Sri Hari Hara Kshetra Ayyappa Swamy Devastanam

Sri Hari Hara Kshetra Ayyappa Swamy Devastanam Second Largest Ayyappa Swami Temple In Telangana & First Largest Temple In Hyderabad

లోకాభిరామం రణరంగధీరంరాజీవనేత్రం రఘువంశనాథం |కారుణ్యరూపం కరుణాకరం తంశ్రీరామచంద్రం శరణం ప్రపద్యే||ధర్మ స్వరూపుడు, సత్యవాక్...
27/03/2026

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం |
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే||

ధర్మ స్వరూపుడు, సత్యవాక్పరిపాలకుడు అయిన ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ హృదయపూర్వక 'శ్రీరామ నవమి' శుభాకాంక్షలు.


నూతన సంవత్సరానికి నాంది పలికే ఈ పవిత్రమైన ఉగాది పర్వదినం ప్రతి ఇంట్లో ఆనందం, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి మనసుకు శాం...
19/03/2026

నూతన సంవత్సరానికి నాంది పలికే ఈ పవిత్రమైన ఉగాది పర్వదినం ప్రతి ఇంట్లో ఆనందం, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి మనసుకు శాంతి నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

Sri Hari Hara Kshetra Ayyappa Swamy Devastanam



04/03/2026

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన హరిహర క్షేత్ర పంచాదశ వార్షికోత్సవం.



ఆదివారం రోజున శ్రీశ్రీశ్రీ హరిహర క్షేత్ర పంచాదశ వార్షికోత్సవం..Sri Hari Hara Kshetra Ayyappa Swamy Devastanam తేది:- మార...
28/02/2026

ఆదివారం రోజున శ్రీశ్రీశ్రీ హరిహర క్షేత్ర పంచాదశ వార్షికోత్సవం..

Sri Hari Hara Kshetra Ayyappa Swamy Devastanam

తేది:- మార్చి 1,2026, ఉదయం 8.01గంటలకు..
గణపతి పూజ, పుణ్యహవనచము సర్వతోభద్ర లింగతోభద్ర యంత్రస్థాపన మరియు కలశస్థాపన ప్రధాన దేవతల హోమాలు, మరియు రుద్ర సహిత చండీయాగము మహపూర్ణాహుతి, హోమరక్ష ఆశీర్వచనము తీర్థ ప్రసాద వితరన తదుపరి అన్న ప్రసాదం..

సాయంత్రం 6.30గంటలకు ఏకశిల పదునెట్టాంబడి మహా పడిపూజ మరియు రాత్రి 9.30లకు మహా హరతి, హరివరాసనం ప్రసాద వితరణ.

భక్తులు సాంప్రదాయ వస్త్రములు ధరించి ఈ 15వ బ్రహ్మోత్సవ మహోత్సవములో అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు..



22/02/2026

స్వామియేశరణం.. అయ్యప్ప శరణం అంటూ నిత్యం కర్మాన్ ఘాట్ హరిహర క్షేత్రం అయ్యప్పస్వామి ఆలయం మారుమోగుతుంది అంటూ దానికి కర్త, కర్మ, క్రియ వంగా మధు సూదన్ రెడ్డి గారే..

తెలంగాణ రాష్ట్రములోనే రెండవ అతి పెద్దదైన అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం 2009 సంవత్సరంలో హస్తినాపురం డివిజన్ సాగర్ రింగ్ రోడ్డు బైరామల్గూడ, డిఫెన్స్ కాలనీలోని హరిహరక్షేత్రంను ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉండి ఆ శబరిమల అయ్యప్ప స్వామిని దీక్షని 30సార్లు స్వీకరించి.. హైదరాబాద్ నుండి శబరిమలకి పాదయాత్రగా వెళ్లిన అయ్యప్ప ప్రియభక్తుడు వంగా మధుసూదన్ రెడ్డి గారు ఆలయ నిర్మాణం ప్రారంభించగా, హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యాభారతి స్వామి పర్యవేక్షణలో ఆలయ నిర్మాణానికి అంకుర్పాణ జరిగింది. ఆలయ ధర్మకర్త వంగా మధుసూదన్ రెడ్డి గారు భక్తుల విరాళాలతో సుమారు రూ.20కోట్లకి పైగా వెచ్చించి ఆలయాన్ని రెండేండ్లలో సుందరంగా నిర్మించారు.

