04/10/2026
*** దసరా దుర్గ నవరాత్రులలో ఏడవరోజు
శ్రీ సరస్వతీ దేవి అమ్మ అలంకారణ.
అమ్మవారి అలంకారణ : నేడు మూలా నక్షత్రం కనుక అమ్మవారిని చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవిగా అలంకరించాలి.
అమ్మ చీర రంగు : తెలుపు
నైవేద్యం : అటుకులు బెల్లం, శనగపప్పు, కొబ్బరి అన్నం, దద్దోజనం, చక్కెర పొంగళి.
దద్ధోజనం చేయు విధానం :
కావలసినవి : బియ్యం 1/4 కిలో
పాలు 1/2 లీ, చిక్కటి పెరుగు 1/2 లీ
నూనె 1/2 కప్పు, నెయ్యి 1 స్పూన్
కోతిమిర, కరివేపాకు, చిన్న అల్లం ముక్క
పచ్చిమిర్చి, పోపు సామాగ్రి, జీడిపప్పు 20
ఉప్పు, ఇంగువ ఎండుమిర్చి.
దద్ధోజనం చేసే విధానం :
ముందు బియ్యం కడిగి అన్నం వండి కాస్త చల్లారాక కాచినపాలు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి వుంచండి. సన్నగా తరిగిన చిల్లి, కోతిమిర, అల్లం అన్నీ సిద్దంగా ఉంచుకొని స్టావ్ పై మూకుడుంచి అందులో నునె వేసి పోపు కావలసినవన్నీ వేసి ఎండుమిర్చి ఇంగువతో పాటు తరిగి వుంచినవన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపి కాస్త నేతిలో జీడి పప్పులు వేయించి అవీ వేయండి. అంతే దద్ధోజనం రెడి. రుచికరమైన దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ. ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ ప్రార్థించాలి.
సరస్వతీ శ్లోకం :
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆమాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.
ఆశ్వయుజ శుక్ల పక్షమున మూలా నక్షత్రమునాడు చక్కని పీఠముపై తెల్లని శుభ్రమైన వస్త్రాన్ని పరచి, దానిపై పుస్తకాలని పేర్చిపెట్టాలి. ఆ పుస్తకాలపై సరస్వతీదేవిని ఆహ్వానించాలి.
ధ్యాన శ్లోకములు :
నమస్కృత్య జగత్పూజ్యాం శారదాం విశద ప్రభామ్
శ్రిత పద్మాసనాం దేవీం త్ర్యంబకీం శశి భూషణామ్||
పద్మముపై కూర్చుని యున్నది, మూడు కళ్ళతో చంద్ర రేఖతో నిర్మలమైన కాంతితో శోభిల్లుచున్నది, సమస్త జగత్తులకు పూజ్యురాలైన శారదా అమ్మవారిని నమస్కరించుచున్నాను.
ప్రణవాసన మారూఢాం తదర్థత్వేన నిశ్చితామ్
సితేన దర్పణాభేన వస్త్రేణ పరిభూషితామ్||
శబ్ద బ్రహ్మాత్మికాం దేవీం శరచ్చంద్ర నిభాననామ్||
ప్రణవమే అమ్మవారి ఆసనం. ఆ ఓంకారము తెలియజేసే వస్తువు అమ్మవారే అని ఉపనిషత్తులు నిర్ణయించి చెప్పుచున్నాయి. శబ్దము ఆమె స్వరూపము. సాకార రూపమున ఆమె ముఖము శరత్కాల చంద్రుని వలె ఆహ్లాదకరమైనది. ఆమె అద్దమువలె స్వచ్ఛముగా తెల్లగానున్న వస్త్రముతో భాసిల్లుచున్నది. అట్టి దేనిని ధ్యానించుచున్నాను.
అత్రాగచ్ఛ జగద్వన్ద్యే సర్వలోకైక పూజితే
మయా కృతామిమాం పూజాం సంగృహాణ సరస్వతి||
సమస్త లోకాలచే పూజింపదగిన దానివి, అందరిచే పూజింపబడే ఏకైక దేవతవూ అయిన ఓ సరస్వతీ దేవీ, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి మా పూజని స్వీకరించు తల్లీ!!
మూలా నక్షత్రం రోజున ఇలా అమ్మవారిని ఆహ్వానించి లఘుపూజ చేయాలి. మరునాడు పూర్వాషాఢ నాడు కూడా పునః పూజ చేయాలి. మహానవమి నాడు ఉత్తరాషాఢలో మహానైవేద్యాన్ని సిద్ధం చేసుకుని ఆసనము, పాద్యము, అర్ధ్యము, ఆచమనీయము, మధుపర్కము, పంచామృతస్నానము, వస్త్ర యుగ్మము(చీర, రవిక), ఉపవీతము, ఆభరణములు, పసుపు, కుంకుమ, కాటుక, గంధము, అక్షతలు, పూలమాలలు సమర్పించి, పుష్పాదులతో పూజించి, ధూప దీప నైవేద్య తాంబూలాదుల సమర్పించి కర్పూర హారతినిచ్చి మంత్ర పుష్పాంజలి నొసగి ప్రదక్షిణ నమస్కారాలను చేయాలి. ఆయా ఉపచారాలకై పూజా గ్రంథాలలో శ్లోకాలు ఉంటాయి. వాటితో చేయాలి. సరస్వతీ దేవిని పూజించి మహా నవమినాడు నైవేద్యం సమర్పించి, శ్రవణ నక్షత్రమున ఉద్వాసన చెప్పాలి. చెప్పి పుస్తకాలని చదువుకొనటం మొదలు పెట్టాలి. మూల - పూర్వాషాఢ - ఉత్తరాషాఢలలో మౌనము పాటించి శ్రవణం నాడు పుస్తక పఠనం ప్రారంభిస్తే చదువులు బాగా వస్తాయి. మాటలలో నేర్పరితనం కలుగుతుంది. చదువుల సారం వంటబట్టి జ్ఞానం సత్ఫలితాలనిస్తుంది.
