30/07/2016
B L E S S E D * G O S P E L * D A Y !
------------------------
జా న్* క్రి స్టి య న్ * ఫ్రె డె రి క్ * హ య ర్
JOHN CHRISTIAN FREDERICK HEYER
(July 10,1793 - Nov 7,1873)
FOUNDING FATHER OF A.E. L. CHURCH
GUNTUR (A.P), INDIA
----------------------
"నీ తి మం తు ని జ్ఞా ప క ము చే సి కొ ను ట ఆ శీ ర్వా ద క ర మ గు ను." ~ సామెతలు 10:7
సరిగ్గా 174 సంవత్సరాల క్రితం ఇదే రోజున ( జూలై 31, 1842 ) జా న్ క్రి స్టి య న్ ఫ్రె డె రి క్ హ య ర్, తెలుగు ప్రజలకు తొలి క్రైస్తవ మిషనెరిగా, ఇండియా దేశంలోని, ఆంథ్ర ప్రదేశ్ రాష్ట్రపు, గుంటూరు పట్టణంలో అడుగు పెట్టాడు. ఈయన జర్మనీ దేశంలో జన్మించి, అమెరికాలో వేదాంత విద్య నభ్యసించి, అక్కడే పాస్టర్ గా పనిచేస్తూ, అమెరికన్ లూథరన్ సంఘపు మొట్టమొదటి మిషనెరిగా ఇండియా దేశానికి యేసు క్రీస్తును గూర్చిన రక్షణ సువార్తను తీసుకొచ్చాడు.
హయర్, తన మాతృభాషయైన జర్మన్ భాషయే కాకుండా 7 ఇతర భాషలు - ఫ్రెంచ్, ఇంగ్లీష్, హెబ్రీ, గ్రీకు, లాటిన్, సంస్కృతం మరియు తెలుగు - భాషలు నేర్చుకున్నాడు. ఈ భాషలన్నీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని లోతుగా అథ్యయనం చేయడానికినీ, బలంగా సువార్తను ప్రకటించడానికోసమై అత్యంత శ్రమకోర్చి, శ్రద్ధతో నేర్చుకున్నాడు!
దేవుని వాక్యం ప్రజలలో ప్రబలంగా విస్తరించాలంటే వారు విద్యావంతులై ఉండడం ఎంతో ముఖ్యమనే విషయాన్ని గుర్తించి, గుంటూరులోనూ, చుట్టుపట్ల ముఖ్య గ్రామాలలోనూ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాడు. అలా గుంటూరులో ప్రథమంగా ప్రారంభమైన ఇంగ్లీష్ - తెలుగు పాఠశాల (Anglo-Vernacular School ), దినదినాభివృధ్ధిచెంది, 1885 లో ప్రసిద్ధిగాంచిన ఆంధ్ర క్రైస్తవ కళాశాలగా (Andhra Christian College) పరిణితి చెంది, నేటికి 131 సంవత్సరాలుగా విద్యారంగంలో విశిష్ట సేవలందింస్తుంది.
హయర్, ఇండియాలో తన మొదటి మిషనెరి యాత్రలో, ప్రజల ఆరోగ్య సమస్యలు, వారు పడే అవస్థలు గమనించి, అమెరికా తిరిగి వెళ్లి, ప్రసిద్ధిగాంచిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ( Johns Hopkins University ) లో, తన 54 వ ఏట వైద్య విద్య నభ్యసించి M. D. డిగ్రీ పొందాడు. ఇండియాకు తిరిగివచ్చి, తన రెండవ, మూడవ మిషనెరి యాత్రలలో సువార్త నందించడంతో పాటుగా, వైద్యపరిచర్యను కూడా కొనసాగించాడు. కొన్నేళ్ళ తర్వాత మెడికల్ మిషనెరిగా ఇండియా దేశానికి వచ్చిన Dr. Anna S. Kugler గారికి 'ఫుల్ టైం' వైద్య పరిచర్యలను అప్పగించాడు. ఆమె 1885లో గుంటూరులో ప్రారంభిన సుప్రసిద్ధ ఆరోగ్య సంస్థే 'కు గ్ల ర్ హా స్పి ట ల్' !
అంతటి ఘనమైన సువార్త సేవను తెలుగు ప్రజల మథ్య ప్రథమంగా చేసిన రెవరెండ్. డాక్టర్. జాన్ క్రిస్టియన్ ఫ్రెడెరిక్ హయర్ ను అందరూ ఆప్యాయంగా 'ఫా ద ర్ * హ య ర్' అని పిలిచేవారు. ఆయన గుంటూరులో తొలిసారి అడుగుపెట్టిన రోజైన జూలై 31 వ తేదీని, ప్రతి సంవత్సరం 'ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘం' (Andhra Evangelical Lutheran Church) యొక్క ' జ న్మ ది నం ' గానూ, ' సు వా ర్త ది నం ' గానూ జరుపుకుంటాం.
