Sathkarya SevaSamithi

Sathkarya SevaSamithi Daily Horoscope and Panchaga details for the rectification of Graha Doshas and other astrological problems. Marriage, Gruha Pravesham etc. Vyvahika Ponthanam.

Our services in the fields of Astrology, Vaastu Sastra, Raasi Phalas, Shubha Muhurtas, Matrimonial Services,Predictions Lucky Stones, Names, Shanti Pujas, complete Horoscope Analysis, Fixation of all types of Subhamuhurtams for individuals, Matrimonial Services including Match-Compatibility, providing lucky stones for the success in life, providing suitable lucky names for newly born children acco

rding to Sastra, Raasi phalas, Vasthu Sastra and providing engineering plans at your specifications and providing for the performance of Shanti Poojas etc. Subhamuhurtham means the auspicious time fixed to perform a Subha Karyam i.e. An Astrologer/ Panchanga Kartha fixes Subha Murthas after calculating different Ganithas to make them free from “doshas”. The Muhurthas in Panchangams are given commonly for all. The individual has to check the suitable Muhurtham for his personal Horoscope. We provide personalized attention and provide you the required Subha Muhurtham as per your personal need at a reasonable fees. We have mentioned the types of Muhurthams for different occasions are here under for personal attention. Marriage is the most amazing and crucial event in every one's life. And also it is the real turning point of real life. Hence, there is high priority to search for match compatibility i.e. Brides considering other factors like education, job etc. equal (or) utmost importance is given to this match compatibility by both the bride and bridegroom. Before entering into the Matrimonial Agreement, thorough verification and searching of the compatibility of the Horoscopes will be done. Since ancient times, the importance of Vaastu in human life is well-recognized. Even in the present civilized Society, the importance of Vaastu has been enormously increased by all sections of Society i.e. Non-Hindus. According to Vaastu, every place / site will have 8 sides (Ashta Dikkulu) and all these 8 sides are governed by Ashta Dikpalakas. It is believed that the said Dikpalakas pose their positive / negative powers on the place / site for ever. In Vaastu, the powers of the Dikpalakas is calculated is calculated through certain methods and theories – generated by ancient Vaastu Sastra Pitamahas

01/04/2022

అందరికీ శుభకృతు నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ గోచార రీత్యా శుభములను పొంది ధన ధాన్యములు గృహములో శుభకార్యములు రాజకీయ అభివృద్ధి ఆరోగ్యం సంతానము పొంది ప్రతి ఒక్కరూ నిరంతరం ధర్మ కార్యాచరణ చేస్తూ ఉండాలని సదా ఆ పరమేశ్వరుని ప్రార్ధిస్తూ మీ గాడేపల్లి రఘురామ శర్మ
"ధర్మే సర్వం ప్రతిష్ఠితం"

04/07/2021
_*కార్తీక పురాణం - 20 వ అధ్యాయము*_🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉*పురంజయుడు దురాచారుడగుట*☘☘☘☘☘☘☘☘☘జనక మహారాజు , చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన...
05/12/2020

_*కార్తీక పురాణం - 20 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*పురంజయుడు దురాచారుడగుట*

☘☘☘☘☘☘☘☘☘

జనక మహారాజు , చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో *"గురువర్యా ! కార్తీకమాస మహాత్మ్యమును ఇంకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా ! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్దునిగాజేయు"* డనెను. అ మాటలకు వశిష్టుల వారు మందహాసముతో *"ఓ రాజా ! కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి , అత్రిమునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు"* మని అ కథా విధానమును ఇట్లు వివరించిరి.

పూర్వ మొకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి , *"ఓ అత్రిమహామునీ ! నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీకమాస మహాత్మ్యమును నీకు ఆములాగ్రమున తెలియును , కాన దానిని నాకు వివరింపుము"* అని కోరెను. అంత అత్రిమహముని *"కుంభసంభవా ! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరమగుటచే ఉత్తమమయినది. కార్తీక మాసముతో సమానమగు మాసము. వేదముతో సమానమగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను , శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను , లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము.

త్రేతాయుగమున పురంజయుడను సూర్య వంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగ రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతను , రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్దిగలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహణ మాన్యములు లాగుకొని , పరమలోభియై , చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసికోనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభోజ , కొంకణ , కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకోని రధ , గజ , తురగ , పదాతి సైన్య బలాన్వితులై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి , నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భంధముచేసి యుద్దమునకు సిద్దపడిరి.

అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వసన్నద్దుడై యుండెను. అయినను యెదుటి పక్షము వారధికబలాన్వితులుగా నుండుటయి తాను బలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి , చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్దసన్నద్దుడై - వారిని యెదుర్కొన భేరి మ్రోగించి , సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రుసైన్యములపై బడెను.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్మ్యమందలి వింశాద్యాయము - ఇరవయ్యోరోజు పారాయణము సమాప్తము.*

_*కార్తీక పురాణం - 19 వ అధ్యాయము*_🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉*చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ*☘☘☘☘☘☘☘☘☘ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులం...
04/12/2020

_*కార్తీక పురాణం - 19 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ*

☘☘☘☘☘☘☘☘☘

ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్దుడను ఒక మహాయోగి *"ఓ దీనబాంధవా ! వేద వేద్యుడవని , వేద వ్యాసుడవని , అద్వితీయుడవని , సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని , సర్వాంతర్యామివని , బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని , నిత్యుడవని , నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా ! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందనా ! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యమువలన మేము మాఆశ్రమములు , మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా ! మేమీ సంసార బంధము నుండి బైట పడలేకుంటిమి , మమ్ముద్దరింపుము. మానవుడెన్నిపురాణములు చదివినా , యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు. ఓ గజేంద్రరక్షకా ! ఉపేంద్రా ! శ్రీధరా ! హృషీకేశా ! నన్ను కాపాడుము"* అని మైమరచి స్తోత్రము చేయగా , శ్రీ హరి చిరునవ్వు నవ్వి *"జ్ఞానసిద్దా ! నీ స్తోత్రవచనమునకు నేనెంతయు సంతసించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము"* అని పలికెను. అంత జ్ఞానసిద్దుడు *"ప్రద్యుమ్నా ! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలె కొట్టుకోనుచున్నాను. కనుక , నీ పాద పద్మముల పైనా ధ్యానముండుటనటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు"* అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు *"ఓ జ్ఞానసిద్దుడా ! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక , మరొక వరము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై , బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము.

*నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మిదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్దద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతముచేయు వారలకు సకల పాపములు నశించి , నా సన్నీధికి వత్తురు. ఈ చతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు , వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. వ్రతము చేసినవారికి జన్మ , జరా , వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును , శ్రవణశుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వోసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తిశ్రద్దలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగ వత్తురు."* అని శ్రీమన్నారాయణుడు మునులకు బోదించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవ్వళించెను.

వశిష్టుడు జనకమహారాజుతో *"రాజా ! ఈ విధముగా విష్ణుమూర్తి , జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస్య వ్రత మహత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు , అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు యీ చతుర్మాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనవింశోధ్యాయము - పందోమ్మిదోరోజు పారాయణము సమాప్తము.*

03/12/2020

_*కార్తీక పురాణం - 18 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*సత్కర్మానుష్టాన ఫల ప్రభావము*

☘☘☘☘☘☘☘☘☘

*"ఓ మునిచంద్రా ! మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి - గురువు - అన్న - దైవము సమస్తము మీరే , నా పూర్వ పుణ్య ఫలితమువలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహా పాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా , తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా ! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున వుండవలసినదే కదా ! అట్టి ! నేనెక్కడ ! మీ దర్శన భాగ్యమెక్కడ ! నాకు సద్గతి యెక్కడ ? పూణ్యఫలప్రదాయి అగు ఈ కార్తీకమాసమెక్కడ ! పాపాత్ముడనగు నేనెక్కడ ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించుటెక్కడ ? ఇవి అన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన , నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో , దాని ఫలమెట్టిదో విశదీకరింపు"* డని ప్రార్ధించెను.

*"ఓ ధనలోభా ! నీ వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి ఉపయోగార్ధమైనట్టివి కాన , వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని , సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే , జాతివాడో , ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక , సత్కర్మల నచారించినను వ్యర్ధమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను , మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా ఈ మూడు మాసముల యందయిననూ తప్పక నదిలో ప్రాతఃకాల స్నానము చేయవలెను. అటుల స్నానము ఆచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు , స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము , వేదములతో సరితూగు శాస్త్రము , గంగ గోదావరి నదులకు సమాన తీర్ధములు , బ్రాహ్మణులకు సమానమైన జాతీయు , భార్యతో సరితూగు సుఖమునూ , ధర్మముతో సమానమైన మిత్రుడనూ , శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు"*. అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.

*"ఓ మునిశ్రేష్టా ! చతుర్మాస్యవ్రతమని చెప్పితిరే ! ఏ కారణం చేత దానిని నాచరించవలెను ? ఇదివరకెవ్వరయిన ఈ వ్రతమును ఆచరించియున్నారా ? ఆ వ్రతము యొక్క ఫలితమేమి ? విధానమెట్టిది ? సవివరంగా విశదికరింపు"* డని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను.

