Arunachala Siva Seva Satsang

Arunachala Siva Seva Satsang Spiritual & Charity activities

Kanchi + Arunachalam Trip
11/02/2026

Kanchi + Arunachalam Trip

*సత్సంగం అరుణాచలం 34వ యాత్ర* Friday - 4.30 PM నార్సింగి డిమార్ట్ నుండి ప్రారంభంMonday- 7.30 AM నార్సింగి డిమార్ట్‌కి తిర...
11/02/2026

*సత్సంగం అరుణాచలం 34వ యాత్ర*

Friday - 4.30 PM
నార్సింగి డిమార్ట్ నుండి ప్రారంభం

Monday- 7.30 AM
నార్సింగి డిమార్ట్‌కి తిరిగి రావడం

1) 44 ఎనర్జీ పాయింట్లు చూడడం
2) స్థానిక దేవాలయాలు & ప్రధాన ఆలయ సందర్శన
3) రమణ మహర్షి/శేషాద్రి స్వామి ఆశ్రమాల సందర్శన
4) గిరిప్రదక్షిణ నడక & ఆటో ద్వారా (పెద్ద వాళ్లకు)
5) కంచిలో లోకల్ temples

కంచి & అరుణాచలం ....ఏసి స్లీపర్ బస్సు & ఏసి గదుల వసతి

ఇది తెలుగు ప్రవచనంతో కూడిన యాత్ర....ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి డిస్కౌంట్ ఉంటుంది

ఇది నెలకు ఒక్క యాత్ర మాత్రమే ఉంటుంది...

*అరుణాచల శివ సేవా సత్సంగం*
9652110433

🥀దత్త క్షేత్రములు..!!దత్తావతారాలు🥀1. *శ్రీపాద శ్రీ వల్లభ స్వామి - పిఠాపురం*దత్తుని ప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీ వల్లభుడ...
24/10/2024

🥀దత్త క్షేత్రములు..!!దత్తావతారాలు🥀

1. *శ్రీపాద శ్రీ వల్లభ స్వామి - పిఠాపురం*

దత్తుని ప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్రదేశం. ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది..

*2. కురువపురం*

ప్రథమ దత్తావతారులైన శ్రీపాదవల్లభులు తపసు చేసిన స్థలం... ఇది హైదరాబాదు, కర్నూలు రూటులో దేవరకద్ర స్టేషను నుండి బస్ లో వెళ్ళవచ్చు.

*3. గోకర్ణము*

ప్రథమ దత్తావతారులైన శ్రీపాదవల్లభులు తపసు చేసిన స్థలం ... ఇది కర్నాటక రాష్ట్రము హుబ్లి నుండి బస్ లో వెళ్ళవచ్చు.

*దత్తావతారం..నృశింహ సరస్వతి.*

*4. కరంజా*

రెండవ దత్త అవతారం, నృశింహ సరస్వతి (శ్రీ గురుడు) జన్మస్థలం...
ఇది మహరాష్ట్ర అమరావతి జిల్లాలో ఉన్నది

*5. నర్సో బావాడిన*

శ్రీ గురుడు 12 సం॥తపసుచేసిన స్థలం,... ఇది కొల్హా పూర్ మీరజ్ రూటులో ఉన్నది

*6. గాణగా పూర్*

శ్రీ గురుడు 23 సం నివసించినస్థలం, ఇది కర్నాటక గుల్బర్గ వద్ద కలదు. ఇచ్చట శ్రీగురుని నిజపాదుకలు కలవు,
చూడవలసి స్థలం, బీమా-అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం

*7. ఔదుంబర్‌*

శ్రీ గురుడు చాతుర్మాసం చేసిన స్థలం. ఇది కూడ మహరాష్ట్రలో ఉన్నది.

*8. మీరజ్.*

ఇచట శ్రీ గురుడు తపసు చేసిన స్థలం. కొల్హాపూరు రూటులో జైసింగ్ పూరు వద్ద నుండి వెళ్ళవచ్చు.

