Divine Mercy Church Madinaguda

Divine Mercy Church Madinaguda Divine Mercy Church at Madinaguda near Miyapur in Hyderabad Roman Catholic Church attached to the Archdiocese of Hyderabad. Parish Priest: Rev. Fr.

A growing community currently comprising of ~300 families. Y Thomas Reddy

Sunday Masses:

07:30 AM - Mass in Telugu
09:30 AM - Mass in English

Daily Mass: 6:30 AM

08/09/2023

ఆవే మరియ వందనం
యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను

ఆరోగ్యమాత అనుగ్రహము మీతో నిత్యము ఉండునుగాక . అనుగ్రహ పరిపూర్ణురాలైన లూర్దు మాత ప్రార్థన నీకు నీ కుటుంబానికి తోడై నిలుచును గాక. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన మరియమాత నిన్ను ఉన్నత స్థానమునకు చేర్చును గాక. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నిత్యసహాయమాత నీ జీవితంలో ఓ అద్భుత సహాయము చేయును గాక. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నమ్మిన ఫాతిమా మాత నీ జీవితంలో సమస్తము సాధ్యమయ్యేలా చేయును గాక. తన్ను నమ్మిన భక్తులకు మంచి ఆరోగ్యము దయచేయు ఆరోగ్యమాత నీకు స్వస్థత మంచి ఆరోగ్యము గొప్ప విడుదల దయచేయునుగాక . బెర్నాడేతమ్మకు దర్శన మిచ్చిన లూర్దు మాత నీకు దర్శన మిచ్చును గాక. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని తన దీన హృదయం ను చాటుకున్న ఆ తల్లి నీలో ధీనత్వమును, వినయమును, మంచి మనసును, ధ్యానమును, ప్రార్ధనను , ఉపకార మనసును, దాన గుణమును పుట్టించును గాక.

వేలంఖన్ని మాత పండుగ శుభాకాంక్షలు.

ఆ తల్లి దీవెన నీతో నీ కుటుంబముతో ఎప్పుడూ ఉండును గాక !

దైవాశీసులు.
మీ కోసం ప్రార్థిస్తున్న
మీ గురుశ్రీ తోమాస్ ఏరువ

07/09/2023

ఆవే మరియా వందనం
యేసు నేను నిన్ను నమ్ముతున్నాను

దివ్యబలిపూజలో సెల్ ఫోన్ వాడొద్దు- పోప్ హెచ్చరిక

నేను, వాటికన్ లోని పేతురు మహాదేవాలయ ఆవరణలో, లేదా ఆలయంలో, పూజను సమర్పిస్తున్నప్పుడు,నాకు అత్యంత బాధను కలిగించే సంఘటన ఏదనగా విశ్వాసులు దైవవాక్కును ఆలకించకుండా,సెల్ ఫోన్స్ లో లీనమై పోతున్నారు. కేవలం విశ్వాసులు మాత్రమే కాదు, కొందరు దైవాంకితులు, పీఠాధిపతులు కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తున్నారు.

దివ్యబలిపూజ, ఫ్యాషన్ షో కాదు,దివ్యబలిపూజ,విశ్వాసులను దేవునితో ఐక్యపరిచే పవిత్ర వేదిక. దివ్యబలిపూజలో
యోగ్యంగా పాల్గొందాం"...

-పోప్ ఫ్రాన్సిస్

మీ గురుశ్రీ థామస్ యెరువ

06/09/2023

ఆవే మరియ వందనం
యేసు నేను నిన్ను నమ్ముతున్నాను

బంగారం కూడా ఒక పరిపూర్ణమై ఆకారం పొందాలంటే.. కాలక తప్పదు.. కరగక తప్పదు.. నలగక తప్పదు.. దెబ్బలు తప్పవు..

మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు, ఒడిదుడుకులు తప్పవు.. ధైర్యం వహించు. ఎప్పటికి
గుర్తుంచుకో. నీకు శ్రమలు, బాధలు, వేదనలు, నిందలు, రోగాలు , అవమానాలు, దూషణలు, మనసు బాధ పడటాలు ,,,ఇలాంటివి ఇంకా ప్రభువు కొరకు హింసలు పడినప్పుడు నీవు ఎన్నో ఆత్మలు రక్షిస్తున్నావని మరచిపోకు. ఇప్పుడు నీకు తెలియదు రక్షించినట్లు కానీ మరణానంతరం వారే నీ దగ్గర వచ్చి దేవుని నిన్ను స్తుతిస్తారు. ఆనందించండి. ఆస్వాదించండి.

దైవాశీసులు.
మీ గురుశ్రీ తోమాస్ ఏరువ

05/09/2023

ఆవే మరియా వందనం
యేసు నేను నిన్ను నమ్ముతున్నాను

ఈ రోజు జపాలు చెప్పుకున్నారా ..
3 పరలోక
3 మంగళ వార్త
౩ త్రీత్వ స్తోత్రమ్

ఇతరుల కోరకు ప్రార్ధించు
నీ కోరకు స్తుతించు

నీకు ఒక సమస్య ఉన్నా, రోగము ఉన్నా, ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉన్నా, ఇతరులకు కుడా అలాంటి సమస్యలు ఉందని వారి కోరకు ప్రార్ధించి వారిని ప్రభువుకి సమర్పించు. నీకున్న సమస్య కి ప్రభువ స్తోత్రం అని పలుకు.

ఇప్పుడు పైన చెప్పిన జపాలు
చెప్పుకోండి. మార్చిపోకుండా జపించండి. నేను ఇప్పుడే జపిస్తున్నాను

( మీ పెరూ, వాట్సప్ నంబర్ పంపండి . నాకు 1000 మంది కావాలి. ఒక్కసారి ఊహించుకో. ప్రతిరోజు ఈ జాపాలు ఇంత మంది జాపిస్తే అద్భుతాల పంట కోస్తాం. )

Pray for Others
Praise for Yourself.

Did you Pray..
3 Our Father
3 Hail Mary
3 Glory be

PRAY pray Now.
Don't forget to Pray..
I am praying Just NOW.

I need 1000 people who Pray these. Just imagine if 1000 people Pray for others, how Wonderful Miracles take place.

Send me your name and watsapp number.

God bless you abundantly
Fr. Thomas Yeruva

05/09/2023

ఆవే మరియా వందనం
యేసు నేను నిన్ను నమ్ముతున్నాను

పునీత మదర్ థెరిసా గారి పండుగ శుభాకాంక్షలు.

ప్రార్ధన చేసే పెదవుల కన్నా
సాయం చేసే చేతులు మిన్నా

నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది

నీకు మంచి రోజులు వస్తాయ్

నిన్ను అవమానించిన వారి ఎదుట నీ తల పైకెత్తుతాడు

అనుదినము విశ్వాసంతో ప్రార్దించు . అవసరం లో ఉన్నవారికి చేతనైతే సాయం చెయ్యి

ఆమెన్

దైవానుభూతులు పొందుకో
మీ గురుశ్రీ థామస్ యెరువ

https://youtu.be/5I95Kv6xYqc?feature=shared
04/09/2023

https://youtu.be/5I95Kv6xYqc?feature=shared

Divyavani TV is the First ever Telugu Catholic Satellite TV Channel. It’s started by TCBC (Telugu catholic Bishops' Council)Thanks for Watching the Video, if...

04/09/2023

ఆవే మరియా వందనం
యేసు నేను నిన్ను నమ్ముతున్నాను

దేవా....
నీకు దూరమైపోతానేమోనన్న భయం నాలో ఎక్కువైపోతోంది. అపవాది నేను నీకు దగ్గరయ్యే కొలది నన్ను మరి ఎక్కువగా శోధిస్తున్నాడు. ప్రతి క్షణం నను విడువనని వాగ్ధానము చేసావు కదా..! నీకు ఎప్పుడు దగ్గరగా ఉండునట్లు నీ సన్నిధిని నాకు తోడు ఉంచవా ప్రభువా..