గుంటూరు నగరం లోని, పాత బస్టాండ్ ఎదురుగానున్న ప్రస్తుతం 'ఫాదర్ హయర్ మెమోరియల్ లూథరన్ దేవాలయం'/ పరిశుధ్ధ. మత్తయి తూర్పు గురుమండల దేవాలయము (St. Matthew's East Parish church, Gunn Hall Compound ) నిర్మించబడియున్న స్థలంలో, ఒక చిన్న పెంకుటింట్లో ఫాదర్ హయర్ నివాసమూండేవాడు. ఆ ఇంటి వరండాలో కూర్చొని ఆ దారిన వస్తూ, పోతూ వుండేవాళ్ళకు ఆయన యేసుక్రీస్తును గూర్చిన సువార్తను ముచ్చటిస్తుండేవాడు ! ఆ ' సు వా ర్త గృ హం ' యొక్క జ్ఞాపకార్థంగా అదే స్థలంలో నిర్మించిన దేవాలయం ప్రక్కన ఒక జ్ఞాపక చిహ్నం నిర్మించబడి, నేటికీ కనబడుతుంది. ( ఇది ఆయన సమాథి కాదు. ఫాదర్ హయర్ సమాథి ఫ్రీడెన్స్ పట్టణం, పెన్సిల్వేనియా రాష్ట్రంలో (USA ) లో ఉంది). గుంటూరు ఇంట్లో ఆయన వాడిన 'మడత - చెక్క - కుర్చీ' (Wooden folding Chair ) నేటికినీ ఈ ఆలయయంలోని ఆల్టర్ లో, ఒక గ్లాస్ కేస్ లో కనిపిస్తుంది. ఈ కుర్చీ ఆరాధనా అవశేషం (Not a Relic) కాదు, 'ఫాదర్ హయర్' సువార్త సేవను కళ్ళకు కట్టినట్లు చూపే, కేవలం జ్ఞాపిక ( Reminder ) మాత్రమే !
"నీ తి మం తు ని జ్ఞా ప క ము చే సి కొ ను ట ఆ శీ ర్వా ద క ర మ గు ను." ~ సామెతలు 10:7.
ఈ వాక్యానికి అర్థం, విశ్వాసం ద్వారా దేవునిచే నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తి పేరును జ్ఞాపకం చేసుకోగానే, ఆశీర్వాదమొస్తుందని కానేకాదు. ఆ వ్యక్తి, ఎలా నీతిమంతునిగా తీర్చబడ్డాడో, ఆ తర్వాత, దేవునియందలి విశ్వాసం, పరిశుధ్ధాత్ముని సహాయంతో ఏ ఏ నీతిక్రియలు చేశాడో తెలిసికొని, ఆ రీతిగా మనం కూడా చేసినపుడే దేవుని ఆశీర్వాదం పొందుతామని తెలిసికోవాలి!
'సువార్త దినం / గాస్పెల్ డే ' సందర్భంగా నీతిమంతుడైన 'ఫాదర్ హయర్' జీవిత విశేషాలలో కొన్నింటిని క్లుప్తంగా తెలిసికున్న మనం,
ఆయన జీవితాన్నిబట్టి స్ఫూర్తిని పొందుదాం. మనం చేయగల్గిన మేరకు శక్తివంచన లేకుండ సువార్త సేవ చేద్దాం.
స్వయంగా చేయలేకపోతే, నమ్మకంగా సేవచేసే సువార్తికులకు ప్రార్థనాపూర్వక సహకారం అందిద్దాం !
ఈ సందర్భంగా జులై 31, 2016 న ప్రారంభమై, జులై 31, 2017 న పరిపూర్ణమయ్యే మన AEL సంఘపు 175 వ సంవత్సరపు వివిథ సువార్త కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొందాం!
దేవుని మహిమ పర్చుదాం !
" మీ కు దే వు ని వా క్య ము బో ధిం చి, మీ పై ని నా య కు లు గా ఉ న్న వా రి ని జ్ఞా ప క ము చే సి కొ ని,
వా రి ప్ర వ ర్త న ఫ ల ము ను శ్ర ద్ధ గా త లం చు కొ ను చు, వా రి వి శ్వా స ము ను అ ను స రిం చు డి." ~ Heb 13:7
" Remember your leaders who have taught you the Word of God. Think of all the good that has come from their lives, and try to trust the Lord as they do." ~ Hebrews 13:7