మోహన్ వి నాయక్

మోహన్ వి నాయక్ శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు క?

శివ!చచ్చిన పామును పదే పదే కొట్టినట్లు, ఇంకెన్నాళ్లీ పరీక్షలు?...ఈ మిథ్యా ప్రపంచంపై నాకింకా వ్యామోహం ఉందో లేదో అని చూస్తు...
24/08/2026

శివ!
చచ్చిన పామును పదే పదే కొట్టినట్లు, ఇంకెన్నాళ్లీ పరీక్షలు?...
ఈ మిథ్యా ప్రపంచంపై నాకింకా వ్యామోహం ఉందో లేదో అని చూస్తున్నావా?...
ఏనాడో నీ పాదపద్మాల వద్ద ప్రాణాలు వదిలిన పశువును నేను...
నీ మాయా నాటక రంగంలో నన్ను గంగిరెద్దులా తిప్పుతూ ఎన్ని వేషాలు వేయించినా పడేందుకు సిద్ధమే...
పశుపతివై నన్ను అక్కున చేర్చుకున్నా సరే...
లేక 'నీ ప్రాప్తం ఇంతే' అని దూరంగా నెట్టినా సరే...
నీ ఆజ్ఞే నాకు శిరోధార్యం!
నీవు ప్రసాదించిన ఈ ఆయువు ముగిసే వరకు నీ ఆటలో నన్ను ఒక బొమ్మలా ఆడించినా చాలు శివా.

శివ నీ దయ.

వద్దనుకున్న కొద్దీ నిప్పులా దహిస్తోంది కోరిక...నిన్ను చేరుకోవాలనే నా తపన కంటే...ఈ భౌతిక బంధాల మోహమే బలమైపోతోంది...లయకారా...
23/08/2026

వద్దనుకున్న కొద్దీ నిప్పులా దహిస్తోంది కోరిక...
నిన్ను చేరుకోవాలనే నా తపన కంటే...
ఈ భౌతిక బంధాల మోహమే బలమైపోతోంది...
లయకారా! నా కర్మల బంధాలను లయం చేయి,
నీ పాద పద్మాల నీడలో నన్ను కాపాడు.

శివ నీ దయ.

శివ,శివుడి ఆజ్ఞ లేనిదే చిమైన కుట్టదు అంటారే...మరి మనసంతా నిత్యం కోరికల ప్రవాహమే...నీ దివ్య మంగళ రూపాన్ని ధ్యానిద్దామంటే,...
22/08/2026

శివ,
శివుడి ఆజ్ఞ లేనిదే చిమైన కుట్టదు అంటారే...
మరి మనసంతా నిత్యం కోరికల ప్రవాహమే...
నీ దివ్య మంగళ రూపాన్ని ధ్యానిద్దామంటే, ఈ తృష్ణ నన్ను నీ దరికి చేరనివ్వడం లేదు.
కామదహనా! కాముడిని బూడిద చేసిన నీ ముక్కంటి చూపుతో...
నాలోని ఈ తృష్ణను కూడా కాల్చి బూడిద చేయవా చెన్నమల్లికార్జునా.

శివ నీ దయ.

ఏ అక్షరం రాని వయసులో.. ఒక అస్పష్టమైన బాట...నీ పాదాల చెంతకు చేరి నిశ్చలమైన సంపూర్ణత...నా ప్రజ్ఞ కాదు, నా శ్రమ అసలే కాదు.....
20/08/2026

ఏ అక్షరం రాని వయసులో.. ఒక అస్పష్టమైన బాట...
నీ పాదాల చెంతకు చేరి నిశ్చలమైన సంపూర్ణత...
నా ప్రజ్ఞ కాదు, నా శ్రమ అసలే కాదు...
నన్ను నడిపించినది నీ లీలా తరంగమే...
నీ మాయ ముందర నన్ను నేను కోల్పోయి నిన్నే పొందాను శ్రీగిరినాథా.

శివ నీ దయ.

శివ!ఈ జగత్తు ఒక చెఱసాల...ఇక్కడ అనుభవించేది నీ శిక్ష...నీ వైపు నుంచి ఒక్క పిలుపు వస్తే చాలు...సమస్తాన్ని వదిలేసి నీ సన్ని...
19/08/2026

శివ!
ఈ జగత్తు ఒక చెఱసాల...
ఇక్కడ అనుభవించేది నీ శిక్ష...
నీ వైపు నుంచి ఒక్క పిలుపు వస్తే చాలు...
సమస్తాన్ని వదిలేసి నీ సన్నిధికి చేరుకోవడానికి...
నీ గిరిశిఖరాల నడుమ నాకంటూ నిలబడటానికి ఒక్క అంగుళం చోటివ్వు స్వామీ...
నీ నీడలో పడి ఉండటమే ఈ బంటు పొందే అతిపెద్ద జన్మధన్యత.

