St.Mary's Roman Catholic Church Julurupadu

St.Mary's Roman Catholic Church  Julurupadu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from St.Mary's Roman Catholic Church Julurupadu, Religious organisation, julurpad, Julurpad.

*పెంతెకొస్తు పండుగ*క్రీస్తు ప్రభువు పునరుత్థానం అనంతరం 50వ రోజున శిష్యులు,మరియతల్లి పవిత్రాత్మను పొందుకున్న రోజు.ఏక పవిత...
24/05/2026

*పెంతెకొస్తు పండుగ*
క్రీస్తు ప్రభువు పునరుత్థానం అనంతరం 50వ రోజున శిష్యులు,మరియతల్లి పవిత్రాత్మను పొందుకున్న రోజు.
ఏక పవిత్ర కతోలిక అపోస్తలిక సభ ఆవిర్భవించిన రోజు.

గుంటూరు మేత్రాసనం, అబ్బినేనిగుంటపాలెం విచారణ కర్తలు *గురు శ్రీ తుమ్మా వెలాంగిని శౌరెడ్డి* గారు నేడు అమెరికాలోని లాస్ ఏంజ...
22/05/2026

గుంటూరు మేత్రాసనం, అబ్బినేనిగుంటపాలెం విచారణ కర్తలు *గురు శ్రీ తుమ్మా వెలాంగిని శౌరెడ్డి* గారు నేడు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో గుండెపోటుతో మరణించారు.
ఫాదర్ గారు సామాజిక మాధ్యమాలలో తెలుగు కాథలిక్ ప్రజలకు సుపరిచితులు. ఆకట్టుకునే ప్రసంగము మరియు సంగీతంలో వీరు నిష్ణాతులు.
చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకరం. దేవుడు వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి ఇవ్వాలని ప్రార్థిద్దాం.

*క్రీస్తు  మోక్షారోహణ మహోత్సవం* *క్రీస్తు మోక్షారోహణ మహోత్సవం* *(Feast of the Ascension of Jesus)* అనేది ఈస్టర్ పండుగ తర...
17/05/2026

*క్రీస్తు మోక్షారోహణ మహోత్సవం*

*క్రీస్తు మోక్షారోహణ మహోత్సవం* *(Feast of the Ascension of Jesus)* అనేది ఈస్టర్ పండుగ తర్వాత వచ్చే నలభైవ రోజున క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ. ఈస్టర్ ఆదివారం నుండి సరిగ్గా 40 రోజుల తర్వాత,అంటే గురువారం నాడు ఇది వస్తుంది. కొన్ని క్రైస్తవ ప్రాంతాల్లో దీన్ని ఆ తర్వాతి ఆదివారం కూడా జరుపుకుంటారు.

యేసుక్రీస్తు సిలువ మరణం, పునరుత్థానం తర్వాత తన శిష్యుల సమక్షంలో శరీరంతో సహా పరలోకానికి ఆరోహణమైన (వెళ్ళిన) సంఘటనకు ఇది ప్రతీక.ఈ రోజున ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు మరియు దివ్య పూజా బలిని సమర్పిస్తారు.

మన ప్రభువైన యేసు క్రీస్తు పాటించిన ఉపవాస దినాల సంఖ్య నలభై. పునరుత్థాన క్రీస్తు భువిపైన నివసించిన దినాల సంఖ్య నలభై. యేసుక్రీస్తు తన పునరుత్థానం తర్వాత ఆరోహణమయ్యే లోపు శిష్యులకు కనిపించి, నలభై రోజుల పాటు దైవరాజ్యాన్ని గూర్చి ఉపదేశించారు. మానవాళి రక్షణ కోసం శిష్యులు అనుసరించాల్సిన ముఖ్యమైన ఆదేశాలను, బోధలను ఈ కాలంలో ఆయన స్పష్టం చేశారు.

