కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం Hmt nagar

  • Home
  • India
  • Hyderabad
  • కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం Hmt nagar

కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం Hmt nagar ఓం నమః శివాయ

గుడికి ఎందుకు వెళ్ళాలి?✍మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది ...
22/12/2017

గుడికి ఎందుకు వెళ్ళాలి?

✍మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.
గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.
మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.
దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.
అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.
ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.
గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.
మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.
గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.
తీర్థంలో పచ్చ కర్పూరం యాలుకలు సాంబ్రాణి సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము ,తులసి పత్రాలు, లవంగాలు,మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.
లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.
కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.
ఈ మెసేజ్ చదివిన తరువాత
ఈమెసేజ్ ను మీరు ఒక పదిమందికి పంపండి.

గుడికి ఎందుకు వెళ్ళాలి?మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గ...
22/12/2017

గుడికి ఎందుకు వెళ్ళాలి?

మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.
గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.
మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.
దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.
అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.
ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.
గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.
మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.
గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.
తీర్థంలో పచ్చ కర్పూరం యాలుకలు సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము , తులసి పత్రాలు, లవంగాలు మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.
లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.
కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.
ఈ మెసేజ్ చదివిన తరువాత
ఈమెసేజ్ ను మీరు ఒక పదిమందికి పంపండి.

రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రం తేడాలు ::యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పే...
16/09/2017

రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రం తేడాలు ::

యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానికి ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి.
ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు.
రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'.
11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది.
ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది.
ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం'! హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'.

🌿🍌🍋శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో అంతా సుఖ, సంతోషాలతో,ఆయురు ఆరోగ్యాలతో గడపాలని కొరుకుంటూ.....మీ కుటుంబ సభ్యుల జీవితాల్లో  వ...
28/03/2017

🌿🍌🍋శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో అంతా సుఖ, సంతోషాలతో,ఆయురు ఆరోగ్యాలతో గడపాలని కొరుకుంటూ.....మీ కుటుంబ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపి ఆనందం వెల్లువిరియాలని ఆకాంక్షింస్తూ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

14/03/2017

దానాలు – శుభ ఫలితాలు

ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడుతుంది.. అనే మాటలు మనం వింటూ ఉంటాము. పురాణాలు కూడా దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నాయి. ఈ కారణంగానే దైవ దర్శనం పూర్తి చేసుకున్న తరువాత చాలా మంది, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మాత్రమే అర్హులుగా భావించి తమకి తోచిన విధంగా దానధర్మాలు చేస్తుంటారు.
నవగ్రహ పూజ – దానాలు, ఫలితాలు

నవగ్రహ శాంతికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసేవారు గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారకి దోష నివారణ జరిగి జీవితాన సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరుతాయి. సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురుగ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానము చేయాలి. చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు సమస్య నశిస్తుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. శని పూజలో నువ్వులను దానం చేయాలి.

దానాల్లో పలు రకాలు:

చతుర్విద దానాలు
చతుర్విద దానాలు చేసిన వారికి పూర్వ జన్మ పాపాలు నశించి, ఈ జన్మలోనే సుఖిస్తారు.
చతుర్విద దానాలు నాలుగు. అవి..
1. మరణ భయంతో భీతిల్లే వారికి ప్రాణ అభయం ఇవ్వడం
2. వివిధ వ్యాధులతో నరక యాతన పడే రోగులకు వైద్యం చేయడం
3. పేదవారికి ఉచిత విద్యను అందించడం
4. క్షుద్భాదతో అల్లాడే వానికి అన్నదానం చేయడం

దశ దానాలు
పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ, వస్తు సహాయమును కానీ..‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చినపుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది.
మంత్రపూర్వకంగా ఓసద్బ్రాహ్మణునకు చేసినదానఫలం, పరలోక సుఖాలను అందించడమే కాకుండా, ఉత్తమ జన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది. ‘ధర్మం’ చేయడానికి పరిధులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ, ‘దానం’ చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చేయడానికి వీలులేదు. శాస్త్రనియమానుసారం దాన యోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటిని మాత్రమే దానం చేయాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు.

ఇవి మొత్తం 10 దానాలు
దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవు నెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు…ఈ పదింటిని దశ దానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. ఏయే దానం వల్ల ఏయే ఫలం సిద్ధిస్తుందో తెలుసుకుందాం.

