09/11/2018
ఏది సంసారం? ఏది వ్యభిచారం?
అనంతసాహితి - ఆంధ్ర‘‘వ్యాసశాకుంతలం‘‘ - 020
‘‘నేటి తరం యువతకు మీరు ఏం చెబుతారు?‘‘ అనే ప్రశ్నకు సమాధానం చాలా మందికి కావాలి. అలాగే ‘‘నేటి వివాహవ్యవస్థ బాగుపడడం ఎవరి చేతుల్లో ఉంది?‘‘ అని కోట్లాది మంది తల్లి తండ్రులు మౌనంగా రోదిస్తూ సమాధానం వెతుకుతున్నారు.
ఈ ప్రశ్నలకు ఆంధ్రవ్యాసులవారు ఇచ్చిన సమాధానం వ్యాస శాకుంతలంలో ఉంది.
భారతదేశాన్ని మట్టుపెట్టాలని ప్రయత్నిస్తున్న పరమతస్తులు, దేశశత్రువులు సామాజిక మాధ్యమాలు, ఎజెండాజర్నలిజం మీడియాలు, టివి సినిమాలు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. అర్జునుడు విషాదయోగంలో చెప్పిన అహింసాయుత మారణకాండను సృష్టిస్తున్నారు. ఒక్కబొట్టు రక్తం చిందించకుండా జాతిని సమూలంగా నాశనం చేసే కుట్రలు క్రాస్ కంట్రీ కల్చరల్ ఎఫెక్టు ద్వారా సృష్టిస్తున్నారు. వారు చేస్తోంది అలనాడు అర్జునుడు భయపడిన మారణకాండ. అదే ‘‘ప్రదుష్యంతి కులస్త్రియాః‘‘ కులస్త్రీలు చెడిపోతారు అనే శ్లోకపాదంలో ఉంది. ఇందుకోసం ఒకప్పటి భౌతికదాడులు చేసి అత్యాచారాలు చేయడంలేదు. క్లుప్తంగా చెప్పాలంట ఈ మైరావణ మీడియా మాఫియాల వలలో పడి సంసారాలకు అతిముఖ్యమైన ‘‘నమ్మకాలను‘‘ చెడగొట్టుకుంటున్నారు. దీనికి తోడు తాగుడుకు బానిసలైన వ్యవస్థతో కుటుంబజీవితం సర్వనాశనం అవుతోంది.
భారతజాతికి ఉన్న పటిష్ఠమైన కుటుంబవ్యవస్థను నాశనం చేస్తే దేశం సమూలంగా నాశనం అవుతుందని పరమతప్రేరేపిత మీడియాలు, సామాజిక మాధ్యమాలు, సినిమాది రంగాలు, పుస్తక ప్రచురణవిభాగాలు కుట్ర చేశాయి. చేస్తున్నాయి. వారు దశాబ్దాలుగా నాటిన విషకుట్రబీజాలు నేడు కాలకూటవిషఫలాలుగా ఫలిస్తున్నాయి.
నేటి తరంలో కుటుంబవ్యవస్థ సమూలంగా నాశనం కావడానికి చాలా దగ్గరలో ఉంది. ఇది ఇప్పటికే ఈ దేశంలో కొన్ని కోట్లాది మంది తల్లితండ్రులు కుమిలిపోతూ కూలిపోతున్న తమ సంతానం కాపురాలు చూస్తూ నిత్యం రోదిస్తూ ఏమీ చేయలేక ప్రాణం ఉన్న శవాలుగా బ్రతుకుతకడం ద్వారా స్పష్టం అవుతోంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలా రోదించేవారిలో ఆడపిల్లల తండ్రులు కూడా ఉండడం. న్యాయస్థానాలు కూడా పక్షపాతంతో ఆడపిల్లల్నే సమర్థిస్తూ, స్వైరిణులకార్ఖానాలైన మహిళా సంఘాలు మద్దతు ఇస్తున్న తరుణంలో ఆడపిల్లల తల్లితండ్రులు ఎందుకు ఏడుస్తున్నారో అందరికీ తెలియదు.
