హింధూ - సనాతన ధర్మం

హింధూ  - సనాతన ధర్మం Today's Reality in single words

19/03/2022
27/12/2021

*🍁 భగవంతుడే ఆశ్చర్య పోయే పలురకాల భక్తులు*🍁

1.భంగు భక్తులు:
వీరు భంగు,గంజాయి మొదలైన మత్తు తీసుకొని దేవుడి కోసం వెతుకుతుంటారు. దేవుడిని చూడాలనిపించినప్పుడు ఒక దమ్ము లాగి పైకి చూస్తారు.

2.రంగు భక్తులు:
వీరు తమ భక్తిని రంగు రూపంలో ప్రదర్శిస్తారు. డ్రెస్ కోడ్ కి importance ఇస్తారు. ఈ రకమైన భక్తులు మాలలు వేసుకుంటారు.

3.హంగు భక్తులు:
వీరికి తమ భక్తిని రిచ్చిగా చూపించాలనే పిచ్చి ఎక్కువగా ఉంటుంది. వీళ్లు బాగా వైభవంగా ఉండే ఆలయాలని మాత్రమే ఇష్టపడతారు.

4.మింగు భక్తులు:
ఈ టైప్ భక్తులు తమ తిండిపిచ్చినే భక్తి అనే భ్రమలో బతికేస్తుంటారు. గుడి గురించి వీళ్లని అడిగితే వీరు అక్కడ దొరికే "ప్రసాదం" గురించి చెప్పేటప్పుడు వాళ్ల కళ్లల్లో ఒక మెరుపు కనపడుతుంది.

5.పొంగు భక్తులు:
ఈ టైప్ భక్తులు ప్రతిదానికి పొంగిపోతూ ఉంటారు. టెంకాయలో పువ్వొచ్చినా, దండంపెట్టేటప్పుడు గంట మోగినా చాలు పొంగిపోతుంటారు.

6.లొంగు భక్తులు:
వీరికి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. అందుకని వీరు భక్తి లో పీక్స్ కి వెళ్లిపోతారు. మతం పేరుతో జరిగే కొన్ని దురాచారాలకి వీరు కొంత కారణం.

7.ఒంగు భక్తులు:
వీరు కూడా లొంగుభక్తుల లాంటి వాళ్లే. అంతకుమించి వీరు ఎక్కువగా దొంగబాబాలని నమ్ముతారు. ఎక్కువ మతదురాచారాలకి వీళ్లే ఎక్కువ కారణం.

8.సాంగు భక్తులు:
వీళ్లకి భక్తి పాటల పిచ్చి. కీర్తనలు,స్తోత్రాలు.

9.పింగ్ పాంగు భక్తులు:
వీళ్లని చూస్తే ఎవరూ భక్తులనుకోరు. బాగా స్టైలిష్ గా టాటూలతో ఉంటారు. అల్ట్రామోడర్న్ భక్తులు. భక్తిలో technology వాడుతారు మన సకురె లా.

10.కొంగు భక్తులు:
దరిద్రపు భక్తులు వీళ్లు, కేవలం అమ్మాయిలని చూడటానికి మాత్రమే గుడికి వెళతారు.

11.రాంగు భక్తులు:
వీళ్లకి ఏ దేవుడిని ఎలా పూజించాలో తెలీదు. అందుకని తెలిసిన ప్రతిదాన్ని తమకిష్టమైన పద్ధతిలో మొక్కుతారు.

12.కింగు భక్తులు:
వీరికి రాజుల్లాగా మందిరాలు నిర్మించడం అంటే ఇష్టం. వీరిలో మందిరాలు కట్టలేని వారు విరాళాలు ఇచ్చి తమ ఆనందం తీర్చుకుంటారు. ప్రసాదాలని వేలం వేసినప్పుడు ఎక్కువ ఖర్చు చేసి కొంటారు.

13.వాకింగు భక్తులు:
పుణ్యక్షేత్రాలకి మైళ్లకి మైళ్లు నడిచి వెళ్లే బ్యాచ్. పాద యాత్రలు చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని వీళ్ల నమ్మకం.

14.జాగింగు భక్తులు:
ప్రదక్షిణల పిచ్చి ఎక్కువ. 100+ ప్రదక్షిణలు చేసే భక్తులు ఈ కేటగిరి కిందకి వస్తారు.

15.ట్రెక్కింగు భక్తులు:
భక్తిలో పీక్స్ చూడాలంటే కొండలెక్కాలని నమ్మే భక్తులు.

16.సఫరింగు భక్తులు:
వీళ్లు దేవుని ముందు ఏడ్చి భక్తిని ప్రదర్శిస్తారు.

17.కటింగు భక్తులు:
వీరికి శాస్త్రసంబంధ విషయాల్లో బాగా గ్రిప్ ఉందని తామే గొప్ప భక్తులమని అందరికీ తెలిసేలా ప్రదర్శనలు చేస్తుంటారు.

18.మీటింగు భక్తులు:
వీరికి సమారాధనలు,
ప్రవచన ప్రసంగాలు అంటే చాలా ఇష్టం. చెవులు కోసేసుకుంటారు.

