Sri Siddhi Buddhi sahitha Lakshmi Ganapathi Aalayam

Sri Siddhi Buddhi sahitha Lakshmi Ganapathi Aalayam Sri Siddhi Buddhi sahitha Lakshmi Ganapathi Aalayam is one of the rarest temples built in India, whe

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
10/04/2022

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

12/02/2022
12/02/2022

Bheeshma Ekadasi

12/02/2022
*🙏 #108రూపాలలోమహాగణపతులు🙏*1. ఏకాక్షర గణపతిప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోకదావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్అజ్ఞాన కానన వినాశ...
11/09/2021

*🙏 #108రూపాలలోమహాగణపతులు🙏*

1. ఏకాక్షర గణపతి
ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక
దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం
ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య

2. మహా గణపతి
భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం
భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం
గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:
శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో మహాన్

3. బాల గణపతి
కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం
బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం

4. తరుణ గణపతి
పాశాంకుశాపూస కపిత్ధ జంబూ
ఫలం తిలాం చేక్షు మపిసవ హసై:
ధత్తే సదాయ స్తరుణారుణాంభ:
పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:

5. విఘ్నరాజ గణపతి
విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే
మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:

6. సిద్ది గణపతి
ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్
అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్

7. బుద్ధి గణపతి
త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే
బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |
నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే
నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||

8. లక్ష్మీ గణపతి
బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్
పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:
శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవీ చ యస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్

9. సంతాన లక్ష్మీ గణపతి
శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |
భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||

10. దుర్గా గణపతి
తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |
దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||

11. సర్వశక్తి గణపతి
ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం
పరస్పరాశ్లిష్టకటీ నివేశం
సంధ్యారుణం పాశసృణీం వహస్తం
భయాపహం శక్తి గణేశ మీఢే

12. విరివిరి గణపతి
సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |
అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||

13. క్షిప్ర గణపతి
దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం
బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం

14. హేరంబ గణపతి
అభయ వరద హస్త: పాశదంతాక్షమాల:
పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:
కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా

15. నిధి గణపతి
విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |
తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ

16. వక్రతుండ గణపతి
స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |
ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్

17. నవనీత గణపతి
దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|
పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ ||

18. ఉచ్ఛిష్గ్ట గణపతి
లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం
దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:

19. హరిద్రా గణపతి
హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్
పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ
భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్

20. మోదక గణపతి
నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |
మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||

21.మేధా గణపతి
సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం
అఖిలదేవ ప్రదాయకం మమ ఆత్మరక్ష వినాయకం

22.మోహన గణపతి
రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక
భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్

23.త్రైలోక్య మోహన గణపతి
గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే
పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం
స్వశుండాగ్ర రాజం | మణి కుంభ
మంగాధి రూఢం స పత్న్యా ||

24. వీర గణపతి
భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ
ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం
వీరం గణేశ మరుణం సతతం స్మరామి

25. ద్విజ గణపతి
యం పుస్తకాక్ష గుణ దండకమండలు
శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం
స్తంబేర మానన చతుష్టయ శోభమానం
త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||

26. ఋణవిమోచన గణపతి
సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే

27. సంకష్టహర గణపతి
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే

28. గురు గణపతి
ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |
సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||
అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |
వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||

29. స్వర్ణ గణపతి
వందే వందారుమందార, మిందు భూషణ నందనం |
అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||

30. అర్క గణపతి
మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|
విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||

31. కుక్షి గణపతి
సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా
లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||

32. పుష్టి గణపతి
ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||

33. వామన గణపతి
లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |
అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||

34. యోగ గణపతి
యోగరూఢో యోగ పట్టాభిరామో
బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:
పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో
పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో న:

35. నృత్య గణపతి
పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం
పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం

36. దూర్వా గణపతి
దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |
గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||

37. అభీష్టవరద గణపతి
నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |
కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||

38. లంబోదర గణపతి
లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:
శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||

39.విద్యా గణపతి
భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |
నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||

