14/02/2020
అభివృద్ధి పేరుచెప్పుకొనుచు దేశ ప్రధానులు, అధికారులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రులు లక్ష్యల కోట్లు డబ్భును ప్రపంచ బ్యాంకు నుండి అప్పులు తెచ్చి దేశాన్ని, రాష్టాలను ప్రజలకు తెలియకుండానే అమ్మివేస్తున్నారు.
ఈ విషయముపై నేటి మతోన్మాదులు దృష్టి పెట్టకుండా క్రైస్తవ్యాన్నీ అడ్డుకుంటున్నారు.
సహోదరులారా...
వివేచించండి..,
ఆనాడు బ్రిటీషు వారు భారతదేశమును పరిపాలించియున్నారు.
అది రాజుల కాలము.
ఆ రోజుల్లో వారికి పాస్పోర్ట్ వీసాలు ఏమి అవసరం లేదు. కాబట్టి వారు సులువుగా దేశాలను దాటియున్నారు. ఆక్రమించుకున్నారు. దోచుకున్నారు.
ప్రజలు వారికి విరుద్ధముగా తిరుగుబాటు చేసి యుద్దాలు చేసి వారిని తమ దేశాల నుండి వెల్లగొట్టారు మరియు స్వాతంత్ర్యమును పొందుకున్నారు.
ఆ తరువాత దేశములో రాజుల పరిపాలన ముగిసి ప్రజాస్వామ్యము నాయకుల పాలన ప్రారంభించబడినది. మరియు దేశ పాలనకొరకు రాజ్యాంగము, హక్కులు, చట్టాలు మరియు న్యాయవిదులు మొదలగునవి అమల్లోకి వచ్చాయి.
ఇప్పుడు ఎవరి దేశాన్ని వారే పరిపాలించుకుంటున్నారు. అంతమాత్రమే కాకుండా ప్రభుత్వం యొక్క పెర్మిషన్ లేకుండా సరిహద్దులు కూడా దాటలేని సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మనము జీవిస్తున్నాము.
అయితే..,
నేడు దేశములోనున్న క్రైస్తవులను బట్టి క్రైస్తవ దేశాల వారు మరల భారతదేశమును ఆక్రమించుకుంటారేమో అని నేటి భారత మతోన్మాదులు భయపడుచున్నారు. వారి స్వాతంత్ర్యమును కోల్పోతామేనని దిగులుచేందుచున్నారు.
అందుకే వీరు క్రైస్తవ్యాన్ని అనిచివేయాలని అల్లరులు, గొడవలు చేస్తున్నారు.
వారి ప్రార్థనలు మీటింగులను అడ్డుకుంటున్నారు.
దీని విషయముమై మేము ధైర్యముగా చెప్పుచున్నాము.
దేశప్రజలను దేశాలను రాష్ట్రాలను పన్నుల ద్వారావస్తున్న ధనమును ప్రపంచ బ్యాంకు నుండి అప్పుగా తెచ్చున అసలుకు ఇంట్రెస్టు మాత్రమే చెల్లిస్తూ ఇతర దేశాలకు ప్రపంచ బ్యాంకుకు మరల బానిసలుగా చేస్తూ అమ్మివేస్తున్నది దేశ నాయకులే తప్ప క్రైస్తవులు ఎంతమాత్రము కాదు.
ఇప్పటికైనా ..
దేశములో మతకల్లోలాలు రేపుచున్న మతోన్మాదులు తమ కన్నులను తెరచి ఈ విషయమును గ్రహించాలి.
ఎవరు ఎవరిని ఎవరికి బానిసలుగా చేస్తున్నారో కాస్త గుర్తించాలి.
నేటి నిజ క్రైస్తవులు ...
దేశమును ఇతర దేశాలకు అమ్మివేయాలని ఎన్నటికిని ఆలోచించలేరు.
ఎందుకంటే వారు క్రీస్తును నమ్ముకొన్నది ఆయన ద్వారా దొరికిన నిరీక్షణతో కనిపెడుచున్నది పైనున్న పరలోకం కొరకే గాని.,
క్రిందున్న భూమికొరకు కాదు.
వారి సంపద సహవాసము దేవుని రాజ్యముతోనే తప్ప భూమిపైనా కాదు.
నిత్యము వారు చేస్తున్న ఆత్మీయ యుద్ధము..
క్రీస్తు పోలికలోనికి వారు మార్చడకుండా పరలోకమును చేరకుండా పాపపు శక్తితో తమతో యుద్ధము చేస్తున్న మతోన్మాదులకు కనిపించని సాతాను సామ్రాజ్యాముతోనే ఉన్నది గాని మనుషులతో ఎన్నటికిని కాదు.
వారు ఈ పాపపు ప్రపంచాన్ని భూమిని, తమకు కలిగియున్నవి చివరికి ప్రాణమును సైతం విడచి నిత్యత్వములోనికి ప్రవేశించాలనే గురితోనే ఉన్నారు తప్ప ఏ దేశముతోను ప్రజలతోను సంది చేసుకోలేరు.
కాబట్టి.,
One world,
One rulling,
One currency,
One religion
లాంటివి స్థాపించుటకు కలిగిన ఉద్దేశముతో క్రీస్తువిరోది తన రాజ్యమును స్థాపించుటకు
భూమిపైన జరుగుచున్న యుద్దాలకు వారు కారకులే కాదు.
ప్రపంచ ఉగ్రవాదమును అణచి శాంతియుత సామ్రాజ్యమును స్థాపించుటకు మోసపూరితమైన అబద్ధపు మాటలు, నెరవేర్చలేని వాగ్దానాలతో ప్రపంచ దేశాలతో సంది చేస్తూ
ఇప్పుడు కట్టబడుచున్న క్రీస్తువిరోది రాజ్యమును విడచి క్రీస్తు రాజ్యములోనికి ప్రవేశించడమే క్రైస్తవుల యొక్క ముఖ్యమైన గురి.
ఒక్క మాటలో చెప్పాలంటే..,
వారు భూసందులు కారు పరసంబందులే..!
ఇక్కడ వారు ఆస్తులు దంపాదించుట కాదు ఉన్నవి విడిచిపెట్టువారే.
కాబట్టి క్రైస్తవులు ప్రజలకు ఆటంకము కాదు వారిని అడ్డగిస్తున్న సాతాను రాజ్యానికే..!
ఈ విషయాన్ని నేటి భారతీయ సహోదరులు గ్రహించాలి.
మరి ముఖ్యముగా అంబేత్కరిజమును అనుసరిస్తున్న వారు గ్రహించాలి.
సహోదరులారా..!
ఈ మాటలు రాసింది దేశములోను ప్రపంచములోను జరుగుచున్నది తెలుసుకోవాలని, గ్రహించాలని అందరిలో ఒక ఆలోచన ఉద్బవించాలనే భావన తప్ప ఇది వ్యక్తిగతముగా ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు.
చదివినవారు వివేచిస్తారని నమ్ముచూ..!
మీ సహోదరుడు.
Br. Bhaskar Narsinga