HaindavaDarmam

HaindavaDarmam This web site about performing all types of poojas,numerology,homas,navagrah poojas and many more.you can book online at sarvapoojalu.com

haindava darmam is a 24 x 7 YOU TUAB devotional channel in Telugu which caters to the people of all religions. It was launched on August 2016 Its south India's first Telugu devotional channel.Channel comprising fiction and non-fiction Programes. Daily devotional news, Weekly Special Programes and devotional programs and special programs relating to major festivals specific to Telugu language speaking community and the Indian State of Andhra Pradesh.

ప్రదోష వ్రతం (శివపూజ) :సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అంటారు. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ...
11/01/2025

ప్రదోష వ్రతం (శివపూజ) :
సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అంటారు. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు. ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) త్రయోదశి వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం.

శనిత్రయోదశి :సర్వసాక్షి అయిన సూర్యదేవునికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో యముడు వ్యక్తులు మరణించిన తరువాత వారి కర్మఫలాన్న...
11/01/2025

శనిత్రయోదశి :
సర్వసాక్షి అయిన సూర్యదేవునికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో యముడు వ్యక్తులు మరణించిన తరువాత వారి కర్మఫలాన్ని బట్టి శిక్షిస్తే, శని మానవుడు బతికి ఉండగానే సంచిత పాపాలను బట్టి దండన విధిస్తాడు. ఈ కారణంగా వ్యక్తుల సంచిత పాపభారం తగ్గిపోతుంది. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు, అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. శని చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే పీడిస్తాడు. ఎంత దైవాంశసంభూతులైనా తప్పులు చేస్తే వారి కర్మల ఫలితాలను నిర్దేశిస్తాడు. సత్కార్యాలు చేసేవారికి మహోన్నతమైన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, కచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన మన పూర్వీకులు శనిత్రయోదశి నాడు శనైశ్చరుని ఆరాధించాలని నిర్దేశించారు. జ్యోతిష శాస్తర్రీత్యా ఆయన శనివారానికి అధిపతి. వ్యక్తి జీవితంలో శని దశ జరిగే సమయంలో పూర్వజన్మలో చేసిన దుష్కర్మలకు శిక్ష అనుభవించాల్సివస్తుంది. పైకి అవి శిక్షలుగా కనబడినా వాస్తవానికి అవి సన్మార్గంలో మనమెంతలా నిలబడుతున్నామో తెలుసుకునేందుకు పెట్టే పరీక్షలే.
శనికి నువ్వులనూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో పూజలు చేస్తే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్ధికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు. జాతకచక్రంలో శని ప్రతి రాశిలోనూ రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు. శని ఉన్న రాశికి వెనకరాశి, ముందురాశికి ఏలినాటి శని దోషం సంప్రాప్తిస్తుంది. అలాగే చంద్రుడున్న రాశి నుంచి శని నాలుగో రాశిలో సంచరిస్తుంటే అర్ధాష్టమ శని దోషం, చంద్రుడున్న రాశి నుంచి శని ఎనిమిదో రాశిలో సంచరిస్తుంటే అష్టమ శనిదోషం కలుగుతాయని శాస్త్రం. ఇలా ఏర్పడే అర్థాష్టమ, అష్టమ, ఏలినాటి శనిదోషాల వల్ల వ్యక్తులకు ఏకాగ్రత లోపం, వాహన ప్రమాదాలు, పెద్దల గురించి ఆందోళన, చంచలత్వం పెరిగిపోవడం, ఆరోగ్యంలో చికాకులు వంటివి ఏర్పడతాయి. ఇలా ఏలినాటిశని, అర్ధాష్టమశని, అష్టమశని పీడితులు ఈ శనిత్రయోదశి నాడు పరిహారక్రియలు చేసి ఆ గ్రహబాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఏడాది పాటు త్రయోదశి వ్రతం చేస్తే శని కరుణకు పాత్రులు కావచ్చు. న్యాయవివాదాలు, శత్రు, రోగ, రుణబాధలు తగ్గుతాయి. ఈ వ్రతం చేసేవారు త్రయోదశులలో ప్రదోషకాలంలో శివపూజ, నక్తభోజనం విధిగా చేయాలి.