*"ఓయీ ! వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి 'శయన ఏకాదశి'* అనియు , *కార్తీక శుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' అనియు , ఈ వ్రతమునకు , చతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన , దాన , జప , తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన , ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను".*

తొలి కృతయుగంబున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతలచేత , వేదములచేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును , చతుర్బాహుండును , కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో నిట్లనెను. *"నారదా ! నీవు క్షేమమే గదా ! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా ? మానవులందరికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ? ప్రపంచమున ఏ అరిష్టములు లేక యున్నవి కదా?"* అని కుశలప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి *"ఓ దేవా ! ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు - మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడదనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు , అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా , మరి కొందరు అహంకార సహితులుగా , పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపు"* మని ప్రార్ధించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి , ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.

ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు , పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు *"ఈ ముసలి వానితో మనకేమి పని"* అని ఊరకుండిరి. కొందరు గర్విష్టులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతియైనను చూడకుండిరి. వీరందిరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి *"వీరినెట్లు తరింపజేతునా ?"* అని అలోచించుచు , ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ , చక్ర , గదా , పద్మ , కౌస్తుభ , వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి , లక్ష్మి దేవితోడను , భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.

ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన సచ్చిదానంద స్వరుపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మినారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.

*శ్లో|| శాంతకారం! భజగాశయనం! పద్మనాభం! సురేశం!*
*విశ్వాకారం! గగనసదృశం! మేఘవర్ణం శుభాంగం! |*
*లక్ష్మికాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!*
*వందేవిష్ణుం! భవభయహారం! సర్వలోకైకనాథం ||*

*శ్లో|| లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీ రంగదామేశ్వరీం*
*దాసి భూత సమస్త దేవా వనితాం* *లోకైకదీపంకురాం |*
*శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర* *గంగాధరాం*
*త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియం||*

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టాదశాధ్యాయము - పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తం.*

_*కార్తీక పురాణం - 17 వ అధ్యాయము*_🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉*అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము*☘☘☘☘☘☘☘☘☘ఓ మునిశ్రేష్ఠులారా ! ఓ ధనలో...
03/12/2020

_*కార్తీక పురాణం - 17 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము*

☘☘☘☘☘☘☘☘☘

ఓ మునిశ్రేష్ఠులారా ! ఓ ధనలోభీ ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.

కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున , శరీరోత్పతికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక , కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. 'ఆత్మ'యనగా ఈ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది - అని అంగీరసుడు చెప్పగా

*"ఓ మునీంద్రా ! నేనింత వరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక , ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన , *'అహంబ్రహ్మ' యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి"* యని ధనలోభుడు కోరెను.

అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంతఃకరణవృత్తికి సాక్షియే , *'నేను - నాది'* అని చెప్పబడు జీవత్మాయే *'అహం'* అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా *' నః '* అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా వున్నదై ఎల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే *"ఆత్మ"* యనబడను. *"నేను"* అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక , ఇట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ *"నేను", "నాది"* అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.

ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర , ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ . అట్లే , అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరెంద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి , మేల్కొన్న తర్వాత *'నేను సుఖనిద్రపోతిని , సుఖంగావుంది'* అనుకోనునదియే ఆత్మ.

దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును , ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన , దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే *'పరమాత్మ'* అని గ్రహింపుము. *'తత్వమసి'* మొదలైన వాక్యములందలి *'త్వం'* అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం *'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి"* అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే *"ఆత్మ దేహలక్షణములుండుట - జన్మించుట - పెరుగుట - క్షిణించుట - చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము , ఉపదేశము , సంపూర్ణత్వము నిరుపించబడియున్నదో అదియే "ఆత్మ".* ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో , అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.

జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు , జీవులు కర్మ ఫలము అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు , దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణ సమాప్తము.*

_*కార్తీక పురాణం - 16వ అధ్యాయము*_🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉*స్తంభ దీప ప్రశంస*☘☘☘☘☘☘☘☘☘*వశిష్టుడు చెబుతున్నాడు -**"ఓ రాజా ! కార్తీకమాసము ద...
01/12/2020

_*కార్తీక పురాణం - 16వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*స్తంభ దీప ప్రశంస*

☘☘☘☘☘☘☘☘☘

*వశిష్టుడు చెబుతున్నాడు -*
*"ఓ రాజా ! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన , దాన , వ్రతాదులను చేయుట , సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో , అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ విడువకుండ , తులసి కోటవద్దగాని - భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీకశుద్ద పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి , భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు , నారికేళ ఫలదానము జేసిన యెడల - చిరకాలమునుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును.

