Prabhu Krupa Gospel Ministries

Prabhu Krupa Gospel Ministries Praise the lord thank you we always pray for you.Delivering spiritual songs, worship and spiritual messages.

Our main purpose is to empower you spiritually and for serve the poor people.

10/03/2021

ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువు పేరట వందనములు.మీ అందరికీ తెలిసిన విషయాన్ని మరొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము జాగ్రత్తగా ఆలకించండి. చాలామంది విశ్వాసులు లేదా దేవుని ప్రజలు అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉన్నప్పటికీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నారు. అనగా ఉదాహరణకు బైక్ అయినా, టీవీ అయినా, ఇల్లయినా, మొబైల్ ఫోన్ అయినా ఇటువంటివి ఏవైనా కొనడానికి మన స్థోమతకు మించి ఖర్చు పెట్టడానికి లేదా అవి కచ్చితంగా కొనడానికి ప్లానింగ్స్ వేస్తూ ఉంటాం. కానీ దేవుని పరిచర్య కొరకు కానీ, సంఘం అభివృద్ధి కొరకు కానీ, సేవకుని కుటుంబ పోషణ కొరకు కానీ, సువార్త కొరకు కానీ, మందిరంలో ఏవైనా ఇన్స్ట్రుమెంట్స్ కొనడం కొరకు కానీ, మందిరానికి స్థలం కొనడం విషయంలో కానీ, మందిరం కట్టుట విషయంలో కానీ మరి ఏ ఇతర దేవుని కార్యక్రమాలలో లేదా దేవుని పరిచర్య కొరకు ఇచ్చుటలో ఆసక్తిని కనబరచడం లేదు. ఇటువంటి వారి మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే దేవుని పనికి దేవుడే ఇస్తాడు లే మీరు ప్రార్థన చేయండి లేదా మేము ప్రార్థన చేస్తాము అని పరిచర్యకు ఇచ్చుట లేదు.
గమనించండి ప్రియమైన దేవుని ప్రజలారా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు అనుకుందాం వారికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది అది మన అందరికీ తెలిసిన విషయం కానీ ఆ గవర్నమెంట్ కి ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తేనే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వగలుగుతుంది. ఇక్కడ ఇస్తున్నది గవర్నమెంట్ అయినా గవర్నమెంటకి ఇస్తున్నది మాత్రం ప్రజలు తమ పన్నుల రూపంలో ఇస్తున్నారు. ప్రజలు ఇవ్వకపోతే గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. అదే విధముగా దేవుడు కూడా తనకు ఇష్టమైన బిడ్డలను ఆశీర్వదిస్తాడు సంఘాలను సేవకులను పోషిస్తాడు. అంటే దాని అర్థం దేవుడు కోట్ల కోట్ల రూపాయలు పైనుండి కుమ్మరిస్తాడని గాని, లేకపోతే ఏదో లక్కీ డ్రా లో డబ్బంతా వచ్చేస్తుందని గాని, రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోతారు అని కానీ మరి ఏ విధమైనటువంటి ప్రలోభాలు కానీ కావు. ఆయనే తన ప్రజల ద్వారా ఆయా సంఘాలను, ఆయా సేవకులను పోషిస్తాడు అనగా ఆయన ప్రజలను ప్రేరేపించి వారు నిండు మనసుతో, మనస్ఫూర్తిగా వారి పరిచర్య నిమిత్తము సంఘము నిమిత్తము, దేవుని కొరకు చేయబడుతున్న కార్యక్రమాల నిమిత్తము వారికి దయ చేస్తాడు. మరి అటువంటి సమయంలో దేవుని ప్రజలు తమ గుప్పిలి విప్పి దేవుని కొరకు ఇవ్వనట్లయితే దేవుని కార్యాలు ఎంత వరకు ముందుకు సాగుతాయో మీరే ఆలోచించండి.