ప్రపంచంలో ఉన్నతమైన వివాహవ్యవస్థగా ఉన్న హైందవసమాజం, ఏ ప్రాతిపదికన గృహస్థాశ్రమం ఏర్పడిందో అది మరిచిపోయింది. నేడు భయంకరమైన ఊబిలో పడి నాశనం కావడానికి కారణమైంది. ‘‘ఇదిగో ఇదే ఉన్నతమైన కుటుంబవ్యవస్థ ....‘‘ అని నిజంగా జరిగిన సజీవ ప్రేమకథలను ఇతిహాసాలు అనే భారతీయ చరిత్ర ద్వారా అందిస్తే వాటిని విస్మరించడమే నేటి ఈ దుర్గతికి ప్రధాన కారణం.
అతి సులభమైన ఆధ్యాత్మిక సాధన, కామసంతృప్తి, సంపూర్తి రక్షణ వ్యవస్థలతో నిర్మించిన హైందవ వివాహవ్యవస్థ గురించి నేడు 98 శాతం మందికి తెలియదు. మహాభారతంలో ఉన్నన్ని ఉత్తమ ప్రేమకథలు ప్రతి ఏడాదీ వేలకోట్లు తగలేస్తు నిర్మిస్తున్న సినిమా రంగంలో ఇప్పటి వరకూ లేవు. యుగాల క్రితంనాటి భారతంలోని కథలు నేటికీ సజీవంగా నిలిచి ఉంటే, ఏ సినిమా ఎప్పుడు వచ్చిందో అది నిర్మించిన సినీకూలీలకు కూడా తెలియడం లేదు.
వీటిలో శకుంతల ప్రేమ కథ ఉత్తమోత్తమమైనది ఎందుకు అయిందో తెలుసుకుంటున్నాము. అందులో వ్యాసభగవానుడు చెప్పినది, ఆంధ్రవ్యాసులవారు ప్రవచించిన పితృయోగాన్ని గురించి మరింతగా తెలుసుకుందాం.
సాధారణ సంసారంలో భార్యతో ఇష్టభోగాలు అనుభవిస్తూ, పిల్లలతో జీవించడం ద్వార వేదవేదాంతాలు, సర్వమతసిద్ధాంతాలు అతి తేలిగ్గా ఎలా అర్థం అవుతాయో, ఆచరణలోకి వచ్చిన అద్వైత జ్ఞానం ద్వారా ఎంత తేలిగ్గా మోక్షం సంపాదించవచ్చో శకుంతల వేదమంత్రాల సాక్షిగా చెబుతోంది.
కర్ణాటకలోని గంధం చెట్లనుంచీ వచ్చే గంధం చల్లనిదా, కౌగిలించుకున్న శిశువు స్పర్శ చల్లగా ఉంటుందా అంటే శకుంతల శిశువు కౌగిలే చల్లగా ఉంటుందని అంటోంది. రెండుకాళ్ళున్న ప్రాణులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. నాలుగు కాళ్ళవాటిలో ఆవు శ్రేష్ఠురాలు. గౌరవించదగిన వారిలో గురువు శ్రేష్ఠుడు. స్పర్శసుఖాల్లో కుమారుడి కౌగిలి శ్రేష్ఠం అని ఆమె అంటోంది. గ్రామాంతరం వెళ్ళివచ్చిన తండ్రి తమ పుత్త్రుని తొడలమీదకు ఎక్కించుకొని శిరస్సు మీద ముద్దాడతారని చెప్పింది.