40. సరస్వతీ గణపతి
వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే
యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||

41. సంపత్ గణపతి
పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ
ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:

42. సూర్య గణపతి
హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం |
గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||

43. విజయ గణపతి
శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత
పాశాంకుశై: కళమమంజరికా సనైధై:
పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:

44. పంచముఖ గణపతి
గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|
అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||

45. నీలకంఠ గణపతి
వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |
పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||

46. గాయత్రి గణపతి
యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |
భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||

47. చింతామణి గణపతి
కల్పద్రుమాధ: స్థితకామధేయం |
చింతామణిం దక్షిణపాణి శుండమ్ |
బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం |
య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||

48. ఏకదంత గణపతి
అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

49. వికట గణపతి
వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |
మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||

50. వరద గణపతి
వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |
నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||

51. వశ్య గణపతి
విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |
శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||

52. కుల గణపతి
శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |
రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||

53. కుబేర గణపతి
రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |
సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |

54. రత్నగర్భ గణపతి
హేరంబతే రత్నసువర్ణయుక్తే సునూపుర మంజీరకే తథైవ|
సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||

55. కుమార గణపతి
మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:
అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:

56. సర్వసిద్ధి గణపతి
పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |
విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |
సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |
సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||

57. భక్త గణపతి
నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం
శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్

58. విఘ్న గణపతి
పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:
విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:

59. ఊర్ధ్వ గణపతి
కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,
దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,
ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా
దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే

60. వర గణపతి
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన
ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్

61. త్ర్యక్ష్యర గణపతి
సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్

62. క్షిప్రప్రసాద గణపతి
యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్

63. సృష్టి గణపతి
ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం
ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం
పుత్రం విలాస చతురం శివయో: శివాయ

64. ఉద్దండ గణపతి
ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం
సిందూరపూర పరిశోభితగండయుగ్మం
ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం
అఖండలాది సురనాయక బృందవంద్యమ్

65. డుండి గణపతి
అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్
ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:

66.ద్విముఖ గణపతి
స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:
రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:

67. త్రిముఖ గణపతి
శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్ష వరదాన్ దక్షే దదానం కరై:
పాశాంచామృత పూర్ణకుంభమయం వామే దదానోముదా
పీఠే స్వర్ణమయారవింద విలసత్సత్కర్ణికాభాసురే
స్వాసీనస్త్రిముఖ: పరశురుచిరో నాగనన: పాతున:

68. సింహ గణపతి
వీణాం కల్పలతా మరించ వరదం దక్షేవిధత్తేకరై:
వేణే తామరసం చ రత్న కలశం సన్మంజరీం చా భయం
శుండాదండలసన్ మృగేంద్ర వందన: శంఖేందు గౌర: శుభో
దీప్యద్రత్న నిభాంకుశో గణపతి: పాయా దపాయాత్సన:

69. గజానన గణపతి
సదా సుఖానందమయం జలేచ సముద్రేన ఇక్షురసే నివాసం|
ద్వంద్వ స్థయానేనచ నాళరూపం గజాననం భక్తియుతం భజామ||

70. మహోదర గణపతి
మహోదర ఇతిఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక:
మోహాసుర నిహంతావై ఆఖువాహన ఏవచ ||

71. భువన గణపతి
విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయతే |
నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుండినే ||

72. ధూమ్రవర్ణ గణపతి
ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:
ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ

73. శ్వేతార్క గణపతి
ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే
శ్వేతార్కమూలనివాసాయ
వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ
సూర్యవరదాయ కుమారగురవే

74. ఆధార గణపతి
నాదం బాలసహస్ర భాను సదృశం నాగేంద్ర
వక్త్రాన్వితం | హస్తాభ్యాం చషకం పవిత్ర కలశం
హస్యంచ వృత్తాండవం | నానా చిత్రవిచిత్రయన్
పరగురుం ఆధార విద్యా స్థితిం | ఓంకార
ప్రణవాకృతిం గణపతిం నిత్యం భజేహం ప్రభో ||

