విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల

  • Home
  • India
  • Jagtial
  • విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల

విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల धर्मो रक्षति रक्षितः ధర్మో రక్షతి రక?

11/09/2018

ప్రభుత్వాలకు గుడి ఆదాయం కావాలి కానీ, గుడి కి ప్రత్యేక బస్, ఘాట్ రోడ్ లో రక్షణ గోడ కానీ ఏర్పాటు చేయలేకపోయినాయి. ఇంకెన్నాళ్లు నిర్లక్ష్యం.

🚩🚩🚩 #చలో  #జగిత్యాల🚩🚩🚩🚩🚩🚩 #దేశం  #కోసం  #ధర్మం  #కోసం🚩🚩🚩కదలిరండి భారతమాత బిడ్డలారా పిలుస్తుంది జగిత్యాల  హిందూ వీరుల్లార...
10/01/2018

🚩🚩🚩 #చలో #జగిత్యాల🚩🚩🚩
🚩🚩🚩 #దేశం #కోసం #ధర్మం #కోసం🚩🚩🚩
కదలిరండి భారతమాత బిడ్డలారా పిలుస్తుంది జగిత్యాల హిందూ వీరుల్లారా...
ప్రతి ఒక్క హిందువు తేదీ 11/01/2018గురువారం 12/01/2018శుక్రవారం ఈ రెండు రోజులు ఎన్ని పనులు ఉన్న ఎన్ని ఆటంకాలు ఉన్న అవన్నీ ఒకవైపు మన హిందూ ధర్మ రక్షణ ఒకవైపు కావున హిందువులారా మన శక్తిని చాటే సమయం వచ్చింది త్వరపడండి...
🚩🚩🚩జై శ్రీరామ్🚩🚩🚩
🚩🚩🚩భారత్ మాతా కీ జై🚩🚩🚩
🚩🚩🚩జై హింద్ 🚩🚩🚩

28/11/2017

గౌతమబుద్ధుడు దశావతారాలలోని వాడా?

కానే కాదు. చాలామంది ఈ విషయంలో పొరపాటు పడుతూ ఉంటారు. విష్ణువు అవతారాలలో బుద్ధుడు వేరే, పెళ్ళాం పిల్లలను వదిలేసి పారిపోయిన గౌతమ బుద్ధుడు వేరే. వీరిద్దరికీ విష్ణువుకు బుద్ధుడికి ఉన్నంత తేడా వుంది. భాగవతం ప్రకారం చెప్పిన 23 లీలావతారాలలో బుద్ధుడు ఒకానొక వైష్ణవావతారం.
త్రిపాసురులు ఎన్నో సంవత్సరాలు వేదాధ్యయనం చేసి అత్యంత బలవత్తరమైన వరాలు పొంది లోకాలను అల్లకల్లోలం చేస్తున్న సమయంలో దేవతల ప్రార్ధన ఆలకించి శివుడు త్రిపురాసుల సంహారానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆయనకు సహాయకారిగా విష్ణువు ఒక లీలావతారం ఎత్తుతాడు. దండి ముండి అయి రాక్షసులకు దగ్గరలో అవతార స్వీకారం చేసి వారికి కపట బోధలు చెయ్యడం మొదలుపెట్టాడు. వేదాలను త్యజించి కేవలం ధ్యానం చెయ్యడం వలన మోక్షమని, ఒకే పుట్టుక అని కావున వేదాలు ఇలాంటివి వదిలి పెట్టి జీవితాన్ని ఆస్వాదించమని, అహింస గురించి కూడా ప్రభోదించాడు. అతడి అత్యంత మోహన రూపం చూసి రాక్షసులు అతనికి వివశులు అవుతారు. అశ్వత్థ వృక్షం కింద కూర్చుని ఈయన బోధిస్తుంటే అక్కడకు మహా పతివ్రతలైన ఆ త్రిపురాసురుల భార్యలు కూడా వచ్చి మోహితులు అయి ఆ ప్రభోధాలకు లొంగి కామలోలులై ధర్మాన్ని తప్పుతారు. దానితో ఆ త్రిపురుల బలం క్షీణిస్తుంది. బ్రహ్మ రధం నడుపుతుండగా విష్ణువు బాణమై ప్రయోగింపబాడగా శివుని చేతిలో ఆ త్రిపురాసురులు అంతమవుతారు. ఇదే విషియం "ఆపన్నివారక స్తోత్రము " లో ఉంది. "ద్వైత్యస్త్రీమనభంజినే" అంటే రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడు అని అర్ధం. అంజని, జాని పుత్రునిగా చెప్పబదతాడు ఈ బుద్ధుడు.