ఇటువంటి దివ్యమైన అనుభూతిని నేడు సినిమా టివి వెబ్ సైట్లలో అక్రమసంతానంతో ఆనందం పంచే భార్యల నీచత్వాన్ని హాస్యంగా అనుభవిస్తున్నాం. ఈ అంశాన్ని ఎంత సాధారణాంశంగా తీసుకున్నామో తెలుస్తోంది. ఊరు లోకువ చూసి ఉడత గుడ్లెట్టటం అంటే ప్రజలు అక్రమసంబంధాలను దోషంగా నీచంగా చూడకుండా ఆమోదించి సాధారణహాస్యంగా ఆనందిస్తున్నారు కనుక సుప్రీం కోర్టు 497లో ఆ విధమైన తీర్పు ఇవ్వడంగా చెప్పవచ్చు. సుప్రీంకోర్టు ఉడత వంటిదా అంటే అంత కంటే పిరికితనంలో అంతకంటే నీచమైన జీవి మరొకటి లేదు పలుకుబడిలో. తామే సర్వసత్తా అని అనుకుంటున్న సుప్రీం కోర్టు ప్రజలను మరిచిపోయింది. తన బ్రతుకు అంతా ‘‘నిన్న న్యాయం కానిది, నేడు అవుతుంది. నేటి న్యాయం రేపు న్యాయం కాదు‘‘ అనే మౌలికమైన సూత్రాన్ని మరిచిపోతోంది. (‘‘what's law? what is not law Yesterday can be today's law . Today's law will be repealed by tomorrow.") తమకు కావలసిన న్యాయాన్ని ప్రజలే తయారు చేసుకుంటారు. అక్కర్లేని దాన్ని చెత్తబుట్టలో వేస్తారు. అదే ప్రజాస్వామ్యం. సుప్రీం కోర్టు పని ప్రజలు చట్టసభల ద్వారా చేసినదాన్ని పరిరక్షించడమే అనే మౌలికాంశాన్ని విస్మరించి తాను సర్వాధికారిని అని భావిస్తోంది. తాను ప్రజల ముందర ఉడుతను అనే సత్యం విస్మరిస్తోంది.
ఈ తరుణంలో పరమపవిత్రమైన శారీరకసంబంధాలలో గృహస్థాశ్రమం ద్వారా పుట్టే పుత్త్రుడి స్పర్శ విశేషాలు శకుంతల ఏం చెప్పిందో తెలుసుకుందాం.
‘‘కన్నకొడుకు దుమ్ముగొట్టుకుపోయిన మేనితో చేరి, తండ్రి అవయవాలను కౌగిలించుకొంటే, అంతకంటే ఎక్కువైన ఆనందం, ఐశ్వర్యం మరొకటి ఏముంది?‘‘ అని నిండుసభలో ప్రశ్నించింది.
మగవాడికి జీవితంలో భార్య ఇచ్చే సుఖం కన్నా ఉత్తమమైన సుఖం పుత్రగాత్రపరిష్వంగం. ఇది భార్య ఇచ్చే శారీరకానందం కన్నా మనోబుద్ధి ఆత్మానందాలకు చెందింది. దీని కోసమే కుటుంబ జీవనం ఏర్పడింది. ఇది తెలియని నేటి ఆధునిక మహిళామణులు వేశ్యాప్రవృత్తితో సంసారాన్ని సానికొంప చేసి భర్తకు కుటుంబం పట్ల ఉండాల్సిన మౌలికబంధాన్ని దూరం చేస్తున్నారు. ఏ అత్యుత్తమ ఆనందం నుంచీ భర్తలు దూరం అయ్యారో కూడా తెలియని పరిస్థితికి నేడు భర్తలు జారుకున్నారు. కుటుంబం ఎందుకు అనేది నిర్వచించిన మహాభారతంలోని ఈ అంశం మతపరమైనది కాదు. మానసికశాస్త్రానికి చెందింది. ఇది కుహనా సెక్యులర్ వాదులు తమపిశాచబుద్ధిని పక్కనపెట్టి తెలుసుకుంటే వారి కాపురాలు, వారి పిల్లల కాపురాలు నిలుస్తాయి. మంచిది.
భర్తకు ఇటువంటి అత్యుత్తమ ఆనందాన్ని అతనికి తన సంతానమే అనే నమ్మకం ద్వారా ఆమె అందికపోవడం వల్లనే నేడు సంసారాలు కూలిపోతున్నాయి. నిలిచిన సంసారాల్లో కూడా ఆత్మలోపించి ప్రాణంలేని శవప్రాయాలుగా నిలిచాయి. కనుకనే నేడు ఎన్ని సంసారాలు ధర్మబద్ధంగా ఉన్నాయి, ఎన్ని సంసారాలు సానిగూటికి నకళ్ళుగా ఉన్నాయో ఎవరికి వారు తెలుసుకోవాలి. కేవలం సంస్కారం ఉన్న సంసారాలే ఈ దివ్యానుభూతిని అనుభవిస్తున్నాయి. వారే సంసారానికి బద్ధులై ఉన్నారు.
