SRI Ramanama Kshetram,GUNTUR

SRI Ramanama Kshetram,GUNTUR Ancient kshetram located in R agraharam Guntur (Highest Ramakoti books in India are placed in stupas)

16/07/2026

Ready for sale

* *FLAT FOR SALE**  1000 sq ft, lift with generator, car parking, GYM , PLAY AREA, WALKING TRACK , 24 HOURS WATER and cu...
30/06/2026

* *FLAT FOR SALE*
* 1000 sq ft, lift with generator, car parking, GYM , PLAY AREA, WALKING TRACK , 24 HOURS WATER and current facility ,close to inner ring road and AMARAVATHI road, 2015 construction

*FLAT NO.314, B BLOCK*

SRI BALAKRISHNA TOWERS , TURPU BAZAAR, GORANTLA

Contact:
Venkata Ravikishore chimalamarri
8008996893

డిసెంబర్ 3 వ తేదీ 🙏*హనుమద్వ్రతం*🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️  *హనుమాన్ వ్రతమును ఎప్పుడు ఆచరించాలి ?*  *హనుమంతునికి ప్రీతిగా ఏ విధంగ...
13/05/2026

డిసెంబర్ 3 వ తేదీ
🙏*హనుమద్వ్రతం*🙏

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*హనుమాన్ వ్రతమును ఎప్పుడు ఆచరించాలి ?*

*హనుమంతునికి ప్రీతిగా ఏ విధంగా ఈ వ్రతమును ఆచరించాలి ?*

*హనుమాన్ వ్రతం రోజున ఏయే పూజలను చేయడం శ్రేష్ఠం ?*

*ఈ రోజు చేసే పూజలకు స్వామి ఎటువంటి ఫలితాలను ఇస్తాడు ?*

*మార్గశీర్షే త్రయోదశ్యాం – శుక్లాయాం జనకాత్మజా |*
*దృష్ట్యా దేవీ జగన్మాతా – మహావీరేణ ధీమతా ||*

మార్గశిర మాసంలో పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి రోజున ఈ హనుమద్వ్రతాన్ని ఆచరించాలి. ఎందువల్లనంటే మృగశిరానక్షత్రం అంటే హనుమంతునికి ఇష్టమైనది. అందువల్లనే ఈ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీకగా , ఆత్మ విశ్వాసం పెంచి అపజయాలు తొలగించి విజయాలు చేకూర్చే శక్తి. భోగాన్ని , మోక్షాన్ని ఇచ్చే కల్ప వృక్షం హనుమంతుడు. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం హనుమత్ వ్రతం ఆచరించడం.

ఆర్తజన రక్షకుడు , భక్తసులభుడు అయిన ఆ హనుమంతుని అనుగ్రహం పొందటానికి భక్తులంతా పరితపిస్తుంటారు. ఇలా ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలంటే అందుకు దివ్యమైన మార్గం , *మార్గశిర త్రయోదశినాడు* హనుమంతుని పూజించి , హనుమంతుని ఆయన శక్తి స్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహన చేసి పూజించి , హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తి చేసుకోవాలి. ఈ వ్రతంలో భాగంగా పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు.

ఈవిధంగా పదమూడు సంవత్సరాలు వరుసగా వ్రతాన్ని ఆచరిస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీతీరంలోనే చేసుకోవాలి. ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి బదులు పంపాకలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్ర్వతం ఆచరిస్తే హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు. ఈ వ్రతంలో పంపా కలశ స్థాపనే ముఖ్య విధి.

*పంపాకలశ ప్రతిష్ఠ*

ముందుగా పూజాసామాగ్రిలో భాగంగా ఆచమనం చేయడానికి ఒకటి , కలశస్థాపన కోసం మరొకటి రెండు పంచపాత్రలతో నీటిని సిద్ధంగా ఉంచుకోవాలి. సంకల్పంలో భాగంగా ముందుగా ఆచమనం చేయాలి.