75. భూతరోగ నివారణ గణపతి
ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణ పాశమంకుశం |
అభయం వరదం సాస్మృర్భధానం మూషిక ధ్వజం |

76. ప్రసన్న విఘ్నహర గణపతి
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||

77. ద్వాదశభుజవీర గణపతి
సురేంద్రనేన్యం హ్యసురై: సుసేవ్యం సమానభావన విరాజయంతం|
అనంతబాహుం మూషక ధ్వజం తం గజాననం భక్తియుతం భజామ: ||

78. వశీకర గణపతి
బీజాపూరగదేక్షుకార్ములసచ్చక్రోబ్జ పాశోత్పల|
వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహ: ||
ధ్యేయోవల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్వల- ద్భూషయ
విశ్వోత్పత్తి విపత్తి సంస్తుతికరో విఘ్నో విశిష్టార్ధద: ||

79. అఘౌర గణపతి
గజవదనమంచింత్యం తీక్ష్ణదంష్టృం త్రినేత్రం
బృహదుదరమశేషం భూతరాజం పురాణం
అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం |
పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||

80. విషహర గణపతి
నాగాననే నాగకృతోత్తరీయే క్రీడారతే, దేవకుమార సంఘై: |
త్వయిక్షణం కాలగతిం విహాయతౌ ప్రాపతు కన్దుకతామినేన్దూ ||

81. భర్గ గణపతి
బాలార్కకోటి ద్యుతి మప్రమేయం
బాలేందు రేఖా కలితోత్తమాజ్ఞమ్ |
భ్రమద్ద్విరేపావృత గణ్డభాగం భజే భవానీతనయం గణేశమ్ ||

82. సర్వ సమ్మోహన గణపతి
స్వాంకస్థితాయానిజవల్లభయాముఖామ్భుజాలోకేన లోలనేత్రం |
స్మేరాననాస్యం మదవైభవేన రుద్ధం భజే విశ్వవిమోహనంతం ||

83. ఐశ్వర్య గణపతి
సహస్ర శీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటంతు సువర్ణజంవై |
అనేకరత్నై: ఖచితం గృహాణ బ్రహ్మేశతే మస్తక శోభనాయ ||

84. మాయావల్లభ గణపతి
సంసారార్ణవ పారేచ మాయాపోతే సుదుర్లభే |
కర్ణధార స్వరూపంచ భక్తానుగ్రహకారకం |
వరం వరేణ్యం వరదం వరదానామపి ఈశ్వరం |
సిద్ధం సిద్ధి స్వరూపంచ సిద్ధిదం సిద్ధి సాధనమ్ ||

85. సౌభాగ్య గణపతి
తతో హరిద్రామచిరంగులాలం సిన్ధూరకం తేపరికల్పయామి |
సువాసితం వస్తు సువాస భూతై: గృహాణ బ్రహ్మేశ్వర శోభనార్థమ్ ||

86. గౌరి గణపతి
విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ |
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |
నాగాసనాయ కృతియజ్ఞ విభూషితాయ |
గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||

87. ప్రళయంకర్త గణపతి
అకాలమేవ ప్రళయ: కథం లబ్ధో జనైరయం |
హా ! గజానన దేవేశ: హాహా విఘ్న హరావ్యయ ||

88. స్కంద గణపతి
కుమార భుక్తౌ పునరాత్మహేతో: పయోధరే పర్వతరాజ పుత్ర్యా|
ప్రక్షాళయంతం కరశీ కరేణ మౌగ్ధ్యేనతం నాగముఖం భజామి ||

89. మృత్యుంజయ గణపతి
సరాగలోకదుర్లభం విరాగిలోక పూజితం
సురాసురైర్నమస్కృతం జరాప మృత్యునాశకం ||

90. అశ్వ గణపతి
రాజోపచారాన్వి విధాన్గృహాణ హస్త్యశ్వఛత్రాధికమాద రాద్వై |
చిత్తేన దత్తాన్గణనాధడుణ్డే హ్యపార సంఖ్యాన్ స్థిరజంగమాంస్తే ||