పతివ్రతైన భార్య ఇచ్చే సంతానం ద్వారా కలిగే భౌతికమైన అనందాలు పైన చెబితే, ఆధ్యాత్మికపరమైన మోక్షసాధనను వేదమంత్రాల సాక్షిగా తన వాదనకు బలంగా శకుంతల చెబుతోంది. జాతకకర్మ సమయంలో చెప్పే దివ్యమైన వేద మంత్రాలు ఉదాహరిస్తూ ఆమె చెప్పింది. ఇవి అంతా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన మంత్రాలివి.
అంగాదంగాత్సంభవసి హృదయాదధిజాయసే॥
ఆత్మా వై పుత్రనామాసి స జీవ శరదః శతం।
జీవితం త్వం దధీనం మే సంతానమపి చాక్షయం।
తస్మాత్ త్వై జీవ మే పుత్ర సు సుఖీ శరదాం శతం॥
‘‘ నా ప్రతి అవయవం నుంచీ నీవు సంభవించావు. నా హృదయం నుంచి జన్మించావు. పుత్త్రుడవనే పేరనున్నది నేనే. అట్టి నీవు నూరేండ్లు జీవించు. నా జీవితం నీవు. అక్షయమైన నా సంతానమూ నీవే. అందువల్ల నా పుత్త్రుడా, నీవు మిక్కిలి సుఖంతో నూరేండ్లు జీవించు‘‘ అని వేదమంత్రాలు అంటున్నాయి.
ఈ మంత్రాలు ఆంధ్రవ్యాసుల వారు ప్రతిపాదించిన పితృయోగంలో అతి కీలకమైనవి.
శకుంతల అతి ముఖ్యమైన యోగాన్ని చెప్పడం కొనసాగిస్తోంది.
భార్యతో సంసారం మోక్షప్రదాయకం ఎలా అవుతుందో చెప్పే అతి ముఖ్యమైన వేదమంత్రాలివి. వీటిని అర్థం చేసుకుని సంసారం చేస్తే వేరే ఆధ్యాత్మిక సాధన అవసరం లేదని ఆంధ్రవ్యాసుల పితృయోగం చెబుతోంది.
జాతకర్మలు చేసేటప్పుడు పలికే వేదమంత్రాలలో ‘‘అంగాదంగాత్సంభవసి‘‘ అని ఆమె ఉదాహరించిన మొదటి పాదంలో ఉంది. ‘‘నా ప్రతి అవయవం నుంచీ నీవు సంభవించావు‘‘ అని దీని అర్థం. ఇది ఆధునిక విజ్ఞానశాస్త్రాలు తెలియని పల్లెటూరి వారికి కూడా తండ్రిపోలికలతో ముమ్మూర్తులా కుమారుడు నఖశిఖపర్యంతం (కాలి గోరు నుంచీ తల వెంట్రుకల వరకూ తండ్రి ఫోటో కాపీగా కుమారుడు జన్మిస్తాడు) పుడతాడని తెలుసు. నిజానికి జానపదులలో గతజన్మ రహస్యాలు చెప్పే విద్యకూడా ఉంది. ఎవరికైనా చెవులడొప్పల మీద చిన్న రంధ్రం ఉంటే వారు గత జన్మలో కూడా అదే వంశంలో జన్మించిన వారని చెబుతారు. వీటికి శాస్త్రీయ ప్రమాణాలు పరిశోధించాల్సి ఉంది. కానీ అన్ని భారతీయజాతుల్లోనూ జన్మరహస్యాలు పసిగట్టే విద్య వేలఏళ్ళ నుంచీ ఉంది.
