లేపాక్షి దేవాలయం - Lepakshi Temple

  • Home
  • India
  • Hindupur
  • లేపాక్షి దేవాలయం - Lepakshi Temple

లేపాక్షి దేవాలయం - Lepakshi Temple జైశ్రీరాం. హిందూబంధువులకు నమస్సుమాం?

16/02/2026

శ్రీ సత్యసాయి జిల్లా

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లేపాక్షిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా కొనసాగిన శివపార్వతుల బ్రహ్మరథోత్సవం

వేలాదిగా పాల్గొన్న భక్తులు,శివనామస్మరణతో మార్మోగిన లేపాక్షి వీధులు

శ్రీదుర్గా,పాపనాశేశ్వర, వీరభద్ర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లను దర్శించేందుకు భారీగా క్యూ కట్టిన భక్తులు

శ్రీ దుర్గా పాపనాశేశ్వర, వీరభద్ర దేవాలయములేపాక్షి - 515 331, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్మహాశివరాత్రి కళ్యాణ, రుద్...
11/02/2026

శ్రీ దుర్గా పాపనాశేశ్వర, వీరభద్ర దేవాలయము

లేపాక్షి - 515 331, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్

మహాశివరాత్రి కళ్యాణ, రుద్ర, చండీయాగ, బ్రహ్మరథోత్సవ ఆహ్వాన పత్రిక

తేది 14-2-2026 నుండి 18-2-2026 వరకు జరుగును

భక్తమహాశయులారా......

భారతదేశంలో అతి పెద్ద నంది విగ్రహముగల దేవాలయము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా, లేపాక్షి మండలం లేపాక్షి గ్రామములో ఉండటం బహు విశేషం. ఈ దేవాలయము 15వ శతాబ్దములో విజయనగర చక్రవర్తుల కాలములో శ్రీ విరూపణ్ణ, వీరణ్ణ అనే సహెూదరులచే నిర్మించబడినది. ప్రాచీన శిల్ప, చిత్ర కళలకు క్షేత్రమైనది. దేశ విదేశాలలో లేపాక్షి చీరలు, డిజైన్స్ బార్డర్లకు విశేష ఆదరణ పొందినది. ఈ దేవాలయము నందు శ్రీ వీరభద్రస్వామి, శ్రీ పాపనాశేశ్వర స్వామి, శ్రీ రఘునాథస్వామి, శ్రీ దుర్గాదేవి మున్నగు దేవతలు ఒకే స్థలమునందు ఉండటం చాలా విశేషమైనది. ఇటువంటి దేవాలయాన్ని కేంద్ర పురాతత్వ శాఖవారు విమాన గోపురాలు, ప్రాకారాదులు, సుందరమైన తోటలు నిర్మించి దేవాలయాన్ని అతి సుందరముగా తీర్చి దిద్దుచున్నారు.

ఇటువంటి క్షేత్రమునందు శ్రీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు,

శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘ బహుళ ద్వాదశి శనివారం 14-2-2026 నుండి 18-2-2026 బుధవారం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు...!

భక్తులందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాము

#లేపాక్షి

Address

Lepakshi
Hindupur

Website

Alerts

Be the first to know and let us send you an email when లేపాక్షి దేవాలయం - Lepakshi Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category