ఆలయంలో ఏకశిల పదునెట్టాంబడి (బంగారు మెట్లు) ఏర్పాటు కోసం నాగర్ కర్నూల్ జిల్లాలోని చారగొండ మండలం శిరుసనగండ్ల గుట్టలోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఎంచుకోగా, గుట్ట నుంచి 160టన్నుల బండను తొలిచేందుకు శిల్పులు ఎనిమిది మాసాల పాటు శ్రమించి ఏకశిల పదునెట్టాంబడిని చెక్కారు. రాష్ట్రంలోనే ఏకశిల పదునెట్టాంబడిని ఇక్కడి ఆలయంలో ప్రతిష్ఠించారు.

అయ్యప్ప స్వామి వారితో పాటు వినాయకుని, శివుని, దుర్గామాత, దత్తత్రేయ సుభ్రమణ్య స్వామి, ఆంజనేయు స్వామి మరియు సత్యనారాయణ స్వామి అలాగే నవగ్రహాలు మరియు మణికపురం మంజుమాత, నాగ దేవత ఆలయాలు సైతం ఇక్కడ కొలువుదిరేలా వంగా మధున్న నిర్మాణం చేపట్టడం జరిగింది..బంగారు కిరీటం , వెండి తలుపు మరియు 500 యార్డ్స్ లో గో -శాల మరియు 20 గృహాలని పూజరుల కోసం నిర్మించడం జరిగింది..

13 ఏళ్లుగా ప్రతి సంవత్సరం 5రోజుల పాటు అంగరంగవైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడమే కాక 5రకాల హోమాలను అలాగే 5రకాల కళ్యాణోత్సవాలను నిర్వహిస్తూ..ప్రముఖ ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు గారు మరియు గరికిపాటి నరసింహరావు గారితో ప్రవచన సభలను సైతం ఏర్పాటు చేశారు..

అయ్యప్పస్వామి మహాపడి పూజా కార్యక్రమంలో ఏకశిల పదునెట్టాంబడిలో పడిని వెలిగించేందుకు స్వాములు పోటీ పడుతారు. నియమ నిష్టలతో అయ్యప్ప మాలాధరణ ధరించిన స్వాములు నిత్యం ఆలయంలో పడిపూజలు నిర్వహిస్తారు.

వంగా మధు సూదన్ రెడ్డి గారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయంలో సౌకర్యాలు కల్పించి, భక్తులకు నిత్యం అన్నదానం ఏర్పాటు చేసారు. తన చివరి మజిలీలో సైతం మృత్యువుతో పోరాడుతూ నేను లేకపోతే నా ఆలయం ఏమైపోతుందో అని భార్య పిల్లల గురించి కంటే తాను నిర్మించిన గుడి గురించి ఆలోచించిన గొప్ప దైవభక్తి వంగా మధున్న సొంతం..

ఆ హరిహర సుతుడి ప్రియభక్తుడు మన నుండి గతించినా ఆయన రూపం మన గుండెల్లో పదిలం..

మహా శివరాత్రి పర్వదినాన ఆ పరమ శివుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ...మీకు, మీ కుటుంబ ...
15/02/2026

మహా శివరాత్రి పర్వదినాన ఆ పరమ శివుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ...మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.