దీని తరువాత ‘‘హృదయాదధిజాయసే‘‘ అని ఉదాహరించిందామె. నా హృదయం నుంచి జన్మించావు అని దీని అర్థం. మంత్రపుష్పం అర్థం తెలిసిన వారికి హృదయం అనే మాటకు సంపూర్తివివరాలు తెలుస్తాయి. మనిషి ప్రాణాలు హృదయంలో ఉంటాయి. మిణుకు మిణుకు మంటూ అతి సూక్ష్మమైన దీపశిఖగా ఉంటుంది. ఆ శివ రూపాన్నే బ్రహ్మ, విష్ణు, ఇంద్రులు అని అంటారు. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టు కుమారుని శరీరంలోని హృదయప్రాణదీపాన్ని తండ్రి వెలిగిస్తాడు.
దీని తరువాత అతిముఖ్యమైన దివ్యవేదమంత్రం ఆమె చెప్పింది. ‘‘ఆత్మా వై పుత్రనామాసి‘‘, పుత్త్రుడవనే పేరనున్నది నేనే . అద్వైత సిద్ధాంతం మొత్తం ఈ మంత్రంలో ఉంది. ఇది అర్థం చేసుకుంటే సంసార జీవితంలోనే ఆత్మసాక్షాత్కారం పొందవచ్చు. ధర్మశాస్త్రాలలో ఆత్మ అనే పదానికి అనేక అర్థాలున్నాయి. నేను పదాన్ని ఆత్మ, అహం అనే పదాలకి అర్థంగా వాడతారు. ఇక్కడ నేను అంటే తండ్రి కాదు. ఎందుకంటే భూమి మీద తండ్రి అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. తండ్రే పరమాత్మ. ఆ పరమాత్మే పుత్రుడిగా జన్మిస్తుంది. ఈ పుత్త్రుడే పరమాత్మగా మనుమడిని పుట్టిస్తాడు. మనుమడే పరమాత్మగా మునిమనుమడిని పుట్టిస్తాడు.
ఆత్మ ఆత్మగా విభజన, ఖర్చు లేనిదిగా ఉంటూ ఆత్మ జన్మించడం అంటే తండ్రి తండ్రిగా ఉంటూ కుమారుడిగా జన్మించడం బట్టీ అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆత్మ అవ్యయం (ఖర్చుకానిది) అనేదానికి కూడా ఇక్కడ అర్థం తెలిగ్గా చేసుకోవచ్చు. కుమారుడు జన్మించినంత మాత్రాన తండ్రిలో మార్పు ఉండదు. కాసు బంగారం నుంచీ అరకాసు ఉంగరం తయారు చేస్తే, బంగారునాణెంలో అరకాసే ఉంటుంది. కానీ ఇక్కడ తండ్రి తండ్రిగానే ఉంటాడు. అదే ఆత్మతత్త్త్వం. ఈ విధంగా ఎంతో కష్టమైన వేదవేదాంతాల రహస్యాలు ఎన్నో పుత్రుడు కలిగినందువల్ల సంసార జీవితంలో ప్రాక్టికల్ (అనుభవపూర్వకం) గా అతి తేలిగ్గా తెలుసుకోవచ్చు.
‘‘నా జీవితం నీవు‘‘ అనేది తరువాతి వేదమంత్రం ‘‘జీవితం త్వం దధీనం మే‘‘లో ఉంది. ఒక మొక్కకు అంటుకట్టి మరొక మొక్కను తయారు చేసినట్టు బాల్యం యవ్వనం ముసలితనం ఉన్న శరీరం నుంచీ ఆత్మకు నూతన శరీర కొనసాగింపే కుమారుడు. ‘‘మే సంతానమపి చాక్షయం‘‘ అక్షయమైన నా సంతానమూ నీవే -అనే తరువాతి పాదంలో చెప్పినది నా జీవితం నీవు అన్నదానికి కొనసాగింపు. కుమారుడు తండ్రి మరుజన్మకు కొనసాగింపు, మనుమడు తాత జీవితానికి కొనసాగింపు అవుతాడు. ఈ విధంగా ఆత్మ అనంతమైన దేహయాత్రకు అక్షయమైన పుత్త్ర సంతానం కారణం అవుతుంది.
