AP State Jesus Believers Association

AP State Jesus Believers Association Vision
1. Unite & Serving Christian Community(Bishops, Pators, All Jesus Believers ) in the Andhra Pradesh State

Mission
1.

Associating with almost all Church heads of Main line churches, Large gathering Independent & churches, All Belivers in AP State.

⛪✝️ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంగా, జీవ...
20/04/2026

⛪✝️ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంగా, జీవముగల దేవుని సేవకులైన బిషప్స్, పాస్టర్స్, క్రైస్తవ నాయకులు అందరూ ఆయన కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయవలసిందిగా వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను.

రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు, అన్ని మతాల వారికి సమాన న్యాయం జరిగేలా, జ్ఞానముగల ఆలోచనలు ప్రసాదించే ఏసు ప్రభువు, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మంచి నిర్ణయాలు తీసుకునే జ్ఞానం ప్రసాదించి, ఆయనను ముందుకు నడిపించాలని ప్రార్థిద్దాం.

సర్వమానవాళి పాపాల కొరకు తన ప్రాణం అర్పించి, మూడవ దినమున సజీవుడై తిరిగి లేచి, 40 రోజుల పాటు భూమిపై ఉండి, 500 మందికి పైగా ప్రజలకు కనబడి, "మరల వచ్చెదను" అని వాగ్దానం చేసి, పరలోకమునుండి సమస్తమును చూచుచున్న జీవముగల ప్రభువైన ఏసుక్రీస్తు, శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని మనమందరం ప్రార్థిద్దాం.

ప్రొఫెసర్ డా. జోసఫ్ మోసిగంటి
B.Tech, M.Tech, Ph.D
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు &
మేనేజింగ్ డైరెక్టర్ (MD)
సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ కాలేజస్, గుంటూరు

✝️ ఈస్టర్ శుభాకాంక్షలుప్రభువైన యేసుక్రీస్తు మృతులలోనుండి లేచిన ఈ మహిమాన్వితమైనఈస్టర్ పండుగ సందర్భంగా అందరికీహృదయపూర్వక శ...
05/04/2026

✝️ ఈస్టర్ శుభాకాంక్షలు
ప్రభువైన యేసుక్రీస్తు మృతులలోనుండి లేచిన ఈ మహిమాన్వితమైన
ఈస్టర్ పండుగ సందర్భంగా అందరికీ
హృదయపూర్వక శుభాకాంక్షలు. 🌸✝️
ఈస్టర్ మనకు ఆశను, ప్రేమను,
విజయాన్ని, నూతన జీవితాన్ని గుర్తు
చేస్తుంది. సిలువపై మరణించిన యేసు
ప్రభువు, మూడవ దినమున లేచి
మరణంపై విజయాన్ని సాధించి మనకు
నిత్యజీవమునకు మార్గం చూపించారు.
"నేను
బ్రతికియున్నాను; మీరు కూడ బ్రతుకుదురు"
— యోహాను 14:19
బైబిల్ వాడుక భాషలో - డౌన్లోడ్
https://play.google.com/store/apps/details?id=org.grace.ministries.telugu.studybible
ఏసుప్రభు గుడ్ ఫ్రైడే రోజున
చనిపోయిన తర్వాత, తిరిగి బ్రతికి
ఉండకపోతే మనకు నిరీక్షణ ఉండేది
కాదు. ఏసుప్రభు ఇప్పుడు జీవించుచున్నాడు,
కనుకనే ఏసుప్రభు విగ్రహము పెట్టుకోరు,

ఇప్పటికీ అనేక మందికి దర్శనాలలో
ప్రత్యక్షంగా కనబడుతూ మాట్లాడుతూ ఉన్నాడు

ఈ ఈస్టర్ పండుగ మన
జీవితాల్లో

నిరాశకు బదులు ఆశను 🌿
భయానికి బదులు ధైర్యాన్ని 💪
చీకటికి బదులు వెలుగును ✨
మరణానికి బదులు జీవాన్ని 💖
నింపాలని ప్రార్థిస్తున్నాను.
యేసుక్రీస్తు
పునరుత్థానం మీ కుటుంబాలకు
శాంతి, సంతోషం, ఆరోగ్యం, సమృద్ధి
కలుగజేయుగాక.
హ్యాపీ
ఈస్టర్!