*9. శ్రీశైలం*

శ్రీ గురుడు అంతర్దానమైన ప్రదేశం.
ఈ స్థల దర్శనం చాలా దుర్లభం అంటారు. దత్తాత్రేయ స్వామి అనుగ్రము ఉంటే చేరుకోగలరు
ఇది ఆంద్రప్రదేశ్ కర్నూలు జిల్లా లో ఉంది.

*దత్తావతారం.. మాణిక్య ప్రభువులు.*

*మాణిక్య నగర్*

మూడవ దత్తావతారం,
శ్రీమాణిక్య ప్రభువుల వారి సమాధి, ప్రభువుల వారి సంస్ధానం, కర్నాటక గుల్బర్గా - హైదరాబాదు రూటులో హుమ్నాబాదుకు దగ్గరలో ఉన్నది.
తప్పక చూడవలసిన క్షేత్రము.

*దత్తావతారం - అక్కల కోటస్వామి.*

*10. అక్కల్ కోట*

నాలుగవ దత్తావతారం,
స్వామిసమర్థ (అక్కల్ కోటస్వామి ) సమాదధి మందిరం ఇది చెన్నై - ముంబాయి రూటులో అక్కల్ కోట స్టేషనులో దిగి బస్ లేదా ఆటో పై వెళ్ళవచ్చు.
తప్పక చూడవలసిన దత్త క్షేత్రము.



*11 సాకోరి*

ఏక ముఖ దత్తుని ఆలయం కలదు.
ఇది షిరిడికి దగ్గరలో ఉన్నది ఆటోలో వెళ్ళి రావచ్చు

*12. నాశిక్..*

ఇచట ఏకముఖ దత్త విగ్రహం ఉంది. ఇది కూడా షిరిడి నుండి వెళ్ళవచ్చు.

ప్రముఖ దత్త క్షేత్రములు.

*13గిరి నార్*

ఇచ్చట దత్తపాదుకలు కలవు.
ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
ఇది చాలా మహిమగల 10,000 మెట్లు కలిగిన కొండపై ఉన్నది,
ఈ కొండపై దత్తపాదుకలు దర్శిస్తే దత్త అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల నమ్మకం

*14 షేగాం*

ఇచ్చట మరో దత్త రూపుడు గజానన మహరాజ్ సమాధి మందిరం కలదు
ఇది నాగపూర్ పట్టణంనకు దగ్గరలో కలదు
ఇది కూడ చూడదగ్గ క్షేత్రం.

*15ఖేడ్గావ్*

సమర్దనారాయణమహరాజ్ వారి సమాధి కలదు.
ఇది పూనా వద్ద కలదు.

*16 ఖాoడ్వా.*

శ్రీ దున వాలా దాదా వారి సమాధిమందిరం ఉంది.
ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కలదు.

*17మాణ్ గావ్.*

శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి జన్మస్థలం, గురు చరిత్రను అందించిన మహనీయుడు. మహారాష్ట్రలో ఉంది
ఇది చూడదగ్గ క్షేత్రం.

*18 గరుడేశ్వర్.*

శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి సమాధి మందిరం కలదు
గుజరాత్ రాష్ట్రంలో బరోడా జిల్లాలో ఉంది
ఇది తప్పక చూడవలసిన క్షేత్రం

*19. మౌంటు అబూ*

ఇచట దత్త శిఖరము కలదు.
రాజస్తాన్ రాష్ట్రములో కలదు...

🙏దిగంబరా దిగంబరా సద్గురు దత్తా దిగంబరా🙏

09/10/2024

* #ఈ సృష్టిలో మనం ఎంత?*

1) మనమే కొత్తగా ఏమీ చేయట్లేదు
2) మనకంటే ముందు ఈ సృష్టి ఉంది
3) మన తర్వాత కూడా ఈ సృష్టి ఉంటుంది

4) మనకు వచ్చే ఆలోచనలు - మనం చేసే పనులు - మన సంకల్పాలు - మనం చేసే సేవా కార్యక్రమాలు
5) ఇవన్నీ కూడా ఎంతో మంది - ఎన్నో రకాలుగా - ఎన్నో సంవత్సరాలుగా - ఏదో ఒక చోట చేస్తూనే ఉన్నారు
6) మనకున్న జ్ఞానం /భక్తి - ఎంతో మందికి అంత కంటే ఎక్కువగా ఉంటుంది
7) మనమే గొప్ప అన్న అహంకారం వద్దు