ఈ వేదమంత్రాలున్న శ్లోకాలు నిత్యం చదువుకొని భావాన్ని మనసుకు పట్టించుకుంటే సంసారంలో ఉంటూనే అతితేలిగ్గా ఆత్మసాక్షాత్కారాన్ని కుమారుని రూపంలో పొందవచ్చని శకుంతల చెబుతోంది. ఇదే ఆంధ్రవ్యాసుల వారు ప్రచారం చేస్తున్న పితృయోగం.
ఈ ఆత్మజ్ఞానం అతి తేలిగ్గా పొందడానికి పూర్వం వివాహం సృష్టించారు. అయితే అది నేడు పైశాచికభాష్యకారుల నిర్వచనాల ప్రకారం వివాహం అనేది స్త్రీ రక్షణకోసం ఏర్పడింది. సురక్షిత శృంగారం కోసం ఏర్పడింది అంటూ వికృతార్థాలు చెబుతూ వచ్చారు. ఈ వేశ్యాభోగనిర్వచనాల వల్ల సంసారం అంటే శారీరకభోగాలకు అడ్డాగా అర్థం చేసుకునే తరాలు తయారయ్యాయి.
ఇంత తేలికగా వేదవిద్యను బోధించే వ్యవస్థను రూపొందించి శూద్రాదులకు కూడా అందించిన దివ్యదేశం భారతదేశం. బ్రాహ్మణుడి నుంచీ అష్టాదశవర్ణాల వారూ చేస్తున్న పనిని చేస్తూనే, చేస్తున్న సంసారం చేసుకుంటూనే , భార్యతో భోగాలు అనుభవిస్తూనే, అరణ్యాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా తపస్సులు చేయాల్సిన అవసరం లేకుండా, నువ్వు కనే పిల్లలతోనే నీకు మోక్షప్రాప్తి లభిస్తుందనే అద్భుతమైన వ్యవస్థ మరే మతంలోనూ, మరే దేశంలోనూ లేదు. భార్యభర్త కలిసిన స్వస్వరూపమైన బిడ్డలుగా తమను తాము ఆవిష్కరించుకుని అతితేలిగ్గా యోగసాధనను చేసే దివ్యమైన గృహస్థాశ్రమం లాడ్జీలకన్నా నీచంగా తయారవుతోంది.
పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నామో ఎప్పుడైతే మరిచిపోయారో, భౌతిక లంపటత్వాలు పెరిగి నేటి సంసారాలు రూపుమార్చుకున్న సానికొంపలవుతున్నాయి.
వేదమంత్రాల ద్వారా దివ్యమైన యోగాన్ని చెప్పిన శకుంతల కుమారుడు అంటే ఎవరో చిన్నచిన్న మాటల్లో అద్భుతంగా చెబుతోంది.
‘‘స్వచ్ఛమైన సరస్సులో ప్రతిఫలించిన నీ ప్రతిబింబంలా ఉన్నాడు, జీవుని నుంచి జీవునిలా నీ అవయయవాల నుంచీ సంభవించిన నీ సుతుని చూడు. గార్హపత్యాగ్ని నుంచి ఆహవనీయాగ్ని వెలువడినట్లు నీ అవయవాల నుంచి వెలువడిన వాడితడు. ఒకడవుగా ఉన్న నీవే ఇద్దరైనావు.‘‘
పతివ్రతైన భార్య కుమారుని ప్రసవం ద్వారా భర్తను సంసారానికి కట్టిపారేస్తుంది.
ప్రపంచంలో నేడు నెలకొన్న అశాంతికి మూల కారణం కుటుంబవ్యవస్థ కూలిపోవడమే. తల్లితండ్రులు బిడ్డల బంధం, భార్యాభర్తల బంధం, వియ్యంకుల బంధం, సోదరుల బంధం, బంధువుల బంధం -ఇవన్నీ నేడు కనిష్ఠస్థాయికి పడిపోయాయి. వీటిలో కొన్ని ఋణాత్మకవిలువకు కూడా చేరుకున్నాయి. అది సమస్యే అయినా, వీటిని తిరిగి నిర్మించుకోలేనంతగా పాడైపోవడమే ప్రధాన సమస్య. అన్నిటికీ మించి ఈ బంధాలు ఎంత మధురమైనవో చెప్పేవ్యవస్థ నాశనం కావడం ప్రధాన అంశం.