సంతానము వున్న వారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యుందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపముగాని , స్తంభ దీపాము గాని వుంచి నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశర్యములు కలిగి , వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టు వారు శాలిధాన్యంగాని , నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీప ముంచవలమును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును , లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు. చెప్పెదను వినుము.

*దీప స్తంభము విప్రుడగుట*

ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒక చోట అశ్రమాన్ని ఏర్పరచుకొని , దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని , నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీకమాసములో ఆ ఆశ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడ వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము అలయద్వారాల పై దీపములు వెలిగించి , కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్దడు తక్కిన మునులను చూచి *"ఓ సిద్దులారా ! కార్తీకమాసములో హరిహరాదుల ప్రీతికోరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా ! రేపు కార్తీకశుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభముపాతి , దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడ్కునివత్తము , రండు"* అని పలుకగా అందరు పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలి ధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపఠనము చేయుచుండగా ఫెళ ఫెళమను శబ్దము వినిపించి , అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి , దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూచి వారందరు ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి *"ఓయీ నీ వేవడవు ? నీవీ స్తంభమునుండి ఎలా వచ్చితివి ? నీ వృత్తాంతమేమి"* అని ప్రశ్నిచిరి. అంత , ఆ పురుషుడు వారందరకు నమస్కరించి *"పుణ్యాత్ములారా ! నేను క్రిందటి జన్మమందు బ్రహ్మణుడను. ఒక జమిందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయా విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్భుద్దులలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక , దానధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడయినా వచ్చినన్ను ఆశ్రయించినను అతనిచె నా కాళ్ళు కడిగించి , ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి , నానా దుర్భాషలాడి పంపుచుండెవాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను , పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడువారే కాని , నన్నెవరును మందలింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడిది. దానధర్మములు యెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై , పాపినై అవసానదశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి , లక్ష జన్మలముందు కుక్కనై , పదివేల జన్మలు కాకినై , ఐదువేల జన్మలు తొండనై , ఐదు వేల జన్మలు పేడపురుగునై , తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని , నన్ను మన్నింపు"* డని వేడుకొనెను.

ఆ మాటలాలకించిన , మునులందరు నమితాశ్చర్యమొంది *"ఆహా ! కార్తీకమాస మహిమ మెంత గొప్పది అదియునుగాక , కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కఱ్ఱలు , రాళ్లు , స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే యీ స్తంభమునకు ముక్తికలిగిన"* దని మునులు అనుకోనుచుండగా , ఆ పురుషుడా మాటలాలకించి *"మునిపుంగవులారా ! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా ? ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును ? అది నశించుటెట్లు ? నాయీ సంశయము బాపు"* డని ప్రార్ధించెను. అక్కడ వున్న మునిశ్వరులందరును తమలో నోకడగు అంగీరసమునితో *"స్వామి ! మీరే అతని సంశయమును తీర్చగల సమర్ధులు గాన , వివరించు"* డని కోరిరి. అంత అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి షోడశాధ్యాయము - పదహారో రోజు పారాయణము సమాప్తం.*

_*కార్తీక పురాణం - 15 వ అధ్యాయము*_🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉*దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట*☘☘☘☘☘☘☘☘☘అంతట జనకమహారాజుత...
30/11/2020

_*కార్తీక పురాణం - 15 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట*

☘☘☘☘☘☘☘☘☘

అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా ! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని , మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను.

ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట , చేయుట , శివకేశవులవద్ద దీపారాధనను చేయుట , పురాణమును చదువుట , లేక , వినుట , సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల , విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విడువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి , చతుర్దశి , పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను.

ఈ మహా కార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను , లేక , ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు , వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.

సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణపఠనముజేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి , నీళ్లతో కడిగి , బొట్లుపెట్టి , ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి , దూదితో వత్తులుజేసి , పండ్రెండు దీపములుంచి , స్వామిని పూజించుచు , నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమునుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి , నలుమూలలు వెదకి , తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నొట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను , శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.

ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా , ప్రక్కనొక మానవుడు నిలబడి యుండుటను గమనించి *"ఓయీ ! నీవెవ్వడవు ? ఎందుకిట్లు నిలబడియుంటివి ?"* అని ప్రశ్నించగా , *"ఆర్యా ! నేను మూషికమును , రాత్రి నేను ఆహారమును వెతుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నున్న ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ , నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని , ఓ మహానుభావా ! నేను ఎందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"* మని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని , *"ఓయీ ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ , ధనాశపరుడై దేవపూజలు , నిత్యకర్మలు మరచి , నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు , మంచివారలను , యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు , సమస్త తినుబండారములను కడుచౌకగా కొని , తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి , అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన , నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి , ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"* మని అతనికి నీతులు చెప్పి పంపించెను.

*ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము.*

_*కార్తీక పురాణం -14 వ అధ్యాయము*_🕉🕉🕉🕉🕉🕉🕉🕉*ఆబోతును అచ్చుబోసి వదలుట(వృషోత్సర్గము)**కార్తీకమాసములో విసర్జింపవలసినవి*☘☘☘☘☘☘☘...
29/11/2020

_*కార్తీక పురాణం -14 వ అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*ఆబోతును అచ్చుబోసి వదలుట(వృషోత్సర్గము)*
*కార్తీకమాసములో విసర్జింపవలసినవి*

☘☘☘☘☘☘☘☘☘

మరల వశిష్ఠులవారు , జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి.

ఓ రాజా ! కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్జనము చేయుట , శివలింగ సాలగ్రామములను దానముచేయుట , ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు.

వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు. ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక , దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమున గురుచేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీకమాసమున తన శక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయంసమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆ రాత్రియంతయు జాగరముండి మరునాడు తమ శక్తికొలది బ్రాహ్మణులకు , సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు.

*కార్తీకమాసములో విసర్జింపవలసినవి*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు , తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన , సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి , అమావాస్య , సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజించరాదు , విధవ వండినది తినరాదు. ఏకాదశీ , ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కూడదు చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున , వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యము వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ , గోదావరి , సరస్వతి , యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.

ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని , చెరువునందుగాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.

*గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ |*
*నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ||*
అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం , హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరముననున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలెను.

*కార్తీకమాస శివపూజాకల్పము*

ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి
ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి
ఓం కైలాసవాసాయ నమః - నవరత్న సింహాసనం సమర్పయామి
ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి
ఓం లోకేశ్వరాయ నమః - అర్ఘ్యం సమర్పయామి
ఓం వృషభవాహనాయ నమః - స్నానం సమర్పయామి
ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి
ఓం జగనాథాయ నమః - యజ్ఞోపవీతం సమర్పయామి
ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి
ఓం సంపూర్ణ గుణాయ నమః - పుష్పం సమర్పయామి
ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్ సమర్పయామి
ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి
ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి
ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి
ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి
ఓం శంకరాయ నమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ఓం భవాయ నమః - ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

ఈ ప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను శివసన్నిధిన దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తినిబట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము , వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన , తులసీకోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన యెడల , వారికీ , వారివంశీయులకు , పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా యీ వ్రతము నాచరించనివారును వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క , కుక్క , పంది , పిల్లి , ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన యెడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను , పురాణము చదివినను , విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.

*ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి చతుర్దశాధ్యాయము - పద్నాలుగవరోజు పారాయణము సమాప్తము.*

_*కార్తిక పురాణం - 13 వ అధ్యాయము*_🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉*కన్యాదాన ఫలము**సువీర చరిత్రము*☘☘☘☘☘☘☘☘☘ఓ జనక చక్రవర్తీ ! కార్తీకమాసములో యింక...
29/11/2020

_*కార్తిక పురాణం - 13 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*కన్యాదాన ఫలము*
*సువీర చరిత్రము*

☘☘☘☘☘☘☘☘☘

ఓ జనక చక్రవర్తీ ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై అలకింపుము.

*కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము.* దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒక వేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు , దక్షణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ , అ పాపములన్నియు పోవును. ఎన్ని నూతులూ , తటాకములూ త్రవ్వించిననూ పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తి శ్రద్దలతో కన్యాదానము చేసిన యెడల తాను తరించుటయే గాక తన పితృదేవతలను కూడ తరింపజేసినవాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్దగా అలకింపుము.

*సువీర చరిత్రము*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు , శూరుడు అయిన *"సువీరు"డను* ఒక రాజుండెను. అతనికి రూపవతియను భార్యకలదు. ఒక సారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడయి , భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందోక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. అ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన అ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికి శుక్ల పక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు , అతిగారబముతో పెరుగుచుండెను , ఆమె చూచు వారలకు కనులపండువుగా , ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచినకొలదీ , బాలికకు నిండు యౌవనదశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికనుగాంచి ఆమె అందచందములకు పరవశుడై అ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు *"ఓ ముని పుత్రా ! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు"నని* చెప్పగా తన చేతిలో రాగి పైసాయైననూ లేకపోవుటచే బాలిక పైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోరతపమాచరించి , కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించెను. రాజు అ పాత్రను పుచ్చుకొని , సంతోషించి , తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను.

అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెట్టుచూ భార్యతో సుఖముగా వుండెను. అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే మరుల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను.

ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరమునుండి నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని *"ఓయీ ! నీవెవ్వడవు ? నీ ముఖ వర్చస్సుచూడ రాజవంశమునందు జన్మించిన వానివలె నున్నావు. నీవీ యరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి ?"* అని ప్రశ్నించగా , సువీరుడు *"మహానుభావా ! నేను వంగదేశమును నేలు చుండెడిది సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులాక్రమించుటచే భార్యాసమేతముగా నీ యడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు. పుత్రశోకముకంటె గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్పసంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్ఠుడనియినందున యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి , వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే యింత వరకు కాలక్షేపము చేయుచున్నాను"* అని చెప్పగా , *"ఓ రాజా ! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము లాలోచింపక కన్యనమ్ముకొంటివి. కన్యావిక్రయము మహాపాతకములలో నొకటి , కన్యను విక్రయించిన వారు 'అసిపత్రవన' మను నరక మనుభవింతురు. ఆ ద్రవ్యములతో దేవముని , పితృదేవతా ప్రిత్యర్ధము యే వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యావిక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారు చేయు గృహస్థధర్మములు వ్యర్ధమగుటయేగాక అతడు మహా నరకమనుభవించును. కన్యావిక్రయము జేసినా వారికీ యెట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే యున్నారు. కావున , రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు , ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన యెడల గంగాస్నాన మొనరించిన ఫలము , అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయేగాక , మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలిగిపోవును"* అని రాజునకు హితోపదేశము చేయగా అందుకా రాజు చిరునవ్వు నవ్వి *"ఓ మునివర్యా ! దేహసుఖము కంటె దానధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా ? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక , చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడువమాంటారా ? ధనము , బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని , నోరు మూసుకొని , బక్క చిక్కి శల్యమైయున్న వారిని లోకము గుర్తిస్తుందా ? గౌరవిస్తుందా ? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన , నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని , కన్యాదానము మాత్రము చేయను"* అని నిక్కచిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను.

మరి కొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి , యమలోకములో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతిచెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి.

అంతటా శ్రుతకీర్తి *"నేనెరిగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు , యజ్ఞయాగాదులొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె ?"* నని మనమునందుకొని నిండుకొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి , నమస్కరించి *"ప్రభూ ! నీవు సర్వజ్ఞుడవు , ధర్మముర్తివి , బుద్దిశాలివి , ప్రాణకోటినంతను సమంగా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి ? సెలవిండు"* అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి *"శ్రుతకీర్తి ! నీవు న్యాయమూర్తివి , ధర్మజ్ఞుడవు , నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు. అయిననేమి ? నీ వంశియుడగు సువీరుడు తన జ్యేష్టపుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు యిటు మూడు తరములవారు అటు మూడు తరములవారున్ను వారెంతటి పుణ్యపురుషులైనను నరకమనుభావించుటయేగాక , నిచజన్మలెత్తవలసియుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదునుగాన , నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీతీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యాశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి , అచటకు పోయి ఆ కన్యను వేదపండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీకమాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన యెడల నీవు , నీ పూర్వికులు , సువీరుడు , మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కెగుదురు. కార్తీకమాసములో " సాలంకృత కన్యాదానము " చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను , లేక విధివిధానముగా ఆబోతునకు వివాహమొనర్చినను కన్యాదాన ఫలమబ్భును. కనుక , నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు , పోయిరమ్ము"* అని పలికెను.

శ్రుతకీర్తి యమధర్మరాజుకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటిరములో నివసించుచున్న సువీరుని భార్యను , కుమార్తెను చూచి , సంతోషపడి , ఆమెతో యావత్తు విషయములు వివరించి , కార్తీకమాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలసికొనెను.

కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను , పుణ్యము కలుగును. కార్తీకమాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు. విష్ణుసాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రయోదశాధ్యాయము - పదమూడో రోజు పారాయణము సమాప్తము.*

Address

Jawahar Street
Kakinada
533001

Alerts

Be the first to know and let us send you an email when Sathkarya SevaSamithi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share