*ఆచమనం*

ఓం కేశవాయ స్వాహాః ,
నారాయణాయ స్వాహాః ,
మాధవాయ స్వాహాః ,
(అని మూడుసార్లు చేతిలోనికి నీరు పోసుకొని త్రాగవలెను)
గోవిందాయ నమః ,
విష్ణవే నమః ,
మధుసూదనాయ నమః ,
త్రివిక్రమాయ నమః ,
వామనాయ నమః ,
శ్రీధరాయ నమః ,
హృషీకేశాయ నమః ,
పద్మనాభాయ నమః ,
దామోదరాయ నమః ,
సంకర్షణాయ నమః ,
వాసుదేవాయ నమః ,
ప్రద్యుమ్నాయ నమః ,
అనిరుద్ధాయ నమః ,
పురుషోత్త మాయ నమః ,
అధోక్షజాయ నమః ,
నారసింహాయ నమః ,
అచ్యుతాయ నమః ,
ఉపేంద్రాయ నమః ,
హరయే నమః ,
శ్రీకృష్ణాయ నమః ,
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ,

*గణపతి ప్రార్థన*

(గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను)

*యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా* *తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం.*
*లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: ఏషామిందీవరశ్శ్యామో హృదయస్థోజనార్థన.*
*ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం.*
*సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే*
*శరణ్యేత్య్రంబికే దేవి నారాయణి నమోస్తుతే.*

ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు
దేవునిపై చల్లవలెను

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ,
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ,
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ,
ఓం శచీపురందరాభ్యాం నమః ,
ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః ,
ఓం శ్రీ సీతారామాభ్యాం నమః ,
నమస్సర్వేభ్యో మహాజనేభ్యః ,
అయం ముహూర్త స్సుముహూర్తోస్తు
భూతోచ్చాటన

(క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)

ఉత్తిష్ఠంతో భూత పిశాచాః (అంటూ రెండు అక్షతలను మన వెనుకవైపునకు వేసుకోవాలి)
ఏతే భూమి భారకాః
ఏతేషామవిరోధేన
బ్రహ్మ కర్మ సమారభే
అంటూ ముక్కుపై మూడు వేళ్ళను ఉంచి ప్రార్థిస్తూ
భూః ఓం భువః ఓం మహః ఓం జనః ఓంతపః ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీసువర్చలా సామెత హనుమద్వ్రత పూజాంగత్వేన పంపాపూజాం కరిష్యే అని నీటిని తాకాలి.

ముందుగా పంపాకలశ ప్రరిష్టాపన చేసి షోడశోపచారాలతో పంపాపూజ చేయాలి. పీఠంపై యథాశక్తిగా బియ్యం పోసి పట్టుగుడ్డ పరిచి హనుమంతుని పటాన్ని చక్కని పూలమాలతో అలంకరించి దానిముందు ఐదు తమలపాకులు ఒకేరీతిగా పరిచి దానిపై వెండి , రాగి , లేదా కంచు పాత్ర ఉంచాలి. ‘ఇమం మే వరుణ’ మంత్రంతో ఆ పాత్రను నీళ్ళతో (పంపానదీ నీళ్ళతో) నింపాలి.

*ఇమం మే వరుణ శ్రుదీహవమద్యాచ మృడయ*
*త్వామవస్సురాచకే| తత్త్వాయామి బ్రాహ్మణా*
*వందమాన స్తదాశాస్తే యజమానో హవిర్భి:|*
*ఆహేడమానో వరుణేహ బోధ్యోరుశగ్ సమానః||*

*“ఇమం మే గంగా”* అనే మంత్రంతో ఆ కలశంలోని నీళ్ళను అభిమంత్రించాలి.
*ఇమం మే గంగే యమునే సరస్వతి శతుద్రి స్తోమగొం నచతావరుష్ణియా|*
*అసిక్నియా మరుద్వ్రుదౌవితన్థ యార్జీకీయే శృణుహ్యసుషోమయా||*

తరువాత ఆ పంపాకలశంలో సువర్ణమౌక్తికలు ఉంచి గంధపుష్పాక్షతాలను , అష్టగంధ , కర్పూరాలు ఉంచి

