Sri Sri Sri Raama Lingeshwara Aalayam

Sri Sri Sri Raama Lingeshwara Aalayam శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర ఆలయం (SRI SRI SRI RAAMA LINGESHWARA AALAYAM)

ఈ రోజు 26 మే 2024, సంకష్ట హర చతుర్థి పురస్కరించుకుని శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర ఆలయం శిల్పా పార్క్, కొండాపూర్ నందు వెలస...
26/05/2024

ఈ రోజు 26 మే 2024, సంకష్ట హర చతుర్థి పురస్కరించుకుని శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర ఆలయం శిల్పా పార్క్, కొండాపూర్ నందు వెలసిన క్షిప్ర గణపతికి విశేష పంచామృత అభిషేకము, అష్టోత్తర పూజ, అలంకరణ మరియు పంచ హారతులు ఇవ్వటం జరిగింది.

వేద శాస్త్ర విద్వాంసులు తెలుగువారు గర్వించదగ్గ జ్ఞాననిధి బ్రహ్మశ్రీ ముదిగొండ శంకరశర్మగారు శంకర జయంతి రోజున భగవత్పాదుల్లో...
13/05/2024

వేద శాస్త్ర విద్వాంసులు తెలుగువారు గర్వించదగ్గ జ్ఞాననిధి బ్రహ్మశ్రీ ముదిగొండ శంకరశర్మగారు శంకర జయంతి రోజున భగవత్పాదుల్లో లీనమయ్యారు.. నిన్నటిదాకా గుంటూరులో ని సంపత్ నగర్ లోని శృంగేరి శంకరమఠంలో శంకర జయంతి ప్రత్యేక ప్రవచనాలు అందించిన శంకరశర్మగారు కొంత అస్వస్థతకు లోనవగా హుటాహుటిన భాగ్యనగరానికి నిన్న విచ్చేసి ఆసుపత్రిలో చేరగా కొద్దిసేపటికి వారు తుది శ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.. ఇవాళ నాగోల్ లోని వారి నివాసం నుంచి బయల్దేరి వారి అంత్యక్రియలు 12 గంటలకు స్థానిక వైకుంఠధామంలో జరుగుతాయి.ముదిగొండ శంకర శర్మ గారి నాన్నగారు బ్రహ్మవిద్యాలంకార బ్రహ్మశ్రీ ముదిగొండ వేంకట రామశాస్త్రి గారుమహా పండితులు.. మూడు తరాల శృంగేరి జగద్గురువులతో అత్యంత వాత్సల్యం కలిగినటువంటి శిష్యులు. ఈ మహావిద్వాన్మూర్తి నిర్యాణానికి సభక్తికంగా నివాళి అందిస్తోంది.

రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము దాశరధీ నీవాధారము...
17/04/2024

రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము దాశరధీ నీవాధారము...

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బెద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ము...
17/04/2024

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.

శ్రీరామ నవమి పురస్కరించుకుని ఈరోజు శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర ఆలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామ చంద్ర ప్రభువు ...
17/04/2024

శ్రీరామ నవమి పురస్కరించుకుని ఈరోజు శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర ఆలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామ చంద్ర ప్రభువు ఇలా దర్శన మిచ్చారు.

సర్వాంగ సుందరంగా తయారు అయిన మన శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర ఆలయం.
14/04/2024

సర్వాంగ సుందరంగా తయారు అయిన మన శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర ఆలయం.

Address

Hyderabad
500084

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Sri Sri Raama Lingeshwara Aalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category