91. ఓంకార గణపతి
వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళికృతాతితోషణం
విశ్వం భరా సంస్థితలోక రక్షణం మదీయ పాపౌఘతమస్సు పూషణమ్ ||

92. బ్రహ్మవిద్యా గణపతి
బ్రహ్మేభ్యో బ్రహ్మదాత్రేచ గజానన నమోస్తుతే |
ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయతే నమ: ||

93. శివ అవతార గణపతి
విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ |
సర్వాంతర్యామిణే తుభ్యాం నమస్సర్వప్రియంకర ||

94. ఆపద గణపతి
ఓమ్ నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే ||

95. జ్ఞాన గణపతి
గుణాతీతమౌనం చిదానంద రూపం |
చిదాభాసకం సర్వగం జ్ఞాన గమ్యం |
ముని శ్రేష్ఠమాకాశ రూపం పరేశం |
పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||

96. సౌమ్య గణపతి
నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |
భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||

97. మహాసిద్ధి గణపతి
గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |
పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||

98. గణపతి
సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం
దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర
విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి
కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై
భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||

99. కార్యసిద్ధి గణపతి
యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: |
యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |
యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి: |
సదాతం గణేశం నమామో భజామ: ||

100. భద్ర గణపతి
అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:
సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||

101. సులభ గణపతి
వందే గజేంద్రవదనం – వామాంకారూఢ వల్లభాశ్లిష్టం
కుంకుమపరాగశోణం – క్వులయినీ జారకోరకా పీడమ్ ||

102. నింబ గణపతి
విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |
త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: ||

103. శుక్ల గణపతి
అంతరాయ తిమిరోపశాంతయే
శాంతపావనమచింత్య వైభవం |
తంనరం వపుషికుంజరం ముఖే
మన్మహే కిమపి తుందిలంమహ: ||

104. విష్ణు గణపతి
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

105. ముక్తి గణపతి
పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై: |
ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||

106. సుముఖ గణపతి
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |
ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||

107. సర్వ గణపతి
చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం |
అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ:

108. సిద్ధిబుద్ధి గణపతి
సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి:
శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:
వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో
విఘ్నం మామపహర సిద్ధి వినాయకత్వమ్ ||
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻శుక్రవారం, సెప్టెంబర్ 10, 2021 శ్రీ ప్లవ నామ సంవత్సరందక్షిణాయనం - వర్ష ఋతువుభాద్రపద మాసం -  శుక్ల పక...
09/09/2021

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻
శుక్రవారం, సెప్టెంబర్ 10, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:చవితి రా12.24వరకు
వారం:శుక్రవారం (భృగు వాసరే)
నక్షత్రం:చిత్ర సా4.11 తదుపరి స్వాతి
యోగం:బ్రహ్మం రా9.44 తదుపరి ఐంద్రం
కరణం:వణిజ మ1.24, భద్ర రా12.24 తదుపరి బవ
వర్జ్యం:రా9.27 - 10.57
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.06 &
మ12.22 - 1.11
అమృతకాలం:ఉ10.05 - 11.36
రాహుకాలం; ఉ10.30 - 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.05
వినాయక చవితి/చతుర్థి
చతుస్సాగర పర్యన్తం
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు🙏🏻

శ్రీ గణేశ మహిమ్నః స్తోత్రమ్ (Sri Ganesha Mahimna Stotram)అనిర్వాచ్యం రూపం స్తవన-నికరో యత్ర గలిత- స్తథా వక్ష్యే స్తోత్రం ...
06/09/2021

శ్రీ గణేశ మహిమ్నః స్తోత్రమ్ (Sri Ganesha Mahimna Stotram)

అనిర్వాచ్యం రూపం స్తవన-నికరో యత్ర గలిత- స్తథా వక్ష్యే స్తోత్రం ప్రథమపురుషస్యాఽత్ర మహతః ।
యతో జాతం విశ్వం స్థితమపి సదా యత్ర విలయః స కీదృగ్గీర్వాణః సునిగమనుతః శ్రీగణపతిః ॥ 1 ॥