గోదానం
గోవు అంగములందు పదునాలుగులోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులో ఉన్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతో పాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చేయాలి. గోవుకు కనీసం 6 నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.

భూదానం
కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతుంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రం, సమస్త సస్యసమృద్ధం అయిన భూమిని దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై, దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

తిలదానం
తిలలు అంటే నువ్వులు.శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయడం వల్ల సమస్త పాపములు నశిస్తాయి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

హిరణ్య (బంగారం) దానం
హిరణ్యం అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వల్ల, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై, దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

ఆజ్య(నెయ్యి) దానం
ఆజ్యము అంటే ఆవు నెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాల నుంచి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అలాంటి ఆజ్యాన్ని దానం చేయడం వల్ల సకల యఙ్ఞఫలం లభిస్తుంది. ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై, దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

వస్త్రదానం
చలి నుంచి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రం.. కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి, సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.

ధాన్యదానం
జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యం. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వల్ల, సకల దిక్పాలకులు సంతృప్తి చెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యం అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.

గుడ(బెల్లం)దానం
రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుంచి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంప్రీతులై, దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.

రజత(వెండి)దానం
అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పన్నమైనది ఈ వెండి. ఈ దానంతో శివ, కేశవులు, పితృదేవతలు సంప్రీతులై, దాతకు సర్వ సంపదలను, వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు.

లవణ(ఉప్పు)దానం
రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై, దాతకు ఆయుర్దాయమును, బలాన్ని,ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.

ఇవి దశ దానాలు. ఈ దానాలను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో చేస్తే దాని ఫలం పదింతలు అవుతుంది. ఈ దానాలనుభక్తి, శ్రద్ధలతో చేయాలిగాని, దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు.

షోడశ దానాలు – ఫలితాలు

1. కన్యా దానం – దీనివల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
2. సువర్ణ దానం – దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
3. దాసీజనం దానం – దీనివల్ల ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది.
4. వాహన దానం – దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
5. అశ్వ దానం – దీనివల్ల గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది.
6. గజ (ఏనుగు) దానం – దీనివల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది.
7. గ్రుహ దానం – దీనివల్ల విష్ణులోకం ప్రాప్తి కలుగుతుంది.
8. నాగలి దానం – దీనివల్ల క్రుష్ణ ప్రీతి కలుగుతుంది.
9. కాలపురుష దానం – దీనివల్ల కోరికల సిద్ధి కలుగుతుంది.
10. కాలచక్ర ప్రతిమ – దీనివల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది.
11. భూ దానం – దీనివల్ల శివలోకం నివాసం కలుగుతుంది.
12. మేక దానం – దీనివల్ల శివ ప్రీతి కలుగుతుంది.
13. వృషభ దానం – దీనివల్ల మృత్యుంజయం కలుగుతుంది.
14. పాన్పు దానం – దీనివల్ల గోలోక ప్రాప్తి కలుగుతుంది.
15. గో దానం – దీనివల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
16. నువ్వురాశి దానం – దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.

https://www.facebook.com/permalink.php?story_fbid=446766535505637&id=139826386199655&substory_index=0

24/10/2016

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వున్న గుడికి వెళ్లినప్పుడు ...
దక్షిణ హుండీలో వేస్తే పుణ్యమా? పూజారికి ఇస్తే పుణ్యమా?

నిస్సందేహంగా పూజారికి ఇస్తేనే పుణ్యం!
ఎందుకంటే... మన తరుఫున దేవుడ్ని పూజించే వాడు పూజారి! పైగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి వచ్చినంత జీతాలు రాని బడుగు జీవి కూడా! మన తెలుగు సినిమా వాళ్లు పనిగట్టుకుని అవమానించే బాధితుడు! లెఫ్టు అభ్యుదయవాదులు ఒంటి కాలు మీద లేస్తున్నా ఏమీ అనకుండా వుండిపోయే సాధు జీవి! ఇంతే కాకుండా.. మీ డబ్బులు తీసుకుని వీఐపీలకు పూర్ణ కుంభ స్వాగతాలు పలికే దేవాదాయ శాఖ అధికారులకి మీ దక్షిణ దక్కితే... కాని పుణ్యం కూడా రాదు! అందుకే, శాస్త్రం బ్రాహ్మణుడికి దానం చేయమందిగాని.. దేవాలయ హుండి అనలేదు...