మార్గశిర మాసం - ఆరుద్ర నక్షత్రం ఆదివారం రోజున *15-12-2024*పుట్ట మన్ను తో తయారు చేసిన శివలింగం కు అభిషేకంరుసుము ₹ 555/- h...
05/12/2024

మార్గశిర మాసం - ఆరుద్ర నక్షత్రం ఆదివారం రోజున *15-12-2024*
పుట్ట మన్ను తో తయారు చేసిన శివలింగం కు అభిషేకం
రుసుము ₹ 555/-

https://youtu.be/BeKWruhdHoM?si=-NHyvZ7Kkk_Wgg5H

--> రుద్రాభిషేకం ఆయుః దీర్ఘాయుష్షు, ఆరోగ్యము, ఐశ్వర్యము పొందడానికి రుద్రాభిషేకం చాలా ఉత్తమమైన పూజ

--> ఈ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని జరిపించడం వలన ఆరోగ్య సమస్యలు కఠినమైనటువంటి సమస్యలు మరియు సంసార అభివృద్ధి, సంతాన అభివృద్ధి, వృత్తి వ్యాపార, ఉద్యోగ ఆర్థిక పరంగా, వివాహపరంగా మంచి ఫలితాలను ఇస్తుంది.

మీ గోత్రనామాలతో ఈ పూజ జరిపించిన వారికి అన్ని విఘ్నాలు తొలగి అద్భుతమైన ఫలితాలను పొందుతారు. పూజ అనంతరం మీకు స్వామివారి ప్రసాదం పంపబడుతుంది.
ఇప్పుడే మీ గోత్రనామాలను నమోదు చేసుకోవడం కోసం కింద ఉన్న ఫోన్ నెంబర్ కు కాల్ చేసి నమోదు చేసుకోండి

8019312323, 9959594528 9533612323, 8978232328

ముందు గా నమోదు చేసుకున్న వారి పేర్లు సంకల్పం లో ముందుగా వస్తాయి..

మార్గశిర మాసం - ఆరుద్ర నక్షత్రం అదివారం రోజునపుట్ట మన్ను తో తయారు చేసిన శివలింగం కు అభిషేకంరుసుము ₹ 555/- శ్రీచక్ర ....

19/01/2024

శ్రీ చక్ర సన్నిధి రహస్య సిద్ధ తంత్రాలు పరిహారాలు కొరకు ఈ ఛానల్ ను ఫాలో అవ్వండి:-

ఆధ్యాత్మిక జాతకపరంగా కావలసినటువంటి చాలా విలువైనటువంటి పరిహారాలు
ఈ ఛానల్ యందు మేము పొందుపరచడం జరిగింది..

🔆 మీరు మీ మిత్రులను, సన్నిహితులను, కుటుంబ సభ్యులను ఈ చానల్ లో ADD చెయ్యండి.
https://whatsapp.com/channel/0029VaDnr9w23n3iuC46R62z

🔆 Group Name పై Touch చేస్తే Follow అని ఆప్షన్ పైన ఉంటుంది.

🔆 ఈ Follow ఆప్షన్ Click చేసి Bell సింబల్ Press చేయడం ద్వారా మీ మిత్రులు, సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు ఈ చానల్ లో Add అవ్వవచ్చు.

🔆 మీకు తెలిసిన వారికి ఈ చానల్ లింక్ Forward చెయ్యండి.

🔆 ప్రతి వారికి ఈ చానల్ ఉపయోగపడాలి.

https://whatsapp.com/channel/0029VaDnr9w23n3iuC46R62z

గాయత్రి మాత అనగా ఎవరు…?ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని...
19/01/2024

గాయత్రి మాత అనగా ఎవరు…?
ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం…డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:
01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.

త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
* గాయత్రి మంత్రాక్షరాలు
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం తఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతూ ఉంటాయి...