*హ్రం హ్రీం హ్రూం హ్రై౦ హ్రౌం హ్రః తటిన్యా*
*ద్వాదశ కళా ఇహగాచ్చ తాగచ్చత||*

‘ఓం హం సూర్యమండలాయ ద్వాదశ కళాత్మనే తద్దేవతా కలశాయ నమః
అని ఆ కలశానికి నమస్కరించి నూతనవస్త్రం చుట్టి కలశానికి *‘బృహత్సామ’* మంత్రంతో రక్షాబంధనం చేయాలి.
*బృహత్సామక్షత్రభృద్వ్రుద్ధ వృష్టియం త్రిష్ణు భౌజశుఋభిత ముగ్రవీరం!*

*ఇంద్రస్తోమేనా పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా||*

*పుష్పాక్షతలు తీసుకుని – ఐం హ్రీం శ్రీం ఓం నమోభగవాతే అశేష తీర్థాలవాలే శివజటాదిరూఢే గంగే గంగాంబికే స్వాహా||*

సర్వానందకరీ మశేషదురితధ్వంసీం మృగాంకప్రభాం
త్ర్యక్షా మూర్ద్వ కరద్వయేన దధతీం పాశం సృణీం చ క్రమాత్
దోర్భ్యాం చామృత పూర్ణకుంభ మవరే ముక్తాక్షమాలా ధరాం
గంగా సింధు సరిద్వరాది రచితాం శ్రీతీర్థశక్తిం భజే||

అని చేతులో ఉన్న పుష్పాక్షతలను కలశంలోని నీటిలో వేసి నమస్కరించాలి.
తరువాత పంపాకలశానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి.

ఓం అనునీతే పునరస్మాసుచక్షుః ప్రాణమిహనోథౌహి భోగం
జ్యోక్సశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి|

*అమృతం*
వై ప్రాణా అమృతమాపః ప్రాణా నేవ యథాస్థాన ముపహ్వయతే. పంపాకలశ
స్థిత శ్రీ గంగా మహాదేవీ ఇహప్రాణ ఇహజీవ ఇహజీవ ఇహగాచ్చ|
సర్వేంద్రియాణి సుఖం చిరం తిష్టంతు స్వాహా||
స్థిరభవ వరదాభవ| సుముఖీభవ| సుప్రసన్నాభవ| ప్రసీద ప్రసీద ప్రసీద

అని ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత పంపాకలశ పూజ చేయాలి. తరువాత ఆంజనేయ స్వామిని అష్టోత్తరశతనామాలతో అర్చించి , ధూప , దీప , నైవేద్యాలు సమర్పించి , కార్పూరహారతి సమర్పించాలి. అనంతరం చేతిలో అక్షతలు తీసుకుని భక్తిశ్రద్ధలతో కథను వినాలి.

*హనుమద్వ్రతం కథ*

శౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన కధ చెప్పాడు. వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో వున్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు , భార్య ద్రౌపదితో , సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు యిచ్చి భక్తిశ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరు భక్తీ శ్రద్ధలతో చేయవలసిన వ్రతం వుందని దాన్ని వివరించాడు. అది కార్య సిద్ధిని కలిగిస్తుందనీ , వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే *శ్రీ హనుమద్ వ్రతం*. దుష్ట గ్రహాల్ని , వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు , శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు ద్రౌపదికి బోధించి , దగ్గర వుండి వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు.

అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి వున్న హనుమత్ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు. ఆమె అన్నీ వివరంగా చెప్పగా , అతడికి గర్వం కలగటంతో కోతిని గూర్చిన వ్రతం ఏమిటని ఈసడించాడు. తన జెండాపై కట్టబడ్డ వాడు , ఒక వానరుడు అయిన హనుమకు వ్రతం చేయటమేమిటని దుర్భాషలాడాడు. ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీ కృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా అర్జునుడి కోపం తగ్గలేదు. ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు. అప్పటినుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమైనాయనీ ఈ అరణ్య , అజ్ఞాత వాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. పదమూడు ముడులు గల హనుమత్ తోరాన్ని తీసివేయటం వల్లే పదమూడు ఏళ్ళ అరణ్య , అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు. ధర్మరాజుకు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు.

దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కధ చెప్పాడు.

