాడు, కానుకలు ఇవ్వమంటాడు.* *ఏమండీ సెలవులో మా కుంటుంబాలతో సరదాగా గడుపుదాము అనుకుంటే ఆ మూడు రోజులు బుక్ అయినట్లే. అన్ని కూడికల్లో పాల్గొనాలట. ఆదివారమే ఆ మూడు గంటలు ఎలా తప్పించుకోవాలబ్బా అనుకుంటుంటే ఇదొకటి.*
👉 *డైరీలు, క్యాలెండర్లు, క్రైస్తవ సాహిత్యం ( భక్తుల జీవిత చరిత్రలు ) కొనమంటాడు. నా బైబిల్ కొని 10 సంవత్సరాలు అయింది. ఇంకా కొత్తగా ఉంది. ఇంకా ఇవి కొని ఏంచేసుకోను.*
👉 *యేసు క్రీస్తు త్వరగా వస్తున్నాడు (రెండవ రాకడ) సిద్ధపడండి, లేకపోతే విడవబడుతారు అంటాడు. మేము విడవబడుతే ఆయనకు ఎందుకండి ? ఆయనకు ఏమన్నా కలిసి వస్తుందా ?*
👉 *నీతిమంతుని ( దైవసేవకులు ) గద్ధింపు తైలాభిషేకం అంటాడు. అసలు నన్ను మా ఆయన అంటేనే ఊర్కోను. ఎవరు ఏమన్నా పడను. అది నా తత్వం.*
👉 *వాక్యము చెప్పుటలో రాజీ పడడట, మొమాటం లేదట, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి దేవుడే అధికారం ఇచ్చాడట. మనుషుల మెప్పు వద్దట , కోరడట. క్వాంటిటీ కాదట, క్వాలిటీ కావాలట. ఏమి పాస్టర్ రా బాబు.*
👉 *బొట్టు పెట్టొద్దట, రాఖీ కట్టొద్దట, జాతర వెళ్ళొదట, తాయ్యత్తు కట్టొద్దట, వాస్తు చూడొద్దట, తోరణాలు కట్టొద్దట, నవరాళ్లు, నవ ధాన్యాలు వాడొద్దట. గృహ ప్రవేశానికి ఆవును తిప్పడం, పేడ వేయడం తప్పంట. పాలు పొంగించోద్దట. మా తాత ముత్తాత దగ్గరనుండి వస్తున్నాయి వొద్దంటే ఎలా ?*
👉 *కులం చూడొద్దట, ఆచారాలు పాటించొద్దట, దశదిన కర్మలు, దినాలు చేయోద్దట. ముహుర్తాలు చూడొద్దట. తిధి, నక్షత్రం , పేరు బలం చూడొద్దట. మంచి రోజులు, చెడ్డ రోజులు లేవట. నాదేమో తుమ్మిన, దగ్గిన, పిల్లి ఎదురొచ్చినా, ఆగిపోయే వ్యక్తిత్వం.*
🙏 *అమ్మో, ఇక మా వల్ల కాదండి.!!!* 🙏
◆ *ప్రస్తుతం మేము వెళ్తున్న ఈ పాస్టర్ పద్ధతులు అస్సలు నచ్చడం లేదు !*
● *మేము ఏమి చేసినా, ఎప్పుడు వెళ్లినా, మమ్ములను పట్టించుకోకుండా ఉండే పాస్టర్లు, చర్చిలు కావాలి, అలాంటివి మా ఊరిలో బోలెడన్ని. వచ్చారా, వెళ్ళారా అనుకునే సంఘాలు ఎన్నో. ఇక ఆ సంఘాలకే వెళ్తాము.*
● *మాకు స్వేచ్చా స్వాతంత్రము దొరికే సంఘాలు కావాలి. మేము ఎన్ని తప్పులు చేసినా ఖండించని , గద్దించని పాస్టర్ కావాలి. లేదా డిజిటల్ చర్చ్ చూసుకుంటాము. అక్కడ ఆ గొడవే ఉండదు. వెళ్ళమా, కానుక వేశమా, టి.వి. ప్రోగ్రాం కి స్పాన్సర్ చేశామా లేదా. అంతే. అడిగేవాడు ఉండడు. వారికి మా డబ్బే కావాలి. డబ్బు పోతే ఎంటి . పైన వన్ని తప్పించుకుంటాము కదా. హమ్మయ్య.*
● *మేము నరకము వెళ్లినా పర్వాలేదు. మేము నరకానికి వెళ్తాము అని కూడ మాకు బాగ తెలుసు. మా జీవితం మా ఇష్టం.*
*ఇట్లు,*
*ఓ విశ్వాసి