JJPF Church

JJPF Church But we preach Christ crucified, unto the Jews a stumblingblock, and unto the Greeks foolishness;
(1C

Join us
31/12/2025

Join us

28/12/2025
28/10/2025

“దేవుని కృప నాకు విస్తారంగా లభించింది
అందుకు ఆయనకు స్తోత్రాలు.
నేను చేసిన పాపాలకంటే,
సాతాను నాకు పెట్టిన శోధనలకంటే
అది (దేవుని కృప) అధికంగా వుంది”.

“జాన్ బన్యన్”@@

27/12/2024

బైబిల్ ప్రమాణం ప్రకారం నిజ క్రైస్తవునిగా ఉండడానికి చెల్లించాల్సిన వెల ఒకటుంది. నిజ క్రైస్తవునిగా ఉండడానికి జయించాల్సిన శత్రువులున్నారు, చేయాల్సిన యుద్ధాలున్నాయి, త్యాగాలున్నాయి, విడిచి పెట్టాల్సిన ఐగుప్తు ఉంది, దాటిపోవాల్సిన అరణ్యం ఉంది, మోయాల్సిన సిలువ ఉంది, పరిగెత్తాల్సిన పరుగుపందెం ఒకటి ఉంది. మారుమనస్సు అంటే మనిషిని ఒక కుర్చీలో (ఆర్మ్ చైర్లో) కూర్చోబెట్టి సులభంగా అతణ్ణి పరలోకానికి తీసుకుపోవడం కాదు. బలమైన పోరాటానికి అదొక ఆరంభం. విజయం సాధించడానికి ఎంతో వెలచెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చెల్లించాల్సిన వెల యొక్క ప్రాముఖ్యత మాటల్లో చెప్పలేనిదనే సత్యం స్పష్టమవుతోంది.
" జె.సి. రైల్ "

10/07/2024

*మానవులు విస్తారంగా పాపాలు చేసి కూడా, దేవుడు ఇంతవరకు ఎటువంటి శిక్షను వేయలేదు ఇక ముందుకు కూడా మమ్మును శిక్షింపడు అని అనుకుంటారు.*
*న్యాయ విచారణ వాయిదా వేయబడింది కాబట్టి ఇక న్యాయ విచారణ జరగదని వారు భావిస్తారు.*

"దేవుడు ఆయన విముకుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములో అనుకొందురు (కీర్తన 10: 11)
*దేవుడు నిజంగా పాపుల ఎడల దీర్ఘ శాంతుడు తన శాంత గుణంతో పశ్చాత్తాప పడే వారిని ప్రోత్సహిస్తాడు.*
గాని వారి దుర్గుణం చూడండి: ఆయన వారిని శిక్షించకుండా సహిస్తూ ఉంటే వారు కూడా మారుమనస్సు పొందడానికి మానివేస్తారు.
*ఆయనలోని ఓర్పు తొందరలోనే అంతమైపోతుందని తెలుసుకోండి.
"నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని దేవుడు చెప్పే సమయం ఉంది (ఆది 6:3) *అప్పు ఇచ్చిన వాడు అప్పు తీసుకున్న వానిని కొంతకాలం సహింపవచ్చు గాని అప్పు తీర్చకూడదని దాని అర్థం కాదు.*

*దేవుడు తన సహనం ఎంత కాలము నుండి చూపబడుతూ ఉందోనని తన గడియారం చూస్తూ ఉంటాడు. "మారుమనస్సు పొందుటకు సమయం ఇచ్చితిని గాని.. అది మారుమనస్సు పొంద నొల్లదు" (ప్రకటన 2:21) యేజబేలు పశ్చాత్తాప పడకపోవడమే కాకుండా ఆత్మ నిగ్రహము కూడా లేనిదిగా ఉండినది, ఫలితంగా, "ఇదిగో నేను దానిని మంచం పట్టించి" (ప్రక 2:22) - సుఖం నిచ్చే మంచం కాదు, శ్రమలపాలు చేసే మంచము దానిలో తన అవినీతి క్రియలతో పాటు లయమైపోతుంది "*దేవుని విల్లు ఎంత ఎక్కువ సమయం సంధింపబడితే అంత లోతుగా గాయమవుతుంది, *దేవుని దీర్ఘశాంతమునకు విరోధంగా చేయబడిన పాపాలు ఆ వ్యక్తి నరకాన్ని అంత ఎక్కువ వేడిగా చేస్తాయి*

*"థామస్ వాట్సాన్"*

25/02/2022

దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
ఎఫెసీయులకు 5:15‭-‬16

ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపననుచేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ఎఫెసీయులకు 6:18

Address

Hyderabad
500076

Website

Alerts

Be the first to know and let us send you an email when JJPF Church posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to JJPF Church:

Share