Father Workz

Father Workz God the Father is the creator of all things. He is the Father of the universe.

This Father is a loving father, whatever the situation may be ,we may have turn away from Him still God the Father never

30/05/2021

// Prayer calms down attacks of the enemy //

In every situation prayer is the only thing that makes you to overcome. Prayer brings power to face all the attacks.

16/05/2021
15/05/2021

// ప్రతి ఎడతెగని ప్రార్థన ఒక అద్భుతముతో ముగుస్తుంది //

ప్రార్థన ....

ఎప్పుడైతే మనము ప్రార్థన జీవితానికి అలవాటు పడతామో మనకున్న ప్రతి సమస్యలు, ప్రతివిధమైన ఇబ్బందులు , అన్నీ ఆగిపోతాయి .
అందుకే ఆయన ఫిలిప్పీయులు 4:5 లో 6. దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
ప్రార్ధించు! ప్రతిఫలాన్ని అనుభవించు! అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక..! ఆమెన్!

Please Subscribe Our new Pages
Teens Book for Jesus
Kids Book for Jesus

15/05/2021

Devils greatest targets are Christian teens and youth. So Let us all build a rock solid foundation and a constant relationship with god at this age which ultimately gives us the ability to change the attitude of the devil and to defeat it..

11/05/2021

// ప్రార్థన శత్రువు భయాన్ని తీసేస్తుంది ప్రార్థన నీ మనసుని రూపాంతర పరుస్తుంది //

ఆయన శత్రువు భయమంతటి మీద మనకి ఎప్పుడో అధికారాన్ని ఇచ్చేసాడని లూకా 10 వ అధ్యాయములో రాసిపెట్టాడు .మనం వాటిని వాడుకొని ప్రార్థనలో ఆ శత్రువుని తరిమేయాలి .. ఆయనను మనం ముందు పెట్టి ఆయన చేయి పట్టుకొని నడవాలి . మనలను స్వస్థపరచువాడు ఆయనే .

యేసు ప్రభువు శిష్యులతో - మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడని చెప్పాడు. యేసు ప్రభువు ఈ మాట 12 మంది శిష్యులకు చె...
17/04/2021

యేసు ప్రభువు శిష్యులతో - మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడని చెప్పాడు. యేసు ప్రభువు ఈ మాట 12 మంది శిష్యులకు చెప్పి వారిలో ఒకడిని నాయకునిగా నియమించి పంపలేదు, 12 మంది నాయకులను పంపించాడు. ఈ రోజు దేవునిచేత పంపబడినా, దేవుని పని ఏది చేయగలిగినా నీవు నాయకుడవే. వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును అంటే ఒక్కడిగా పంపబడిన నాయకుడు 1000 మందిని శిష్యులను చేసే సామర్ధ్యం కలిగియున్నాడని అర్ధం.

దుష్టుడు ముందుగా ఒంటరి వానినే, ఒక్కడి మీదనే దృష్టిస్తాడు. దేవుని చేత ఎన్నిక చేయబడిన ఒక్కడిని ఆపగలిగితే 1000మందిని ఆపినట్లే. నీవు దేవుని చేత పంపబడిన వాడావని, నీవు దేవుడు నియమించిన నాయకుడవని గుర్తించాలంటే యేసు ప్రభువు ఎదుర్కొనిన మొదటి శోధనను గమనించాలి.
నిరుత్సాహం ఎంతటి బలవంతునినైనా బలహీనం చేసేస్తుంది. పని చేయని వానికి ఎప్పుడు నిరుత్సాహం కలుగదు. పని చేసే వానికే, ప్రయత్నించే వానికే నిరుత్సాహం కలుగుతుంది. యేసు ప్రభువు సాతాను శోధనను గుర్తించాడు కాబట్టే జయించాడు. ఈ రోజు దేవునిపైన, నీపైన అనుమానం కలిగించే, నిరుత్సాహపరిచే శోధనలో నీవుంటే జయించే మార్గం ఒక్కటే; దేవుని నోట నుండి వచ్చే మాట, అదే జీవముగల వాక్యం. ప్రతి రోజు, ప్రతి క్షణం వాక్యం చదివితే వెయ్యి మంది బలంతో నింపబడి వెయ్యి మందిని క్రీస్తు యొద్దకు నడిపించగలవు. అందుకనే కీర్తనాకారుడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని చెప్పాడు. దేవుని చేత నియమించిన నాయకుడు ఎప్పుడు వెనకవుండి తన్నుతాను తగ్గించుకుంటు దేవుడిచ్చిన పనిని ముగిస్తాడు. తనను తానుగ నియమించుకున్న నాయకుడు నాకంటే గొప్పవారు తెలివిగలవారు లేరని సకల ప్రవర్తనలో కనబరుస్తాడు. నీవు ఏ నాయకుడవు?