'యా కుందేందు తుషారహార
దవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత
కరా యశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి
భిర్దేవైస్సదా పూజితా
సమాంపాతు సరస్వతీ భగవతీ
నిశ్శేష జాడ్యాపహా"
ధవళ వర్ణ వస్త్రాలను ధరించి, అక్షమాలను, వీణను రెండు చేతులతో ధరించి , చందన చర్చితమైన దేహంతో దర్శనమిస్తుంది. సరస్వతి బుద్ధి ప్రదాయిని, వాగ్దేవి. సకల ప్రాణుల నాలికపై ఈ వాగ్దేవత నివసిస్తుందని స్మృతులు చెబుతున్నాయి. సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ మూడవ శక్తి. సరస్వతీ దేవత విద్యార్థుల పాలిట కల్పవల్లి.
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువులతల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతోభక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, మొదలైన లోకోత్తర చరిత్రులకు ఈమె వాగ్వైభవాన్ని వరంగా ఇచ్చింది. త్రి శక్తి రూపాల్లో అమ్మ మూడో శక్తి రూపం, సంగీత- సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల జిహ్మగ్రంపై (నాలుకపై) ఈమె నివాసం ఉంటుంది. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుద్ధి వికాసం కలుగుతుంది. అందుకే ఈ రోజున అమ్మను సరస్వతీరూపంలో ప్రత్యేకంగా పిల్లలతో (విద్యార్ధులు) పూజలు చేయిస్తారు. బాసరలో ఙ్ఞాన సరస్వతీదేవికి ఈ దినం విశేషంగా పూజలు జరుగుతాయి. ఈ రోజు అమ్మవారి ఆధ్వర్యంలో మూలా నక్షత్ర యుక్త పూజతో విశేషంగా అక్షరాభ్యాసం చేస్తారు. దీనిని ”విజయారంభం” అని పిలుస్తారు.
పారాయణం : శ్రీ సరస్వతీ అష్టోత్తరం
శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి :
ఓం సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం శ్రీప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మవక్త్రాయై నమః
ఓం శివానుజాయై నమః
ఓం పుస్తకభృతే నమః (10)
ఓం జ్ఞానముద్రాయై నమః
ఓం రమాయై నమః
ఓం పరాయై నమః
ఓం కామరూపాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాపాతక నాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః (20)
ఓం మహాభాగాయై నమః
ఓం మహోత్సాహాయై నమః
ఓం దివ్యాఙ్గాయై నమః
ఓం సురవన్దితాయై నమః
ఓం మహాకాళై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం పీతాయై నమః
ఓం విమలాయై నమః (30)
ఓం విశ్వాయై నమః
ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చన్ద్రికాయై నమః
ఓం చన్ద్రవదనాయై నమః
ఓం చన్ద్రలేఖావిభూషితాయై నమః
ఓం సావిత్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకారభూషితాయై నమః (40)
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వసుదాయై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోవిన్దాయై నమః
ఓం గోమత్యై నమః (50)
ఓం శివాయై నమః
ఓం జటిలాయై నమః
ఓం విన్ధ్యవాసాయై నమః
ఓం విన్ధ్యాచలవిరాజితాయై నమః
ఓం చణ్డికాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మయై నమః
ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః
ఓం సౌదామన్యై నమః
ఓం సుధామూర్త్యై నమః (60)
ఓం సుభద్రాయై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం సువాసిన్యై నమః
ఓం సునాసాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం విద్యారూపాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం బ్రహ్మజాయాయై నమః
ఓం మహాఫలాయై నమః (70)
ఓం త్రయీమూర్తయే నమః
ఓం త్రికాలజ్ఞాయై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం శాస్త్రరూపిణ్యై నమః
ఓం శంభాసురప్రమథిన్యై నమః
ఓం శుభదాయై నమః
ఓం స్వరాత్మికాయై నమః
ఓం రక్తబీజనిహన్త్ర్యై నమః
ఓం చాముణ్డాయై నమః
ఓం అమ్బికాయై నమః (80)
ఓం ముణ్డకాయప్రహరణాయై నమః
ఓం ధూమ్రలోచనమదనాయై నమః
ఓం సర్వదేవస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురాసుర నమస్కృతాయై నమః
ఓం కాలరాత్ర్యై నమః
ఓం కలాధరాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వరారోహాయై నమః (90)
ఓం వారాహ్యై నమః
ఓం వారిజాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః
ఓం చిత్రగన్ధాయై నమః
ఓం చిత్రమాల్య విభూషితాయై నమః
ఓం కాన్తాయై నమః
ఓం కామప్రదాయై నమః
ఓం వన్ద్యాయై నమః
ఓం విద్యాధర సుపూజితాయై నమః
ఓం శ్వేతాననాయై నమః (100)
ఓం నీలభుజాయై నమః
ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
ఓం చతురానన సామ్రాజ్యాయై నమః
ఓం రక్తమధ్యాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం నీలజఙ్ఘాయై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః (108)
ఇతి శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.
ఓం శ్రీ సరస్వతీ దేవియే నమః