19.కేర్ టేకింగు భక్తులు:
మిగతా భక్తుల కన్నా రెండాకులు ఎక్కువే చదివిన బ్యాచ్. వీరు ప్రవచనకర్తలుగా, మతగురువులుగా ఉండి తమ ప్రసంగాలతో మతాన్ని, దేవుళ్లని బతికిస్తూ ఉంటారు.

20.షాకింగు భక్తులు:
వీరు తమ భక్తిని విచిత్రంగా చాటుకుంటూ ఉంటారు. నాలుక కోసుకోవడం, నిప్పుల మీద నడవడం లాంటివి చేస్తుంటారు.

21.బెగ్గింగు భక్తులు:
వీళ్లు చాలా మంది ఉన్నారు. దేవుడిని అడుక్కుంటూ ఉంటారు అదివ్వు, ఇదివ్వు అని. దేవుళ్లకి లంచం ఇచ్చి పనులు జరగాలని కోరుకునే బ్యాచ్. ముడుపులు,బలులు etc. ఇస్తారు.

22.షిఫ్టింగు భక్తులు:
వీళ్లు మతం మారిన భక్తులు. వీళ్లు మనశ్శాంతి, లేదా డబ్బు, లేదా అమాయకత్వం, లేదా అజ్ఞానం, లేదా వివక్ష వగైరా కారణాల వల్ల వేరే దేవుడికి షిఫ్ట్ అవుతారు.

23.కేటరింగు భక్తులు:
వీళ్లు ప్రసాదాలు పంచి తమ భక్తిని చాటుకుంటారు. వీరి భక్తి కొంత మంది కడుపు నింపుతుంది.

24.రీజనింగు భక్తులు:
వీళ్లు దేవుడున్నాడని నిరూపించడం కోసం లాజిక్కులు చేసి నాస్తికులని ఇబ్బంది పెడుతూ ఉంటారు. 'గాలి చూపించు? చూపించలేవ్ కదా! కాబట్టి దేవుడున్నాడు' ఇలా ఉంటాయి వీళ్ల లాజిక్కులు.

అహంకారం లేని భక్తే అతి ముఖ్యమైన భక్తి. సర్వ జీవులను భగవత్ స్వరూపంగా భావించే వారే నిజమైన భక్తులు.🙏🙏🙏

18/06/2021

భవిష్యత్తులో ఏ వివాదాలకూ తావులేకుండా వందల సంవత్సరాలుగా నలుగుతున్న సమస్యను మూలాలతో సహా పెకలించి వేయడమే రాజనీతి. మోదీజీ అనుసరించే పద్దతి ఇదే..ఆయన వచ్చే ఎన్నికలకోసం ఆలోచించే రాజకీయ నాయకుడు కాదు..వచ్చే తరాల కోసం పరితపించే రాజనీతిజ్ఞుడు.

450 ఏళ్లుగా హిందువుల అవమాన చిహ్నం కేసును కేవలం 5 ఏళ్లలో తెగ్గొట్టారు.

పోయిందనుకున్న కాశ్మీర్ తిరిగి చేతికి రావడమే కాదూ అక్కడ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం చేసేదాక తీసుకు వచ్చారు.

బెంగాల్..కేరళ కూడా త్వరలోనే జీహాదీల కబంద హస్తల నుంచి విముక్తి చెందుతాయి.

అఫ్త్రాల్ 10 రూపాయల పెట్రోల్ పెరుగుదల చూస్తున్నారు మీరు..మోదీజీ పేరుతో పెట్రోల్ ధరల్లో రాష్ట్రాలు చేసే దోపిడీ చూస్తున్నాం మేం.

240 రూపాయల సిమెంట్ బస్తా 450 అయినా దాన్ని మీ దృష్టికి రాకుండా కేంద్రం మీద బురదచల్లే ప్రాంతీయ పార్టీల కంత్రి తనాన్ని మేం గమనిస్తున్నాం.

కేంద్రం ఇచ్చిన ఇళ్ళు..కేంద్రం ఇస్తున్న పెన్షన్లు..కేంద్రం ఇస్తున్న పోర్టులు..కేంద్రం ఇస్తున్న హాస్పిటల్స్..కేంద్రం ఇస్తున్న బియ్యం..కేంద్రం ఇస్తున్న గాస్.. కేంద్రం ఇస్తున్న చిన్న రుణాలు..కేంద్రం ఇస్తున్న ఇళ్ల రుణాలు..కేంద్రం ఇస్తున్న జనరిక్ మెడిసిన్స్..కేంద్రం ఇస్తున్న పనుల వాటాలు..గ్రాంటులు..కేంద్రం ఇస్తున్న వాక్సిన్లు ఇవన్నీ మేం చూస్తున్నాం.

ఒక్కసారి కాంగ్రేస్ దాని అనుబంద కుటుంబ ప్రాంతీయ పార్టీలు డిల్లీ పగ్గాలు చేపడితే జస్ట్ ఊహించండి..
రోజుకో కుంబకోణం..బాంబు పేలుళ్లు..హిందువుల మీద అణచివేత..హిందువుల మీద మత హింసా నిరోధక బిల్లు తో వేటాడం..లవ్ జీహాడ్..రామ్ మందిర్..కాశ్మీర్ లు పక్కన పెట్టండి..బొట్టు పెట్టుకోడానికి కూడా ఉచ్చ పోసుకునే పరిస్తితి వస్తుంది.

