10/05/2018
నేటికాలం_పెళ్లిళ్లు ఎవరో చెప్పినట్టుగా పెద్ద తంతుగా తయారు అయ్యాయి. అందరు చేస్తున్నారు, మనం అలాగే చేసేయ్యాలి. చెయ్యక పొతే నామోషీ.. ఇది నేటి రీతి .
"ఎందుకు చేస్తున్నామో తెలియకుండా గుడ్డిగా మనం పాటించేవాటినే "తంతు" అంటారు"
మరి కొన్ని గంటల్లో వేదం మంత్రాలూ చదవ బోతున్న స్టేజి పైకి అందరూ షూస్ /చెప్పులతో ఎక్కడం .
ఆ షూస్ ఎక్కడెక్కడ తొక్కి వచ్చిందో .ముహుర్తాలు దాటిపోయాక చెప్పులు వేసుకొని, పోనీ ఆచారం సంగతి పక్కన పెట్టండి కనీసం ఆరోగ్య సూత్రాల రీత్యా మంచిదేనా ?
ఆ స్టేజి పైన కొన్ని గంటల పాటు వధూవరులు కూర్చొంటారు కదా ? ఆలోచిస్తారా ?...
పోనీ పెద్దలైనా చెబుతారా అదీ లేదు !...ప్చ్
పెళ్లి మొదలయ్యేటప్పటికి ఒకచోట జాతరను మించి జనాలు ఉంటే మరోచోట పట్టున యాభై మంది ఉండరు. నిర్మానుష్యంగా పెళ్లి హాల్. పెళ్ళికొచ్చిన వారికి, కూర్చున్న వారికైనా పెళ్లి జరిపే దృశ్యం కనిపిస్తుందా అంటే జస్ట్ నో ఛాన్స్ .
ముగ్గురు కెమెరా వాళ్లు.. ఇద్దరు విడియోగ్రాఫేర్స్ .. లైట్ మోసేవాడు .
పెళ్లి మంటపం మొత్తం కవరయ్యేటట్టుగా ఒక్కో ఫొటోగ్రాఫర్ రెండేసి తెల్లబట్ట గొడుగులు
ఇదేందయ్యా అంటే.. మల్లి మల్లి చేసుకుంటారా సార్ స్టిల్స్ సరిగ్గా రావొద్దా ?..అనే జవాబు
ఇక ఫొటోలు ఠెసె సమయూరంలో పెయిన్ మంటం దగ్గర కూర్చున్న వాళ్ళను ఎవరెవరిని ఎన్నిసార్లు తొక్కుతారో ఆ భగవంతునికే తెలుసు !
మనం చూసేదీ పెళ్ళితంతు కానే కాదు, వీడియో /.ఫొటోగ్రాఫర్ల పిఱ్ఱల దివ్యదర్శనం చేసుకోవలసిందే.
మంటపంలో వధూవరులు అస్సలు కనిపించరు,,,వచ్చిన జనాలకి వధూవరులకు మధ్యన ఈ ఫొటోగ్రాఫర్లే ...వాళ్ళు దయతలచి కొద్దిగా పక్కకు జరిగితే ఆహ్వానితులుచూసి తరిస్తారు అప్పుడు వారు ధన్యులే ...
ఫొటోగ్రాఫర్లు .. బ్రాహ్మణుడిని పెళ్లి సరిగ్గా చేయనియ్యరు ,
వధూవరులని ప్రతీ ఘట్టంలో ఆపి, ఇటువైపు చుడండి ...
ఆ .. నవ్వండి! ఇలా పట్టుకొనుండండి!... పోజులకోసమా ఈ పెండ్లి ? ... సుమూర్థాలెక్కడా ?
బ్రాహ్మణుడు తాళి కట్టే ముందు అమ్మయ్యి మేనమామ ని పిలిచి మంగళ సూత్రాలు చేతిలో బెట్టి వచ్చిన పెద్దల ఆశీర్వాదాలు చేయించుకురమ్మని ఆజ్ఞాపిస్తే ...స్టేజీ దిగకముందే ,ఒక పెద్ద మనిషి అడ్డుగా వచ్చి ... చాల్లేవయ్యా ఇప్పుడు టైం ఎంతయ్యిందో చూశావా ?...పైనుండే అందరికీ చూపించి తీసుకెళ్లి బాపడి చేతిలో పెట్టు అన్నాడు ..వాహ్ వా ఎంత ఎదిగిపోయార్రా ...
