Bible Gospel Church

Bible Gospel Church Bible Gospel Church

25/08/2026

బెంగాల్ గొప్పతనాన్ని హింసతో మసకబార్చకండి!

ఈ మధ్య బెంగాల్‌లో చర్చిలు, క్రైస్తవ ప్రార్థనా స్థలాలు మరియు క్రైస్తవులపై జరుగుతున్న కొన్ని దాడులు తీవ్రంగా ఖండించదగినవి .

బెంగాల్ అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు.
అది విద్యకు, సాహిత్యానికి, కళలకు, సంస్కృతికి, మేధస్సుకు, మానవతా విలువలకు ప్రసిద్ధి చెందిన నేల. రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, రాజా రామమోహన్ రాయ్ వంటి మహనీయుల ఆలోచనలకు జన్మనిచ్చిన నేల.

అలాంటి బెంగాల్‌లో మత స్వేచ్ఛను అణచివేయడం, ప్రార్థనా స్థలాలపై దాడి చేయడం, క్రైస్తవులను భయపెట్టడం బెంగాల్‌ యొక్క గొప్ప సంస్కృతికి ఏమాత్రం ప్రతినిధ్యం వహించదు.

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారా?
ఎవరైనా రాజకీయ శక్తులు ఇలాంటి చర్యలను ప్రేరేపిస్తున్నాయా?
అయితే ప్రజాస్వామ్య సమాజం దీనిపై ప్రశ్నించాలి, నిజాలను వెలికి తీయాలి.

దాడి చేసే వ్యక్తి ఏ మతానికి చెందినవాడైనా — దాడి తప్పే.
బాధితుడు ఏ మతానికి చెందినవాడైనా — న్యాయం అతని హక్కే.

క్రైస్తవులపై దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

బెంగాల్‌కు హింస కాదు — విద్య, సాహిత్యం, సంస్కృతి, మానవత్వం మరియు సహజీవనమే నిజమైన గుర్తింపు.

✝️ చర్చిపై దాడి అంటే కేవలం ఒక భవనంపై దాడి కాదు; అది ప్రార్థనా స్వేచ్ఛపై దాడి.

మత స్వేచ్ఛను కాపాడుదాం.
హింసను ఖండిద్దాం.
విద్వేష రాజకీయాలను తిరస్కరిద్దాం.
న్యాయం కోసం స్వరం వినిపిద్దాం.

23/08/2026
22/08/2026

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన తెలుగు రాష్ట్రాలలో పెరిగిపోతున్న అసహనం. ఇదే ప్రాతిపదికన రాష్ట్రంలో ఎన్ని హిందూ గుడులు మూయించింది చెప్పాలి.

18/08/2026

తప్పు ఎవరు చేసినా తప్పే! నిష్పక్షపాత స్పందన ఉండాలి.
అరాచకాన్ని ఖండిచడానికి కూడా మత ప్రాతిపదికన ఆలోచించాలి అనుకోవడమే దౌర్భాగ్యం. తప్పు చేసింది క్రైస్తవులైతే తెలుగు భాషలో ఉన్న మురికి కూతలు అన్నీ కుయ్యాలి. అదే వాడొక పూజారో, స్వామీజీ లేదా ఒక హిందువు అయితే. వ్యూహాత్మక మౌనం పాటించాలి. అన్యాయం బ్రో.

15/08/2026

ఇది కేవలం హిందువుల సమస్య మాత్రమే కాదు. సమాజంగా మనందరి సమస్య.
ఇంగితం లేని ఉన్మాదుల్లా దీన్ని ఒక మతానికి, వర్గానికి అంటగట్టాల్సిన అవసరం లేదు. సమాజంగా దీనిని ఖండించాలి. ఈ ఒక్క పూజారి చేసిన ఘోరం యావత్ హిందూ సమాజానికి ఆపాదించడం హేయం! మతాలకు అతీతంగా ఇలాంటి దురాగతాలను నిలువరించాలి. ఆ పాప జీవితం నాశనం చేసిన ఆ దుర్మార్గునికి కఠిన శిక్ష పడాలి. ఆ పాప గోప్యతను కాపాడాలి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి, వారిని కూడా కాపాడాలి. సంఘటితంగా ఉందాం..! చాలా ఘోరం! దారుణం! భయంకరం!

13/08/2026

క్రైస్తవ సమాజానికి, రాజకీయ నాయకులు ఇంతకు ముందున్న వారరైన, ఇప్పుడున్న వారైనా చేసిందేమీ లేదు…వాడుకొని పైకి రావడం తప్ప!
పరాయి దేవతలను దూషించమని పాస్టర్స్ చెప్పిఉంటే వారి మీద ఇతను చెప్పిన కేసులన్నీ పెడుతున్నారు. మరి, అదే పనిగా క్రైస్తవ్యాన్ని, బోధకులను, యేసు ప్రభువు లను, మరియమ్మను…లఖారాలతో తిడుతుంటే ఎన్ని కేసులు పెట్టిండ్రో అన్న చెప్పాలి. క్రైస్తవులను తనే కాపాడుతున్నట్టు ఇక నేనే లేకపోతే ఆ దేవుడు కూడా రక్షించలేడు అన్నట్టు మాట్లాడడం హేయం. ఈయన మణిపూర్ గురించి కూడా మాట్లాడాడు..ఇంకేముంది!

09/08/2026

భారతదేశ చరిత్రలో క్రైస్తవులపై ఈ పదేళ్లలో జరిగినన్ని దాడులు మరిప్పుడు జరుగలేదు.
చర్చి ప్రాంగణం లోకి వెళ్లి మరీ దాడులు చేయడం హేయం! క్షమార్హం కాని నేరం!
దయచేసి నాయకులు, అధికారులు, పోలీస్ అధికారులు జీవితంలో ఒక్కసారైనా మీ డ్యూటీ సరిగా చేయండి. చరిత్ర మిమ్మల్ని క్షమించదు.

Address

Bible Gospel Church
Hyderabad
500049

Alerts

Be the first to know and let us send you an email when Bible Gospel Church posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Bible Gospel Church:

Shortcuts

Share