కారుంగలి మాల కావలసినవారు ఈ గ్రూపులో జాయిన్ కండి అందరికీ ఒకటే సారి మెసేజ్ పెట్టడానికి సందేహాలను నివృత్తి చేయడానికి కుదురు...
18/01/2024

కారుంగలి మాల కావలసినవారు ఈ గ్రూపులో జాయిన్ కండి అందరికీ ఒకటే సారి మెసేజ్ పెట్టడానికి సందేహాలను నివృత్తి చేయడానికి కుదురుతుంది....

https://chat.whatsapp.com/FbczTTVx39PEQWeWMevHI8

*🌺 కరుంగలి మాల విశిష్టత:🌳ఎబోనీ చెట్టు నుండి ఈ కరుంగలి నరదృష్టి మాల తయారు చేస్తారు. దీనికి అధ్బుతమైన ఔషధ విలువలు కలిగి ఉం...
18/01/2024

*🌺 కరుంగలి మాల విశిష్టత:

🌳ఎబోనీ చెట్టు నుండి ఈ కరుంగలి నరదృష్టి మాల తయారు చేస్తారు. దీనికి అధ్బుతమైన ఔషధ విలువలు కలిగి ఉంటుంది. 🌺

🎊ఈ కరుంగలి బ్రేస్లెట్ ధరించడం వలన చెడు దృష్టి, ప్రతికూల శక్తులు తొలుగుతాయి.👀 ఉత్సాహన్నీ, తేజస్సును మరియు మనోబలాన్ని కలుగజేస్తుంది. ✨

🏆 దీని వలన మీలో ప్రతికూల ఆలోచనలు తొలిగి సానుకూలత పెరుగుతుంది. మనం చేసే ప్రతి పనిలో విఘ్నాలను తొలగించి విజయతీరాలకు చేరుస్తుంది.💪

💎ఈ కరుంగాలి బ్రేస్లెట్ వలన సమస్త నరదృష్టిదోషాలను తొలగిస్తుంది. దీనిని ధరించిన వారికీఅనారోగ్య సమస్యలు తొలగి దీర్ఘ ఆరోగ్యం కలుగుతుంది. 💖 సోమరితనాన్ని తొలగించి, శరీరం చైతన్యవంతంగా ఉండేలా చేస్తుంది. 🌟

📢కోపం, మానసిక భయాలు మరియు భాదలను తొలగించి ధైర్యాన్ని పెంచుతుంది.
🐍విషపూరిత కీటకాలు ప్రమాదాల నుండి మనలను రక్షిస్తుంది. 🔦

⏰కుజదోషాలు ఉన్నవారు ధరిస్తే దోషాలు తొలగించబడతాయి. ఈ కరుంగలి బ్రేస్లెట్ ని ధరించడం వలన వివాహానికి ఎదురైయ అవరోధాలు తొలగి త్వరగా వివాహం జరుగుతుంది.

 #ప్రశస్త_తీర్థం🍁తీర్థం అంటే అభిషేక జలం అనే అర్థమే వాడుకలో స్థిరపడింది. దేవతా మూర్తులకు సాధారణంగా నీటితో అభిషేకం చేస్తార...
14/01/2024

#ప్రశస్త_తీర్థం

🍁తీర్థం అంటే అభిషేక జలం అనే అర్థమే వాడుకలో స్థిరపడింది. దేవతా మూర్తులకు సాధారణంగా నీటితో అభిషేకం చేస్తారు. విగ్రహం, సాలగ్రామం, బీజాక్షరాలు రాసి ఉన్న చక్రాలకు యంత్రాలకు ఆయా దేవతల స్థాయి, ప్రత్యేకతలను బట్టి సాధారణ నీటికి కొబ్బరినీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, వట్టివేళ్లు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాల్లో అవసరమైన వాటిని చేర్చి ఆ నీటితో అభిషేకం చేస్తారు. ఆ మిశ్రమ ద్రవాన్ని శంఖంలో పోసి దాని చివరనుంచి ధారగా అభిషేకం చేస్తారు.

