23/01/2026
వాక్యమనే రెండంచులు గల వాడియైన ఖడ్గాన్ని పట్టుకుని, పౌలుచే బోధించిబడిన సర్వాంగ కవచాన్ని ధరించి, సంపూర్ణ సువార్త యోధునిగా జయకేతనం ఎగురవేస్తూ, జోషి అన్న పొందిన పరిశుద్ధాత్మను తానూ పొందుకొని, తండ్రికి మించిన తనయునిగా, వేల కొలది ప్రజలకే కాదు, అతి కొద్ది మంది అయినా, చివరకు ఒక్కరైనా, ఇద్దరైనా, సువార్త ప్రకటించుటయే నా ప్రణాభీష్టమని నొక్కి వక్కాణిస్తున్న, మన ప్రియతమ సౌవార్తక యోధులు భక్త సింగ్ గారి పరిచర్య దైవసంకల్పితం.
మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారుమనస్సు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుననే వాక్యాన్ని ఔపోసనపట్టి, ప్రభువే స్వయంగా మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మమీయుడి అన్న ఆజ్ఞను శిరసా వహించి, బాప్తీస్మం ఇవ్వడానికి కనీస వసతులు లేకపోయినా బిల్డింగ్ సంపు లోనే బాప్తిస్మ కార్యక్రమం చేయాలన్న సంకల్పం, నేటి దినాల్లో ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభువు కొరకు పని చేయాలన్న కాంక్ష, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడునన్న రక్షణ నినాదాన్ని భుజాన వేసుకుని, రక్షణ స్వీకరించదలచిన వృద్ధురాలిని తన భుజాన ఎత్తుకుని బాప్తీస్మం అందించిన భక్త సింగ్ గారి ప్రేమ పూర్వక తెగువ తెలుగు క్రైస్తవ చరిత్రలో లిఖించదగ్గ సాక్ష్యం.
ఇది పరలోకాన సంతోషఘట్టం. ఇహలోకన విశ్వాసులమైన మనందరికీ దేవుని మహిమకు పట్టం కట్టే అమోఘ సంఘటనం.