8) ఈ సృష్టిలో మన స్థానం - సముద్రంలో ఒక నీటి బిందువుతో సమానం
9) కనుక - ఈశ్వరుడికి శరణాగతి చేయడం మంచి పని ..
10) అదే కోరిక లేని స్థితి .. అది రావడమే - సాధన /ముక్తి/మోక్షం ..
11) 'నేను' చేస్తున్నాను అనే భావన పక్కన పెట్టాలి

*అప్పుడు ఈ సృష్టి అంతా కూడా శివుడి క్రీడా స్థలంగా కనబడుతుంది*

25/09/2024

*ఈ జీవితం విడిచి పెట్టిన బాణం*

ఎలా జరగాలి అని వ్రాసి ఉంటే...అలా జరుగుతుంది...

ఎన్ని మంచి పనులు చేసినా...ఎంత ధర్మం పట్టుకున్నా...కష్టాలు వస్తాయి

మనం చేసే పూజలు...మంచి పనులు...శాస్త్ర పఠనము...సేవా కార్యక్రమాలు...

ఇవి ఈ జన్మలో కష్టాలు రాకుండా కాపాడుతాయి...వచ్చినా తట్టుకుని నిలబడి ఉండే ధైర్యం ఇస్తాయి ...కష్టాల తీవ్రత తగ్గుతాయి ...

పాము కరవాలి అని వ్రాసి పెట్టి ఉంటే...చిన్న దోమ కరుస్తుంది

మనం భూమి మీద మనిషిగా ఉన్నారు అంటే పోయిన జన్మ లో కొంత పుణ్యం & కొంత పాపం చేశామని గుర్తు...

1) మొత్తం పుణ్యం చేస్తే దేవతలుగా స్వర్గం లో ఉంటాం...
2) మొత్తం పాపం చేస్తే...కుక్క/పంది /గాడిద జన్మ వస్తుంది...
3) కొంత పుణ్యం & కొంత పాపం చేస్తే మనిషి జన్మ వస్తుంది

11/09/2024

*పూజలు కాదు...ముందుగా మనం మారాలి*

క్రింద చెప్పినవి చేస్తూ..మనం ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు....

1) ఇతరులను మన మాటల చేత బాధ పెట్టడం
2) ఇతరుల డబ్బు/ఆస్తి దోచుకోవడం
3) ఇతరులను మోసం చేయడం
4) ఇతరులను ఏడిపించడం
5) కష్టాల్లో ఉన్నవారిని చూసి జాలి కలగపోవడం
6) చేసిన మేలును మరచిపోవడం
7) మనకు సహాయం చేసిన వారిని మరచిపోవడం
8) అధర్మముగా డబ్బు సంపాదించడం
9) ఉన్నదాంట్లో పేదలకు సహాయం చేయకపోవడం
10) ధర్మ శాస్త్రాలను అదే పనిగా విమర్శించడం
11) ఇంట్లో పితృకార్యాలు చేయకపోవడం
12) మూగ/చెవిటి/గుడ్డి వాళ్లను చూసి అవమానించడం
13) కారణం లేకుండా మూగ జీవులను హింసించడం
14) భక్తులను/సాధు/సన్యాసులను అవమాన పరచడం
15) కావాలని అప్పు చేసి ఆ డబ్బు తీర్చకపోవడం
16) తల్లి/తండ్రిని అవమానించడం

29/08/2024

*రమణ మహర్షి మాటలు*

ఎదుటి వారిని మార్చాలని...ఎదుటి వారికి ఏదో నేర్పించాలి అని అనుకోవడం తప్పు

మనకు మనం మారాలి...మనం మంచిగా మారితే...ఆ ప్రభావం తో ఆటోమేటిక్ గా ఇతరులు మారతారు....