ఎంతోమంది సేవకులు దేవుని పరిచర్య చేయాలని ఆశగా వచ్చి కొద్దిరోజుల తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సతమతమయిపోయి, కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో దేవుని పనిని విడిచి వెళ్ళిన వారు ఉన్నారు. మరికొన్ని గ్రామాల్లో అయితే పేద ప్రజల మధ్య, బీదప్రజల మధ్య, ట్రైబల్ ఏరియాస్ లలో సేవచేసే సేవకులు ఉన్నారు వారు కూడా ఇటువంటి పరిస్థితుల్లో దేవునికి దేవుని పరిచర్యకు దూరమైపోతూ ఉన్నారు. మరి కొంతమందిని దేవుడు అన్యజనులలో నుండి పిలుచుకుని దేవుని పరిచర్య కొరకు వాడుకుంటున్నాడు అయితే వారు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్న వారు ఉన్నారు. దేవుని పరిచర్య చేయాలని ఆశ ఉంది కానీ ఇంట్లో తినడానికి తిండిలేక, భార్య పిల్లలు పస్తుంటే చూడలేక, వారికి ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్ కి వెళ్లలేని స్థితిలో ఉంటూ వారిని చూసి ఏడ్చుకుంటూ ఎందుకు సేవకు వచ్చాను అని ఉన్నవారు కూడా ఉన్నారు. ఇటువంటి వారి పట్ల దేవుని ప్రజలైన మీయొక్క సహాయ సహకారాలు లేనియెడల చాలామంది సేవకులు దేవుని సేవను మరచి, విడచి వారి బ్రతుకు తెరువు, కుటుంబ పోషణ నిమిత్తం బ్రతికేవారిగా మారిపోతున్నారు.

