01/01/2022
శిశు సంస్కార మహా యజ్ఞ కార్య క్రమ విశేషాలు :
ఈ కార్య క్రమం ప్రతినెలా పుష్యమి నక్షత్ర దినం నందు నిర్వహిచడం జరుగుతుంది.
ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు పూర్తవుతుంది
ఉదయం 7 గం//లకు యజ్ఞ వేదిక పై ఆశీనులైన వేద పండితుల సమక్షంలో మీకు కేటాయంచిన స్థలంలో కూర్చోబెట్టి నియమ పూర్వకంగా యజ్ఞ సంకల్పంతో ప్రారంభమౌతుంది.
ముందుగా సంకల్పం,ఈశ్వరస్తుతి,స్వస్తివాచనం,శాంతిప్రకరణ వేద మంత్రోచ్చారణ చేయడం జరుగుతుంది.
తదుపరి అగ్ని ప్రజ్వలన మంత్రాలతో యజ్ఞం ఆరంభమౌతుంది ముఖ్యమైన మంత్రాలతో అగ్ని హోత్రం మొదలై శిశు సంస్కార విశేష మంత్రాలతో యజ్ఞం లో విశేష ఆహుతులు ఇవ్వడం జరుగుతుంది.
శిశు సంస్కార యజ్ఞం సమాప్త సమయానికి ముందు యజ్ఞం లో పాల్గొన్న యజమానులు వారి కుటుంబసమేతంగా యజ్ఞ వేదికపై వచ్చి విశేష యజ్ఞ ఆహుతులను సమర్పించి తమకు కేటాయించిన స్థలం నందు తిరిగి కూర్చోవలసి ఉంటుంది.
పూర్ణాహుతి మరియు యజ్ఞం అనంతర ప్రార్థన యజ్ఞ హారతి తదుపరి శాంతి మంత్రాలతో యజ్ఞం సుమారు 9 గంటలు,9 30 లోపు పూర్తిఅవుతుంది. తిరిగి ఈ కార్యక్రమం 10 30 నిలకు పునః ప్రారంభభమై మధ్యాహ్నం 1 00 గం లకు ఆశీర్వాదం ,విశేష ప్రసాదం అందించి ఈ మహా యజ్ఞాన్ని పూర్తిచేయడం జరుగుతుంది.
ముఖ్యంగా ఈ కార్య క్రమంలో 4 ముఖ్యమైన అంశాలపై ప్రతి 45 నిమిషాలకు ఒక విశేష అంశంపై ప్రెసెంటేషన్ ఉంటుంది.