10/05/2026
మార్కాపురం జిల్లా, కనిగిరి నియోజకవర్గం, సి.యస్.పురం మండలం, కోవిలంపాడు పోస్టు మిట్టపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానం నందు *ధ్యాన మందిర నిర్మాణం నిమిత్తం రూ.1,25,00,000/- లు సి.జి.ఎఫ్ నిధులు* మంజూరు కాబడినివి. కావున తేది.11.05.2026 అనగా రేపు సోమవారం ఉదయం 10.00 గంటలకు *ధ్యాన మందిరం శంకుస్థాపన* మరియు *దాతలచే* పామూరు నుండి సి.యస్.పురం హైవే మీదగా దేవస్థానమునకు వచ్చే దారి ఎంట్రన్స్ నందు *మెయిన్ ఆర్చి* శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేసి ఉన్నారు. ముఖ్యఅతిథిగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు విచ్చేయుచున్నారు. కావున మీడియా వారు మరియు గ్రామస్తులు శ్రీ స్వామి వారి భక్తాదులందరూ పాల్గొనవలసినదిగా కోరుచున్నాము.
ఇట్లు
*ఆలయ కార్యనిర్వహణాధికారి*
*మరియు వ్యవస్థాపక ధర్మకర్త*