శివ నీ దయ.

శివ!కాలం కనికరం లేకుండా పరిగెడుతోంది...కానీ నా అడుగులు మాత్రం నీ వైపే సాగుతున్నాయి...ఒక్కసారి ఓకె ఒక్కసారి నిన్ను తనివిత...
19/08/2026

శివ!
కాలం కనికరం లేకుండా పరిగెడుతోంది...
కానీ నా అడుగులు మాత్రం నీ వైపే సాగుతున్నాయి...
ఒక్కసారి ఓకె ఒక్కసారి నిన్ను తనివితీరా చూసుకుంటే చాలు...
ఆ ఆశే నన్ను బతికిస్తోంది .

శివ నీ దయ

సుదూర శిఖరాల నీడల్లో...సుడిగుండాల లాంటి ఈ బతుకు పయనం...ఆశల కొండలకు, ఆగిపోయే శ్వాసలకు మధ్య...ఊగిసలాడే ఓ నరుడి ఆరాటం...కాళ...
18/08/2026

సుదూర శిఖరాల నీడల్లో...
సుడిగుండాల లాంటి ఈ బతుకు పయనం...
ఆశల కొండలకు, ఆగిపోయే శ్వాసలకు మధ్య...
ఊగిసలాడే ఓ నరుడి ఆరాటం...
కాళరాత్రి లాంటి కష్టాల నడుమ నా వంతు దాకా నిరీక్షించే ఓపికను ఇవ్వకపోతే...
నీ ప్రశాంతత నాకు లభించేదెలా? తండ్రి.

శివ నీ దయ.

రెండు అడుగుల ఆశల సాగు...ఒక అడుగు పడుతున్న వెనకడుగు...కాలంతో సాగే సవాళ్ల హోరు...ఇది నా సహనానికి జరుగుతున్న అగ్ని పరీక్ష.....
18/08/2026

రెండు అడుగుల ఆశల సాగు...
ఒక అడుగు పడుతున్న వెనకడుగు...
కాలంతో సాగే సవాళ్ల హోరు...
ఇది నా సహనానికి జరుగుతున్న అగ్ని పరీక్ష...
అలసిపోయిన నా హృదయం...
తొలగిపోని నా సంశయం...
కదిలే నా ప్రతీ అడుగులో కలగనివ్వకు నిరాశ నిమిషం...
ఓ ముక్కంటి శివా నా ప్రయాణంలో నువ్వే దారి...
నీ దయ ఉంటే ఈ సుడిగుండాలన్నీ దాటే తీరం.
శివ నీ దయ.

ఆయువు ముగుస్తున్న వేళ...నేలరాలడం ఒక్కటే నా నొసటి రాత...కానీ, మట్టిలో కలిసిపోయే ముందు నీ దివ్య పాదాలను తాకడమే నా ఏకైక తపన...
17/08/2026

ఆయువు ముగుస్తున్న వేళ...
నేలరాలడం ఒక్కటే నా నొసటి రాత...
కానీ, మట్టిలో కలిసిపోయే ముందు నీ దివ్య పాదాలను తాకడమే నా ఏకైక తపన.
ఒక్కసారి దయచూడు తండ్రీ...
నీ దయే నా జన్మకు శరణ్యం.

శివ నీ దయ.

సంసారపు ఆరాటాలన్నీ ఆవిరైపోగా...లోకపు బంధాలన్నీ బూడిదలా రాలిపోగా...ఈ కడపటి ప్రయాణంలో, ఏకాకినై మిగిలాను.శ్రీగిరి మల్లికార్...
16/08/2026

సంసారపు ఆరాటాలన్నీ ఆవిరైపోగా...
లోకపు బంధాలన్నీ బూడిదలా రాలిపోగా...
ఈ కడపటి ప్రయాణంలో, ఏకాకినై మిగిలాను.
శ్రీగిరి మల్లికార్జునా! అజ్ఞానపు పొరలు వీడి, నీ దరికి చేరాను.
విభూతి పూసిన నీ ఈ హస్తమే నా ఆఖరి నిశ్చింత.
డమరుకపు ప్రళయ నాదమే నా జనన మరణాల విముక్తి గీతం.

శివ నీ దయ.

Address

Secunderabad
Hyderabad
500003

Alerts

Be the first to know and let us send you an email when మోహన్ వి నాయక్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share