భారతీయుల్లో ఉన్న పటిష్ఠమైన కుటుంబవ్యవస్థను నాశనం చేసిన ఘనత మాత్రం ఆంగ్లేయులకే చెందుతుంది. ఎప్పుడైతే భారతపురాణాలు, ఇతిహాసాలు ప్రజల్లో బహుళప్రచారంలో ఉన్నాయో మానవసంబంధాలు కూడా ప్రబలంగా ఉన్నాయి. పనిగట్టుకొని సంస్కృతభాషను నాశనం చేయడంతో మొదటిగా కుటుంబవ్యవస్థ ఛిన్నాభిన్నమై భారతీయపునాదులు కదిలిపోయాయి. నేడు ఖరీదైన వస్తువినియోగమాయలో బహుళజాతిసామ్రాజ్యంలో పడి కొట్టుకులాడుతున్న భోగలాలసత జీవితం నిజమైన తీయని ఆనందం మరిచిపోయింది. ఇది తెలియాలంటే శకుంతల చెప్పిన అద్భుతమైన పుత్రగాత్రస్పర్శసుఖం వివరాలు తెలియాలి. నేడు ఫామిలీ కోర్టులకు చేరుతున్న విడాకుల కేసుల్లో కనీసం 80 శాతం విడాకులు అవసరం లేని కేసులే.
నిజానికి శకుంతల ప్రేమ మాయలోపడి పెద్దపొరపాటే చేసింది. కానీ, ఆమె తెలియక చేయలేదు. అన్నీ తెలిసే చేసింది. ఆమెకు ఎంత దివ్యమైన జ్ఞానం ఉందో ఈ చర్చద్వారా తెలుస్తోంది. సంసారం అంటే సానితనం అంటే తెలియనిది శకుంతల కాదు. కానీ నేడు ఈ జ్ఞానం లేని వారు ప్రేమపేరుతో చేస్తోంది ఏమిటో ఎవరికి వారు తెలుసుకోవాలి. వారసత్వహక్కుతో ఆస్తి దక్కించుకోవాలనుకునే ఆధునిక వేశ్యలకు, కుమారునికి రాజ్యాధికారం కావాలని శకుంతల చేసిన సాహసానికి ఉన్న వెంట్రుకవాసి భేదాన్ని దివ్యమైన సంసారయోగవిజ్ఞానమే వేరు చేస్తుంది. పుత్త్రుడు పుట్టాక ఆమె మాసిన గుడ్డలతో, అలంకరణ లేకుండా, శుష్కించి యోగమార్గంలోకి వెళ్ళిపోయింది. కడుపురాగానే హమ్మయ్యా ఇక రంగం ఎక్కవచ్చు అంటూ మీ టూ పిశాచాల్లా అల్లరి చేయలేదు. అప్పుడే ఆమె చేసి ఉంటే 15 ఏళ్ళ నిండుయవ్వనం అడవిలో మగ్గిపోయేది కాదు. మహారాజ భోగాలు ఆమె లక్ష్యం కాదు.
పితృయోగాన్ని దర్శిస్తూ కణ్వాశ్రమంలోనే యోగమార్గంలో ఉన్న శకుంతల ఎందుకు దుష్యంతుడి సభకు వెళ్ళిందో ముందుముందు తెలుసుకుందాం.
సూచన: శకుంతల ప్రవచించిన సంసార జీవితంలో ఉంటూనే ఆత్మసాక్షాత్కారం పొందే పితృయోగం నిత్యం యువతీయువకులు, దంపతులూ పారాయణ చేయవలసిన దివ్యసూక్తం. దీన్ని కావలసినవారు 7842224469కి వాట్సప్ చేసి పొందవచ్చు.