మండల మరియు మకర జ్యోతి కాలం పాటు నెయ్యి అభిషేకంతో మెరిసి ఆభరణ ప్రియుడైన ఆ కేరళాకేళి విగ్రహం మళ్ళీ భస్మధారణతో మునిగి పరవశి...
21/01/2026

మండల మరియు మకర జ్యోతి కాలం పాటు నెయ్యి అభిషేకంతో మెరిసి ఆభరణ ప్రియుడైన ఆ కేరళాకేళి విగ్రహం మళ్ళీ భస్మధారణతో మునిగి పరవశించి ఉంది, శివోహం స్వామిశరణం🙏

మకరవిళక్కు మహోత్సవంలో భాగంగా ప్రాచీన వామ్మోళి సంప్రదాయాలతో నాయట్టు పిలుపు నిర్వహించబడుతుంది. మకరవిళక్కు దినం నుంచి వరుసగ...
16/01/2026

మకరవిళక్కు మహోత్సవంలో భాగంగా ప్రాచీన వామ్మోళి సంప్రదాయాలతో నాయట్టు పిలుపు నిర్వహించబడుతుంది. మకరవిళక్కు దినం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు నాయట్టు పిలుపు సన్నిదానంలో జరుగుతుంది.

పద్దెనిమిదవ మెట్టుకి దిగువనున్న నిలపాట్తర నుండి దక్షిణ దిశగా చూస్తూ నాయట్టు పిలుపు నిర్వహిస్తారు. చివరి రోజు ఈ కార్యక్రమం శరంగత్తిలో జరుగుతుంది.

అయ్యప్ప స్వామికి కాపలాదారులైన భూతగణాలు మరియు మలదేవతలు మకరవిళక్కు మహోత్సవ సమయంలో శబరిమల నుంచి అడవుల్లోకి వెళ్తారని విశ్వాసం, వారిని అయ్యప్ప స్వామి స్వయంగా పిలిచి తిరిగి శబరిమలకి తీసుకొస్తాడని నమ్మకం ఉంది. అందుకోసమే నాయట్టు పిలుపు బృందం శరంగుత్తికి వెళ్తుంది.

పద్యరూపంలో చక్కగా రూపొందించిన అయ్యప్ప చరిత్ర ఇతిహాసాలను ద్రావిడ మలయాళ భాషలో తరతరాలుగా వామ్మోళి సంప్రదాయంగా అందిస్తూ వస్తున్న ఆచారమే నాయట్టు పిలుపు.

అయ్యప్ప స్వామి ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని మొత్తం 576 శీలాలు నాయట్టు పిలుపులో భాగంగా ఉంటాయి. శబరిమల దేవాలయ ప్రారంభ కాలం నుంచే కొనసాగుతున్న ఈ ఆచారంలో నాయట్టు పిలుపు చెప్పే వ్యక్తి ప్రతి శీలం ముగించిన వెంటనే అతనితో పాటు ఉన్నవారు ఈ హూయి అని ఘోషిస్తారు.

భగవాన్ అయ్యప్ప యొక్క మకరమాస మహోత్సవం జరుగుతోందని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలియజేయడానికే ఈ హూయి అనే పిలుపు. పద్దెనిమిదవ మెట్టుకి దిగువన ఉన్న అయ్యప్ప స్వామి, పైభాగంలోని శ్రీ ధర్మశాస్తాను దర్శించుకునే సందర్భం కూడా ఇదే నాయట్టు పిలుపుగా భావిస్తారు.

నాయట్టు పిలుపు బృందంలో నాయట్టు పిలుపు కురుప్పు సహా మొత్తం 12 మంది ఉంటారు. రాన్నీ – పెరునాడ్ ప్రాంతానికి చెందిన వెల్లాళ కులానికి చెందిన పున్నమూటిల్ కుటుంబానికి నాయట్టు పిలుపు చేసే వారసత్వ హక్కును పందళం రాజు అప్పగించినట్లు చెబుతారు. ప్రస్తుతం పున్నమూటిల్ పి.జి. మహేష్ నాయట్టు పిలుపులో శీలాలను ఉచ్ఛరిస్తున్నారు.

Address

Kharmanghat, Champapet, LB Nagar
Kachiguda

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Hari Hara Kshetra Ayyappa Swamy Devastanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category