పోర్చుగల్ దేశంలోని *ఫాతిమా* అనే నగరంలో 1917  మే 13 తారీఖున ఫ్రాన్సిస్, జెసింతా, లూసియా అనే ముగ్గురు చిన్నారులకు మరియతల్ల...
13/05/2026

పోర్చుగల్ దేశంలోని *ఫాతిమా* అనే నగరంలో 1917 మే 13 తారీఖున ఫ్రాన్సిస్, జెసింతా, లూసియా అనే ముగ్గురు చిన్నారులకు మరియతల్లి దర్శనమిచ్చింనందులకు గుర్తుగా ప్రతి ఏటా మే 13 తారీఖున ఫాతిమా మాత మహోత్సవముగా కొనియాడుతారు.

*ఫాతిమా మాత పండుగ శుభాకాంక్షలు*

వరంగల్ మేత్రాసన 4వ అధిపతిగా అదే పీఠానికి అపోస్థలిక పరిపాలన అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న గురువు మోన్సిన్యోర్. దుగ్గి...
11/05/2026

వరంగల్ మేత్రాసన 4వ అధిపతిగా అదే పీఠానికి అపోస్థలిక పరిపాలన అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న గురువు మోన్సిన్యోర్. దుగ్గింపూడి. విజయపాల్ రెడ్డి గారిని విశ్వ కథోలిక శ్రీ సభ అధిపతి మహా పరిశుద్ధ పోప్ 14వ సింహరాయల జగద్గురువులు ఎన్నిక చేయడం జరిగింది.
ఈ ప్రకటన వరంగల్ పీఠ క్యాతెడ్రల్ ఫాతిమా మాత దేవాలయంలో.....వరంగల్ పూర్వ పీఠాధిపతులు మరియు ప్రస్తుత విశాఖపట్నం అగ్ర పీఠాధిపతులు మహా.ఘన.శ్రీ శ్రీ శ్రీ ఉడుముల బాల తండ్రి గారు,
ఖమ్మం పీఠ కాపరి మహా. ఘన. శ్రీ శ్రీ శ్రీ డాక్టర్. సగిలి ప్రకాష్ తండ్రి గారి సమక్షంలో జరిగింది.

ఇరువురు పీఠాధిపతులు కాబోయే నూతన పీఠాధిపతికి గుర్తుగా *(ఫాసియా(fascia)) నడుము పట్టి, తల పట్టి (zucchetto), సిలువ (pectoral cross)* లను ధరింప చేశారు.
నూతన పీఠాధిపతి అభిషేక మహోత్సవం అతి త్వరలో జరగనుంది.

*కొత్తగూడెం కేంద్రంగా గల OCD సభ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ ప్రావిన్స్, ఆంధ్రా మరియు తెలంగాణ ప్రావిన్సీయల్ సుపీరియర్ గా ఎన్...
03/05/2026

*కొత్తగూడెం కేంద్రంగా గల OCD సభ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ ప్రావిన్స్, ఆంధ్రా మరియు తెలంగాణ ప్రావిన్సీయల్ సుపీరియర్ గా ఎన్నిక కాబడిన గురు శ్రీ సలివేంద్ర శౌరి OCD ఫాదర్ గారికి శుభాకాంక్షలు.*

వీరు రెవ. ఫాదర్.వెల్లటూరి అమృత్ రాజ్ OCD స్థానంలో నూతనంగా ఎన్నికవ్వడం జరిగింది.

*ఎమ్మావుకు వెళ్ళే దారిలో జీవ మార్గ చూపరితో సంధ్య వేళ అనుభవం* పస్కా మూడవ ఆదివారం.నీవు నాకు జీవమార్గమును చూపియున్నావు.నీ ద...
19/04/2026

*ఎమ్మావుకు వెళ్ళే దారిలో జీవ మార్గ చూపరితో సంధ్య వేళ అనుభవం*
పస్కా మూడవ ఆదివారం.

నీవు నాకు జీవమార్గమును చూపియున్నావు.
నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందంతో నింపెదవు.

04/04/2026

క్రీస్తు పునరుత్థాన వేడుకలు,2026
Happy Easter.

శుభ శుక్రవారం,2026
03/04/2026

శుభ శుక్రవారం,2026

29/03/2026

Address

Julurpad
Julurpad
507166

Website

Alerts

Be the first to know and let us send you an email when St.Mary's Roman Catholic Church Julurupadu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share