గణేశం గాణేశాః శివమితి చ శైవాశ్చ విబుధా రవిం సౌరా విష్ణుం ప్రథమపురుషం విష్ణుభజకాః ।
వదన్త్యేకే శాక్తా జగదుదయమూలాం పరిశివాం న జానే కిం తస్మై నమ ఇతి పరం బ్రహ్మ సకలమ్ ॥ 2 ॥

తథేశం యోగజ్ఞా గణపతిమిమం కర్మ నిఖిలం సమీమాంసా వేదాన్తిన ఇతి పరం బ్రహ్మ సకలమ్ ।
అజాం సాంఖ్యో బ్రూతే సకలగుణరూపాం చ సతతం ప్రకర్తారం న్యాయస్త్వథ జగతి బౌద్ధా ధియమితి ॥ 3 ॥

కథం జ్ఞేయో బుద్ధేః పరతర ఇయం బాహ్యసరణిర్యథా ధీర్యస్య స్యాత్ స చ తదనురూపో గణపతిః ।
మహత్కృత్యం తస్య స్వయమపి మహాన్ సూక్ష్మమణువద్ ధ్వనిర్జ్యోతిర్బిన్దుర్గగనసదృశః కిం చ సదసత్ ॥ 4 ॥

అనేకాస్యోఽపారాక్షి- కరచరణోఽనన్త-హృదయస్తథా నానారూపో వివిధవదనః శ్రీగణపతిః ।
అనన్తాహ్వః శక్త్యా వివిధగుణకర్మైకసమయే త్వసంఖ్యాతానన్తాభిమత- ఫలదోఽనేకవిషయే ॥ 5 ॥

న యస్యాఽన్తో మధ్యో న చ భవతి చాదిః సుమహతామలిప్తః కృత్వేత్థం సకలమపి ఖంవత్ స చ పృథక్ ।
స్మృతః సంస్మర్తౄణాం సకలహృదయస్థః ప్రియకరో నమస్తస్మై దేవాయ సకలసురవన్ద్యాయ మహతే ॥ 6 ॥

గణేశాద్యం బీజం దహన-వనితా-పల్లవయుతం మనుశ్చైకార్ణోఽయం ప్రణవసహితోఽభీష్టఫలదమ్ ।
సబిన్దుశ్చాగాద్యాఙ్గణకఋషిఛన్దోఽస్య చ నిచృత్ స దేవః ప్రాగ్బీజం విపదపి చ శక్తిర్జపకృతామ్ ॥ 7 ॥

గకారో హేరమ్బః సగుణ ఇతి పునిర్గుణమయో ద్విధాఽప్యేకో జాతః ప్రకృతిపురుషో బ్రహ్మ హి గణః ।
స చేశశ్చోత్పత్తి-స్థితి- లయకరోఽయం ప్రథమకో యతో భూతం భవ్యం భవతి పతిరీశో గణపతిః ॥ 8 ॥

గకారః కణ్ఠోర్ధ్వ గజముఖసమో మర్త్యసదృశో ణకారః కణ్డాధో జఠరసదృశాకార ఇతి చ ।
అధోభాగ ః కట్యాం చరణ ఇతి హీశోఽస్య చ తను- ర్విభాతీత్థం నామ త్రిభువనసమం భూర్భువఃసువః ॥ 9 ॥

గణేశేతి త్ర్యర్ణాత్మకమపి వరం నామ సుఖదం సకృత్ప్రోచ్చైరుచ్చారితమితి నృభిః పావనకరమ్ ।
గణేశస్యైకస్య ప్రతిజపకరస్యాస్య సుకృతం న విజ్ఞాతో నామ్నః సకలమహిమా కీదృశవిధః ॥ 10 ॥

గణేశేత్యాహ్వాం యః ప్రవదతి ముహుస్తస్య పురతః ప్రపశ్యఁస్తద్వక్త్రం స్వయమపి గణస్తిష్ఠతి తదా ।
స్వరూపస్య జ్ఞానం త్వముక ఇతి నామ్నాఽస్య భవతి ప్రబోధః సుప్తస్య త్వఖిలమిహ సామర్థ్యమమునా ॥ 11 ॥