ఇక్కడ మరొక సమస్య ఏమిటి అంటే కొంతమంది ఫుల్ టైం మినిస్ట్రీ లో పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు అనగా వారు నిద్ర లేచింది మొదలు కొని రాత్రి నిద్రపోయే వరకు వారు కేవలం దేవుని పని, పరిచర్య మీదనే ఉంటారు. మరికొంతమంది అయితే బ్రతుకుతెరువు నిమిత్తం ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ లేదా వ్యాపారం చేసుకుంటూ లేదా వారికి నచ్చిన ఏదో ఒక పని చేసుకుంటూ పరిచర్య చేస్తూ ఉంటారు. ఇటువంటి వారికి మీయొక్క సహాయ సహకారాలు అందించిన లేక అందించక పోయిన వారు తమ కుటుంబం కోసం కష్టపడుతూ దేవుని పని కూడా చేస్తూ ఉన్నారు వీరికి కలిగే నష్టం తక్కువే. కానీ ఫుల్ టైం మినిస్ట్రీ లో కష్టపడుతూ ఉదయం లేచింది మొదలు కొని దేవుని పరిచర్య లో ఉంటూ దేవుని సువార్త అందిస్తూ దేవుని ఘన పరుస్తూ, అనేకమందిని దేవుని వైపు నడిపిస్తూ, ఎటువంటి లాభనష్టాలను ఆశించకుండా దేవుని సహాయం కొరకు ఎదురు చూసే వారికి మీ యొక్క ఆర్థిక పరమైన సపోర్ట్ ఎంతైనా అవసరం. నిజమైన సేవ చేస్తున్న సేవకులకు మీరు చేయగలిగినంత ఆర్థికపరమైన సహాయం చాలా అవసరం.
కొంతమంది దేవుని ప్రజలు కూడా పేరెన్నికగల వారికి మేము సపోర్ట్ చేస్తున్నామని, కొన్ని టీవీ ప్రోగ్రాములు స్పాన్సర్ చేస్తున్నామని చెబుతున్నారు మంచిదే కానీ ఇక్కడ నేను ఎవరిని విమర్శించడం లేదు ఆలోచించండి. పేరెన్నికగన్న సేవకులకు ఆహారపు కొరత లేదు, ఆర్థికపరమైన కొరత లేదు, తన కుటుంబాన్ని పోషించే శక్తి ఉన్నది తన పరిచర్యనుఆపే పరిస్థితి లేదు. వారికి కావలసిన ఇల్లు, ఆహారము, మందిరము, దేవునిప్రజలు అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నది కనుక వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని పరిచర్యను విడిచి వెళ్లరు. వారు చేస్తున్న పరిచర్య ఇంకా అభివృద్ధి చెందుతుంది తప్ప పరిచర్య అయితే ఆగదు.
అదే చిన్న సేవకులు అనగా గ్రామాలలో సేవ చేస్తున్న సేవకులకు ఆర్థికపరమైన కష్టాలు బాధలు తలెత్తితే కచ్చితంగా సేవకు పరిచర్యకు దూరం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గ్రామాలలో ఉన్న వారు చాలా వరకు పేదలుగా ఉంటారు వారు ఎంత వరకు సమృద్ధిగా దేవుని కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సేవకుని కుటుంబం కొరకు, మందిర నిర్మాణం కొరకు, సువార్త కూడికలు కొరకు, మందిర నిర్మాణం కొరకు, మందిరానికి అవసరమైన వస్తువులు కొనడం కొరకు, కొన్ని సంఘాలలో మధ్యాహ్నం భోజనం పెట్టడం కొరకు, ఇలాంటి ఆత్మీయ విషయాలకు సహాయము చేయగలరు ఆలోచించండి. ఇటువంటప్పుడు పేరెన్నిక కలిగిన సంఘాలకు మీ సహాయం ఎంత వరకు అవసరమో లేదా చిన్న సంఘాలకు మీ సహాయం ఎంత వరకు అవసరమో మీరే ఆలోచించండి. గ్రామీణ ప్రాంతాలలో సేవ ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలియనిది కాదు. ఇటువంటి వారిని మీరు సపోర్ట్ చేయవలసిన అవసరత ఎంతవరకు ఉందో మీరే ఆలోచించండి. పెద్ద సేవకులను ఘనముగా చూడడం చిన్న సేవకులను చులకనగా చూడటం చాలా తప్పు ఎందుకంటే ఎంత పెద్ద సేవకుడు కూడా అయినా చిన్న సంఘం నుండి ఎదిగిన వారే. పరిశుద్ధ గ్రంథములో చిన్న సేవకులు పెద్ద సేవకులు అనేటువంటి భేదాలు ఎక్కడ లేవు అందరూ సమానమే అందరికీ ఒకే తీర్పు ఒకే న్యాయం ప్రభువు ఇచ్చాడు.
ప్రజలు ఇచ్చే విషయంలో కూడా పాతనిబంధనలో అయితే దశమ భాగాలను ఆయన సన్నిధిలో సమృద్ధిగా ఉండటం కొరకు ఆయన కోరుకున్నాడు, కొత్త నిబంధనలో అయితే ఆదిమ సంఘం పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు జనులు స్వతహాగా తమకున్న ఆస్తులను సైతం అమ్మి వారి పాదాల చెంత పెట్టినట్టుగా చూడగలుగుతున్నాం. మరి ఈ కాలంలో ప్రజల వద్దకు వెళ్లి మీ ఆస్తులన్నీ ప్రభువు కొరకు, దేవుని పరిచర్య కొరకు ఇవ్వండి అంటే ఎంత మంది ఇవ్వగలరు? ప్రభువును వదిలేయడానికి సిద్ధపడతారు కదా. కాబట్టి ప్రభువు కూడా ఒకానొక సందర్భంలో భూమ్మీద మీరు ధనమును సమకూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మట ఉంటుంది దొంగలు దొంగిలిస్తారు అని చెబుతారు. పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకొనుడి అని సెలవు ఇస్తారు. మీ ఆస్తులు అమ్మి ఇవ్వకపోయినా మీకున్న సమృద్ధి లో నుండి, ప్రభువు మీకిచ్చిన దానిలోనుండి చిన్న సంఘాల కొరకు సేవ కొరకు మీ యొక్క ఆర్థిక సహాయాన్ని ఇవ్వండి. మరి ముఖ్యముగా సంపూర్ణమైన సేవా పరిచర్య లో ఉన్న సంఘాలకు, సేవకులకు తప్పక మీయొక్క సహాయాన్ని ఇవ్వండి. అలాగే మీ సంఘాలకు మీ సేవకులకు మీరు న్యాయం చేయండి.
ప్రపంచాన్ని ఏలిన ది గ్రేట్ అలెగ్జాండర్ చనిపోయేటప్పుడు ఏమీ ఈ లోకంలో నుండి తీసుకెళ్లలేదు మనం ఎంత? మనకున్న దాంట్లో నుండి కొంత దేవుని పరిచర్య కిచ్చి పరలోకమందు ధనమును కూర్చోగలరు. దీనిని బట్టి ఎవరికి ఇవ్వాలి, ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరిని ప్రోత్సహిస్తే వాళ్లు మరింత బలపడతారు, ఎంతవరకు ఇవ్వాలి అనేటువంటి అవగాహన మీకు కలిగినది అని భావిస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఇటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నప్పుడు కొంతమంది దీనికి ఒక పేరు పెట్టారు అదే ఆన్లైన్ బెగ్గింగ్. అనగా ఆన్లైన్లో అడుక్కోవడం. నిజానికి ప్రియులారా ఇది అడుక్కోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికో, గొప్పవారిగా మారడానికో, పలుకుబడిని పెంచుకోవడానికి కాదు. కొంతమంది సేవకులు పడుతున్న బాధలను మీకు తెలియ చేయడం కొరకు మాత్రమే అందులో మేము ఒకరము.
కొంతమంది అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే దేవునికి డబ్బు అవసరమా? జాగ్రత్తగా గమనించండి ప్రియులారా కేవలం కొంచెం సేపు దేవుని మాటలు అందించడానికి డబ్బు అవసరం లేదు అయితే సంపూర్ణముగా దేవుని సేవ చేయాలని, సంఘాన్ని స్థాపించి కాపరిగా ఉండాలి అంటే ఇక సంఘ స్థాపనకు స్థలం విషయంలో, సంఘాన్ని నిర్మించే విషయంలో, సంఘంలో వాయిద్యాలు కొరకు, వాటి రిపేర్ కొరకు, సౌండ్ సిస్టం కొరకు, సంఘంలో ఉండవలసిన ఉపకరణములు కొరకు, సంఘంలో చెడిపోయినది తీసివేసి కొత్త వస్తువులు పొందుట కొరకు, పరిచర్యకు సంబంధించి వాహనముల కొరకు, సువార్త కూడికలు కొరకు, భోజన సదుపాయం కొరకు, మందిరంలో మీటింగ్స్ కొరకు, పబ్లిక్ మీటింగ్స్ కొరకు, మందిరానికి అవసరమైన బిల్లులు అనగా కరెంట్ బిల్లు, నీటి పన్ను బిల్లు, చర్చి రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ కొరకు, ప్రభు బల్లారాధనకు కావలసిన వాటి కొరకు, మందిరం శుభ్రం చేసే చీపురు మొదలుకొని క్లీనింగ్ డిపార్ట్మెంట్ కొరకు ఇలా ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్నదే వీటన్నిటితో పాటు దైవ సేవకుని కుటుంబం ఆ సంఘాన్ని ప్రజల సహాయాన్ని పొందుకొని జీవించాలి. ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకొని జరిగే కార్యక్రమాలు ఇప్పుడు చెప్పండి దేవునికి డబ్బు అవసరమా లేదా? అందుకే దేవుని సేవ చాలా కష్టమైనది భారభరితమైనది.