శుభ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు! ✝️🌸
ప్రొఫెసర్ డా|| జోసఫ్
మోసిగంటి,
B.Tech, M.Tech, Ph.D ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు
Nara Lokesh TD Janardhan Rajumaddipati Rajumaddipati sravani bandaru Chirri Balaraju galla madhavi MOHAMMED NASEER Ravi Hindu Gottipati Akhila Priya

**గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు****– ప్రొఫెసర్ డా. జోసెఫ్ మోసిగంటి**ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ న...
03/04/2026

**గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు**

**– ప్రొఫెసర్ డా. జోసెఫ్ మోసిగంటి**
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు **ప్రొఫెసర్ డా. జోసెఫ్ మోసిగంటి** గారు గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వ మానవాళి రక్షకుడైన **యేసు క్రీస్తు ప్రభువు**, ప్రపంచ ప్రజల పాపాల విమోచన కోసం తన ప్రాణాన్ని సిలువపై అర్పించారని తెలిపారు. మానవాళి పాపాల శిక్షను తనపై భరించి, ప్రేమ, క్షమ, త్యాగం అనే గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించారని అన్నారు.

యేసు ప్రభువును అమానుషంగా హింసించి, 39 కొరడా దెబ్బలు కొట్టారని, ఆయన తలపై ముళ్ల కిరీటం పెట్టారని, భారమైన శిలువను మోయించారని, చేతులు కాళ్లలో మేకులు కొట్టి సిలువ వేయించారని ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి గారు పేర్కొన్నారు. ఎటువంటి తప్పు చేయకపోయినా, సర్వ మానవాళి పాప విమోచన కోసం ఈ బాధలను ఆయన స్వీకరించారని తెలిపారు.

ఒక తండ్రి తన కుమారుని తప్పిదాలను భరించినట్లే, దేవుడైన యేసు ప్రభువు కూడా మానవాళి పాపాలను భరించి, తనను సిలువ వేసిన వారిని కూడా క్షమించారని ఆయన అన్నారు. తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మానవాళికి విమోచన మార్గాన్ని చూపారని తెలిపారు.

ఎవరైతే తమ పాపాలను ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టి, యేసు ప్రభువు తమ పాపాల కొరకు ధర చెల్లించాడని విశ్వసిస్తారో, వారిని ఆయన రక్తం శుద్ధులుగా చేసి, పరిశుద్ధమైన జీవితం గడపడానికి మార్గనిర్దేశం చేస్తుందని ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి గారు తెలిపారు.

నిజంగా యేసు ప్రభువును వెంబడించిన అనేక మంది తమ జీవితాలను మార్చుకున్నారని, దొంగలు తమ దొంగతనాన్ని విడిచిపెట్టారని, వ్యభిచారులు తమ వృత్తిని విడిచిపెట్టారని, ఇతరులదాన్ని ఆశించకుండా కష్టపడి పని చేయడం నేర్చుకుంటున్నారని ఆయన అన్నారు.

గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రేమ, క్షమ, త్యాగం, వినయం అనే యేసు ప్రభువు బోధలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి గారు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

Nara Lokesh TD Janardhan Rajumaddipati Rajumaddipati sravani bandaru

ఆడపిల్లలకు కూడా మగ పిల్లలతో సమానంగా ఆస్తి పంచాలి – ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటిగుంటూరు జిల్లా చేబ్రోలు: ఆడపిల్లలకు కూడా మగ ...
08/03/2026

ఆడపిల్లలకు కూడా మగ పిల్లలతో సమానంగా ఆస్తి పంచాలి – ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి

గుంటూరు జిల్లా చేబ్రోలు: ఆడపిల్లలకు కూడా మగ పిల్లలతో సమానంగా తల్లితండ్రులు ఆస్తిని పంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు ప్రొఫెసర్ డా. జోసెఫ్ మోసిగంటి అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలులో ఆయన ఒక ప్రకటన చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం సమాజంలో అనేక రంగాలలో స్త్రీలపై ఉన్న వివక్షతలు చాలా వరకు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. గతంలో సతీసహగమన వంటి దురాచారాలను నిర్మూలించేందుకు ప్రముఖ సంఘ సంస్కర్త మిషనరీ విలియం కేరి కృషి చేయగా, రాజా రామ్మోహన్ రాయ్ సహకారంతో ఆ దురాచారం నిషేధించబడిందని ఆయన గుర్తు చేశారు.