🍁సాలగ్రామాలకు పురుషసూక్తం పఠిస్తూ, అమ్మవార్లకు శ్రీసూక్త విధానంలో, శివలింగానికి రుద్ర నమకచమకాలతోను, చక్రాలు యంత్రాలు తదితరాలకు వేదమంత్రాలు, బీజాక్షరాల స్మరణ పూర్వకంగా అభిషేకం చేస్తారు. ఆ సమయంలో ఆయా మూర్తుల్లో నిక్షిప్తమై ఉన్న శక్తిని ఆ జలం గ్రహిస్తుంది. వీటన్నింటి సమాహారమైన ఆ అభిషేక జలం శక్తిమంతమైనది.

🍁ఇంటి పరిసరాలను శుద్ధి చేయడానికి వేదమంత్రాలు పఠనంతో శుద్ధి పుణ్యాహవచనం అనే ప్రక్రియ జరుపుతారు. తీర్థాల్లో నాలుగు రకాలున్నాయి. అవి జల, కషాయ, పంచామృత, పానక తీర్థాలు. పైన చెప్పిన విధంగా అభిషేకం చేసిన జలాన్ని భక్తులకిస్తే దాన్ని జలతీర్థం అంటారు. రాత్రి పూజ తరవాత అభిషేక జలంలో కొన్ని మూలికల రసాన్ని/సారాన్ని కలుపుతారు. దీన్నే కషాయ తీర్థం అంటారు. కొల్హాపురి శ్రీమహాలక్ష్మి, కొల్లూరు మూకాంబిక, హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలామాలిని, అస్సాంలోని శ్రీకామాఖ్య దేవాలయాల్లో అలా ఇస్తారు. ఈ తీర్థాన్ని సేవించడం వల్ల దీర్ఘ రోగాలు త్వరగా నయమవుతాయని నమ్ముతారు.

🍁పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం అనే అయిదు" పదార్థాల సమాహారాన్ని పంచామృతం అంటారు. దీనితో ప్రత్యేక సందర్భాల్లో శివుడికి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. ఈ పంచామృత తీర్ధ సేవనం వల్ల ఆరోగ్యపరంగా, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటారు. నరసింహ స్వామికి, శ్రీరాముడికి పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ పానకాన్ని భక్తులకు తీర్థంగా పంచుతారు.

🍁ఇవేకాకుండా తులసి, పచ్చకర్పూర, బిల్వ, గంగాజల, హరిద్రా (పసుపు కలిపిన నీరు), తీర్థాల పేరుతో సందర్భోచితంగా అభిషేకం చేస్తుంటారు. వీటిని సేవించడం వల్ల కూడా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చేకూరతాయంటారు.

🍁తీర్థాన్ని లోపలికి మూడుసార్లు తీసుకోవాలని పెద్దలు చెబుతారు. ఉద్ధరిణి నిండా తీర్ధం తీసుకుని అరచేతిలో వేసుకుని శిరస్సు మీద ఒక్కసారే చల్లుకోవడాన్ని మార్జన అంటారు. పరిసరాల్లో చల్లేటప్పుడు మామిడి ఆకుల చివరలను తీర్ధమున్న పాత్రలో ముంచుతూ దైవ నామ స్మరణ చేస్తూ చల్లాలి. దీన్ని ప్రోక్షణ అంటారు. తీర్థాన్ని కింద పడనీయకుండా, నోటినుంచి శబ్దం రాకుండా భక్తిగా స్వీకరించాలి. తీర్థాన్ని భక్తి, నమ్మకాలతో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతాయని అకాల మరణ, సర్వ రోగాల నివారణ జరుగుతాయని నమ్ముతారు.🙏

✍️కె. వి. ఎస్. ఎస్. శారద

Shri ram jay ram jay jay ram
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయరామ జయ జయరామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Wonderful OpportunityOm namah shivaya November 14th to December 13th is the month of *Kartika Masam* which is dear to th...
16/10/2023

Wonderful Opportunity
Om namah shivaya

November 14th to December 13th is the month of *Kartika Masam* which is dear to the holy Lord Harihar.

In this month do japa, dana, homa, tarpana, vrata,
Pujaads give the result of doing it once or doing it a few thousand times.

*Abhishekam* is the most dear to Lord Shiva.
Archana performed with Bilva forces can remove all the evils and sins of Saitama, even the *accumulated* sins of Saitama.