మీకు పెట్రోల్ మీద 10 రూపాయల తగ్గింపు కావాలి..
మాకు దేశం బద్రంగా ఉండాలి..హిందువులు స్వాభిమానంతో బతకాలి..
రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం ఇప్పటినుంచే వీళ్ళు చేస్తున్న కుట్ర కుతంత్ర కుల్లు హిందూ వ్యతిరేక రాజకీయాలు చూస్తూ కూడా ఇంకా మోదీజీ ని యోగిజీ ని తిడతాం కాంగ్రేస్ దాని తోక కుటుంబ పార్టీలకే ఓట్లు వేస్తామంటే మీకో 🙏 ..మిమ్మల్ని ఆధునిక జయచంద్రుల్లా భావించి మేం ముందుకు వెళ్తాం..
భారత్ మాతాకీ జై..

జయహో భారత్ 🇮🇳
భారత్ మాతాకి జై ✊
జై శ్రీరాం 🚩

15/06/2021

హిందువుల ఆలయాల లోని దైవాన్ని హిందువులు దర్శించుకోవటానికి టికెట్ కొనుక్కుని ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు పంపాలి. లేకపోతే దైవదర్శనానికి అనుమతి వుండదు. ముస్లిములు, క్రైస్తవులకి ఆ సమస్య లేదు. అదియుగాక, వాళ్ల దైవదర్శనానికి సౌదీ అరేబియా దేశంలోని మెక్కా వెళ్లి రావటానికి, క్రైస్తవులు ఇజ్రాయిల్ దేశంలోని బెత్లెహేము వెళ్ళి రావటానికి కూడా హిందువుల డబ్బుతోనే ఫ్లైట్ టిక్కెట్లు కొని పంపాలి. హిందువులు ఇంత చేతకాని వాళ్ళు కాబట్టే ప్రతి వాడికి చులకన అయ్యారు. మన హిందు రాజకీయ పార్టీలు కూడా సెక్యులర్ ముసుగులో హిందువుల్నే దోచుకుంటున్నారు. లేకపోతే వాళ్లకి ఎంత ధైర్యం హిందువులతో ఈ విధంగా ప్రవర్తించడానికి?

15/06/2021

*'ఇక్కడైతే' నేనేమైనా కావచ్చు.*

విజయవాడలో త్రిపురనేని వెంకటేశ్వరరావు అని ఒక పారిశ్రామికవేత్త (స్పార్ టెక్ సిరామిక్ టైల్స్) ఉండేవారు. ఆయన కొంతకాలం శ్రీకాకుళం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా, హోల్ టైమర్ గా పనిచేశారు. ఆయన సాహిత్య రంగంలోనూ చాలా కృషి చేశారు. కవి కూడా. త్రిపురనేని రామస్వామి చౌదరి గారితో దగ్గరి బంధుత్వం కారణంగా వీరిపై నాస్తికత్వపు ప్రభావమూ, ముద్ర ఉండేవి.

1983లో స్వాతంత్ర వీర సావర్కర్ శతజయంతి వచ్చింది. అప్పటి బస్టాండు దగ్గరున్న హోటల్ దుర్గాభవన్ మీటింగ్ హాలులో శతజయంతి ఉత్సవ సభకు ఆయన అధ్యక్షులుగా వ్యవహరించారు. సావర్కర్ రచించిన *'హిందుత్వ'* గ్రంథంపై ఒక సెమినార్ నిర్వహింపబడాలని అభిలషించారు.

మీరు ఒకవైపు నాస్తికులు. మరోవైపు హిందుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ రెండూ ఎలా పొసగుతాయి అని ప్రశ్నించినవారికి ఇలా వివరించారు.

*"నేను హిందువుగా ఉన్నంతవరకు నాకు అన్ని రకాల స్వేచ్ఛలూ ఉంటాయి .దేవుడు లేడు అని చెప్పడానికి హిందుత్వం అనుమతిస్తుంది. నేను హిందువును కాను అనుకుంటే ఆ స్వేచ్ఛ నాకు అందుబాటులో ఉండదు. హిందువుగా ఉన్నంతవరకూ, నా ఇష్టం వచ్చిన దుస్తులు ధరించవచ్చు. ఇష్టపడిన ఆహారం తినవచ్చు. ఇష్టపడిన దైవాన్ని కొలుచుకోవచ్చు. ఇష్టమైన రీతిలో పూజించవచ్చు, ప్రార్థించవచ్చు. లేదూ, దేవుడే లేడనుకోవచ్చు. ఏ పూజలూ, ప్రార్థనలూ చేయకపోవచ్చు. ఇలా ఎన్నో విధాల స్వేచ్ఛలు నాకు ఉంటాయి."*