ఈ రోజుల్లో చాలా కుటుంబాలు మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదివిస్తున్నప్పటికీ, ఆస్తి విషయంలో మాత్రం ఇంకా సమానత్వం కనిపించడం లేదని అన్నారు. చాలా మంది తల్లితండ్రులు ఆడపిల్లలను “వేరే ఇంటికి వెళ్లిపోయింది” అనే భావంతో చూసి ఆస్తి పంచడంలో వెనుకంజ వేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉద్యోగాలు, జీవన పరిస్థితుల కారణంగా మగ పిల్లలు కూడా తల్లితండ్రులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. అనేక కుటుంబాలలో ఆడపిల్లలకే తల్లితండ్రుల పట్ల ప్రత్యేకమైన ప్రేమ, బాధ్యత ఉండి వారినే ఎక్కువగా చూసుకుంటున్నారని ఆయన తెలిపారు. అయినప్పటికీ కొంతమంది తల్లితండ్రులు కుమారులకే ఆస్తి ఇస్తున్నారని, ఈ పరిస్థితి కూడా మారాల్సిన అవసరం ఉందని సూచించారు.

క్రైస్తవ ధర్మంలో స్త్రీలకు సమాన ఆస్తి హక్కు ఉందని ఆయన అన్నారు. భారతదేశంలోనే తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించగా, అనంతరం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆ చట్టాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు.

ప్రస్తుతం స్త్రీలు చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు సహా అన్ని రంగాలలో మగ పిల్లలకంటే ముందంజలో నిలుస్తున్నారని అన్నారు. అయితే కొంతమంది స్త్రీలు స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని కుటుంబాలలో విభేదాలు సృష్టిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులు తయారవ్వాలన్నా, కుటుంబాలు మరియు సమాజం బాగుండాలన్నా స్త్రీ పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

స్త్రీలు వ్యక్తిత్వంలోనూ, అన్ని రంగాలలోనూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

పలనాడు జిల్లాలోని మండల పాస్టర్ ఫెలోషిప్ నాయకులతో సమావేశంప్రొఫెసర్ జోసఫ్ మోసిగంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు ప...
20/02/2026

పలనాడు జిల్లాలోని మండల పాస్టర్ ఫెలోషిప్ నాయకులతో సమావేశం
ప్రొఫెసర్ జోసఫ్ మోసిగంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి గారు పల్నాడు జిల్లాలోని, నరసరావుపేటలో జూపల్లి సెంటర్ వద్ద గల బెర్షెబా ప్రార్ధనా మందిరం లో నిర్వహించిన పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల పాస్టర్ ఫెలోషిప్ నాయకులతో 19వ తారీకు గురువారం ఉదయం 9.30 గంటల నుండి 4.30 గంటల వరకు నిర్వహించిన సమావేశం చాలా ఘనముగా జరిగినది, పల్నాడు జిల్లాలోని మండలాల నుంచి 60 మంది క్రైస్తవ నాయకులు అటెండ్ అయ్యారు, ప్రొఫెసర్ జోసెఫ్ గారు వారి సమస్యలు విని, చాలా వాటికి పరిష్కార మార్గాలు కూడా సూచించారు, మిగిలిన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, క్రైస్తవ నాయకులందరూ మతసామరస్యముతో ఉంటున్నారని, స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ సాధనలో భాగస్వామ్యంలో అవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా అన్ని జిల్లాలలోని మండల ఫెలోషిప్ నాయకులతో మీటింగ్ పెడుతున్నామని, పలనాడు జిల్లాతో మొదలుపెట్టామని ప్రొఫెసర్ జోసెఫ్ తెలియజేశారు, లోకల్ గా క్రైస్తవ నాయకులు అందరూ కలిసి ప్రొఫెసర్ జోసఫ్ గారు, రాష్ట్ర క్రైస్తవ సమాజానికి చేస్తున్న సేవలను బట్టి, శాలువాతో సత్కరించారు.

పలనాడు జిల్లాలోని మండల పాస్టర్ ఫెలోషిప్ నాయకులతో సమావేశంప్రొఫెసర్ జోసఫ్ మోసిగంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు ప...
20/02/2026