If you want to perform special *Lakshapatri Puja* in *famous Shaivite Temples* in this month of Kartika, you will be provided with all facilities viz.
Everything is arranged including ritvikkus, patri, ekadasa rudrabhisheka money, saffron pooja material for goddess, jyotirlingachan material and food.

You, your family members and any number of your relatives and friends can participate and complete the program and go back.

*This program will also be arranged for you in famous Shaiva Kshetras*

So you thought that you should perform *Lakshapatri Puja* to the Lord

can contact
8019212323, 8019312323

అయోధ్య రాముడి గర్భాలయ మూలవిరాట్ కింద ప్రతిష్టించ బోతున్న రామ మహాయంత్రం తెనాలి ప్రజల అదృష్టవశాత్తు ఒక్క అరగంట ప్రజల సందర్...
09/10/2023

అయోధ్య రాముడి గర్భాలయ మూలవిరాట్ కింద ప్రతిష్టించ బోతున్న రామ మహాయంత్రం తెనాలి ప్రజల అదృష్టవశాత్తు ఒక్క అరగంట ప్రజల సందర్శనార్థం అంగలకుదురు దాసకుటి లో ఉంచారు..
దాన్ని రేపు మధ్యాహ్నం కల్లా విమానంలో అయోధ్య చేరుస్తారు..
దేశంలో ఎవరికీ దక్కని తెనాలి కి దక్కడం రాముడి వరం మాత్రమే..
మీరు అయోధ్యలో రామ మందిరం ప్రారంభం తరువాత రాముడిని చూడగలరు కానీ మేము రాముడి పాదపీఠం క్రింద ప్రతిష్ట చేయబోయే రామయంత్రాన్ని దర్శించుకున్నాము..
అది ప్రతిష్ట చేసిన తర్వాత ఇక దాన్ని దర్శించడం దుర్లభం..దర్శించుకోండి...
జై శ్రీరాం..🙏🙏🙏🙏🙏

💝 *”యావత్ సృష్టీ కూడా కాలం అధీనంలోనే ఉంటుంది. దాని ప్రేరణతోనే దేవతలు తమతమ కర్తవ్యాలను నిర్వర్తిస్తుంటారు” అని అధర్వణ వేద...
23/07/2023

