The India pentecostal church Of God Jadcherla

The India pentecostal church Of God Jadcherla THE INDIA PENTECOSTAL CHURCH OF GOD (IPC) Established by Gaddam John Panthulu in 1950 and later construct a church in 1969. In Jadcherla, Mahabub Nagar.

22/04/2023

Revelation(ప్రకటన గ్రంథము) 21:6

6. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.

21/04/2023

Revelation(ప్రకటన గ్రంథము) 21:6

6. నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను;

20/04/2023

Revelation(ప్రకటన గ్రంథము) 21:4

4.ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును

క్రీస్తునందు ప్రియులగు మీకందరికీ ప్రభు పేరట వందనాలు.మన హైదరాబాద్ ఏరియా నూతన డిస్ట్రిక్ట్ బాడీ ఈ రోజు అనగా తేది 19.04.202...
19/04/2023

క్రీస్తునందు ప్రియులగు మీకందరికీ ప్రభు పేరట వందనాలు.
మన హైదరాబాద్ ఏరియా నూతన డిస్ట్రిక్ట్ బాడీ ఈ రోజు అనగా తేది 19.04.2023 (బుధవారం) మధ్యాహ్నం 1గంటలకు మన హైదరగూడ లోని IPC చర్చ్ లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
అంతయు కూడ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో సమాదానకరముగా, ప్రార్థన పూర్వకముగా, సంతోషకరమైన వాతావరణంలో జరిగింది.
హైదరాబాద్ ఏరియా ప్రసిడెంట్ గా పాస్టర్ యం. ఆమోసు గారు (మండల్: రామారెడ్డి, జిల్లా: కామారెడ్డి)
వైస్ ప్రెసిడెంట్ గా పాస్టర్ జాన్ విక్టర్ గారు (కర్నూల్),
జనరల్ సెక్రటరీ గా
పాస్టర్ పి. రవీంద్రకుమార్ గారు (హైదరగూడ స్థానిక సంఘ కాపరి),
జాయింట్ సెక్రటరీ గా బ్రదర్ A.S ఏలీయా గారు (జడ్చర్ల),
ట్రెజరర్ గా బ్రదర్ ఎల్. రూబెన్ గారు (రామారెడ్డి స్థానిక సంఘం),
స్టేట్ కౌన్సిల్ పాస్టర్ గా పాస్టర్ బి. డేవిడ్ గారు (గ్రా.అన్నారం)
స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా బ్రదర్ పి.పి. సామెల్ గారు (హైదరగూడ) ఎన్నికైనారని తెలుపుటకు సంతోషిస్తున్నాము.
ఇట్టి కార్యమును విజయవంతముగా జరిగించిన ఆ మహా దేవునికి వేలకొలది వందనాలు.
నూతనముగా ఎన్నికైన మన నాయకుల కొరకై మరియు మన ఏరియా, సంస్థ అభివృద్ధి కొరకై, ప్రతి దినము మానక ప్రార్థన చేయగలరని మనవి.

19/04/2023

Revelation(ప్రకటన గ్రంథము) 21:1,2,3

1.అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.
2.మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.
3.అప్పుడుఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

18/04/2023

Revelation(ప్రకటన గ్రంథము) 20:15

15.ఎవని పేరైనను(మూలభాషలో-ఎవడైనను) జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.

17/04/2023

Revelation(ప్రకటన గ్రంథము) 20:12

12. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

16/04/2023

Revelation(ప్రకటన గ్రంథము) 20:10

10.మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

15/04/2023

Revelation(ప్రకటన గ్రంథము) 20:6

6. మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

14/04/2023

Revelation(ప్రకటన గ్రంథము) 20:4

4.అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిముత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.

13/04/2023

Revelation(ప్రకటన గ్రంథము) 19:13

13.దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.

12/04/2023

Revelation(ప్రకటన గ్రంథము) 19:12

12.ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;

Address

Old MLA Quarters Road, Behind Petrol Pump, Hyderguda.
Hyderabad
500029

Opening Hours

Wednesday 7:30pm - 9pm
Saturday 7:30pm - 9pm
Sunday 9:30am - 12pm
4:30pm - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when The India pentecostal church Of God Jadcherla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share