నేను సహాయమని పిలిచిన వెంటనే నీవే నా యొద్దకు వచ్చి నన్ను బలపరచి ధైర్యముతో నింపి నా భయములన్నిటిని తొలగించు..

నీ సహాయము కోరుతున్న ఈ దీనుడిని కటాక్షించు. ఆత్మీయ యాత్రలో పడిపోకుండా నిలబడి ఉండుటకు కృపను అనుగ్రహించు. ఆమెన్

దైవానుభూతులు పొందుకో
మీ గురుశ్రీ థామస్ యెరువ

03/09/2023

In Madinaguda we celebrate Every First Sunday as the Divine Mercy Sunday. At 7.30 am we have Mass in Telugu and at 9.30 am in English. If possible come and visit and participate in the Mass and enjoy the Miracles.

03/09/2023

మదీనగూడలో వెలసిన దివ్య కారుణ్య దేవాలయములో ప్రతి నేల మొదటి ఆదివారము దివ్య కారుణ్య ఆదివారము గా కొనియాడుచున్నాము. ఉదయమ్ 7.30 కి తెలుగులో పూజ. 9.30 కి ఇంగ్లీష్ లో పూజ. వీలైతే వచ్చి పూజ లో పాల్గోని దివ్య కరుణ పొందుకొండి. దైవానుభూతులు పొందండి

03/09/2023

ఆవే మరియా వందనం
యేసు నేను నిన్ను నమ్ముతున్నాను

నీవు భయపడకుము.
నేను నీకు తోడై యందును.
నీవు వెరవకుము;
నేను నీకు దేవుడను.
నేను నీకు బలము నొసగి నిన్ను ఆదుకొందును.
నా శక్తితో నిన్ను కాపాడుదును.

యెషయా 41 : 10. ఆమెన్.

రాత్రి ఎందుకో చాల భయం వేసింది. నిద్ర కూడా సరిగా పట్టలేదు. ఈ వాక్యపు
అభయంతో కుదుట పడ్డాను.

నీవు ఎందుకో బయపడుతున్నావ్ కదా...ఈ వాక్యపు వెలుగులో నీ భయం హరించుకొని పోవును గాక. ఆమెన్

మీ గురుశ్రీ థామస్ యెరువ

02/09/2023

ఆవే మరియా వందనం
యేసు నేను నిన్ను నమ్ముతున్నాను

ఏ మనిషైతే తన మనోవికారములను ( కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ) జయిస్తాడో, వాడే లోకాన్ని జయించిన వాడు.

నిన్ను నీవు జయించావా ?

పరిశుద్ధాత్మ దగ్గరికి వెల్లు. సహాయం చేస్తారు జయించడానికి.

దైవానుభూతులు పొందుకో
మీ గురుశ్రీ థామస్ యెరువ

28/08/2023

ఆవే మరియా వందనం
యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను

మనిషి యవ్వనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు.

వృద్యాపంలో ఆరోగ్యం కోసం డబ్బుని పోగొట్టుకుంటాడు.

మనుషులను ప్రేమించు, మనుషులకు ప్రేమ పంచు.

నువ్వు పోయినా నువ్వు పంచిన ప్రేమ వాళ్ళ గుండెల్లో నిన్ను కలకాలం బ్రతికిస్తుంది..

చిరస్థాయిగా నిలిపేస్తుంది..

దైవాశీసులు.
మీ గురుశ్రీ తోమాస్ ఏరువ

Address

Divine Mercy Church, Madinaguda
Hyderabad
500049

Opening Hours

Monday 6:30am - 7:30am
Tuesday 6:30am - 7:30am
Wednesday 6:30am - 7:30am
Thursday 6:30am - 7:30am
Friday 5:30pm - 7:30pm
Saturday 10am - 11:30am
6:30pm - 8pm
Sunday 7:30am - 11:45am

Telephone

+917032319569

Website

Alerts

Be the first to know and let us send you an email when Divine Mercy Church Madinaguda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Divine Mercy Church Madinaguda:

Share