బుద్ధుని గురించి కొన్ని పురాణ శ్లోకాలు:
భాగవతం 10-40-22 : “ నమో బుద్ధాయ శుద్ధాయ దైత్య దానవ మొహినే “
భాగవతం 1-3-24: “తత: కలౌ సంప్రవర్తతే సంమోహాయ సురద్విషం బుద్దో నామ్నంజనో సుత: కికతేషు భవిష్యతి” – కలియుగారంభంలో బుద్ధుడు అంజనా సుతునిగా జన్మించి అహింస ప్రబోదిస్తాడు
నరసింహ పురాణం 36/29 : “కలౌ ప్రాప్తే యదా బుద్దో భావన్నారాయణొ ప్రభు:”
నిర్ణయసింధు: జ్యేష్ట శుక్ల ద్వితీయం బుద్ధ జయంతి; పౌష్య శుక్లస్య సప్తమ్యాం కుర్యతే బుద్ధస్య పూజనం
విష్ణు, అగ్ని, వాయు స్కాంద పురాణాలలో బుద్ధుని ప్రసక్తి ఉన్నది. అన్నీ కూడా కలియుగారంభంలో బుద్ధ జన్మ ఉంటుంది అని చెప్పాయి. అంటే కనీసం 5000 సంవత్సరాల క్రితం. కానీ నేటి గౌతమ బుద్ధుడు కేవలం 2500 సంవత్సరాల పూర్వం ఉన్నవాడు.
ఎందరో ప్రసిద్ధ చరిత్రకారులు, indologists కూడా ఈ విషయాన్ని బలపరిచారు.

అన్నమయ్య తన కీర్తనలో కూడా ఈ విషయం ప్రస్తావిస్తాడు :

పురసతుల మానములు పొల్లజేసినచేయి.
ఆకాసాన బారేపూరి
అతివలమానముల కాకుసేయువాడు"
ఆకాసాన విహరించే ఊరులు - త్రిపురాలు. వారి మగువల ధర్మాన్ని తప్పించినవాడు. అప్పటి పరిస్థితుల బట్టి లోకరక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది.

గౌతమబుద్దుడు 500 BCE కాలం నాటివాడు. లుంబినిలో మాయాదేవి పుత్రుడుగా జన్మించాడు సిద్ధార్ధుడు. తరువాత తపస్సు చేసి గౌతముడు అయ్యాడు. ఇతడినే శాక్యముని అని కూడా అంటారు. ఇతనిది నిరీశ్వరవాదం. “తెరవాది” పుస్తకాల ప్రకారం ఆరు రకాల బుద్ధులు ప్రస్తావింపబడి ఉన్నారు. విపాస్య, శిఖి, క్రక్కుచండ, కొనగామర, కాశ్యప, మైత్రేయ బుద్ధులు. అమరకోశంలో చెప్పబడిన బుద్ధునికి గౌతమ బుద్ధునికి సంబంధం లేదు. కానీ వారి అహింస సిద్ధాంత సామీప్యం వలన చరిత్రకారులు ఇద్దరినీ ఒకటే అనుకున్నారు. బౌద్ధం అప్రతిహతంగా విస్తరించి నిరీశ్వర వాదులు, తద్వారా కర్మ త్యాగులు ఎక్కువై దారుణాలు జరగగా, వాటినినిలువరించి వేద ధర్మాన్ని పూన:ప్రతిష్టించినది పరమ శివ అవతారమైన ఆదిశంకరులు. పాషండ మతమైన బౌద్ధాన్ని తన వాదనా పటిమతో భారత దేశాననుండి తరిమి తరిమి కొట్టారు ఆయన.

గౌతమబుద్దునిగా మారిన సిద్ధార్ధుడు వేరే, వైష్ణవ అవతారమైన బుద్ధుడు వేరే. లీలావతారమైన బుద్ధుని సాధారణంగా దశావతారాలలో ప్రస్తుతించరు. జయదేవుని దశావతార స్తోత్రంలో చెప్పినా, సాధారణంగా పౌరాణికులు, సనాతన ధర్మావలంబకులు బలరాముని దశావతారాలలో ప్రస్తుతిస్తారు కానీ బుద్ధుని కాదు.

బౌద్ధమతంలో చెప్పిన ఎన్నో విషయాలు మన సనాతన ధర్మం నుండి గ్రహించినవే. కొన్ని తేడాలతో వారు వారి మతాన్ని నిర్మించుకున్నారు. తరువాత మన సనాతనధర్మ మూలాల మీద దాడి చేసారు. ఎప్పుడో వీరి దాష్టీకాన్ని ఆదిశంకరులు అడ్డుకట్ట వేశారు. వారు మనకు అందించిన వాన్గ్మయంతో మనం నేడు దీటుగా ఎదురుకోవాలి.

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీవెంకటేశ్వరార్పణమస్తు !!

