Sri Dwarakamai Sai Baba Peetham

Sri Dwarakamai Sai Baba Peetham I (SWAMIJI 34th lineage of SRIPADA SRIVALLABHA who is the first incarnation of Lord Dattatreya, Peetadhipathi - SRI DWARAKAMAI SAI BABA PEETHAM))

22/02/2023
Om Nama Sivaya, Om Sri Sai Nathaya Namaha.Dear Divine Human Souls, "please read this article without fail" and forward t...
22/02/2023

Om Nama Sivaya, Om Sri Sai Nathaya Namaha.

Dear Divine Human Souls, "please read this article without fail" and forward to your near and dear if you like.

"DOG" is treated as Kala Bhairava (Kasi Kshetra Nivasamcha Kala Bhairava darshanam) - as well as Veda Purushas under the feet of Lord Sri Dattatreya.

In the event of the death of a 4 year old boy due to stray dogs attack, I do express my deep condolences to his family. I do agree that it's horrific. But I do also blame their parents negligent behaviour by not accompanying their child whilst on the road.

I would like to bring the same kind of situation which happened in front of my house. But here the victim is not a human. Its a PUPPY - 20 days old, run over by a very speeding car in the colony roads. It was just thrown by the side of the road, no one least bothered to see what's happening to that poor soul. Many say that I'm comparing the life of a human with that of a useless stray dog. Yes, I do.

As per GITA, Lord Krishna says - In verse 18.61, “I am situated in the hearts of all living beings.”

With regard to Article 21, the Supreme Court notably held: Every species has a right to life and security, subject to the law of the land, which includes depriving its life, out of human necessity.

We see hundreds of stray dogs dying on the roads daily due to automobile accidents. They repeatedly get pressed and pressed by the vehicles even after they die. No one even cares to atleast keep their bodies away from the ongoing traffic. Their body parts gets scattered all over. Is this humanity ? To whom they can complain ? How did we feel when we were under oppressive British rule ? When we were tortured, plundered, r***d and beaten to death. We were asking for rights, justice, freedom. This feeling is not just the condition of only human beings. But, every living being on the planet.

We have mouth to express our feelings and thoughts. Even dogs bark to express such feelings but in their own way and we people call it as a nuisance. We are here to live collectively. If anyone wants to have a secluded life from other living beings, please go and live on the Moon.

We humans have plundered, exploited and degraded the quality of our planet. Name a single other living being which did that.

No matter what, I'm going to stay with the nature and live in harmony with all the living beings and do my best till my last breath. Adopt a stray dog and give a Life. It's Government's responsibility to act wisely and give a solution to this. I say from my side " har ghar ko ek kutha."

Jai Hind.

Sabka Malik Ek - Ek Malik Ka Roop Anek.

Yours in Sai Baba.
His Holiness Parama Poojya A S S K Y G K Swamiji (34th lineage of Sri Sripada Srivallabha who is the 1st incarnation of Lord Sri Dattatreya).
Peetadhipathi - Sri Dwarakamai Sai Baba Peetham.

25/08/2021

ఓం నమఃశ్శివాయ, ఓం శ్రీ.సాయినాథాయ నమః, గురుబోధ:-

పూజ్యశ్రీ గోపాలకృష్ణానంద స్వామీజి బోధామృతము.

శ్లోకము:-
జయతు జయతు దేవో దేవకీ నందనోయం,
జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపఃl
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో,
జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందఃll

భావము:-
ఓ దేవకీ నందన శ్రీకృష్ణా మీకు జయమగు దేవా,
ఓ వృష్ణి వంశ మంగళ దీపా శ్రీకృష్ణా! మీకు జయమగు గాకl
కోమలమైన అంగములు గల ఓ నీలమేఘశ్యామా శ్రీకృష్ణా మీకు జయమగు గాక,
భూభార నిర్మూలనకు అవతరించిన ఓ ముకుందా శ్రీకృష్ణా మీకు జయమగు గాకll అని ఈ పద్యము యొక్క భావము.