తానెక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదు. తాను దేవునివెంట వెళ్తున్నాడన్నది మాత్రం తెలుసు. అది చాలు అతనికి. ప్రయాణంమీద ఎక్కు...
16/04/2021

తానెక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదు. తాను దేవునివెంట వెళ్తున్నాడన్నది మాత్రం తెలుసు. అది చాలు అతనికి. ప్రయాణంమీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదుగాని ప్రయాణం చేసినవాడి మీద పూర్తిగా ఆధారపడ్డాడు. తనకెదురవ్వబోయే కష్టాల గురించి చూడలేదు. కానీ మార్గాన్ని సిద్ధపరచి నిశ్చయంగా తన మాటను నిలబెట్టుకోవడానికి సమర్థుడు నిత్యుడు, అదృశ్యుడు, జ్ఞానవంతుడు అయిన పరలోకపు రాజు పైనే దృష్టి నిలిపాడు. ఇది ఎంత మహిమాన్వితమైన విశ్వాసం! ఇది నీకియ్యబడిన పని, ఇవి నువ్వు చెయ్యగలిగిన వీధులు. నీ ఆజ్ఞలు ఎలాటివో అని నువ్ పరీక్షించుకోనక్కరలేదు. వాటిని అనుసరించి ఓడను సముద్రమార్గం పట్టించడమే నీ పని. అన్నిటినీ వదిలి లేచి క్రీస్తుని వెంబడించు. ఎందుకంటే భూమిపైనున్న అతి శ్రేష్టమైనవి పరలోకంలోని అత్యల్ప విషయాలకు సాటిరావు.

నిన్ను నడిపించేవాడు అందరూ నడిచిన దారిగుండా నిన్ను నడిపించడు. నీ కళ్ళు ఆ దారుల్ని చూస్తాయని నీ కలల్లో కూడా నీవు ఊహించి ఉండవు. అలాటి దారులగుండా నువ్వు వెళ్తావు. భయం ఆయన దరిచేరదు. అలానే ఆయన నీతో ఉన్నంతకాలం నువ్వు కూడా దేనికీ భయపడకూదని ఆయన అంటున్నాడు.

సిలువ అనేది మనిషి చేసిన పాపమును భరించే దేవుని ప్రేమ, సిలువ ప్రేమ ఒక్కటే పాపి హృదయాన్ని కరిగించి, పశ్చాత్తాపాం తీసుకురాగల...
15/04/2021

సిలువ అనేది మనిషి చేసిన పాపమును భరించే దేవుని ప్రేమ, సిలువ ప్రేమ ఒక్కటే పాపి హృదయాన్ని కరిగించి, పశ్చాత్తాపాం తీసుకురాగలదు. పరలోకమునకు సిలువే మార్గం. సిలువ యొద్దకు వచ్చిన వారు ఎప్పటికీ ఒకేలా ఉండరు. సిలువ జీవితమునకు క్రొత్త ఉద్దేశ్యాన్ని ఇస్తుంది. మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును అని వాక్యం సెలవిస్తుంది. సిలువను ఎత్తుకున్నవానికే యేసు బోధలు అర్ధమవుతాయి. సిలువను ఎత్తుకున్నవాడే దేవుని చేత నడిపించబడుతాడు. సిలువను ఎత్తుకున్నావాని ప్రాణమునకే విశ్రాంతి. విశ్రాంతి అనగా ప్రతి ప్రయత్నంలో విజయమును చూస్తావు కాబట్టి నీకు నిరుత్సాహం ఉండదు నెమ్మది సంతోషముతో నింపబడతావు.మనకున్న గొప్ప భాగ్యం సిలువ. సిలువను ధరించేవాడు కాదు సిలువను మోసేవాడే కైస్తవుడు. సిలువ ధ్యానం ఎంత శక్తివంతమైనదనగా, సిలువ గురించి ధ్యానం చేస్తే లోకం మీద కోరిక ఉండదు. సిలువ ధ్యానం శరీరాశల మీద విజయమును ఇస్తుంది. శరీరమును జయించాలంటే సిలువ ధ్యానమే మార్గం. నీవు ఒంటరిగ ఉంటే సిలువ వైపు చూడు. నీవు విడువబడితే సిలువ వైపు చూడు. నీవు అవసరతలో ఉంటే సిలువ వైపు చూడు. జీవితములో విజయం చూడలేనని అనిపిస్తే సిలువ వైపు చూడు ఎందుకంటే సిలువలో యేసు ప్రభువు అందరిచేత తృణీకరించబడి, తండ్రి చేత విడువబడి, ఒంటరితనములో ఎలా విజయము సాధించాడో చూడగలిగితే నీవెప్పుడు వెనకడుగు వేయలేవు, ఆగిపోలేవు.

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Father Workz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share