Temple near Infosys-SEZ

Temple near Infosys-SEZ There is a siva temple at pocharam village near infosys-sez ghatkesar, NH202 or at present NH165

18/12/2017
నిన్న మునిమాపు వేళ మా ఊరి ఏటిగట్టుకి వెళ్ళాను..సెలయేటి అలల నవ్వులమీద ఎగురుతూ ఆటలాడే చంద్ర కిరణంలాగా,లేత చిగురాకు బధ్ధకపు...
14/12/2017

నిన్న మునిమాపు వేళ
మా ఊరి ఏటిగట్టుకి వెళ్ళాను..

సెలయేటి అలల నవ్వులమీద ఎగురుతూ ఆటలాడే చంద్ర కిరణంలాగా,
లేత చిగురాకు బధ్ధకపు విరుపులో పడి మెలితిరిగే
తొలి సూర్య కిరణంలాగా,
ఒక్కోసారి చల్లగా, మరో సారి వెచ్చగా
చక్కిలిగింతలు పెడుతూ నన్ను తాకిపోతూ ఉండింది చల్లటి గాలి.

నింగి బుగ్గన సొట్టలా మొదలై,
అనంతంగా విస్తరించే
వెలుగు దరహాసం లాంటి తన చిరునవ్వు గుర్తుకు వచ్చింది
సన్న జాజితీగల్ని
మృదువుగా మీటే గాలి కొనగోళ్ళ స్పర్శలాంటి తన స్పర్శ గుర్తుకు వచ్చింది ఆ క్షణాన.

ఇంతలో నన్నెవరో గుసగుసగా పిలిచిన భావన. చాలా దగ్గరగావచ్చిపిలిచినట్టు,
రెప రెపలాడుతున్న హృదయంతో తలెత్తి చూసాను...

ఎవరూ కనిపించలేదుగానీ
చెంపల్లో తామరలు విచ్చుకుని రాలిపడేటప్పుడు వచ్చే ఒక విధమైన కెంపుల మెరుపుల మధ్యన తన జ్ఞాపకం కనిపించింది.
మళ్లీ నేనొచ్చేవరకూ నీకంట్లోనే నిలిచిపోయిన నారూపాన్ని అలాగే ఉంచుకో అని చెప్పినట్లుగా అనిపించింది.

ఎక్కడెక్కడి పూల
పరిమళాలనో పట్టుకొచ్చిన గాలి నన్ను సాంత్వన
పరచాలని చూసింది.
కానీ,
తన కుడి
చెవి పక్కన చెంపలమీదుగా జారి ఒంపు తిరిగి మెల మెల్లగా కదిలే తన ముంగురుల అందం గుర్తుకువచ్చి నా మనసు చిన్నగా వణికింది...

మౌనం నిండిన వెన్నెల ఆకాశాన్ని చూసుకుంటూ ఒక్కడినే అలా ఉండిపోయాను....
హరీష్ S.V 9676512349

నన్ను పూరించమని చెప్పి
తానొదిలి వెళ్లిన ఖాళీల్లోఇవన్నీ నేను
రాసుకున్న వాఖ్యాలు...

25/02/2017
06/11/2016

Recently not visited
So

24/06/2016

In these days more public visits are happening

15/03/2015
15/03/2015
15/03/2015
15/03/2015

Address

Hyderabad East (Near Ghatkesar)
Hyderabad
500088

Telephone

+919133244808

Website

Alerts

Be the first to know and let us send you an email when Temple near Infosys-SEZ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share