కానీ, "నేను హిందువును కాను, ఫలానా వేరే మతంవాడిని అనుకున్న రోజున; నువ్వు ఎలాంటి దుస్తులు ధరించాలో, ఆ మతమే నిర్ణయిస్తుంది. లుంగీ ధరించాలని చెప్పటమే కాదు, లుంగీని కట్టుకోవటం కాక, తొడుక్కోవాలనీ నిర్దేశిస్తుంది. నువ్వు ఏమి తినాలో నిర్దేశిస్తుంది. నేను శాకాహారిగా ఉంటాను అంటే కుదరదు. చచ్చినట్లు గొడ్డుమాంసం తినాల్సిందే. నువ్వు ఏ భాషలో మాట్లాడాలో ఆర్డర్ వేస్తుంది. నీ తెలుగును వదిలేసి తురకం నేర్చుకోవాల్సిందే. దేవుడిని ఈ పేరుతోనే, ఈ పద్ధతిలోనే, ఈ చర్చికి వచ్చే ప్రార్థించాలి అంటే ఎదురుచెప్పకుండా అనుసరించాల్సిందే."

అలాంటప్పుడు, *"ఇంత స్వేచ్ఛ ఉన్న హిందూ సమాజాన్ని తెలిసి తెలిసి నేను ఎలా వదులుకోగలను?"*

03/06/2021

కాశీ కి వెళితే కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు. అందులో మర్మమేమిటి ??

అసలు శాస్త్రం లో ఎక్కడ కూడా.. కాశీ కి వెళితే కాయో, పండో వదిలేయాలి అని చెప్పలేదు..

శాస్త్రం చెప్పిన విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు.

కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి " కాయాపేక్ష మరియు ఫలాపేక్ష" ను గంగలో వదిలి, ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.

ఇక్కడ కాయాపేక్షా, ఫలాపేక్ష అన్నారు...అంటే...ఈ కాయము పై ( శరీరము పై అపేక్ష ని ) , ఫలాపేక్షా ( కర్మ ఫలము పై అపేక్ష ని) పూర్తిగా వదులుకొని...కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.

కాలక్రమేణా అది కాస్తా కాయ, పండు గా మారిపోయింది.

అంతే కానీ కాశీ వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగ లో వదిలేస్తే మనకు వచ్చు భక్తి కానీ, అందులో నిజమైన పుణ్యం ఎం ఉంటుంది.

కనుక శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని ఆ క్షేత్ర దర్శనము, ఆ సంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది. అంతే కాని మామిడి పండుని, వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.

కనుక ఈసారి మీరు కాశీ వెళితే మనకి శత్రువులు అయిన ఈ శరీరం పై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలం అపేక్ష ని మాత్రమే వదులుకొని ఆ విశ్వనాథ దర్శనం చేసి, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అని ప్రార్దిదాం.🙏

శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి

🙏 మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి ధర్మ సందేహాలు లో నుంచి🙏🙏🙏

01/06/2021

ఆర్య ద్రావిడ సిద్ధాంతం కరెక్టు ✔️ అయతే, బైబిల్ తప్పు ❌ అని రుజువు అవుతుంది!!

బైబిల్ కి వ్యతిరేకంగా వేలాది చారిత్రక ఆధారాలు ఉన్నా వేటినీ మన కన్వెర్టెడ్ క్రిస్టియన్స్ నమ్మరు. అమెరికా మొదలు ఇశ్రాయేల్ దేశం వరకు వాటిని యూనివర్సిటీలో బోధిస్తున్నా అవన్నీ బుల్ షిట్ అంటారు. అదే ఆర్య ద్రావిడ సిద్ధాంతం విషయానికి వచ్చేస్తే 💯 కరెక్టు అని తేల్చిపారేస్తారు పెద్ద హిస్తోరియన్స్ లా.. అంతే కాదు మేము మూల వారసులం ఆది వారసులం సింధునాగరికత మాదే మా పూర్వీకులు నిర్మించారు. ఈ దేశాన్ని వేల ఏండ్ల పాటు వ్యవసాయ యోగ్యమైన దేశంగా మార్చడానికి శ్రామచేశారు అని చెప్పుకుంటారు.

ఒక వేళ ఈ చరిత్ర నిజమే అని కాసేపు అనుకుంటే మీ బైబిల్ తప్పని మీరే ఒప్పుకున్నట్లు అవుతుంది.

ఎలాగంటే, బైబిల్ ప్రకారం క్రీపూ 2350 ప్రాంతంలో ఓ గొప్ప జలప్రళయం సంభవించి యావత్తు ప్రపంచంలోని భుజంతువులు ఆకాశ పక్షులు నశించిపోయాయి. ఒక్క నోవాహు అతని కుటుంబం, అతని ఓడ ద్వారా పరిరక్షించబడిన జీవ రాశులు తప్ప! నేడు భూమి మీద నివసిస్తున్న యావత్ మనుష్యులు నీతిమంతుడైన నోవహు సంతానమే బైబిల్ ప్రకారం.