ఈ రోజుల్లో ఏ పని కి వెళ్ళిన రోజుకు సగటున ఒక వ్యక్తికి 500 నుండి 700 వరకు లభిస్తుంది. వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నెమ్మదిగా జీవిస్తాయి. కానీ దేవుని సేవ చేసే దైవజనులు ఏ పనికి వెళ్లకుండా దేవుని పరిచర్య లోనే తమ జీవితాన్ని గడుపుతున్నారు వారికి పని చేతకాక లేకపోతే పని చేయలేకో కాదు. దేవుని పని సంపూర్ణముగా నమ్మకముగా చేయాలన్న ఆలోచన తప్ప పనిచేసుకోలేని సోమరిపోతులు అయితే కాదని నా నమ్మకం. వారు కేవలం దేవుని ప్రజలు ఇచ్చేటువంటి ఆ యొక్క అర్పణలు మీదనే సంఘాన్ని నడిపిస్తూ, సంఘము యొక్క అవసరాలను నెరవేరుస్తూ వారి కుటుంబాలను ఎంతో కష్టంగా పోషించుకొనుచున్నారు. ఇటువంటి వారికి మీ అవసరత లేదంటారా.

ప్రియమైన దేవుని ప్రజలారా ఇప్పటివరకు మీరు చదివిన ఈ మాటలన్నీ కూడా మా అనుభవంలో జరుగుతున్నవాటిని మీకు తెలియజేస్తున్నాము.

భారభరితమైన ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించాలి అనుకుంటే కింద ఇవ్వబడిన ఈ నెంబర్లకు మీయొక్క అమూల్యమైన కానుకలను సమర్పించగలరని తెలియజేసుకుంటున్నాము. మరొకసారి ఇది ఆన్లైన్ బెగ్గింగ్ మరొకటో కాదు. దేవుడు మిమ్ములను ప్రేరేపిస్తేనే మీయొక్క సహాయాన్ని పంపించండి. మా ఒక్కరి కొరకే కాదు ఈలాగున కష్టపడుతూ పరిచర్య చేస్తూ ఉన్న సేవకులకు కూడా మీయొక్క సహాయాన్ని అందించండి దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్....

Phone pay & Google pay : 9398404650

ఇంతవరకు ఓపికగా చదువినందుకు మా యొక్క కృతజ్ఞతలు. దేవుని కృప మీ మీద విస్తరించును గాక.ఆమెన్...

Address

Chatrapathi Sivaji Nagar, Nandalur
Kadapa
516150

Telephone

+919849563293

Website

Alerts

Be the first to know and let us send you an email when Prabhu Krupa Gospel Ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Prabhu Krupa Gospel Ministries:

Share