New Jerusalem prayer House Balapur x Roads

New Jerusalem prayer House Balapur x Roads Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from New Jerusalem prayer House Balapur x Roads, Religious organisation, New Jerusalem prayer house balapur x roads meerpet, Hyderabad.

14/08/2020

Praise the lord 🙏😇
Greetings to u in the mighty name of our lord and saviour Jesus christ. Recently I hv started the work that is making the "Karoke tracks " of all Christian songs that we sing in our day to day daily worship. We do not charge not too much but they are available at very simple and low cost which u can afford easily , which has good and rich audio quality. If intrested in this u can plz WhatsApp @ 7093123675 or Dm me. U can also get a sample track. I hope this would be a wonderful opportunity to get the tracks easily and worship our Lord with whole heartedly, glory him and be blessed.......
Thanking you

Watch and Blessed
25/12/2019

Watch and Blessed

Hebron Universal church promise - 2020 Vocals & Tune : Shiney Kotanka Music mixing & Mastering : Monu Israel

05/04/2019

*అలసిన వానికి ఊరడించు మాటలు*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
*సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన*
*అనుదిన ధ్యానములు*
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇

🌷🌷ఏప్రిల్ 5🌷🌷

*" క్రీస్తు మృతులలో నుండి లేపబడి యున్నాడు" (1 కొరింతి. 15:20)*

*జీవముగల మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క పునరుర్ధానమును గూర్చి ఏడు గొప్ప రుజువులు కలవు.*

1. పాతనిబంధన లో ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనములు (యెషయా 25:8, హోషేయ 13:14, కీర్తనలు 16:10) మరణమును గెల్చుటను గూర్చి ఎవరును కలగనలేదు. ప్రపంచ చరిత్ర అంతటిలో ఒకే ఒక సంఘటన కలదు. ఆయన "విజయమందు మరణం మ్రింగివేయబడెను".

2. ఆయన సిలువ వేయబడక ముందు ప్రభువు తానే తన శిష్యులతో చెప్పిన ప్రవచనములు " మనుష్య కుమారుడు చంపబడి తిరిగి లేచును" (మార్కు 8:31; 9:31: 10:34; యోహాను 10:18)

3. ఆదివారము తెల్లవారుచుండగా దూతలు ఇచ్చిన సాక్ష్యము. " ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి యున్నాడు" ( లూకా 24: 5,6)

4. ఖాళీ సమాధి. " వారు సమాధిలోకి ప్రవేశించి ప్రభువైన యేసు యొక్క దేహమును కనుగొనలేదు". ఈనాటికి కూడా యెరూషలేములో ఖాళీ సమాధిని చూడగలము. ప్రతి దినము ప్రపంచములోని అనేక ప్రాంతముల నుండి దానిని చూచుటకు ప్రజలు వచ్చుచుందురు. ఇతర సమాధులు చనిపోయిన వారి ఎముకలతో నిండియుండును గాని ఇది ఖాళీ సమాధి.

5. ప్రభువు, తిరిగి లేచిన తరువాత 40 దినములలో, పది వేరు వేరు సందర్భములలో, వేరు వేరు దినములలో శిష్యులకు కనబడెను. మొదటి దినమున 5 పర్యాయములు, రెండవదినము నుండి ఆరోహణ దినమువరకు 5 సార్లు కనబడెను. మొదట సమాధి యొద్ద మగ్దలేనే మరియకు కనబడెను. తరువాత ఇతర స్త్రీలు సమాధి యొక్క నుండి తిరిగి వచ్చు చుండగా వారికి కనబడెను. తరువాత సీమోను పేతురుకు కనబడెను. ఎమ్మాయుకు వెళ్ళు ఇద్దరు శిష్యులకు, అదే సాయంకాలమున గదిలో చేరిన శిష్యులు తలుపులు మూసికొనియుండగా వారికి కనబడెను. 1 కొరింతి. 15:6 లో చూచినట్లు యెరూషలేములోని 500 మంది శిష్యులకు కనబడెను. తరువాత అపొస్తలుడైన యోహానుకు కనబడెను. తోమా కొరకై ఎనిమిదవ సారి ఎనిమిదవ దినమున కనబడెను. తిబెరియా సముద్రము నొద్ద తొమ్మిదవ సారి కనబడెను (యోహాను 21) ఆయన పరలోకమునకు ఆరోహణము కాకమునుపు బేతనియలో కనబడెను. ఘోరపాపిని దేవుని బిడ్డగా చేయుటకై, ఆయన పునరుర్ధాన శక్తి ద్వారా మనలోకి రాగలడని చూపించుటకై 40 దినములలో ఆ విధముగా పది పర్యాయములు ఆయన కనబడెను.

