17/08/2026
కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కద్రువ లు శ్రావణ శుద్ధ పంచమి నాడు గరుడునికి, నాగులకు జన్మనిచ్చారు.... అందుకని ఈ రోజుని గరుడ పంచమి, నాగ పంచమి గా జరుపుకుంటారు.....
గరుడుడు శ్రీ మహావిష్ణువు కు వాహనంగా, సర్పాలలో శ్రేష్టుడు ఆదిశేషుడు శయన పాన్పుగా సేవించి తరించారు..
హిందూ బంధువులకు గరుడ పంచమి మరియు నాగ పంచమి శుభాకాంక్షలు.... ఈ రోజు గరుఖ్మంతుల వారిని, నాగేంద్ర స్వామి వారిని దర్శించి, పూజిస్తే సమస్త సర్ప దోషాలు నివారణ అవుతాయని ఆర్యోక్తి.....
వైనతేయాయ విద్మహే, సువర్ణ వక్షాయ ధీమహి!
తన్నో గరుడః ప్రచోదయాత్!!
మహా నాగాయ విద్మహే, సర్పరాజాయ ధీమహి!
తన్నో శేషః ప్రచోదయాత్!!