ఈ శ్లోకమునకు మా (పూజ్యశ్రీ గోపాలకృష్ణానంద స్వామీజీ) వ్యాఖ్యానము మరియూ నీతి:-
దుష్టులను అంటే చెడ్డవారిని శిక్షించుట - శిష్టులను అంటే మంచివారిని రక్షించుట దేవుని కర్తవ్యము.
భౌతికముగా దుష్టులు అంటే చెడ్డవారు చట్టం నుంచీ తప్పించుకోవచ్చుగాక!
కానీ ఆధ్యాత్మికంగా పరమాత్మ చట్టం నుంచి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు.
ఎవరు చేసిన పాపాలు వారి వారిని కట్టికుడపక మానవు. కావున తస్మాత్ జాగ్రత జాగ్రత.
ఎందుకంటే ఇక్కడ చేసిన పాపాలకు శిక్షలు ఇక్కడే అనుభవించాలి. నవ్వుతూ చేసే పాపాలకు శిక్షలను ఏడుస్తూ అనుభవించాలి.

యావత్ మానవాళి మూగజీవుల ఎడల దయకలిగి, దైవము ఎడల భక్తప్రపత్తులతో, జ్ఞానుల ఎడల గౌరవముతో, తలిదండ్రుల ఎడల ప్రేమతో, సాటిమానవుల ఎడల సమభావముతో, సంస్కారముతో వ్యవహరించాలని, దుష్టులు - శిష్టులుగా మారాలని ఆ శ్రీకృష్ణ భగవానునికి యావత్ మానవాళి తరఫున మా ప్రార్థన.

తేదీ 30 /08/ 2021, సోమవారం, శ్రీకృష్ణాష్టమి అనగా జగద్గురువైన శ్రీకృష్ణభగవానుని జన్మదినము. ఆరోజు ప్రతివారూ కులమతాలకు అతీతంగా "శ్రీకృష్ణభగవానుని కొలిచి", గీతాచార్యులవారు అనగా శ్రీకృష్ణులవారు ఈ భూప్రపంచానికి అందించిన "శ్రీమద్భగవద్గీతను" తప్పక చదవగలరు లేని ఎడల తప్పక వినగలరని యావత్ మానవాళికీ ఈ గురుబోధ ద్వారా మా సందేశము.

సబ్ కా మాలిక్ ఏక్ - ఏక్ మాలిక్ కా రూప్ అనేక్.

"IN THE SPIRITUAL SERVICE OF ALMIGHTY GOD, SRI SADA SHIVA & ALMIGHTY SADH GURU, SRI SHIRDI SAI BABA."

Yours in Sai Baba - Divine words by మీ, పూజ్యశ్రీ గోపాలకృష్ణానంద స్వామీజి - (ప్రధమ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వంశములో 34వ తరము వారు) పీఠాధిపతి - శ్రీ ద్వారకామాయి సాయిబాబా పీఠం.

14/08/2021

Om Nama Shivaya - Om Sri Sai Nathaya Namaha, Guru Bodha:-

H H Poojya Sri Gopala Krishnananda Swamiji's Bodhaamrutham.

Dear Divine Souls,

HAPPY 75th INDEPENDENCE DAY to one and all.

Meaning of ASSOCIATION.

A rain drop from the sky if it is caught by clean hands is pure enough for drinking.

If it falls in the gutter its value drops so much that it can’t be used even for washing your feet.

If it falls on a hot surface it will evaporate.

If it falls on a lotus leaf it shines like a pearl and finally - if it falls on an oyster it becomes a pearl.

The drop is the same but its existence and worth depends on whom it is associated with.

Always be associated with GNANIS and the People who are good at heart. Accordingly you will experience your own inner transformation.

JAI BHARAT MATA - MERE BHARAT MAHAAN.

Yetho Dharma Stathto Jayaha.
Dharmo Rakshati Raksh*tha.
Yath Bhavam Tadh Bhavathi.

Sabka Malik Ek - Ek Malik Ka Roop Anek.