💝 *”యావత్ సృష్టీ కూడా కాలం అధీనంలోనే ఉంటుంది. దాని ప్రేరణతోనే దేవతలు తమతమ కర్తవ్యాలను నిర్వర్తిస్తుంటారు” అని అధర్వణ వేదంలోని ‘కాలసూక్తం’ చెబుతోంది. కాలానికి దైవం కంటే గొప్ప శక్తి ఉంది కనుక దైవాన్ని చూసినంత పవిత్రంగా దాన్నీ చూడాలని బుుషివచనం.*
💖 *కాలాన్ని వృథా చేసేవాడికి జీవితం విలువ తెలియదు. సద్వినియోగపరచేవాడు కచ్చితంగా ప్రగతి సాధిస్తాడు. కాల స్వరూపం కాని విషయం సృష్టిలో ఏదీ లేదు. సృష్టి జరిగేది, ఎదిగేది, నాశనం అయ్యేది దాని ప్రభావం వల్లే.*
💓 *త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు అనేక సందర్భాల్లో దేవతలెవరూ కాల ప్రభావం నుంచి తప్పించుకోలేక ఇక్కట్లబారిన పడ్డ విషయాలను పురాణాలు వెల్లడిస్తున్నాయి.*
💞 *కాల ప్రేరణ వల్లనే ప్రకృతి సైతం దానికి అనుగుణంగా మారుతూ కొత్త ఆవిష్కరణలు చేస్తుంది. అందుకే “కాలాయ తస్మై నమో నమః” (కాలానికి నమస్కారం) అంటోంది అధర్వణ వేదం.*
💕 *జీవితాలు స్థిరపడ్డానికీ, గతి తప్పడానికీ కూడా కాలమే కారణమౌతుంది. దాని విలువ ఎంత అని ప్రశ్నిస్తే ఒక్కొక్కరూ ఒక్కోలాగా చెబుతారు. “క్షణం విలువ తెలియాలంటే త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నవాణ్ణి అడుగు”అంటాడో మానసిక శాస్త్రవేత్త. చావుకు, బతుక్కి మధ్య ఎడం ఎంతో ఆ వ్యక్తే కచ్చితంగా చెప్పగలడట.*
💖 *’నిమిషం’ విలువ తెలియాలంటే చూస్తూండగానే రైలు తప్పిపోయినవాణ్ణడగాలి. (ఆ రైలునందుకుని అతడు చేసే ప్రయాణంమీదే అతడి భవిత ఆధారపడి ఉంటుందొక్కోసారి.*
❤️ *గంట విలువ తెలియాలంటే ఎవరి కోసమో నిరీక్షించేవారినీ, రోజు విలువ తెలియాలంటే ఆకలితో గడిపినవాణ్ణీ అడగాలి అంటారు. వారం విలువ తెలియాలంటే బంధువుల ఇంట్లో గడిపినవాళ్ళను (ఒకటి రెండు రోజులైతే గౌరవంగా చూస్తారు. ఆపైన ఎంతటి ఆత్మీయుడైనా చాలామటుకు చులకనే ఔతాడు) అడగాలట. నెల విలువ తెలియాలంటే జీతం అందుకునే ఉద్యోగినీ, సంవత్సరం విలువ తెలియాలంటే “కష్టపడి చదివినా ఏవో కారణాల వల్ల పరీక్ష తప్పిన విద్యార్థిని” అడిగితే కచ్చితంగా చెబుతారంటారు.*
💖 *సంవత్సరానికి మూడు బుుతువులు. ఒక్కొక్క బుుతువూ నాలుగేసి నెలలు. వర్షబుుతువు నాలుగు నెలలూ కురవకపోతే, మిగిలిన ఎనిమిది నెలలూ శూన్యమవుతాయి. కనుకనే “వర్షానికి” గౌరవ సూచకంగా, సంవత్సరాన్ని ‘వర్షం’ అంటాం.*
💓 *’మంచి కాలం, చెడ్డకాలం అని రెండు రకాలుండవు. వినియోగించుకునే నేర్పు, దక్షత మీదనే అవి ఆధారపడి ఉంటాయి’ అని నెపోలియన్‌ అన్నమాట అక్షరసత్యం. గతం, భవిష్యత్తుల కంటే వర్తమానమే సత్యమైనది. దాని విలువ చాలా గొప్పది. “రేపు చెయ్యాలనుకున్న పని ఈరోజు చెయ్యి. ఈరోజు చెయ్యాలనుకున్న పని ఇప్పుడే చెయ్యి” అన్నారందుకే.*
💞 *కాలానికి ఎన్నో అద్భుత శక్తులున్నాయి. అది ఎన్నింటినో సృష్టిస్తుంది. కొత్త ఆవిష్కరణలు చేస్తుంది. కడకు అన్నింటినీ తనలో కలిపేసుకుంటుంది. మనసుకు పడిన గాయాలను మాన్పుతుంది. భయంకరమైన సంఘటనల్ని, బాధల్ని మరిచిపోయేట్టు చేస్తుంది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. కాలానికి దయాదాక్షిణ్యాలు, రాగద్వేషాలు, స్వ పర భేదాలుండవు.*
💓 *అదెప్పుడూ ఎవరి కోసమూ ఆగదు. ఎవరేమన్నా, అనుకున్నా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కాలానికనుగుణంగా నడుస్తూ సద్వినియోగం చేసుకుంటే ఎవరైనా చరిత్ర సృష్టించగలరు. లేకపోతే కాలగర్భంలో “పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా” అన్నట్లు నికృష్టజీవులవుతారు.*
*ॐశ్రీవేంకటేశాయ నమః*

Address

Hyderabad
500096

Opening Hours

Monday 5am - 11:30am
Tuesday 5am - 11:30am
Wednesday 5am - 11:30am
Thursday 5am - 11:30am
Friday 5am - 11:30am
Saturday 5am - 11:30am
Sunday 5am - 11:30am

Telephone

8019312323

Website

Alerts

Be the first to know and let us send you an email when HaindavaDarmam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to HaindavaDarmam:

Share