గణేశో విశ్వేఽస్మిన్ స్థిత ఇహ చ విశ్వం గణపతౌ గణేశో యత్రాస్తే ధృతి- మతిరనైశ్వర్యమఖిలమ్ ।
సముక్తం నామైకం గణపతిపదం మంగలమయం తదేకాస్యం దృష్టేః సకల-విబుధాస్యేక్షణ- సమమ్ ॥ 12 ॥

బహుక్లేశైర్వ్యాప్తః స్మృత ఉత గణేశే చ హృదయే క్షణాత్ క్లేశాన్ ముక్తోభవతి సహసా త్వభ్రచయవత్ ।
బనే విద్యారమ్భే యుధి రిపుభయే కుత్ర గమనే ప్రవేశే ప్రాణాన్తే గణపతిపదం చాఽఽశు విశతి ॥ 13 ॥

గణాధ్యక్షో జ్యేష్ఠః కపిల అపరో మంగలనిధి- ర్దయాలుర్హేరమబో వరద ఇతి చిన్తామణిరజః ।
వరానీశో ఢుణ్ఢిర్గజవదననామా శివసుతో మయూరేశో గౌరీతనయ ఇతి నామాని పఠతి ॥ 14 ॥

మహేశోఽయం విష్ణుః సకవిరవిరిన్దుః కమలజః క్షితిస్తోయం వహ్నిః శ్వసన ఇతి ఖం త్వద్రిరూదధిః ।
కుజస్తారః శుక్రో గురురుడుబుధోఽగుశ్చ ధనదో యమః పాశో కావ్యః శనిరఖిలరూపో గణపతిః ॥ 15 ॥

ముఖం వహ్విః పాదౌ హరిరపి విధాతా ప్రజననం రవిర్నేత్రే చన్ద్రో హృదయమపి కామోఽస్య మదనః ।
కరౌ శక్రః కట్యామవనిరూదరం భాతి దశనం గణేశస్యాసన్ వై క్రతుమయవపుశ్చైవ సకలమ్ ॥ 16 ॥

అనర్ధ్యాలంకారైరరుణ-వసనైర్భూషిత- తనుః కరీన్ద్రాస్యః సింహాసనముపగతో భాతి బుధరాట్ ।
స్థితః స్యాత్తన్మధ్యేఽప్యుదిత- రవిబిమ్బోపమ-రుచిః స్థితా సిద్ధిర్వామే మతిరితరగా చామరకరా ॥ 17 ॥

సమన్తాత్తస్యాసన్ ప్రవరమునిసిద్ధాః సురగణాః ప్రశంసన్తీత్యగ్రే వివిధనుతిభిః సాఽఞ్జలిపుటాః ।
బిడౌజాద్యైర్బ్రహ్మాదిభిరనువృతో భక్తనికరై- ర్గణక్రీడామోద-ప్రముద-వికటాద్యైః సహచరై ః ॥ 18 ॥

వశిత్వాద్యష్టాష్టాదశ-దిగఖిలాల్లోలమనువాగ్ ధృతిః పాదూః ఖడ్గోఽఞ్జనరసబలాః సిద్ధయ ఇమాః ।
సదా పృష్ఠే తిష్టన్త్యానిమిషిదృశస్తన్ముఖలయా గణేశం సేవన్తేఽత్యతినికటసూపాయనకరాః ॥ 19 ॥

మృగాంకాస్యా రమ్భాప్రభృతిగణికా యస్య పురతః సుసంగీత కుర్వన్త్యపి కుతుకగన్ధర్వసహితాః ।
ముదః పారో నాఽత్రేత్యనుపమపదే దోర్విగలితా స్థిరం జాతం చిత్తం చరణమవలోక్యాస్య విమలమ్ ॥ 20 ॥

హరేణాఽయం ధ్యాతస్త్రిపురమథనే చాఽసురవధే గణేశః పార్వత్యా బలివిజయకాలేఽపి హరిణా ।
విధాత్రా సంసృష్టావురగపతినా క్షోణిధరణే నరైః సిద్ధౌ ముక్తౌ త్రిభువనజయే పుష్పధనుషా ॥ 21 ॥