"IN THE SPIRITUAL SERVICE OF ALMIGHTY GOD, SRI SADA SHIVA & ALMIGHTY SADH GURU, SADA SHIVA."

Yours in Sai Baba - Divine words by H H Poojya Sri Gopala Krishnananda Swamiji (34th lineage of SRIPADA SRIVALLABHA who is the 1st incarnation of LORD DATTATREYA).
Peetadhipathi - Sri Dwarakamai Sai Baba Peetham.

08/07/2021

ఓం నమఃశ్శివాయ - ఓం శ్రీ సాయినాథాయ నమః, గురుబోధ:-

"పూజ్యశ్రీ గోపాలకృష్ణానంద స్వామీజీ బోధామృతము".

ఎల్లరూ తప్పక చదవవలసిన జరిగిన కధ.

ఒక పాప దగ్గిర పెట్టెలో కొన్ని ముత్యాలు ఉన్నాయి. ఆ పాప వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వుండేది. ఒక రోజు ఆ పాప పడుకుని వుండగా తండ్రి ఆమె పక్కనే కూర్చుని, "నీ ముత్యాలు నాకివ్వవా అమ్మా" అని అడిగాడు.
"అవంటే నాకిష్టం డాడీ, నేను పెద్దవుతున్నాగా కావాలంటే నా బేబీ డాల్ తీసుకో" అంది.
"థాంక్యూ వద్దులే అమ్మా ఐ లవ్యూ" అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు తండ్రి.

అయిదు సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు పక్కమీద పాప పడుకుని వుండగా, తండ్రి వచ్చి పక్కన కూర్చొని "నీ ముత్యాలు ఇవ్వవా తల్లీ" అని అడిగాడు.
"సారీ డాడీ, కావాలంటే నా సైకిల్ తీసుకో పెద్దయ్యాగా" అంది.
"వద్దులే అమ్మా థాంక్యూ డాడీ లవ్స్ యు" అని వెళ్లిపోయాడు. అలా కొంత కాలం గడిచింది.

ఒకరోజు ఆ అమ్మాయి తల్లితో కలిసి శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయానికి వెళ్లింది. అక్కడ శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం జరుగుతోంది. పాప శ్రద్ధగా వింది.

ఆ రోజు రాత్రి తండ్రి వచ్చి మళ్ళీ అదే అడిగాడు. ఆ అమ్మాయి ముత్యాల పెట్టె ఇచ్చేస్తూ, "తీసేసుకో డాడీ నాకివీ అవసరంలేదు" అంది.

అప్పుడా తండ్రి జేబులోనుంచి అలాంటి పెట్టేనే మరొక దాన్ని తీశాడు. దాన్ని ఆమెకిస్తూ "వీటిని నీకిద్దామని ఎప్పటినుంచో నా దగ్గిరే వుంచుకున్నాను. ఇవి నిజమైన ముత్యాలు. ఇప్పటివరకూ నువ్వు భద్రంగా దాచుకున్నవి నకిలీవి తల్లీ" అంటూ కూతురికి అందించాడు అసలైన ముత్యాలని. ముందువాటి కన్నా ఇవి ఎంతో స్వచ్ఛంగా మెరుస్తునాయి. ఆ పాప కళ్ళలాగే.

శ్రీ స్వామీజి వ్యాఖ్యానము మరియూ ఈ కథ నీతి: భగవంతుడు కూడా ఇలాగే అసలు ముత్యాలయిన ఆనందం, ప్రేమ ప్రకృతి పట్ల ఇష్టం, భూతదయ, సంగీతం పట్ల ఆరాధన, సర్వ జీవుల ఎడల కరుణ, ఆప్యాయత మొదలైన గుణాల్ని 'ఇవ్వటానికి' సిద్ధంగా వుంటాడు.