అట్ఠిట్ఠా కిందా మీదా పది బాపడు పెళ్లి తంతు ముగించేశాడూ, అందరూ ఆశార్వాదాలు ఇవ్వడానికి స్టేజీపైకి వస్తారు .అది కూడా షూస్ తో సహా దీవించి ..
వయసులో చిన్న వారు అయిన కాబోయే దంపతులు స్టేజి పై నిల్చుంటారు . వారి ని ఆశీర్వదించడకోసం లేదా గ్రీట్ చేయడం కోసం పెద్ద వారు క్యూ లో నిలబడుతారు .
అంటే మనం పెద్ద వారికి ఇచ్చే గౌరవం ఇదన్న మాట . క్యూ చేంతాడంత ఉంటుంది .
ఎప్పుడెప్పుడు స్టేజి పైకి వెళ్లే ఛాన్స్ వస్తుందా అంటూ వాచ్ చూసుకొంటూ లైన్ లో నిలబడుతారు . చివరికి ఛాన్స్ వస్తుంది . ఫోటో కోసం ఒక కృత్రిమ నవ్వు . వాళ్ళను ఆశీర్వదించడం ..
పెళ్లి అయ్యింది. ఇక అందరూ భోజనం హాల్ లోకి ,ఇక పరుగో పరుగు. అక్కడ అది భోజనశాలో లేక అంగడి మార్కెట్టో అర్ధమే కాలేదు ,దోష ,పెసరట్టు, పానీ పురీ, మిర్చీ ,సమోసా ఇలా రకరకాలు. అక్కడ తోపులాట . తిండికి మొఖం వాచిన వారిలా తోసుకొంటూ వెళ్లి ప్లేట్ పట్టుకొని "భవతి భిక్షందేహీ" అని నిల్చుంటే
ఇక అక్కడ వాడు చేతికి ప్లాస్టిక్ కవర్ వేసుకొని, భిక్షం వేసినట్టుగా మొఖం పెట్టుకొని వడ్డిస్తాడు
అక్కడ ఎన్ని పదార్థాలు వున్నాయి అనేది స్టేటస్ సింబల్. కనీసం 30 అయినా లేక పొతే అవమానం ఒక్కో సారి నూటయాభై దాకా ఉంటాయి . వాటిలో సగం పదార్థాలు పేర్లు జీవితంలో కనీ.. విని ఉండం
పర్ ప్లేట్ లెక్కన కేటరింగ్ వాడికి ఇచ్చివుంటారు . అవి చూడడానికే బాగుంటాయి .
తింటే జీవితంపై విరక్తి పుట్టిస్తాయి .. అంతా రోగాలొచ్చినవారికి వన్డే వంటలే ఉప్పు ఉంటె సరిగ్గా కారం ఉండదు .
అందరూ ప్లేట్లల్లో ఆగడుకొద్దీ పెట్టించుకోవడం తీసి చెత్త బుట్టలో పడేయడం, ఏదో, ఐదో, పదో పదార్థాలు రుచి చూసి ఇక జనాలు బయట పడుతారు
పెద్ద ఎత్తున ఆహారం వృధా . కడుపునిండా తిన్న వాడు ఉండడు. ఒక్క ఐటెం అయిన రుచిగా ఉంటుంది అనే భరోసా లేదు . అదో పెద్ద తంతు .
పెళ్లి సందర్భంగా నలుగురు అనాధ పిల్లలకు భోజనం పెట్టొచ్చుగా ? వారికి మేము మీ బంధువులు అని చెప్పొచ్చుగా ? అసలు ఆ ఫుడ్ ఏంటి ?... ఆ వృదాచేయడం ఏమిటి ? అర్ధం అవ్వట్లేదు,
ఒకరు చేస్తున్నారు కదా అనీ మీరూ చేయకండి !.....
క్రతువు ముఖ్యం కెమెరాల ఫోజులు కాదు, ముహూర్తం ముఖ్యం మందిమార్బలం కాదు, ఆచరణ ముఖ్యం వచ్చినవారికి కడుపునిండా 2,3 కూరగాయలతో మంచి రుచిగా పప్పన్నం భోజనం పెడితే చాలు !!