House Of Prayer Church PGFM

House Of Prayer Church PGFM ప్రభువైన యేసుక్రీస్తును వాక్యానుసారంగా తెలియపరచడానికి దేవుని చేత ఏర్పరచబడినవారము

22/04/2024

గుంటూరులో సమ్మర్లో చిన్న పిల్లలకి కాంగో,ప్యాడ్, నేర్పించే స్కూల్స్ ఏమైనా ఉన్నాయా..?

04/03/2023
28/07/2022
ఆత్మ ద్వారా సంపూర్ణమైన ప్రార్థన"హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనసు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పర...
04/06/2022

ఆత్మ ద్వారా సంపూర్ణమైన ప్రార్థన

"హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనసు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు" రోమా 8:27.

దేవునిని మనం ఏది అడిగినా ఇస్తాడు అనే ఉపదేశము సిద్దాంత పరమైనది కాదు. "ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును” (1 యోహాను 14) మీసంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. మీకు దొరుకును" (యోహాను 16,23-24) అని గ్రహించాలి. దేవుని స్తుతించడం, వ్యక్తిగత ప్రార్ధనలో భాషలతో మాట్లాడడం అనేవి అమూల్యమైన భక్తి విలువలు కలిగివున్నాయి. (1 కొరింథీ. 14:4; 14-17; 1 కొరింథీ. 12:10. -ఈ తొమ్మిది వరాలలో "భాషలతో మాట్లాడుట" అనే ఆత్మవరము ప్రథమముగా దేవునివైపు నిర్దేశించబడింది. దేవుడు హృదయాలను పరిశోధించువాడు, ఆత్మయొక్క మనస్సుకూడా తెలుసు. అక్కకు దేవుని చిత్తమేదో బాగా తెలుసు. పరిశుద్ధులందరూ సర్వ సంపూర్ణులై యుందాలని దేవుని చిత్తము అందుకే ఆత్మ విజ్ఞాపన చేస్తుంది. "దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల అశతో తేరిచూస్తూ కనిపెడుతూ వుంది” (రోమా 8:19). అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయువలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు (రోమా 8:26).

దేవుని అత్యద్వారా ఎలాగు ప్రార్ధన చేయాలో ఆ విషయాలను నీ ముందుకు తీసుకువస్తాడు. నీ అంతరంగములో నివసించు పరిశుద్ధాత్ముడు మన హృదయాలపై బలమైన ముద్ర వేస్తాడు. మనము ఆశ్మీయముగా, మానసికముగా మరియు భౌతికముగా మనకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియబడు దేవుని చిత్తమును ఆచరణలో పెట్టడానికి సిద్ధముగా లేనట్లయితే దేవుడే మనకు తెలియజేస్తాడు (యోహాను 16:12). మనలను మనము పరిశీలించుకొని మనలో వున్న అవిధేయమైన సంగతులను చక్కపెట్టుకొనేటట్లు చేస్తుంది. మన విశ్వాసమును బలపరచడానికి మనము తప్పిపోతే ఆయన మెల్లని స్వరము వినిపిస్తుంది (యెషయా 30:21). మనము ఆసక్తిగా విజ్ఞాపన చేయుటకు కృపనిచ్చు ఆత్మ కావాలి (జెకర్యా 12:10).

పరిశుద్ధాత్మ మన పక్షముగా వాదించడానికి విజ్ఞాపన చేయటానికి సిద్ధంగా వుంటాడు. నీవు దేవునికి చెందినవాడవని, నీవు నీ సొత్తు కాదని, క్రీస్తు వారి అమూల్య రక్తముతో కొనబడినవాడనని, నీ జీవితము అన్ని విధములుగా వర్ధిల్లేటట్లు చెయ్యాలని పరిశుద్ధాత్ముని తో వుండి నీ పక్షముగా నిన్ను విజయపథంలోకి నడిపిస్తాడు. దేవుని జీవితానికి చెందిన అన్ని విషయములపైన, మన నడవడికపై సంపూర్ణ అంతరంగములో పరిశుద్దాత్ముని స్వరమును కలిగి వున్నాము. ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో సంపూర్ణ సమృద్ధి పొందుదాం!

------ "వాక్యముతో "మీ" రోజు ఆరంభం" ------
➡️మీరు మీ స్టేటస్ లో ఈ వాగ్ధానం పెట్టడం వలన మీ కాంటాక్ట్స్ లో అనేకులను వాగ్ధానం చేత బలపరిచిన వారవుతారు.
➡️ ఫేక్ మెసేజ్లు ఫార్వర్డ్ చెయ్యడం కన్నా దేవుని వాక్యం ఫార్వర్డ్ చెయ్యడం ఆశీర్వాదకరం.
➡️ పరోక్షంగా సువార్త వ్యాప్తిలో ఈ విధంగా మీరు కూడా పాలిభాగస్థులు కాగలరు.
Power of god faith ministries
House of prayer church
pastor.Daniel Bellamkonda
send your prayer requests 8985936524 7032036524

------ "వాక్యముతో "మీ" రోజు ఆరంభం" ------ ➡️మీరు మీ స్టేటస్ లో ఈ వాగ్ధానం పెట్టడం వలన మీ కాంటాక్ట్స్ లో అనేకులను వాగ్ధాన...
27/05/2022

------ "వాక్యముతో "మీ" రోజు ఆరంభం" ------
➡️మీరు మీ స్టేటస్ లో ఈ వాగ్ధానం పెట్టడం వలన మీ కాంటాక్ట్స్ లో అనేకులను వాగ్ధానం చేత బలపరిచిన వారవుతారు.
➡️ ఫేక్ మెసేజ్లు ఫార్వర్డ్ చెయ్యడం కన్నా దేవుని వాక్యం ఫార్వర్డ్ చెయ్యడం ఆశీర్వాదకరం.
➡️ పరోక్షంగా సువార్త వ్యాప్తిలో ఈ విధంగా మీరు కూడా పాలిభాగస్థులు కాగలరు.

Address

Guntur
522006

Alerts

Be the first to know and let us send you an email when House Of Prayer Church PGFM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to House Of Prayer Church PGFM:

Share