( సైనికులు దేశం కోసం పోరాడుతున్నట్టే... పూజారులు ధర్మం కోసం నిలబడుతున్నారు. ఒకరిద్దరు పురోహితుల మీద మనకు మంచి అభిప్రాయం లేకపోతే అది వేరు విషయం.. కాని, మొత్తం మీద మాత్రం మతం నిలవాలంటే పూజారి గౌరవంగా బతకాలి... )

01/04/2016

‘’శివాలయ దర్శన విధానం”

సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది.
శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.
5 ముఖాలకి, 5 పేర్లు నిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు.

శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే, మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాతజాత శివలింగం అని అంటారు.

అప్పుడు మనం తప్పకుండా,అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి.శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం.

శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.. తిరోదానము అంటే చీకటిలో ఉంచటం. అది, మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది..

ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం.. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.సద్యోజాత ముఖం పూజించ తగినదే,ఏ మాత్రం అనుమానం లేదు.. మనల్ని రక్షించినా,శిక్షించినా, అన్ని ఆ పరమేశ్వరుడేగా.

తూర్పుని చూస్తూ ఉండె శివలింగం, వాయువు (గాలి) మీద అదిష్టానం కలిగి ఉంటాడు.. ...

మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే,ఆ శివలింగం పేరుని స్మరించాలి.

5ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే, సృష్టి, స్థితి, లయ,తిరోదానము,అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.. అన్ని ముఖాలు,పూజనీయమైనవే.. అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే.శివలింగం, దక్షిణం వైపు చూస్తూ ఉంటే, అటువంటి ముఖం, దక్షిణామూర్తి స్వరూపం. మనకు, శివాలయంలో, దక్షిణం ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి. అసలు, దక్షిణామూర్తి విగ్రహం లేకుండా, శివాలయాలు కట్టకూడదు.

శివలింగం, దక్షిణానికి చూసే ముఖాన్ని, దక్షిణామూర్తి స్వరూపంగా, చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే, అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం , అగ్నిహోత్రానికి అంతటికీ, అధిష్టానం అయ్యి ఉంటుంది ఈ సమస్త ప్రపంచాన్ని,లయం చేసే స్వరూపమే,ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి,మళ్ళీమనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల,భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే.మీరు జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మొక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

ప్రతీరోజూ, ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ద్యానం చేస్తే, మోక్షము కరతళామలకము. వారి,అంత్యమునందు, సాక్షాత్తు, ఈశ్వరుడే, గుర్తుపెట్టుకొని, మొక్షముని ప్రసాదిస్తాడు.

ద్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.

ఉత్తరం వైపు చూసే ముఖంని, "వామదేవ" ముఖం అని అంటారు.

ఇప్పటిదాక, 4 దిక్కులని చూస్తున్న, 4ముఖాల గురుంచి తెలుసుకోగలిగాం కదా!..

ఇక చివరి ముఖం, శివలింగం పైన (అంటే, ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం) ఉండే ముఖం, ఆ ముఖంని "ఈశాన ముఖం" అంటారు. మనం, లింగం పైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః. అని అనాలి.

ఈశాన ముఖ దర్శనం, మనం మిగిలిన 4 ముఖాలని దర్సించిన తర్వతనే దర్సించాలి.. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం, అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని, దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది.
ఉత్తరం వైపు చూసే "వామదేవ ముఖం" నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం.

వామదేవ ముఖం అంటే ఎమిటి అనేది మనకు శివపురాణంలో చెప్పబడింది. యదార్ధమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే, విష్ణువు శివుడు ఒకరే.. రెండు లేనే లేవు...

శివపురాణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంసయం ఉంటే, ఒకటి గమనించండి.

శివఫురాణం ని రాసినది, వేదవ్యాసుడు.. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ,వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే.. రెండు కాదు.. చాలా మంది, వేరుగా చూస్తూ,పొరపడుతున్నారు..

క్రిష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను.

ఈ వామదేవ ముఖం ని, ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు...

అంతే కాక, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే,మనకు 3 ఫలితాలని కూడ ఇస్తుంది..అవి, 1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ,మీతోనే ఉంచుతాడు. ఉదా: మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి (లేదా) ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ,మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. 2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు. 3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఉదా: ఇప్పుడు, తీపి పదార్దాలని కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్దితిలో (షుగర్ ఉందనుకోండి.) ఉంటే, అప్పుడు, ఉన్న దానిని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండ కాపడతాడు.