పలనాడు జిల్లాలోని మండల పాస్టర్ ఫెలోషిప్ నాయకులతో సమావేశం
ప్రొఫెసర్ జోసఫ్ మోసిగంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి గారు పల్నాడు జిల్లాలోని, నరసరావుపేటలో జూపల్లి సెంటర్ వద్ద గల బెర్షెబా ప్రార్ధనా మందిరం లో నిర్వహించిన పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల పాస్టర్ ఫెలోషిప్ నాయకులతో 19వ తారీకు గురువారం ఉదయం 9.30 గంటల నుండి 4.30 గంటల వరకు నిర్వహించిన సమావేశం చాలా ఘనముగా జరిగినది, పల్నాడు జిల్లాలోని మండలాల నుంచి 60 మంది క్రైస్తవ నాయకులు అటెండ్ అయ్యారు, ప్రొఫెసర్ జోసెఫ్ గారు వారి సమస్యలు విని, చాలా వాటికి పరిష్కార మార్గాలు కూడా సూచించారు, మిగిలిన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, క్రైస్తవ నాయకులందరూ మతసామరస్యముతో ఉంటున్నారని, స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ సాధనలో భాగస్వామ్యంలో అవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా అన్ని జిల్లాలలోని మండల ఫెలోషిప్ నాయకులతో మీటింగ్ పెడుతున్నామని, పలనాడు జిల్లాతో మొదలుపెట్టామని ప్రొఫెసర్ జోసెఫ్ తెలియజేశారు, లోకల్ గా క్రైస్తవ నాయకులు అందరూ కలిసి ప్రొఫెసర్ జోసఫ్ గారు, రాష్ట్ర క్రైస్తవ సమాజానికి చేస్తున్న సేవలను బట్టి, శాలువాతో సత్కరించారు.

క్రైస్తవులకు ప్రత్యేకంగా 90.11 కోట్ల బడ్జెట్ కేటాయింపుచంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం,ఆర్థిక ఒత్తిళ్లు మధ్య కూడా, క్రైస్...
16/02/2026

క్రైస్తవులకు ప్రత్యేకంగా 90.11 కోట్ల బడ్జెట్ కేటాయింపు

చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం,
ఆర్థిక ఒత్తిళ్లు మధ్య కూడా, క్రైస్తవ సమాజానికి గత ఏడాది బడ్జెట్ కంటే ఎక్కువగా ఈసారి, ఉమ్మడి మైనార్టీ బడ్జెట్ కాకుండా క్రైస్తవ సమాజానికి ప్రత్యేకంగా మొత్తం 90 కోట్ల 11 లక్షలు బడ్జెట్ కేటాయించడం పట్ల ప్రొఫెసర్ జోసెఫ్ హర్షం వ్యక్తం చేశారు.
పాస్టర్స్ గౌరవ వేతనం రాబోయే సంవత్సరమునకు మరియు నాలుగు నెలల బకాయిలకు కలిపి సుమారు 68 కోట్లు కేటాయించారు

క్రైస్తవ యువత స్వయం ఉపాధి కల్పనకు 21 కోట్లు,

జెరూసలేం యాత్రకు 1.5 కోట్లు కేటాయించారని తెలిపారు.

పల్నాడు జిల్లాలోని క్రైస్తవ సమస్యలపై నాయకులతో చర్చవివిధ అంశాలపై అవగాహన కార్యక్రమ సమావేశంతేదీ: 19-02-2026,       స్థలం: న...
14/02/2026

పల్నాడు జిల్లాలోని క్రైస్తవ సమస్యలపై నాయకులతో చర్చ

వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమ సమావేశం

తేదీ: 19-02-2026,
స్థలం: నరసరావుపేటలో
టైం: 9.30 AM to 4.30 PM
రిజిస్ట్రేషన్ తప్పనిసరి :
https://jbac.in/entry
లింక్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

గమనిక: 16 వ తారీకు సోమవారం సాయంత్రం లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి ఫోన్ కి సమావేశ స్థలం వివరాలు పంపుతాము, భోజనం ఏర్పాటు చేయ బడుతుంది, ఎటువంటి కానుకలు ఇవ్వబడవు, దారి ఖర్చులు.

ఎవరు పాల్గొనచ్చు: పల్నాడు జిల్లా క్రైస్తవ నాయకులు, మాజీ & ప్రస్తుత మండల పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ మెంబెర్స్, క్రైస్తవ విద్యార్థులు, విశ్వాసులు, సమస్యలు ఎదుర్కొనేవారు, రాజకీయ పార్టీ బేధం లేదు, కుల డినామినేషన్ భేదం లేదు, మండల్ లెవెల్ నుంచి రాష్ట్ర లెవెల్ వరకూ మైనారిటీ కి వున్న700 నామినేటెడ్ పోస్ట్ ల తో, సమాజానికి సేవ చేయటానికి క్వావాలి అనుకునేవారు అందరు రావచ్చు.

ఈ సమావేశం లో చర్చించే అంశాల కొరకు పామ్ ప్లేట్ చూడండి

Address

3-241/1, Shalem Nivas, Madhura Nagar, S Achutapuram
Kakinada
533004

Alerts

Be the first to know and let us send you an email when AP State Jesus Believers Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share