దీనికి ఆర్య ద్రావిడ సిద్దాంతంకు సంబంధం ఏమిటి?⁉️

మనకు రక్తంలో A+, B+, O+, A- ,B- ,O- గ్రూపులు ఉన్నట్లుగానే డిఎన్ఏ లో కూడా కొన్ని గ్రూపులు ఉన్నాయి. వాటిని హాప్లో గ్రూప్స్ అంటారు. ఈ గ్రూప్స్ వల్లే మనకు హస్పెటల్ లో గందరగోళముకు గురైన పిల్లలకు తల్లిదండ్రులు ఎవరు అని నిర్దారించడంలో, ఎవరు ఎవరికి పుట్టారు అని తేల్చడంలో తోడ్పడుతుంది. డిఎన్ఏ పరీక్ష ద్వారా తండ్రి తాతలే కాదు ముత్తాతలకు ముత్తాతలు కొన్ని వందల వేల తరాలు కనుక్కోవచ్చు. ఇండియాలోని బ్రాహ్మణాది అగ్రవర్ణాలలో, కులాలలో R1a, R2 హాప్లో గ్రూపుల డిఎన్ఏ అధికంగా ఉంటుంది. గిరిజన సంచార జాతులలో మిగిలినవారిలో H, J2 అనే హాప్లో గ్రూప్స్ అధికంగా ఉంటుంది. ఈ R గ్రూప్ డిఎన్ఏ విదేశాల్లో కూడా ఉంది కాబట్టి వారు బయట నుండి వచ్చారు అని అంటారు.. బయట నుండే ఎందుకు వచ్చారు ఇక్కడ నుండే వెళ్ళివుండొచ్చుగా అని అంటే అలా కూడా జరిగే అవకాశం పూర్తిగా ఉంది. అయితే R గ్రూప్ తో లభిస్తున్న ప్రాచీన భారత్ లోని అస్థి పంజారాలు అన్నీ 4000 సంవత్సరాల లోపువే.. 4000 సంవత్సరాల కంటే ప్రాచీనమైన R హాప్లో గ్రూప్ అస్థికలు ఏవీ భారత దేశంలో దొరకలేదు. అదే రష్యన్ స్టెప్స్ అనబడే గడ్డి మైదానాలలో 8 వేల సంవత్సరాల నాటి R హాప్లో గ్రూప్ మానవ అవశేషాలు అనేకం లభిస్తాయి. అందువల్ల బయట నుండి వచ్చారు అంటారు. రేపు ఏదైనా ఇండియాలో అంతకంటే ప్రాచీనమైన అస్థికలు దొరికితే అప్పుడు ఇండియానే అని అంటారు.

అసలు విషయానికి వస్తే ఇండియాలో రాఖీగఢీ అనే ఒక స్థలంలో 7000 వేల నాటి అస్థిపంజారాలు బయటపడ్డాయి. వారు సింధునాగరికతకు చెందిన ప్రజలు.. వారిలో R హాప్లో గ్రూప్ డిఎన్ఏ ఏ ఒక్కరిలోనూ లేదు.. వాటి డిఎన్ఏ లు స్థానిక హాప్లో గ్రూప్స్ అయిన J2, H గ్రూప్స్ ఉన్నాయి. ఇవి మన సౌత్ ఇండియన్స్ లో ఎక్కువగా ఉంటాయి. అంటే నేటి J H గ్రూప్స్ డిఎన్ఏ కలిగిన వారికి వారు పితరులు అన్నమాట..

బైబిల్ కి ప్రాబ్లమ్ ఏమిటి?

బైబిల్ అందవిశ్వాసుల గ్రంథరాజము.. కాబట్టి వారు మాకు ఏ ప్రాబ్లమ్ లేదంటారు. రాఖీగఢీ డిఎన్ఏ ఫలితాలు గత 7000 సంవత్సరాలుగా J2, H హాప్లో గ్రూప్ డిఎన్ఏ కలిగిన ప్రజలు అవిచ్చిన్నంగా జీవిస్తున్నారు అని సూచిస్తోంది! అంటే జలప్రళయం ముందు వారు ఉన్నారు. జలప్రళయం తరువాత వారు ఉన్నారు. జల ప్రళయం ముందు సిందూనాగరికత ఉంది తరువాత సింధునాగరికత ఉంది. బైబిల్ ప్రకారం అది అసాధ్యం.. క్రీపూ 2350 తరువాత ఉన్న వారంతా నోవహు వంశవాళీ కి చెందిన వారు మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ జలప్రళయం అని చెప్పబడే దానికి ముందు ఉన్నారు తరువాత ఉన్నారు.. అంటే బైబిల్ లోని జలప్రళయం కథ తప్పు.. బైబిల్ లో ఒకటి తప్పు అని తేలితే ఇక మిగిలినవి కూడా ప్రశ్నార్థకాలే అవుతాయి. అన్నీ ఇలాంటి కట్టుకథలే అని రూఢీ అవుతుంది.

మీ ఆదివాసీ మూల వాసీ సిద్ధాంతం మీ బైబిల్ కే ఎసరు పెడుతుంది. 7000 క్రితము వ్యక్తుల సంతతి నేడూ ఎలా బ్రతికే ఉన్నారు? అండమాన్ నికోబర్ లో అయితే 50,000 ఏండ్లుగా అనివతరంగా ఒక తెగ జీవిస్తూనే ఉంది. వీరంతా ఎలా బ్రతికారు?

ఆదికాండము 7: 22
పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చని పోయెను.

