06/02/2025
హిందూపురం:
రాష్ట్రంలోనే మొదటిసారిగా బెస్తల /బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా జరగనున్న శివపార్వతుల కళ్యాణోత్సవం..
పరమశివునికి ఇష్టమైన మాఘమాసం, పవిత్రమైనసోమవారం రోజు ఆరుద్ర నక్షత్రం అనగా 10.2.25 వ తేది సోమవారం వైభవంగా జరగనున్న శివపార్వతుల కళ్యాణం
రెండు రోజులు(9/2/25మరియు 10/2/25) హిందూపురం బెస్త సేవా సంఘం, బెస్తలచే నిర్మింపబడిన శ్రీ జలకన్టేశ్వర స్వామి మరియు శ్రీ గంగమ్మ దేవస్థానమునందు వేద పండితులతో ,మంత్రోచ్ఛరణలతో హోమములు కలిశ స్థాపనలు,అభిషేకములు మరియు కల్యాణోత్సవం వైభవంగా జరుగును
దాదాపు 1000 మందికి పైగా బెస్తలు ఈ కార్యక్రమంలో( కళ్యాణోత్సవం లో )పాల్గొనే అవకాశం
ఈ పవిత్రమైన కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో బెస్త కులస్తులందరూ పాల్గొని, శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు పొందాలని కోరిన హిందూపురం బెస్త సేవా సంఘం కమిటీ..
కళ్యాణోత్సవం అనంతరం భోజనం /ప్రసాదములు కల్పించనున్న కమిటీ, ప్రతి ఒక్కరూ భోజనం ఆచరించి వెళ్లవలసిందిగా కోరిన సంఘ ప్రతినిధులు..
బెస్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము
ఎంతో ఖర్చుతో కూడిన ఈ కార్యక్రమానికి, తమ వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తారని/ కోరుచున్నాము 🙏
ఇట్లు
కమిటీ
బెస్త సేవా సంఘం
హిందూపురం