అయం సుప్రాసాదే సుర ఇవ నిజానన్దభువనే మహాన్ శ్రీమానాద్యో లఘుతరగృహే రంకసదృశః ।
శివద్వారే ద్వాఃస్థో నృప ఇవ సదా భూపతిగృహే స్థితో భూత్వోమాంకే శిశుగణపతిర్లాలనపరః ॥ 22 ॥

అముష్మిన్ సన్తుష్టే గజవదన ఏవాపి విబుధే తతస్తే సన్తుష్టాస్త్రిభువనగతాః స్యుర్బుధగణాః ।
దయాలుర్హేరమ్బో న చ భవతి యస్మింశ్చ పురుషే వృథా సర్వం తస్య ప్రజననమతః సాన్ద్రతమసి ॥ 23 ॥

వరేణ్యో భూశుణ్డిర్భృగు-గురు-కుజా-ముద్గలముఖా హ్యపారాస్తద్భక్తా జప-హవన-పూజా-స్తుతిపరాః ।
గణేశోఽయం భక్తప్రియ ఇతి చ సర్వత్ర గదితం విభక్తిర్యత్రాస్తే స్వయమపి సదా తిష్ఠతి గణః ॥ 24 ॥

మృదః కాశ్చిద్ధాతోశ్ఛద- విలిఖితా వాఽపి దృషదః స్మృతా వ్యాజాన్మూర్తిః పథి యది బహిర్యేన సహసా ।
అశుద్ధోఽద్ధా ద్రష్టా ప్రవదతి తదాహ్వాం గణపతేః శ్రుత్వా శుద్ధో మర్త్యో భవతి దురితాద్ విస్మయ ఇతి ॥ 25 ॥

బహిర్ద్వారస్యోర్ధ్వం గజవదన-వర్ష్మేన్ధనమయం ప్రశస్తం వా కృత్వా వివిధ కుశలైస్తత్ర నిహితమ్ ।
ప్రభావాత్తన్మూర్త్యా భవతి సదనం మంగలమయం విలోక్యానన్దస్తాం భవతి జగతో విస్మయ ఇతి ॥ 26 ॥

సితే భాద్రే మాసే ప్రతిశరది మధ్యాహ్నసమయే మృదో మూర్తి కృత్వా గణపతితిథౌ ఢుణ్ఢిసదృశీమ్ ।
సమర్చన్త్యుత్సాహః ప్రభవతి మహాన్ సర్వ సదనే విలోక్యానన్దస్తామ్ ప్రభవతి నృణాం విస్మయ ఇతి ॥ 27 ॥

తథా హ్యేకః శ్లోకో వరయతి మహిమ్నో గణపతేః కథం స శ్లోకే ఽస్మిన్ స్తుత ఇతి భవేత్ సమ్ప్రపఠితే ।
స్మృతం నామాస్యైకం సకృదిదమనన్తాహ్వయసమం యతో యస్యైకస్య స్తవనసదృశం నాఽన్యదపరమ్ ॥ 28 ॥

గజవదన విభో యద్- వర్ణితం వైభవం తే త్విహ జనుషి మమేత్థం చారు తద్దర్శయాశు ।
త్వమసి చ కరుణాయాః సాగరః కృత్స్నదాతా- అప్యతి తవ భృతకోఽహం సర్వదా చిన్తకోఽస్మి ॥ 29 ॥

సుస్తోత్రం ప్రపఠతు నిత్యమేతదేవ స్వానన్దం ప్రతి గమనేఽప్యయం సుమార్గః ।
సచిన్త్యం స్వమనసి తత్పదారవిన్దం స్థాప్యాగ్రే స్తవనఫలం నతీః కరిష్యే ॥ 30 ॥

గణేశదేవస్యం మహాత్మ్యమేతద్ యః శ్రావయేద్వాఽపి పఠేచ్చ తస్య ।
క్లేశా లయం యాన్తి లభేచ్చ శీఘ్రం స్త్రీ-పుత్ర- విద్యార్థ-గృహం చ ముక్తిమ్ ॥ 31 ॥

ఇతి శ్రీపుష్పదన్త విరచితం శ్రీ గణేశ మహిమ్నః స్తోత్రం సమ్పూర్ణమ్ ॥

https://stotranidhi.com/ucchista-ganapati-stotram-in-telugu/
06/09/2021

https://stotranidhi.com/ucchista-ganapati-stotram-in-telugu/

దేవ్యువాచ | నమామి దేవం సకలార్థదం తం సువర్ణవర్ణం భుజగోపవీతమ్ | గజాననం భాస్కరమేకదంతం లంబోదరం వారిభవాసనం చ || ౧ || కేయ....

