Holy Temple Hyderabad

Holy Temple Hyderabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Holy Temple Hyderabad, Religious organisation, Hyderabad.

17/04/2025
17/07/2023

యేసుక్రీస్తుకు నిజమైన శిష్యులుగా ఉండాలంటే...?

క్రిస్మస్ నందు ఎన్ని కష్టాలో..!🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲👉1. క్రీస్తు జననాన్ని బట్టి యోసేపు, మరియ ఎంతో అవమాన పరచబడ్డారు. మరియ నిండు చూలాల...
23/12/2021

క్రిస్మస్ నందు ఎన్ని కష్టాలో..!
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
👉1. క్రీస్తు జననాన్ని బట్టి యోసేపు, మరియ ఎంతో అవమాన పరచబడ్డారు. మరియ నిండు చూలాలై చలిలో బహు ప్రయాసతో నజరేతు నుండి భేత్లేహేముకు ప్రయాణము చేసెను. కడకు పశువుల పాకలో, పశువుల రోచ్చులో దిక్కుమాలిన స్థితిలో ప్రసవించింది.

👉2. భేత్లేహేము పరిసర ప్రాంతాల్లో వున్న తల్లిదండ్రులుకు కడుపు కోత మిగిలినది. 2సం.లలోపు చిన్నారులందరూ నరకబడతో వీధులన్నీ చిన్నారుల రక్తపు మడుగులతో నింపబడెను.

👉3.ఆ పశువుల కాపరులు తమకు జీవనాధారమైన పశువుల ను విడచి క్రీస్తును చేరి ఆయనను దర్శించి, ఆయనను ప్రకటించిరి.

👉4 .నక్షత్రం ద్వారా క్రీస్తు జన్మించెనని తెలుసుకొన్న జ్ఞానులు ఇంచుమించు .2సం.లకు పైగా రేయనక పగలనక, ఎండనక వాననక వారికున్న సమస్తాన్ని విడిచి బాలుడైన యేసును చూడ వెళ్ళడం గొప్ప ప్రయాసే.

👉5.ఎవరిలో అయితే క్రీస్తు జన్మించెనో వారి జీవితాలు రూపాంతరం చెంది తమ్మును తాము అద్దములకు, సిలువలకు, ఆఖరికి మరణానికి అప్పగించుకోవడం విధితమే.

👉6.లోక రక్షకుడు జన్మించెనన్న వార్తను ప్రకటించడానికి తమకున్న సమస్తాన్ని విడిచి భాష రాకున్నా, ఎంత దూరమైనా నశించిపోతున్న ఆత్మలకొరకు మిషనరీలు పడిన ప్రయాస ఈ క్రిస్మస్ ఫలితమే.

👉7.తొలినాటి క్రిస్మస్ నుండి నేటి క్రిస్మస్ వరకు ఎంతో మంది క్రీస్తు సువార్తను బ్రతికించడానికి తమ్మును తాము హతసాక్షులుగా అప్పగించుకొనుటకు లోకరక్షకుని జననమే కారణం.

👉8. నశించి పోతున్న పాపిష్టి మనిషి కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి దిక్కుమాలిన వానిగా ఈలోకానికీ పంపించటం దేవుని ప్రేమకు నిదర్శనమే.

👉9.ఆయన దేవునితో సమానునిగా ఉండుట విడిచి పెట్టకుడని భాగ్యము గా ఎంచుకొనక నిన్ను నన్ను రక్షించుటకై తన్నుతాను రిక్తునిగాను, దరిద్రునిగాను మార్చుకొనుట ఊహకందని వాస్తవమే.

మరి నీవు ఏం చేస్తున్నావు...?
క్రీస్తు కొరకు ఏమైనా చేసావా...?
నేడే ప్రయత్నించు... 🙏

Call: 7893695931.

పేద మార్టిన్ క్రిస్మస్!🎯🎯🎯🎯🎯🎯🎯🎯👉ఒక ఊరిలో మార్టిన్ అనే వృద్ధుడు ఒక క్రిస్మస్ రోజు - జ్ఞానులు బాలుడైన యేసుకు బహుమతులర్పించ...
13/12/2021