కానీ, తాత్కాలిక ఆనందాన్నిచ్చే ఈర్ష్యా, అసూయ, ద్వేషం, మూగజీవుల ఎడల కౄరత్వం, కోపం, స్వార్ధం, చెప్పుడు మాటలు నమ్మటం, ఉత్తమగరుదూషణ, దైవదూషణ చేయడం, మానవులలో సామరస్యాన్ని భంగపరిచే విధంగా మాట్లాడటం మరియూ శాడిజం, లాంటి నకిలీ ముత్యాల్ని పట్టుకుని అవే 'నిజమైనవి' అనుకుని, పైశాచిక ఆనందం పొందుతూ వుంటారు కొందరు అల్పమానవులు!

మానవులు దుర్భుద్ధులను, దుర్గుణాలను వదిలేస్తేనే తప్ప, వారికి దైవమిచ్చే నిజమైన ముత్యాలు దొరకవని తెలుసుకున్న మనిషే ధన్యుడు. అనేది ఈ మా (పూజ్యశ్రీ గోపాలకృష్ణానంద స్వామీజి) బోధామృతము యొక్క సారాంశము.

సబ్ కా మాలిక్ ఏక్ - ఏక్ మాలిక్ కా రూప్ అనేక్.

"IN THE SPIRITUAL SERVICE OF ALMIGHTY GOD, SRI SADA SHIVA & ALMIGHTY SADH GURU, SRI SHIRDI SAI BABA".

Yours in Sai Baba - Divine words by మీ, పూజ్యశ్రీ గోపాలకృష్ణానంద స్వామీజీ.

03/07/2021

ఓం నమఃశ్శివాయ - ఓం శ్రీ సాయినాథాయ నమః, గురుబోధ:-

ప్రియదివ్యాత్మ స్వరూపులారా!

నీ తప్పు లేకున్నా, నిన్ను ఎవరు బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా, కాలం అట్టి దురాత్ములను తప్పక శిక్షిస్తుంది, అనేది నగ్నసత్యం. నవ్వుతూ చేసే పాపాలు, ఏడుస్తూ అనుభవించే రోజు తప్పకవస్తుంది. స్వర్గనరకాలు ఎక్కడో లేవు. మీరు అనుభవించే సుఖాలు స్వర్గమైతే, మీరు అనుభవించే కష్టాలే నరకము. అన్నద్వేషం, గురుద్వేషం, దైవద్వేషం, మాతృపితృద్వేషం, సజ్జనద్వేషం మరియూ నోరులేని మూగజీవులపై ద్వేషం కలవారు, రెండు యుగాలపర్యంతమూ మానసికశారీరక వికలాంగులైయ్యెదరు. అనే మా మాట వేదవాక్కు. కావున భూతదయకలిగి మెలుగగలరని యావత్ మానవాళికి ఈ గురుబోధ ద్వారా మా సందేశము.

పూజ్యశ్రీ గోపాలకృష్ణానంద స్వామీజి.

02/07/2021

ఓం నమఃశ్శివాయ - ఓం శ్రీ సాయినాథాయ నమః

కుక్కలను ప్రేమించే సహృదయులైన మానవాళికి,

ప్రధమ దత్తావతారమైన శ్రీపాదశ్రీవల్లభుల వంశములో 34వ తరానికి చెందిన,

శ్రీ ద్వారకామాయి సాయిబాబా పీఠానికి - పీఠాధిపతులమైన,
మా (పూజ్యశ్రీ గోపాలకృష్ణానంద స్వామీజి ) - వినమ్ర విన్నపము.

మీర్ పేట, స్ట్రీట్ నంబరు 5, ప్రశాంతి హిల్సులో నోరులేని, వీధిలో సంచరించే మా కాలభైరవుల (కుక్కల) ఆత్మరోదనను, నెత్తురుకారే నోటితో, మా హృదయవేదనను - పూజ్యశ్రీ గోపాలకృష్ణానంద స్వామీజి ద్వారా మేము - మీకు అనగా మా కుక్కలను ప్రేమించే సహృదయులకు తెలియజేయుచున్నాము.

మనిషికి అన్యాయం జరిగితే - కాపాడటానికి పోలీసువారు ఉన్నారు.

