16/03/2023
జాన్ పేట గ్రామంలో నిర్మించనున్న మరియు ప్రాజెక్ట్ శంకుస్థాపన త్వరలోనే జరగబోతుంది, ఈ ప్రాజెక్ట్ గురించిన బ్రోచర్ కంటెంట్‌ను ఫైనల్ చేయడానికి ప్రాజెక్ట్ నందు భాగస్వామ్యం కావడానికి భావసారుప్యత కలిగిన వివిధ సంఘాలను, మిత్రులను కలుస్తున్నాను.
ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని VASHISTA 360 బుక్ స్టోర్ నందు వశిష్ఠ భార్గవ్ ని కలిశాను. బడుగు బలహీన వర్గాల విద్యార్ధుల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకువచ్చే విదంగా రూపుదిద్దుకుంటున్న అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రాజెక్ట్ గురించి ఒక లైక్ మైండెడ్ మిత్రునితో చర్చించడం సంతోషంగా వుంది.
సోషల్ మీడియా ద్వారా పరిచయమైన అద్బుతమైన మిత్రుడు. వశిష్ఠ భార్గవ్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మేధో వారసుడు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలో టాప్ యూట్యూబర్ గా ఎదగడానికి తన కృషిని, తెలివితేటలను పెట్టుబడిగా పెట్టిన స్ఫూర్తిదాయకమైన వ్యక్తి కూడా. వశిష్ఠ రాసిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తక జాబితాలలో ట్రెండింగ్‌లో వుంది.
ఈ సందర్భంగా అతను ప్రేమతో నిండిన అందమైన టెడ్డీ బేర్ ని నా రెండవ కుమార్తె కొరకు, తను రాసిన స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ని నాకు బహుమతిగా ఇచ్చి ప్రేమను పంచాడు.
Vashista, You are a Wonderfull person bro, Keep Rocking. I am confident that your journey will take you to even greater heights. Keep shining bright!