ఆదికాండము 7: 23
నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.

ఆదికాండము 7: 24
నూట ఏబది దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను.

25/05/2021

👌
తెలుగు అనువాదం.
ఈ మధ్య కాలంలో నెల్లూరు జిల్లా ఆంద్రప్రదేశ్ లో జైన్ ధర్మానికి చెందిన అమ్మాయిని ,ఒక ముస్లిం తీసుకొని వెళ్లిపోయాడు. వెంటనే జిల్లాలోని జైన్ సామాజిక వర్గ పెద్దలు సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా ఒక నిర్ణయం చేశారు.అది ఏమంటే వాళ్ళు చేసే /నిర్వహించే వ్యాపారం/వాణిజ్య/ఇండస్ట్రీ లలో పనిచేసే ముస్లిం ఉద్యోగులను వెంటనే తొలగించారు.
ఈ షాకింగ్ నిర్ణయం ఫలితాలు వల్ల సుమారు 10000 ల మంది ఉపాధి కోల్పోవడంతో ,ముస్లిం మత పెద్దలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఆ జైన్ కమ్యూనిటీ అమ్మాయి అడ్రసు కనుక్కోవాలని అనుకోని కేవలం 9 గంటల్లో అమ్మాయిని ట్రేస్ చేసి ,అమ్మాయి కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చడం జరిగింది.
ఇది ఐకమత్యం యొక్క ప్రభావవంతమైన ఖచ్చితం అయిన చర్య ఫలితం. నిజముగా ఆ జైన్ కమ్యూనిటీ మెంబెర్స్ -నెల్లూరు కు జోహార్లు.

19/05/2021

*మనసెరిగిన మాధవుడు..*

గుడి తలుపులు తెరచుకుంటూ లోపలకు వెళ్లాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది.
ఈ రోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినే వారెవరూ?
నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది.
మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్ళతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటినుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు.

ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణమేమిటి? దాదాపు ముప్పయి ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీ కృష్ణునికి సేవలందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయ్యింది. ఎవ్వరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెపుతారు.

అయితే కాలానికి అందరూ తలవంచ వలసిందే కదా!. పూజారికి వృద్ధాప్యంవల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపొతున్నాడు. అందుకే కమిటీ వారు అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరిరోజు!. అదీ అతని వ్యధకు కారణం!!.
ఓ కృష్ణా! ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ళకాలంలో నా వల్ల తెలిసిగాని, తెలియక గాని, అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను. నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా. నేను నిస్సహాయున్ని!! నన్ను మన్నించు కృష్ణా! అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు.చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు.

తెల్లారింది!. కుమారుడు ఆలయానికి వెళ్లాడు. అప్పుడు జరిగింది అద్భుతం! నిజంగానే అద్భుతమే జరిగింది!!!.

కుమారుడు బిగ్గరగా అరుస్తూ," నాన్నగారూ ! అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది!" అని నోట మాటరాక ఆయాసపడుతున్నాడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ,ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చోని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చోని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్ధమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు.

భక్తి అంటే అదే కదా! తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్చించుకోగలగడమే కదా!. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఏముంది!.

ఇది పూరి జగన్నాథుని క్షేత్రానికి దగ్గరలోని సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన.

పాలస్తీనా ఇశ్రాయేలు మధ్య 3000 సంవత్సరాల నుండి యుద్ధం జరుగుతుంది
18/05/2021

పాలస్తీనా ఇశ్రాయేలు మధ్య 3000 సంవత్సరాల నుండి యుద్ధం జరుగుతుంది

issue Israel ్రాయెల్ పాలస్తీనా మధ్య ఈ మధ్య కాలంలో జరుగుతున్న యుద్ధం గురించి మనకు తెలిసిందే ఇప్పుడు మనం అస...

"మంచోడిని గెలికితే,వాడు రంగంలోకి దిగితే"...ఎలా ఉంటుందో "ఆనాడే చూపెట్టిన పరశురామునికి" మా సాష్టాంగ ప్రణామాలు."దుష్టుల తలల...
14/05/2021

"మంచోడిని గెలికితే,వాడు రంగంలోకి దిగితే"...
ఎలా ఉంటుందో "ఆనాడే చూపెట్టిన పరశురామునికి" మా సాష్టాంగ ప్రణామాలు.

"దుష్టుల తలలు పుచ్చకాయలు లేపినట్టు లేపుతూ,చేతులు,కాళ్ళు తెగనరుకుతూ" భీభత్సాన్ని సృష్టిస్తూ,"కార్త్యవీర్యార్జునుని వేయి చేతులు నరికి",
ఇలా దుష్టుల తరాలను 21 సార్లు తెగ నరుకుతూ, "ఈనాటికీ చిరంజీవియై,అదృశ్యశక్తియై", "తపోధనులకు అస్త్ర, శస్త్ర, మర్మ విద్య, ఇలా అనేక విద్యల శక్తిని" అందిస్తున్న "అవతార పురుషునికిదే నమస్సుమాంజలులు".

"భారతీయులకు పరశురామ అవతార దినోత్సవ" శుభాకాంక్షలు".