6. ఆయన పరలోకమునకు వెళ్లిన తరువాత కనబడిన విధము. ఆయన స్తెఫనుకు కనబడెను (అపో.కా. 7:54,55) పౌలు అని పిలువబడిన సౌలుకు కనబడెను (అపో.కా 9:3-5) పత్మాసు ద్వీపములో యోహానుకు కనబడెను (ప్రకటన 1)

7. ఈ ఆరు రుజువులకంటెను నీవు ఎవరితో మాట్లాడుదువో వారిని ఒప్పించగల అతి ప్రాముఖ్యమైన ఇంకొక రుజువు కలదు. ఆయన ప్రతి విశ్వాసిలో నివసించును. ప్రపంచములోని ఏ భాగమునందైనను ఆయన యందు విశ్వాసముంచు వారిలో నివసించుటకు ఆయన వచ్చును. మనమందరము అదే చెప్పగలము. " ఆయన నా యందు నివశించుచున్నాడు, ఆయన నాయందు నివశించుచున్నాడు". అందుచేతనే ఇప్పుడు మేము అదే ప్రశ్న నీకు వేయుచున్నాము. *జీవము గల ప్రభువు నీలో నివసించుచున్నాడా?*

Please share
🙏🏼Praise the LORD.🙏🏼

04/04/2019
04/04/2019

*"అలసిన వానికి ఊరడించు మాటలు"*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన
అనుదిన ధ్యానములు
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇

🌷🌷🌷ఏప్రిల్ 4🌷🌷🌷
" యెహోవా రాజ్యము చేయుచున్నాడు,
న్యాయమును బట్టి ఆయన జనములను
పరిపాలన చేయును"
(కీర్తనలు 96:10)

మనుష్యులు మన మీద లేచినప్పటికిని మనము నీతి మార్గము నుండి తొలగిపోము, సువార్త ప్రకటించు పరిచర్య నుండి కూడా తొలగిపోము. ఏలయనగా మన విశ్వాసము దేవుని యందున్నది. ఆయన పరిపాలన చేయుచున్నాడని మన మెరుగుదుము. మనకు సజీవుడగు దేవుడున్నాడు, ఆయన ప్రజలకు నీతియుక్తముగా తీర్పు తీర్చునని యెరుగుదుము. అందుచేత ఏ మానవుడు మనకు హాని చేయలేడు. దేవుడు లోకమునకు నీతిని బట్టియు, ప్రజలకు తన సత్యమును బట్టియు తీర్పు తీర్చును. ప్రభువు వచ్చి ఈ భూమికి తీర్పు తీర్చునను నిరీక్షణ మనకు గలదు. *మనకు అన్యాయము చేసిన వారిపై మనము పగతీర్చు కొనవలసిన అవసరము లేదు. ప్రభువు నీతిమంతుడు. ఆయన ఇప్పుడే తీర్పు తీర్చవచ్చును. లేదా ఆయన దానిని తీర్పు దినమున చేయును. అందుచేత మనము మన పనులలో నమ్మకముగా నుండి, ఎవరి మీదను పగ తీర్చుకొనక యుందము*.

మనము ఆత్మలను సంపాదించిన యెడల, నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకము ఆనందించును. ప్రభువైన యేసు "మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును" (లూకా 15:10) అని చెప్పెను. వ్యవసాయదారుడు విత్తనములు విత్తునప్పుడు సంతోషముగా ఉండక పోవచ్చును, గాని ఒక దినమున పంట కోతునను విశ్వాసముతో అతడు విత్తును. దేవుని వాక్యమను విత్తనమును విత్తుచు పొలములో పనిచేయువారు, వారి ప్రయాస వ్యర్ధము కాదను విశ్వాసముతో సంతోషించవలెను. ఒక దినమున వారు తప్పని సరిగా సమృద్ధియైన పంటను కోయుదురు.

అనేక సంవత్సరముల క్రిందట మేము బహిరంగ సువార్త నిమిత్తము గుంటూరుకు వెళ్ళితిమి. అకస్మాత్తుగా వర్షము కురియ నారంభించెను. ఒక వీధిలో ప్రకటించిన తరువాత, ఇంకొక చోటికి పోవుటకు ముందు మేము ప్రార్ధించ గోరితిమి. నేల బురదగా నుండుటచే నేను మోకరించుటకు వెనుకాడితిని. నేను నిలువబడి ప్రార్ధించ గోరితిని. అయితే తరువాత బట్టలకు మురికి అంటిన యెడల, బట్టలు శుభ్రము చేయించుకొనవచ్చును గనుక మోకరించుటకు నేనెందుకు సిగ్గుపడవలెనని తలంచితిని. కాబట్టి మేము మోకరించి, ప్రార్ధించితిమి. చాల సంవత్సరముల తరువాత నాకొక ఉత్తరము వచ్చినది. మా బోధను బట్టి దేవుడు ఆ దినమున అతనితో మాట్లాడలేదు గాని ప్రార్ధనకై బురదలో మోకరించుట ద్వారా దేవుడు తనతో మాట్లాడెనని ఒక వ్యక్తి ఉత్తరము వ్రాసెను. కొంత కాలము తరువాత కోత ఏ విధముగా నుండునో విశ్వాసముతో మనము ఈ దినముననే చూడవలెను.

Please share
🙏🏼Praise the LORD.🙏🏼

Praise the lord ... . Good afternoon all
25/10/2018

Praise the lord ... . Good afternoon all

Address

New Jerusalem Prayer House Balapur X Roads Meerpet
Hyderabad

Telephone

7396294264

Website

Alerts

Be the first to know and let us send you an email when New Jerusalem prayer House Balapur x Roads posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share