తదుపరి,ఈశాన ముఖము. శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.
శివలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెల్లినప్పుడు, మనలో ఉండే, అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకోని ముందుకు సాగాలి.

శివాలయలో పురుషులకి ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేసించబడింది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్యం ని, నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో, వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు. ముందుగా చెప్పినట్లు, పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త.

మీరు శివాలయంలో, ఎట్టి పరిస్థితులలోను, విభూధిని కాని, బిల్వ పత్రాలనికాని, కుంకుమ కాని,ప్రసాదం కాని ఎట్టి పరిస్థితులలోను, నందీశ్వరుడి మీద పెట్టరాదు. సాధారణంగా, చాలా మంది, నంది మీద విభూధిని, బిల్వ ఆకులని వేస్తూ ఉంటారు. అది చాలా మహా పాపంగా పరిగణించబడింది. వీలైతే, అందరూ, శివరాత్రి రోజు, శివమహిమ్నా స్తోత్రం చదవండి.. శివస్తొత్రాలు అన్నింటిలోకి, చాలా ప్రాముఖ్యమైనది "శివమహిమ్నా స్తోత్రం"

హర హర మహా దేవ శంభో శంకర !

21/03/2016

Hai

06/03/2016

మహాశివరాత్రి మహాత్మ్యం

శివరాత్రి పర్వదినానికి ఎంతటి మహాత్మ్యం ఉందో తెలియచెప్పే కథ ఇది. శక్తి ఉన్నవారు, పండితులు శాస్త్రబద్ధంగా వ్రతాలు, పూజలు శివరాత్రినాడు చేసి పుణ్యఫలం పొందుతుంటారు. మరి అలాంటివేవీ లేని సామాన్యుల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం కూడా ఈ కథాంశంలో దొరుకుతుంది. బిల్వ దళార్చన, జలాభిషేకం అంటే శివుడికి ఎంత ప్రీతో కూడా ఇక్కడ అవగతమవుతుంది. ఇంకా విచిత్రమేమిటంటే ఈ కథంతా ఓ ఆటవికుడు, ఓ మూడు లేళ్ళ నడుమ జరిగింది కావటం. శివపురాణం కోటి రుద్రసహిత నలభయ్యో అధ్యాయంలో ఈ కథ ఉంది.

పూర్వం ఓ అడవిలో ఓ వేటగాడు ఉండేవాడు. అడవిలో ఉన్న జంతువులను సంహరిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవటమే అతని పని. అతను చిన్నప్పటి నుంచి ఒక్క పుణ్యకార్యమూ చేయలేదు. దాదాపు అడవిలో ఉన్న జంతువులన్నింటినీ తన కుటుంబ పోషణ కోసమే బలిపెట్టాడు ఆ భిల్లుడు. ఇలా ఉండగా ఓ రోజున అతడి తల్లి,తండ్రి, భార్య ఇంట్లో తినటానికి ఏమీ లేదని, ఆహారంగా ఏ జంతువునైనా చంపి తెమ్మనమని కోరారు. తన కుటుంబ సభ్యుల ఆకలిని తీర్చటం కోసం విల్లు, అమ్ములు తీసుకొని అడవిలోకి బయలుదేరి వెళ్ళాడు ఆ భిల్లుడు. ఆ రోజున ఎంతసేపు వెతికినా ఒక్క జంతువూ అతని కంట పడలేదు. అలా సూర్యాస్తమయం కావటం, ఇంకా చీకటి పడటం జరిగింది. ఎలాగైనా సరే ఒక్క మృగాన్నైనా వేటాడి కానీ ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. ఓ పక్క ఆకలి, మరో పక్క ఏ జంతువూ దొరకలేదన్న కోపమూ, బాధ వెంటాడసాగాయి. ఇంతలో అతనికి ఒక మారేడు చెట్టు కనిపించింది. ఆ చెట్టు సమీపంలోనే ఒక నీటి మడుగు కూడా ఉంది.