పేద మార్టిన్ క్రిస్మస్!
🎯🎯🎯🎯🎯🎯🎯🎯
👉ఒక ఊరిలో మార్టిన్ అనే వృద్ధుడు ఒక క్రిస్మస్ రోజు - జ్ఞానులు బాలుడైన యేసుకు బహుమతులర్పించిన విషయం చదివి, నేను కూడా యేసు ప్రభువుకు ఏదైనా యివ్వాలని ఆశపడెను. ఆ రాత్రి అతడు నిద్రిస్తుండగా - "మార్టిన్! నీవు నన్ను చూడాలని, నాకేమైనా యివ్వాలని ఆశపడుచున్నావు గదా! రేపు నేను నీఇంటి దగ్గరకొస్తాను; నీవు పిలిస్తే లోపలికి వస్తాను" అన్న స్వరము వినెను. ఎంతో సంతోషముతో మార్టిన్ వేకువనే లేచి, తన ఇల్లు శుభ్రం చేసి, వేడి వేడి ఫలహారాలను, పాలను సిద్ధపరచి ఎదురుచూచుచుండెను.

👉అయితే నిర్మానుష్యంగా ఉన్న ఆ వీథిలో, దట్టమైన మంచు మధ్య చలికి వణికిపోతూ ఉన్న ఒక వృద్ధుడు కనిపించెను. మార్టిన్ అతని చూచి, జాలిపడి,లోపలికి ఆహ్వానించి - ఈ రొట్టె తిని, ఈ వేడి కాఫీ త్రాగి సేద తీర్చుకోమని చెప్పెను. ఆ ఆతిథ్యాన్ని స్వీకరించి, కృతజ్ఞతలు తెలియజేసి ఆ వృద్ధుడు వెళ్ళిపోయను.మరొక గంటకు చాలా మురికిగా ఉన్న, చినిగిన వస్త్రములు ధరించిన ఒక స్త్రీ తన బిడ్డ నెత్తుకొని ఆ వైపుగా వచ్చుట చూచిన మార్టిన్ వెంటనే తలుపు తీసి, ఆమెను లోపలికి ఆహ్వానించి, ఆమెకు ఆహారమును, ఆ చిన్న బిడ్డకు పాలను యిచ్చెను. ఆచిన్న బిడ్డకు చక్కటి వస్త్రములను కూడా తొడిగెను. ఆమె కూడా అతనికి కృతజ్ఞతలు తెలియజేసి వెళ్ళిపోయెను. ఆలాగు గంట గంటకు అవసరతలో ఉన్న మరికొందరు వ్యక్తులు ఆ వైపుకు రావటం, వారందరిని మార్టిన్ ఆహ్వానించి వారికి ఆతిథ్యమిచ్చి పంపటం జరిగింది.

👉అయితే వస్తానన్న ప్రభువు ఇంకా రాలేదేంటా? అనే దిగులుతో ఆ రాత్రిపడకకు చేరాడు మార్టిన్ అయితే ఆ రాత్రి అకస్మాత్తుగా ఆ గదియంతా వెలుగులో నింపబడింది. ఆ దినము అతడు ఆతిధ్యమిచ్చిన వృద్ధుడు, చినిగిన వస్త్రములతోఉన్న ఆ స్త్రీ , ఆ చిన్న బిడ్డ, ఇంకా పగలు తాను ఆతిధ్యమిచ్చిన వారందరు ఒకరి తరువాత ఒకరు కనబడిని. "నేనే వీరి రూపంలో నీ యొద్దకు వచ్చి, నీ ఆతిథ్యమును స్వీకరించాను" అన్న ప్రభువు స్వరం వినబడింది.

👉"మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును" అని బైబిలు చెప్పుచున్నది. (మత్తయి 25:40)

🎯ప్రతి రోజు ఆత్మీయ సందేశాలు చదువుటకు వినుటకు ఈ క్రింది లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి🙏

https://chat.whatsapp.com/B6DPtkuQq7RGRowsWVluZy

Or

☎️ 7️⃣8️⃣9️⃣3️⃣6️⃣9️⃣5️⃣9️⃣3️⃣1️⃣

God blessed with Best Family 🙏🙏🙏🙏Thank you Lord 🙏🙏🙏🙏
04/12/2021

God blessed with Best Family 🙏🙏🙏🙏
Thank you Lord 🙏🙏🙏🙏

నీవు ప్రార్థించడం ప్రారంభిస్తే దేవుడు నీ కోసం పని చేయడం ప్రారంభిస్తాడు.. 🙏🙏🙏
30/11/2021

నీవు ప్రార్థించడం ప్రారంభిస్తే దేవుడు నీ కోసం పని చేయడం ప్రారంభిస్తాడు.. 🙏🙏🙏

Religious organisation

Address

Hyderabad
500045

Website

Alerts

Be the first to know and let us send you an email when Holy Temple Hyderabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share