28/04/2021

ఎక్కడో ఎప్పుడో చదివిన చిన్న కథ. ఈ రోజు మళ్ళీ చదివాను. మీరు కూడా చదవండి. ప్రాప్తం ఉంటే ఎటువంటి పరిస్థితిలోనైనా మనది మనదికాకుండా పోదు. ఇంటరెస్టింగ్ స్టోరీ.

# # # # #

కొత్తపల్లి సంతలో అరటి పళ్ళు అమ్మే గోపాలం నిజాయితీ పరుడు. పెళ్ళీడుకొచ్చిన కూతురు ఉంది ఆయనకు. ఆమె పెళ్ళి సంబంధాలకోసం‌ కాలికి బలపం కట్టుకొని తిరిగితే, చివరికో మంచి సంబంధం నిశ్చయం అయ్యింది. పెళ్ళి కొడుకు చిరుద్యోగి- మంచివాడూ, సౌమ్యుడూనూ.

పెళ్ళి ఇంకా కొద్ది రోజుల్లో ఉందనగా గోపాలం కూతురి పెళ్ళి కోసం తను ఇంతకాలంగా కూడబెట్టిన యాభై వేల రూపాయలూ బ్యాంకు నుండి తెచ్చి, ఇంట్లో దాచు-కున్నాడు- పెళ్ళి ఖర్చులకు కావాలి కద!

అయితే ఆయన బీరువాలో డబ్బు దాచే సమయంలో ఆయన తమ్ముడి కొడుకు నంద అక్కడే ఉన్నాడు. నందకు పనీ పాటా లేదు; చిన్న చిన్న దురలవాట్లూ ఉన్నాయి. పెదనాన్న డబ్బు దాయటం, బీరువా తాళం చెవులు అక్కడే ఓ ప్రక్కన పెట్టం చూసి వాడి చెయ్యి ఆగలేదు. గోపాలం బయటకు పోగానే వాడు బీరువా తెరిచి ఆ డబ్బంతా కాజేశాడు!
వాడికి ఊళ్ళో తనలాగే దుబారాగా, అల్లరి చిల్లరగా తిరిగే స్నేహితులు ముగ్గురున్నారు. పెదనాన్న నుండి కాజేసిన నోట్ల కట్టని ప్యాంటు జేబులో దాచుకొని, వాడు సైకిలెక్కి గబగబా వాళ్ళ ఇళ్ల వైపుగా బయలుదేరాడు. అయితే ఆ హడావిడిలో వాడు చూసుకోలేదు- వాడి జేబుకో పెద్ద కన్నం ఉంది: అందులోంచి ఆ డబ్బులు ఎప్పుడు జారాయో, ఎక్కడ పడిపోయాయో, వాడికి తెలీనే లేదు!

అట్లా పడిపోయిన ఆ నోట్లకట్ట ఒక వర్తకుడికి కనిపించింది. వర్తకుడు ఆశపోతు. అతను గబుక్కున దానిమీద తన చేతి రుమాలు వేసేసి, ఎవరైనా తనను గమనిస్తున్నారేమో అని అటూ-ఇటూ చూశాడు: ఎవ్వరూ చూస్తున్నట్లు లేరు! అతను వెంటనే దాన్ని పైకెత్తి, గబుక్కున తన సంచీలో వేసుకొని, వెనుతిరిగి చూడకుండా ఇల్లు చేరుకున్నాడు. ఇల్లు చేరుకోగానే సంబరం పట్టలేక ఆ డబ్బు కట్టను భార్యకు చూపించాడు. ఒక్కసారిగా అంత డబ్బు దొరకటం చూసి వర్తకుడి భార్య సొమ్మసిల్లి పడిపోయింది!

కొంచెం తేరుకున్నాక వర్తకుడు ఆలోచించాడు: "ఇంత దొంగ సొమ్ము చేతిలో ఉంటే ప్రమాదం. ఎక్కడైనా దాచాలి- ఎక్కడ?" అని. చివరికి అతను పెరట్లో ఒక గొయ్యి త్రవ్వి, డబ్బును అందులో పాతేసి, తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.
అయితే అతను అట్లా దేన్నో పాతిపెట్టడం అక్కడే తచ్చాడుతున్న ఒక దొంగ చూడనే చూశాడు. 'ఎంతోకొంత విలువైంది కాకపోతే వర్తకుడు అంత శ్రమ ఎందుకు పడతాడు?' అనుకున్న దొంగ, చీకటి పడేంత వరకూ ఆగి, వ్యాపారి పడుకోగానే పెరట్లో పనికి వంగాడు. త్వరలోనే అతని శ్రమ ఫలించింది: ప్లాస్టిక్ కవర్ చుట్టిన నోట్ల కట్ట అతని చేజిక్కింది! వాడు కొంత సేపు తన అదృష్టానికి నివ్వెరపోయి, తర్వాత ప్లాస్టిక్ కవర్ తీసి అక్కడే పడేసి, నోట్లకట్టను రొండిన చెక్కుకొని, గోడ దూకి పరుగు మొదలెట్టాడు.