హిందువులకు మరో షాక్..!దీపావళి పండుగ వేళ మరో షాక్ తగిలింది. ఓ కోర్టు టపాసుల విక్రయాలపై నిషేధం విధిస్తే… మరో కోర్టు.. టపాస...
13/10/2017

హిందువులకు మరో షాక్..!

దీపావళి పండుగ వేళ మరో షాక్ తగిలింది. ఓ కోర్టు టపాసుల విక్రయాలపై నిషేధం విధిస్తే… మరో కోర్టు.. టపాసులు కాల్చే సమయంపై ఆంక్షలు విధించింది...
దేశ రాజధాని డిల్లీలో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీలో బాణాసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు నవంబర్ 1వ తేదీ వరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ సంచలన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే...

ఇప్పుడు పంజాబ్-హర్యానా హైకోర్టు కూడా షాకింగ్ ఆదేశాలు ఇచ్చింది...
పటాకులు కాల్చేందుకు సమయ పరిమితిని విధిస్తూ పంజాబ్‌ హర్యానా హైకోర్టు.. ఆదేశాలు జారీ చేసింది. దీపావళి ప‌ర్వ‌దినాన‌ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు మాత్రమే బాణ‌సంచా కాల్చాలని ప్రజలకు సూచించింది. ఈ తీర్పు పంజాబ్, హర్యానా, ఛండీఘర్ రాష్ట్రాలకు వర్తిస్తుంది...
పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వ్యాన్లు అంతటా తిరుగుతూ పరిస్థితిని సమీక్షించాలని.. తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

ఇప్పటికే సుప్రీంకోర్టు నిర్ణయంపై దేశంలోని ప్ర‌ముఖుల నుంచి ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది... హిందువులు, హిందూ పండుగలను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది...
మొహర్రం రోజున రక్తపాతం కాకుండా ఆపగలరా? అని ప్రముఖ రచయిత చేతన్ భగత్ ఘాటుగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే...
హిందువుల పండుగలపైనే నిషేధం విధించడం సబబు కాదని యోగా గురు బాబారాందేవ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు..
ఈ హీట్ చల్లారకముందే.. ఇప్పుడు పంజాబ్-హర్యానా హైకోర్టు తీసుకున్న నిర్ణయం మళ్లీ చర్చకు దారితీసింది...

29/09/2017
ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశపు రెండవ రాష్ట్రపతి, భారతదేశపు మొట్టమొదటి ఉప రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌... బా...
05/09/2017

ఉపాధ్యాయ దినోత్సవం

భారతదేశపు రెండవ రాష్ట్రపతి, భారతదేశపు మొట్టమొదటి ఉప రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌...
బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు వున్న రాధాకృష్ణన్‌ 21 సంవత్సరాలు దాటకుండానే ప్రొఫెసర్‌ అయ్యారు... ఆయన ఉపన్యాసాలను అత్యంత శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వంఒక కమిటీని నియమించి దానికి అధ్యక్షుడుగా డా. రాధాకృష్ణన్‌ను నియమించింది...
డా. రాధాకృష్ణన్‌ ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952 నుంచి 1952 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు... 1962లో రాధాకృష్ణన్‌ రాష్ట్రపతి అయిన తర్వాత కొందరు శిష్యులు, మిత్రులు ఆయన పుట్టినరోజు వేడుకలు జరపాలని ఆయన వద్దకు వచ్చారు...
అప్పుడు రాధాకృష్ణన్‌ ''నా పుట్టిన రోజు వేడుకలను వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను'' అని చెప్పారు...
భారత రాష్ట్రపతి అయినా ఉపాధ్యాయ వృత్తి పట్ల తనకున్న ప్రేమను ఈవిధంగా చాటారు రాధాకృష్ణన్‌... అప్పటి నుండి ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు, గౌరవానికిగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజు అయిన సెప్టెంబర్‌ 5వ తేదీన దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం....

తాత్విక వేత్త

రాధాకృష్ణన్‌ 1954లో మానవ సమాజానికి రాధాకృష్ణ చేసిన కృషికి గుర్తింపుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదును పొందిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మంచి తత్వ వేత్త...
భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టారు. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను విన్న మైసూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా నియమించింది. ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ప్రొఫెసర్‌గా వివిధ పదవులు అలరించారు..
1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేసారు... ఆంధ్ర విశ్వకళాపరిషత్తుకు ఆయన సారథ్యం వహించడం తెలుగువారి అదృష్టం...

హిందు బంధువులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🙏⛳
14/08/2017

హిందు బంధువులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🙏⛳

Address

Jatial
Jagtial
505327

Alerts

Be the first to know and let us send you an email when విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category