కానీ వీధి కుక్కలను ఉచ్ఛ నీచాలు లేకుండా నెత్తురు వరదలు అయ్యేటట్లు కొడుతుంటే వాటిని కాపాడటానికి ఎవరు ఉన్నారు?

అని, ఈ మానవసమాజానికి నోరులేని మూగజీవులైన మా కాలభౌరవుల (కుక్కల) తరఫున స్వామీజి ప్రశ్న.

మరీ ఇంత పైశాచికమా? జాలి, దయ అనేవి అంతరించిపోయాయి ఈ మానవులలో. ఏ మని చెప్పాలి - ఏమనాలి - ఆటువంటి పిశాచులైన మానవులను.

మమ్ములను అనగా కుక్కలను ప్రేమించే ప్రతివారికీ - మేము అనగా వీధి కుక్కలు,
పూజ్యశ్రీ స్వామీజి ద్వారా మా (కుక్కల) విన్నపాన్ని, మా హృదయవేదనను, మమ్ము ప్రేమించే మానవులకు,
ఈ ఫేస్ బుక్ మాధ్యమము ద్వారా తెలియజేయుచున్నాము.
మమ్ముల్ని వీధి కుక్కలను కాపాడండి.

బాలింతనైన (అప్పుడే పిల్లలను కన్న) నాపై (కుక్కపై) ఓ పెద్దరాయితో కొట్టాడు ఈ కాలనీలోని ఒక 63 ఏళ్ళున్న వ్యక్తి, బి ఎస్ ఎన్ ఎల్ నుంచి జేటీవోగా రిటైర్ అయ్యినాడు. అతనిని సాయి అని పిలుస్తారు జనాలు - ఇతగాడు మా వీధి కుక్కలను రెత్తురోడేటట్లు కొడుతున్నాడు.

ఇంతటి నీచ మానవులు ఉన్న సమాజంలో మేము ఉండడం మా నేరమా? మాకు దయచేసి రక్షణ కల్పించండి - మమ్ము ప్రేమించే దయగల మానవులారా!
🙌🙌🙌🙌🌹🙌🙌🙌🙌

ఓం శ్రీ సాయినాథాయ నమః, గురుబోధ:-"శ్రీ సాయి కృపాకర యోగి గోపాలకృష్ణానంద స్వామీజీ బోధామృతము".   మన వంట నూనెలు"మహర్షి వాగ్భట...
19/02/2018

ఓం శ్రీ సాయినాథాయ నమః, గురుబోధ:-

"శ్రీ సాయి కృపాకర యోగి గోపాలకృష్ణానంద స్వామీజీ బోధామృతము".

మన వంట నూనెలు

"మహర్షి వాగ్భటాచార్యులు అంటారు" జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన వంట నూనెలను వాడవలెను. శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండ్ నూనే (Non Refined Oil). నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది, బాగా జిగురు, జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది. నూనెలో ఉండ వలసిన ముఖ్య అంశం జిగురు పదార్ధము, ప్రోటీన్స్. ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు. నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటేంటే ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్. నూనెని రిఫైండ్ (Refined) చేసినపుడు జిగురు, వాసన పోతాయి. ఇక అందులో ఉండేది నూనె కాదు నీళ్ళే.

ఏ నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కోలెస్ట్రాల్ వుండదు. మనము తీసుకొనే ఆహారము మరియు నూనెల నుండి మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ తయారవుతుంది. మనము శుద్ధమైన నూనె (Non Refined Oil) తీసుకున్నప్పుడు మన శరీరంలో *లివర్* సహాయంతో మంచి కొలెస్ట్రాల్ (H.D.L) ఎక్కవ మోతాదులో తయారవుతుంది. శుద్ధమైన నూనె వాడి జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి.