అయితే ఆ రోజున వాడి అదృష్టం సరిగ్గా ఉన్నట్లు లేదు- వీధి కుక్కలన్నీ వాడి వెంటే పడ్డాయి. వాడు ఎటు వెళ్తే అటు కుక్కలు! వాటి అరుపులకు గ్రామంలోని ప్రజలందరూ నిద్రలేచి పరిగెత్తుకు రాసాగారు. ఇక దొరికిపోతానని భయం వేసింది వాడికి. డబ్బుతో దొరికితే జనాలతో కష్టం! అందుకని వాడు నోట్ల కట్టని దారి ప్రక్కనే విసిరేసి, వేరే దిక్కుకు పరుగు పెట్టాడు.

ఆ ఊళ్ళోని రామాలయం పంతులికి తెల్లవారు జామునే స్నానం చేయడం అలవాటు. ఆ రోజున ఆయన అట్లా స్నానం చేసి తిరిగి వస్తుండగా, దారి ప్రక్కనే నోట్లకట్ట కనిపించింది. "అయ్యా! రామా! ఇన్నాళ్ళకు నీ భక్తుడిని కరుణించావా తండ్రీ!" అంటూ ఆనందంగా డబ్బుని తన కండువాలో చుట్టి పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన.

ఆయన ఇల్లు చేరుకునే సమయానికి ఇంటి ముందు పెద్ద గుంపు ఒకటి మూగి ఉన్నది: వాళ్లంతా ఆయన చేత పెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోటానికి వచ్చిన గ్రామస్తులు. పంతులుగారు కాళ్ళు-చేతులు కడుక్కొని, చేతిలో ఉన్న చెంబును అరుగు మీద పెట్టి, కండువాను ఎవరికీ కనిపించకుండా ఇంట్లోకి తీసుకెళ్ళి, దాన్ని పడక కుర్చీ పైన పెట్టి, ముహూర్తాల వాళ్ళతో మాట్లాడటానికి బయటికి వెళ్ళాడు.

సరిగ్గా అదే సమయానికి పంతులుగారి భార్య బట్టలు ఉతికేందుకు బయలు దేరింది. వెళ్తూ వెళ్తూ ఆవిడ పడక కుర్చీలో పంతులుగారు వేసిన కండువాని కూడా ఎత్తి తన బకెట్ లో వేసుకున్నది- కండువాలో డబ్బు ఉందని ఆమెకు తెలీదుగా?

పంతులుగారి భార్య చాకిరేవుకు చేరుకునే సరికి అక్కడ గోపాలం భార్య శ్రీలక్ష్మి కూడా బట్టలు ఉతుకుతున్నది. ఇద్దరూ అంత:పురం సీరియల్ గురించి కబుర్లాడుతూ బట్టలు ఉతుక్కున్నారు. నోట్ల కట్ట పంతులుగారి బక్కెట్లోనే పడి ఉన్నది- ఇద్దరూ దాన్ని గమనించలేదు. పని ముగించుకున్నాక, ఇద్దరూ ఎవరికి వాళ్ళు తాము ఉతికిన బట్టల్ని బకెట్లో వేసుకొని ఇంటికెళ్ళారు.

ఆ సమయంలో ఒక పొరపాటు జరిగింది: ఇద్దరి బకెట్లూ ఇత్తడివే. రెండూ ఒకే కాంతం దగ్గర కొన్నవి; ఒకేలాంటివి! దాంతో ఒకరి బకెట్ ఒకరికి వచ్చింది. పంతులుగారి బక్కెట్టు నోట్ల కట్టతో‌సహా అలా గోపాలంగారి ఇల్లు చేరుకున్నది!

శ్రీలక్ష్మి ఉతికిన బట్టలు ఆరవేస్తుంటే బకెట్ అడుగున డబ్బు కనిపించింది. ఆమె ఆ నోట్లకట్టని చూసి ఆశ్చర్యపోతున్నంతలో గోపాలం గాభరాగా అక్కడికి వచ్చి , "లక్ష్మీ! నిన్న నేను బీరువాలో దాచిన డబ్బు కనిపించట్లేదు, నువ్వు గాని తీశావా?" అంటూనే బకెట్ లో ఉన్న డబ్బుని చూసి - "నువ్వెందుకు తీశావు, దీన్ని? దీని కోసం ఎంత సేపటినుంచి వెతుకుతున్నానో తెలుసా?" అన్నాడు దాన్ని తీసుకుంటూ.

గోపాలం భార్యకు ఆ డబ్బు తన బక్కెట్టులోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. చివరికి 'పొరపాటున నేనే తీసుకుపోయి ఉంటాను బట్టలతోబాటు- పోయి ఉంటే ఎంత గందరగోళం జరిగేది?!' అనుకొని సంతోష పడ్డది. "ఏమైనా నా అదృష్టం బాగుంది ఇవాళ్ల" అంటూ తెగ నవ్వింది.

అట్లా తిరిగి తిరిగి గోపాలం సొమ్ము గోపాలాన్నే చేరుకున్నది! ఏది ఏమైనా కష్టం చేసి సంపాదించిన సొమ్ము వృధా కాదు. "పోవుట దొరకుట కొరకే" అంటే ఇదే!

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when హింధూ - సనాతన ధర్మం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category