మనం ఎంత చెప్పినా ఎవరూ మారరు...మారాలని వాళ్ల జీవితం లో వ్రాసి ఉంటే తప్ప

జీవితం ఒక సినిమా...అంతే...ఏది ఎలా జరగాలి అని ఉంటే అలా జరుగుతుంది

మనం జరగకూడదు అని ఎంత అనుకున్నా....ఎంత ఆపాలని చేసినా జరగబోయే దానిని ఆపలేము....

మనం జరగాలి అని అనుకుంటే అది జరగదు.....జరిగేది జరుగుతుంది

అన్నీ శివుడి చేతిలో ఉంటాయి అనేది అర్థం అయితే...అదే మోక్షం...

29/08/2024

*శ్రీకాళహస్తి main temple లో చూడాల్సినవి*

1) అమ్మవారి నాగవడ్డానం
2) శివుడి ముందు దీపం
3) రోమస మహర్షి & ధూర్జటి మహా కవి యొక్క సమాధిల పై గడప
4) దక్షిణమూర్తి
5) స్పటిక లింగం
6) సహస్ర లింగం
7) 3 గోపురాలు ...can see by standing in 3 circles
8) అగస్త్య మహర్షి విగ్రహము
9) సూక్ష్మ నంది
10) పాతాళ గణపతి
11) సీతారాములు/ఇతర దేవతలు ప్రతిష్ట చేసిన శివలింగాలు
12) చిత్రగుప్త శివలింగం (like thumb finger)
13) చాలా గణపతులు
14) ఇంకా తెలియని ఎన్నో రహస్యములు

*దగ్గరగా ఉంటే విలువ తెలీదు*

మనం ఎక్కడో chardham యాత్ర...కాశి వెళుతూ ఉంటాం...

మనకు దగ్గరలో ఉన్న అద్భుతంగా ఉన్న temple...Srikalahasthi...

తప్పకుండా అందరూ ఒకసారి వెళ్లి ఇవన్నీ చూడాలి 🙏

13/08/2024

*మంచి సానుకూల స్పందన*

మా కొత్త సత్సంగ్ ఆఫీస్ స్పేస్ గురించి

1) మా ప్రయత్నాలను సభ్యులు అభినందిస్తున్నారు
2) మా కార్యకలాపాల గురించి కొద్దిమంది సందర్శిస్తున్నారు & మాతో చర్చిస్తున్నారు
3) సత్సంగ యాత్రల గురించి కొంతమంది అడుగుతున్నారు
4) కొంతమంది మంచి పుస్తకాలు చదవాలని & కొన్ని పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు
5) కొద్దిమంది రోజు ధ్యానానికి రావాలని కోరుకుంటున్నారు
6) కొంతమంది రోజు లేదా వారానికి ఒకసారి సత్సంగ్ సెషన్‌లకు హాజరు కావాలని కోరుకుంటున్నారు
7) కొంతమంది సీనియర్లు రోజూ ఆఫీసులో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నారు

09/08/2024

*అసలు కర్త ఎవరు?*

1) ఇది చేయాలా...చేయవద్దా ?
2) ఇది అలా చేయాలా...ఇలా చేయాలా?
3) ఇది చేయాలా? అది చేయాలా?
4) ఏది చేయాలి? ఎందుకు చేయాలి?
5) ఇది చేస్తే ఏమి వస్తుంది? చేయక పోతే ఏమి అవుతుంది?
6) నేను ఎందుకు చేయాలి?

సంకల్పం చేస్తున్నది ఎవరు?
చేయిస్తున్నది ఎవరు?
చేసే శక్తిని ఇస్తున్నది ఎవరు?

*నేను నేను నేను అంటున్నది ఎవరు?*

*అసలు "నేను" ఎవరు?*

మనం కర్త అనుకుంటే...ఫలితం గురించి ....బాధ/భయం/విచారణ/ఆలోచన...

దేవుడు నా చేత చేయిస్తున్నాడు ...అనుకుంటే ఇంక దిగులు ఎక్కడిది?

Address

Hyderabad
500089

Telephone

+919652110433

Website

Alerts

Be the first to know and let us send you an email when Arunachala Siva Seva Satsang posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share