శ్రావణ మాసం లో వచ్చే బహుళ అమావాస్యను ‘పోలాల అమావాస్య‘ అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత వుంది.  సౌభాగ్యం కో...
05/09/2021

శ్రావణ మాసం లో వచ్చే బహుళ అమావాస్యను ‘పోలాల అమావాస్య‘ అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత వుంది. సౌభాగ్యం కోసం, పిల్లల యోగ క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం శ్రావణ అమావాస్యనాడు పోలాల అమావాస్య వ్రతం ఈ వ్రతమును ఆచరిస్తారు.ఇది ప్రాంతాచారం. గ్రుహాచారం ఉన్నవారు పూజించే వ్రతం.

పోలాల అమావాస్య పూజా విధానం:

పూజచేసే చోట శుభ్రంగా అలికి, వరిపిండితో ముగ్గువేసి, ఒక కందమొక్కను వుంచి, దానికి పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. (కందమొక్క దొరకని పక్షంలో కందపిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును.)
తర్వాత మంగళగౌరీదేవిని కానీ, సంతానలక్ష్మిని కానీ ఆ కందమొక్కలోకి ఆవాహనచేసి షోడశోపచార పూజను చేయవలెను. తొమ్మిది పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కధను చదువుకొని కధా అక్షతలను శిరస్సున ధరించాలి. ఆ తర్వాత కందమొక్కకు ఒక తోరాన్ని కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని సంతానం మొలలో కట్టాలి(సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కందమొక్కకు సమర్పించవచ్చును).అనంతరం ముత్తయిదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి.

సంతాన క్షేమం కోసం స్త్రీలు ఆచరించే ఈ పూజలో పూర్ణం బూర్లు, గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నివేదిస్తారు.

ఆడపిల్లకావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు సమర్పించాలి.

మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పించాలి.

పోలాల అమావాస్య వ్రత కధ:

పూర్వం పిల్లలమఱ్ఱి అనే గ్రామంలో సంతానరామావధానులు అనే స్మార్తపండితుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయి, కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్దకోడళ్ళు ఆరుగురికీ పిల్లలు పుట్టారు గానీ, చిన్నకోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోతూండడం జరిగేది. అలా ఆరుసార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికీ ఆ ఆరు సంవత్సరాలూ ‘పోలాల అమావాస్య వ్రతం’ చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈ సారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్దకొడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్యనాడు సుగుణకు ప్రసవమై, మృతశిశువును కంది. ఈ సంగతి తోటికోడళ్ళకు తెలిప్తే తనను వ్రతానికి పిలవరని తలచి, చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి, ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డలమూట వుంచి తన తోటికోడళ్ళతో కలిసి ‘పోలాల అమావాస్య వ్రతాన్ని’ ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో స్మశానానికి వచ్చి, గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని, కన్నీరు మున్నీరుగా విలపించ సాగింది. అప్పటికి బాగా చీకటి పడింది.
ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలు దేరిన పోలాలమ్మదేవి, సుగుణ దగ్గరకు వచ్చి ‘ఎందుకు రోదిస్తున్నావు’ అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, ‘ సుగుణా.., బాధపడకు. నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్లి, ఏ పేర్లయితే నీ పిల్లలకు పెట్టాలను కున్నావో ఆ పేర్లతో వారిని పిలు’ అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుత దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరుపేరునా పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని, వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటికోడళ్ళకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ, పిల్లా,పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి, తరించింది.

Address

Panchayati Office, Turangi
Kakinada
533016

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Siddhi Buddhi sahitha Lakshmi Ganapathi Aalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share