28/03/2025
ఇది నెల రోజుల నుండా?♦
-------------------^^^-----------------
♦
ఒక నెల ముందే కరుణాకర్ సుగుణకు తెలుసు ప్రవీణ్ పగడాల రాజమండ్రి కి వస్తున్నట్టు. ఈ విషయం స్వయాన కరుణాకర్ పోస్ట్ లో కామెంట్ సెక్షన్ లో ఉంది.
♦
★ కామెంట్ పెట్టిందెవరు?
★ ఎందుకు అంత ఆసక్తితో ప్రవీణ్ గురించి ప్రత్యేకంగా పోస్ట్ పెట్టినట్టు?
★ ఆ పోస్ట్ పెట్టిన వానికి, కరుణాకర్ కి మద్య ఈ నెలరోజుల్లో జరిగిన ఫోన్, టెక్ట్స్ సంభాషణలు ఏంటి?
★ ఒక ఆరు నెలల, ప్రత్యేకంగా గత మూడు నెలలు, మరి ప్రత్యేకంగా గత నెల కాల్, టెక్స్ట్, సామాజిక మాధ్యమ సంభాషణలన్నీ అధికారికంగా బయటకు తీయాలి.
★ ఆ కాలంలో ఈ అనుమానితులందరి మధ్యలో జరిగిన సంభాషణలు బయటకు తీసి, లోతైన దర్యాప్తు చెయ్యాలి.
★ కాల్ లిస్ట్స్ తీసేటప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ లో క్రైస్తవ సాంకేతిక నిపుణుల బృంద సమక్షంలో వాటిని రిట్రీవ్ చెయ్యాలి.
★ దర్యాప్తు సంస్థలు తమ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి, నిపుణతతో ఈ కేస్ ను పకడ్బందీగా, క్రిస్టల్ క్లియర్ గా తేల్చి సమాజం ముందు ఉంచి, తమ నిబద్ధతను చాటుకోవాలి.
♦
కాబట్టి, ఈ నెల రోజుల నుండి హత్యాపథకం జరిగివుండి ఉంటుందా? ఈ కోణంలో కూడ దర్యాప్తు జరగాలి.
♦
మృత్యుంజయ, ఎల్. కె.