భిల్లుడి మనస్సులో తళుక్కున ఆలోచన ఒకటి మెదిలింది. మడుగులో ఉన్న నీళ్ళు తాగటానికి ఏదో ఒక జంతువు అటు వచ్చి తీరుతుంది కనుక వెంటనే మారేడు చెట్టు పైకెక్కి ఓ కొమ్మ మీద నక్కి కూర్చొని అటొచ్చిన జంతువును వేటాడవచ్చని అనుకొన్నాడు. వెంటనే తనతో తెచ్చుకున్న తాబేటి కాయ (మంచినీరు తెచ్చుకొనే పాత్ర)లోమడుగులో ఉన్న నీరు నింపుకొని మారేడు చెట్టు కొమ్మ పైకి ఎక్కి కూర్చొన్నాడు. దైవలీలగానో, విచిత్రంగానో ఆ చెట్టు కిందే అంతకు ముందు ఎవరో ఉంచిన ఓ శివలింగం ఉంది. ఆ రాత్రి తొలిజాము గడుస్తుండగా అతని నిరీక్షణ ఫలించింది. ఒక లేడి మడుగులో నీరు తాగటానికి వచ్చింది. లేడి కన్పించిదన్న ఆనందంలో విల్లును, బాణాన్ని సిద్ధం చేస్తుండగా చెట్టుకున్న నాలుగు మారేడు దళాలు, తాబేటి కాయలో ఉన్న నీరు చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి.

ఆ రోజు శివరాత్రి అని అతనికి తెలియకపోయినా అనుకోకుండానైనా శివలింగం మీద మారేడు దళాలను ఉంచి పూజించిన ఫలితం, శివలింగానికి జలాభిషేకం చేసిన పుణ్యఫలితం వెంటనే వేటగాడికి ప్రాప్తించాయి. దాంతో తెలియకుండానే అతనిలో ఉన్న క్రూరత్వం చాలా వరకు నశించింది. తనపై బాణాన్ని సంధించబోతున్న ఆ బోయతో ఆ ఆడ లేడి ఏమి చెయ్యబోతున్నాడో చెప్పమని బోయవాడిని అడిగింది. ఆ బోయ కూడా అసత్యమాడకుండా లేడిన చంపి తనకు, తన కుటుంబానికి ఆహారంగా వినియోగించబోతున్నట్లు చెప్పాడు. అప్పుడు ఆ లేడి ఇతరులకు ఉపయోగపడబోతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని, అయితే ఇంటి దగ్గర తన పసిపిల్లలున్నారని, వారిని తన సోదరికి, తన భర్తకు అప్పగించి వస్తానని అంది.

బోయవాడు ముందు ఆ మాటలు వినలేదు కానీ ఆ తర్వాత లేడి చేసిన శపథాలను విని దాన్ని వెళ్ళి రమ్మనమని చెప్పాడు. ఇదంతా జరిగేసరికి శివరాత్రి నాడు మొదటి జాము ముగిసింది. బోయ మళ్ళీ చెట్టెక్కి అంతకు ముందు లాగానే జంతువుల కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో మరొక ఆడ లేడి వచ్చింది. దాన్ని వేటాడబోతుండగా మళ్ళీ కాసిని మారేడు ఆకులు, చంకకు తగిలించుకున్న తాబేటి కాయ నుండి కాసిని నీళ్ళు చెట్టుకింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. రెండో లేడి కూడా వేటగాడిని నన్నేం చేయబోతున్నావు అని అడిగింది. అతను మొదటి లేడికి చెప్పినట్టే చెప్పాడు. అప్పుడు ఆ లేడి కూడా ఇంటి దగ్గర తన భర్త, పిల్లలు ఉన్నారని, అంతకు ముందే తన సోదరి బయటకు వచ్చి ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆమెను వెతుకుతూ తాను వచ్చానని అంది. పిల్లలను భర్తకు, సోదరికి అప్పగించి తాను వస్తానని అప్పుడు ఆహారంగా స్వీకరించమని చెప్పింది. నమ్మకమేమిటి అని లేడిని అతను ప్రశించాడు. అది కూడా సత్య శపథాలు చేసింది.