ఆధారం: మా గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య తెలుగులోకి అనువక్తీకరించగా అనంతసాహితి 1998లో ప్రచురించిన ‘‘భారత శాకుంతలం‘‘.
స్వామి అనంతానంద
అనంతసాహితి ఆశ్రమం
హైదరాబాద్, గుంటూరు
--------------------------------------------------
పురాణవిద్యలో శ్రీకూర్మపురాణం...త్వరలో!!!-
ఒక ప్రణాళికా బద్ధంగా చేస్తున్న ఆధ్యాత్మికవ్యాసవ్యవసాయం ఇది . దాదాపు మూడునెలలుగా వామనపురాణాన్ని ప్రతిరోజూ అధ్యయనం చేసిన వారు మహాదీక్షపొందారు. ఇప్పుడు అదే దీక్షకొనసాగించి చిన్న చిన్న వ్యాసాలుగా వస్తున్న కూర్మమహాపురాణం ద్వారా వ్యాసానుగ్రహం పొందాలని కోరుతున్నాము. అన్నీ ఒకేసారి చదువుకుందాం అని కాక, ఏ రోజువారోజు చదువుకుంటేనే పురాణవిద్యా దీక్షలభిస్తుంది.
మా తొలి చాతుర్మాస్య దీక్షలో భాగంగా గురుదేవులు ఆంధ్రవ్యాసుల వారి ఆశీర్వాదంతో పురాణవిద్యాభ్యాసం ప్రారంభించాము. అందరికీ స్వాగతం. మీ మిత్రులనూ బంధువులనూ నూతంగా ప్రారంభం అవబోతున్న రెండవ చరణంలో మీ సహచరులను చేయమని కోరుతున్నాము. పురాణవిద్యా ప్రచారానికి భాగస్వాములు కావాలని కోరుతున్నాము.
స్వామి అనంతానంద
అనంతసాహితి ఆశ్రమం
హైదరాబాద్, గుంటూరు
---------------------
గురుదక్షిణ
పురాణవిద్యాధ్యయనం, ప్రచారాన్ని వ్యాసపౌర్ణిమనాడు, మా గురుదేవులు వ్యాసునిలో ఐక్యమైన రోజు, మా మొదటి చాతుర్మాస్యదీక్ష మొదలైన రోజు అయిన ఆషాఢపౌర్ణమినాడు వారాణసిలో ప్రారంభించాము. ఇందులో భాగంగా మొదటగా వామనమహాపురాణాన్ని స్వీకరించి సామాజిక మాధ్యమం లోని పరిమితుల మేరకు సభ్యులకు అందచేయడం జరిగింది. ఈ పురాణవిద్యా ప్రచారం ఖరీదైనది. ఈ ప్రచారం వల్ల ప్రయోజనం ఉంది అనుకుంటే, సామాజిక మాధ్యమం ద్వారా కొనసాగించడానికి అనువుగా వదాన్యులను గురుదక్షిణ కోరుతున్నాము. దసరా సందర్భంగా, వామనపురాణాధ్యనం ముగింపు సందర్భంగా దానా లు చేయడానికి తగిన సమయం కనుక ఆసక్తి, ఇచ్ఛ, శక్తి ఉన్నవారు గురుదక్షిణగా దానం చేసి ఈ ఉద్యమాన్ని ప్రోత్సహించమని కోరుతున్నాము.
దానాన్ని భారతప్రభుత్వము ప్రారంభించిన భీమ్ ఆర్థిక మాధ్యమం ద్వారా చేయవచ్చును.
Anantananda@UPI
9247821505@UPI
g pay app:
swamiANANTAananda@okicici (92478 21505)
అనే అనుసంధానం ద్వారా చరవాణి ఉపయోగించి తమ విరాళములు అందచేయమని కోరు న్నాము.
దాతలు దయచేసి 9247821505కి తమ దాన వివరాలు ఎస్ ఎం ఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము.
--------------------------------------
(అనంతసాహితి వాట్సప్ బృందంలో 784 222 4469 అనే నెంబరు ద్వారా చేరి పురాణవిద్యా ప్రచారం చేయండి )
--------------------------------------------------