భారత దేశంలో 50 సంవత్సరాల పూర్వం వరకు ఈ రిఫైండ్ ఆయిల్ లేదు. రిఫైండ్ నూనె చేసేటప్పుడు 6 రకాల హానికరమైన కెమికల్స్, డబుల్ రిఫైండ్ చేసేటప్పుడు 13 రకాల హానికరమైన కెమికల్స్ వాడుతారు. ఈ కెమికల్స్ ముందు ముందు మన శరీరంలో వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి. ఈ రిఫైండ్ అయిలులో మన శరీరానికి కావలసిన జిగురు, వాసన, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ వుండవు. చాలా హానికరమైన ఎటువంటి రిఫైండ్ ఆయిల్స్ వాడకూడదు.

వాతాన్ని నివారించటానికి శుద్ధమైన నూనె, పిత్తాన్ని నివారించటానికి దేశవాళి ఆవు నెయ్యి, కఫంను సక్రమంగా ఉంచాలంటే అన్నింటికన్నా ఉత్తమమైనది బెల్లం, తేనె. కుస్తీపట్లు, దండీలు, బస్కీలు తీసేవారికి మాత్రమే గేదె నెయ్యి మంచిది.

రోగాలకు రాజు వాతరోగాలు. మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, మెడనొప్పులు, హార్ట్ ఎటాక్, పక్షవాతము, బ్రైన్ ట్యూమర్ వంటివి వాతము పూర్తిగా తగ్గిపోవటం వల్ల కానీ లేదా చెడిపోవటం వల్ల కానీ కలుగుతాయి.

జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్దమైన నునెలు (Non -Refined) వేరు శెనగ నూనె, కొబ్బెర నూనె, కుసుమల నూనె, నువ్వుల నూనె మరియు ఆవాల నూనెలు మాత్రమే వాడవలెను.

ప్రొద్దుతిరుగుడు పూల విత్తనాలను (Sun flower seeds) గేదలకు మరియు పశువులకు మాత్రమే పెట్టదగినవి. మనకు ఏ మాత్రము ఈ Sun flower oil వాడదగినది కాదు, ఆరోగ్యకరము కాదు.

ఈ రిఫైండ్ ఆయిల్స్ (Refined oils) ఎంత మాత్రమూ వాడతగినవి కాదు.

సోయాబీన్స్, సోయాబీన్స్ ఆయిల్ మరియు సోయాబీన్ పాలు ఏ మాత్రము వాడరాదు. పందులు తినతగినవి ఈ సోయాబీన్స్, ఎందుకనగా పందులు మాత్రమే వీటిని తిని అరగించు కోగలవు. మనుష్యులలో ఈ సోయాబీన్స్ ని అరిగించే ఎంజైమ్స్ లేనే లేవు. కావున వీటిని వాడరాదు. వీటిని వాడిన యెడల మందులు లేని భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి.

పామోలిన్ అయిల్ కూడా చాలా హానికరమైన అయిల్. వీటిని వాడుతున్నవారికి మొదట మలబద్దకుము వస్తుంది. ఈ మలబద్దకమే అన్ని రోగాలకు మూలము. ప్రస్తుతము చాలా రోగాలకు మూలము ఈ పామోలిన్ అయిల్. ఈ పామోలిన్ పంట పండించే దేశాలలో ఈ నూనెను నిషేదించినారు. వారు ఏ విధముగా కూడా ఈ పామోలిన్ వాడటం లేదు. ప్రపంచములో ఒక్క భారత దేశములో మాత్రమే ఉపయోగిస్తున్నారు. కావున మనము మన సంపూర్ణ ఆరోగ్యము కొరకు త్యజించ వలెయును.

శుద్దమైన నూనెలను వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించ గలరు.

గమనిక :- సన్ ఫ్లవర్ ఆయిల్ (Sun Flower Oil), సోయాబిన్ ఆయిల్ (Soya Bean Oil) , పామోలిన్ ఆయిల్ (Pamolene Oil) ఈ నూనెలు వాడరాదు - అని ఈనాటి నా (శ్రీ సాయి కృపాకర యోగి గోపాలకృష్ణానంద స్వామీజీ) బోధామృతము.