శివలింగానికి మారేడు దళాలు, జలాభిషేకంతో అతని క్రూరత్వం అంతా నశించినందు వల్ల లేడిని వెళ్ళి రమ్మన్నాడు. అప్పటికి రెండో జాము ముగిసింది. మూడో జాములో ఒక మగ లేడి అటుగా వచ్చింది. దాన్ని వేటాడాలని అనుకున్నంతలో అతని కదలికలకు కాసిని మారేడు దళాలు, కాసిని నీరు మళ్లీ శివలింగం మీద పడ్డాయి. మగ లేడి కూడా అతనితో పరులకు ఉపయోగపడటం కన్నా ఈ శరీరానికి కావలసినది ఏమిటి? అయితే ఇంటి దగ్గర ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారని, భార్యలకు పిల్లల బాధ్యతలను అప్పగించి తాను తిరిగొస్తానని చెప్పింది. ఆ వేటగాడు సత్యభాషణం మీద నమ్మకంతో వెళ్ళి రమ్మన్నాడు. మూడు లేళ్ళు ఒక చోట చేరి బోయవాడి సంగతి ముచ్చటించుకుంటున్నాయి. అవి నేనంటే నేనే ముందు వెళతానని బోయవాడికిచ్చిన మాటను తప్పడం బాగుండదని వాటిలో అవి వాదించుకున్నాయి. చివరకు మూడు లేళ్ళూ తమ పిల్లలను పొరుగు లేళ్ళకు అప్పగించి వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వేటగాడికిచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి బయులుదేరాయి. తమ తండ్రి, తల్లులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి ప్రాణాలను సైతం లెక్కచేయక పోవటాన్ని చూసిన పిల్లలు అంతటి ఉత్తములైన ఆ పెద్దల బాటలోనే నడవాలని నిశ్చయించుకొని అవి కూడా బయులుదేరాయి. అలా ఆ లేళ్ళన్నీ మాట నిలుపుకోవటానికి పిల్లలతో సహా తరలి రావటాన్ని చూసిన వేటగాడికి మనస్సు చలించిపోయింది.

జంతు జన్మనెత్తిన వాటికి సత్యవాక్యాన్ని పాలించే అంత గొప్ప మనస్సుంటే మనిషిగా పుట్టిఇన్నాళ్ళూ తాను హింస చేస్తూ బతుకుతున్నందుకు వాడికి పశ్చాత్తాపం కలిగింది. వాటిని ఆదరించి తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పాడు. బోయవాడిలో కలిగిన ఆ మంచి మార్పు, ఆ రాత్రి ప్రతి జాములోనూ చేసిన మారేడు దళాల పూజ, జలాభిషేకం, జాగారం, ఉపవాసం ఇవన్నీ శివుడికి ప్రీతి కలిగించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మరుసటి జన్మలో ఆ భిల్లుడు గుహుడు అనే పేరున జన్మించి దశరథ మహారాజు కుమారుడైన శ్రీ రామచంద్రుడికి సేవ చేసే భాగ్యాన్ని పొందుతాడని శివుడు వరమిచ్చాడు. అలాగే బోయవాడికి కన్పించిన లేళ్ళు కూడా సత్యాన్ని పాలించినందుకు మోక్షాన్ని పొందుతాయని శివుడు చెప్పాడు. ఆనాడిక్కడ ప్రత్యక్షమైన శివుడే వ్యాధేశ్వరుడు అనే శివలింగంగా అవతరించాడు. సంస్కృతంలో వ్యాధ శబ్దానికి తెలుగులో బోయవాడు అని అర్థం.

ఈ కథలో శివరాత్రి మహాత్య్మం మారేడు దళాల పూజ, జలాభిషేకం వ్యాదేశ్వర అవతారం ఇవన్నీ అటుంచిన ఓ గొప్ప సందేశం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో ఉన్న గొప్పతనం, తల్లిదండ్రులు ఎంత నీతి, నిజాయితీలతో ఉంటే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారని చెప్పే సందేహాలు ఇమిడి ఉన్నాయి. వీటిని గమనించి ఆచరిస్తే గొప్ప పుణ్యఫలందక్కినట్టే అవుతుంది. అసలు మన పండుగలు, పర్వదినాలు, వ్రతాలు కథలలోని గొప్ప అంతరార్థం ఇదే.

Address

HMT
Hyderabad
500076

Opening Hours

Monday 6am - 11am
5:30pm - 9pm
Tuesday 6am - 11am
5:30pm - 9pm
Wednesday 6am - 11am
5:30pm - 9pm
Thursday 6am - 11am
5:30pm - 9pm
Friday 6am - 11am
5:30pm - 9pm
Saturday 6am - 11:30am
5:30pm - 9pm
Sunday 6am - 11am
5:30pm - 9pm

Website

Alerts

Be the first to know and let us send you an email when కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం Hmt nagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share