పూర్వం శ్రీ రాముడు సీతను వెదుకుతూ , తమ్ముడు లక్ష్మణునితో ఋష్యమూక పర్వతం చేరాడు. సుగ్రీవ , హనుమలతో సఖ్యం చేశాడు. అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ , దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు. బ్రహ్మాదిదేవతలు హనుమతో *"హనుమా ! నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు. నిన్ను ఎవరు భక్తీశ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు"* అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు. త్వరలో సీతాదర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావు అని విన్నవించాడు హనుమ.

అప్పుడు ఆకాశవాణి *”హనుమ చెప్పినదంతా సత్యమైనదే”* అని పలికింది. వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరాగా , మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు. పంపా నదీతీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. పదమూడు ముళ్ళ తోరంను పూజించి కట్టుకొన్నాడు. కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. వ్యాసమహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు , భార్య , సోదరులతో వ్రతాన్ని విధివిధానంగా చేసి అంతా తోరాలు భక్తీ శ్రద్ధలతో కట్టుకున్నారు.
🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄

13/05/2026

రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి..

1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
= వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
= నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
= తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
=24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
=కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
=సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
=కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
=సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
=కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
=పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?
=జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
= దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
=హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
=శ్రీరాముడు.

16. భరతుని తల్లి పేరేమిటి?
=కైకేయి.

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
=వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
=16 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
=మారీచ, సుబాహులు.

21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
=బల-అతిబల.

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
=సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
=సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
=అగస్త్యుడు.

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
=భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

27. అహల్య భర్త ఎవరు?
=గౌతమ మహర్షి.

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
=శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?
=నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
=దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
=విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
=మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
=జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
=కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
=వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
=యుధాజిత్తు.

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
=మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
=గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
=శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
=గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
=భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
=మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
=తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
=జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
=నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
=అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
=విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
=అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
=గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
=శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
=జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
=మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
=బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
=జటాయువు.

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
=దక్షిణపు దిక్కు.

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
=కబంధుని.

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
=మతంగ వనం, పంపానదీ.

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
=ఋష్యమూక పర్వతం.

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
=హనుమంతుడు.

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
=అగ్ని సాక్షిగా.

61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

62. సుగ్రీవుని భార్య పేరు?
=రుమ.

63. వాలి భార్యపేరు?
=తార.

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
=కిష్కింధ.

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
=మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
=దుందుభి.

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
=మతంగముని.

68. వాలి కుమారుని పేరేమిటి?
=అంగదుడు.

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
=ఏడు.

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
=ప్రసవణగిరి.

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=వినతుడు.

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=అంగదుడు.

73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
=మామగారు, తార తండ్రి.

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=శతబలుడు.

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
=మాసం (ఒక నెల).

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
=దక్షిణ దిక్కు.

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
=స్వయంప్రభ.

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
=సంపాతి.

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
=పుంజికస్థల.

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
=మహేంద్రపర్వతము.

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
=మైనాకుడు.

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
=సురస.

84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
=సింహిక.

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
=నూరు యోజనములు.

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
=లంబ పర్వతం.

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
=అశోక వనం.

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
=పన్నెండు

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
=త్రిజట.

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
=రామ కథ.

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
=చూడామణి.

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
=ఎనభై వేలమంది.

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
=విభీషణుడు.

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
=మధువనం.

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
=ఆలింగన సౌభాగ్యం.

98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
=నలుడు

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
=నికుంభిల.

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
=అగస్త్యుడు.

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
=ఇంద్రుడు.

102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
=మాతలి.

103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
=హనుమంతుడు.

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
=శత్రుంజయం.

106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
=స్వయంగా తన భవనమునే యిచ్చెను.

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
=బ్రహ్మ.

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
=తన మెడలోని ముత్యాలహారం.

Address

R Agraharam
Guntur
522003

Opening Hours

Monday 8am - 6am
Tuesday 8am - 6am
Wednesday 8am - 6am
Thursday 8am - 6am
Friday 8am - 6am
Saturday 8am - 6am
Sunday 8am - 6am

Telephone

+919553513841

Website

Alerts

Be the first to know and let us send you an email when SRI Ramanama Kshetram,GUNTUR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to SRI Ramanama Kshetram,GUNTUR:

Shortcuts

Share

Category