"సబ్ కా మాలిక్ ఏక్ - ఏక్ మాలిక్ కా రూప్ అనేక్".

"IN THE SPIRITUAL SERVICE OF SRI SHIRDI SAI BABA".

Yours in Sai Baba - Divine words by మీ, శ్రీ సాయి కృపాకర యోగి గోపాలకృష్ణానంద స్వామీజీ.
పీఠాధిపతి - శ్రీ ద్వారకామాయి సాయిబాబా పీఠం.
HYDERABAD.

Om Sri Sai Nathaya Namaha, Guru Bodha:-"SRI SRI SRI SAI KRUPAKARA YOGI GOPALA KRISHNANANDA SWAMIJI BODHAAMRUTHAM".कार्यम...
18/02/2018

Om Sri Sai Nathaya Namaha, Guru Bodha:-

"SRI SRI SRI SAI KRUPAKARA YOGI GOPALA KRISHNANANDA SWAMIJI BODHAAMRUTHAM".

कार्यम् अणुः अपि काले तु कॄतम् अत्युपकारताम् |
महद् अपि उपकारः अपि रिक्तताम् अत्यकालत: ||

కార్యమ్ అణుః అపి కాలే తు కృతమ్ అత్యుపకారతామ్ |
మహద్ అపి ఉపకారః అపి రిక్తతామ్ అత్యకాలతః ||

Meaning:- Even a very small thing done at a right time for somebody will be very helpful. But even a great help done at an inappropriate time will be in vain.

తగిన సమయాకి ఎవరికైనా సరే మనము చేసే చిన్నపాటి సహాయము చాలా చాలా గొప్పది మరియూ అతి విలువైనది. అది ఆకలి వేసిన వారికి అన్నము పెట్టటము లాంటిది, దాహము వేసిన వారికి నీరు ఇచ్చుట వంటిది.

అలాగే మనము ఇతరులకు ఎంత గొప్ప సహాయమైనా సరే అది ఆర్తుల యొక్క అవసరము తీరిన తరువాత చేసినచో అది ఎంత గొప్ప సహాయమైనా, దానమైనా సరే అట్టి సహాయము, దానము వ్యర్థము. అది కడుపు నిండిన వారికి అన్నము పెట్టుట వంటిది, దాహము లేని వారికి నీరు ఇచ్చుట వంటిది.

శ్రీశ్రీశ్రీ స్వామీజీ వ్యాఖ్య:-
దానాన్ని పాత్ర ఎరిగి ఆ దానము యొక్క అవసరత ఉన్న వారికి మాత్రమే దానము, ధర్మము చేయవలయును, అట్టి దానము చేసిన దాతలకు మహాపుణ్యము కలుగును.

"ఆర్తులకు, పేదలకు, అనాథలకు చేయు దానము, సాధు జంతువుల యొక్క పోషణ ఇవన్నియూ విశేష ఫలములనిచ్చును".

అపాత్ర దానము చేసిన ఏమిలాభము? లాభమేమియూ లేదు సరికదా! అది కడుపు నిండిన వారికి భోజనము పెట్టుటలాంటిది. అట్లు అపాత్ర దానము చేసిన పుణ్యము మాత్రమూ కలుగదు - అని ఈనాటి నా (శ్రీశ్రీశ్రీ సాయి కృపాకర యోగి గోపాలకృష్ణానంద స్వామీజీ) బోధామృతము.

"IN THE SPIRITUAL SERVICE OF SRI SHIRDI SAI BABA".

"సబ్ కా మాలిక్ ఏక్ - ఏక్ మాలిక్ కా రూప్ అనేక్".

Yours in Sai Baba - Divine words by మీ, శ్రీశ్రీశ్రీ సాయి కృపాకర యోగి గోపాలకృష్ణానంద స్వామీజీ.
పీఠాధిపతి - శ్రీ ద్వారకామాయి సాయిబాబా పీఠం.
HYDERABAD.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Dwarakamai Sai Baba Peetham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Dwarakamai Sai Baba Peetham:

Share