Nandikunta Vigneswara Alayam Nadendla

Nandikunta Vigneswara Alayam Nadendla Religious Organization

08/09/2024
09/09/2021
వినాయక చవితి సందర్భంగా ముస్తాబు అయిన నాదెండ్ల శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి ఆలయం.
09/09/2021

వినాయక చవితి సందర్భంగా ముస్తాబు అయిన నాదెండ్ల శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి ఆలయం.

22/02/2021

⛳️ *22-2-2021 వ తేదీ సోమవారం రోజున*⛳️
*నాదెండ్ల గ్రామం* *గుంటూరుజిల్లాలో*

🌳 *2పళ్ళ విభాగము విజేతలు లిస్ట్*🌳

🌴మొదటి బహుమతి 15,000, రూపాయలు మొత్తాన్ని సాధించిన వారు

*శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు*
పాళడుగు గ్రామం
మేడికొండూరు మండలం
గుంటూరుజిల్లా

🎋వారి జత లాగిన దూరము 🎋
🌹4250 అడుగులు 🌹

🌴రెండొవ బహుమతి 12,000 రూపాయలు నగదు మొత్తాన్ని సాధించిన వారు

శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో
*షేక్ అమీర్ బాబు గారు*
పురుషోత్తపట్నం గ్రామం
చిలకలూరిపేట మండలం
గుంటూరుజిల్లా

🎋వారి జత లాగిన దూరము 🎋
🌹4069.1 అడుగులు 🌹

🌴మూడోవ బహుమతి 10,000 రూపాయలు నగదు మొత్తాన్ని సాధించిన వారు

శ్రీశైల మల్లిఖార్జునస్వామి ఆశీస్సులతో
*సత్తారు సునీతా రెడ్డి గారు*
రెడ్డి కొత్తూరు గ్రామం
నూజెండ్ల మండలం
గుంటూరుజిల్లా

🎋వారి జత లాగిన దూరము 🎋
🌹 4012.3 అడుగులు 🌹

🌴నాలుగోవ బహుమతి 8,000 రూపాయలు నగదు మొత్తాన్ని సాధించిన వారు

కాకాని వెంకట్రామయ్య మెమోరియల్
*కాకాని సురేష్ బాబు గారు*
ప్రత్తిపాడు గ్రామం
పత్తిపాడు మండలం
గుంటూరుజిల్లా

కంబైన్డ్

చాగంటి చిన్న నారాయణ మెమోరియల్
*చాగంటి హనుమంతరావు గారు*
నాదెండ్ల గ్రామం
నాదెండ్ల మండలం
గుంటూరుజిల్లా

🎋వారి జత లాగిన దూరము 🎋
🌹3617.4 అడుగులు 🌹

🌴 ఐదవ బహుమతి 7,000 రూపాయలు నగదు మొత్తాన్ని సాధించిన వారు

జీసస్ ఆశీస్సులతో
*అమృతపూడి కోటయ్య గారు*
శానంపూడి గ్రామం
శావల్యాపురం మండలం
గుంటూరుజిల్లా

🎋వారి జత లాగిన దూరము 🎋
🌹3500 అడుగులు 🌹

🌴 ఆరో బహుమతి 6,000 రూపాయలు నగదు మొత్తాన్ని సాధించిన వారు

శ్రీరాములమ్మతల్లి ఆశీస్సులతో
*రామినేని రత్తయ్య చౌదరి గారు*
తోటపాలెం గ్రామం
చేబ్రోలు మండలం
గుంటూరుజిల్లా

🎋వారి జత లాగిన దూరము 🎋
🌹3423.10 అడుగులు 🌹

🌴 ఏడవ బహుమతి 5,000 రూపాయలు నగదు మొత్తాన్ని సాధించిన వారు

మల్లెల సత్యనారాయణ లక్ష్మీ మెమోరియల్
*మల్లెల రాజేష్ నాయుడు గారు*
బుక్కాపురం గ్రామం
నాదెండ్ల మండలం గుంటూరుజిల్లా

🎋వారి జత లాగిన దూరము 🎋
🌹3338.10అడుగులు 🌹

🌴 ఎనిమిదవ బహుమతి 4,000 రూపాయలు నగదు మొత్తాన్ని సాధించిన వారు

శ్రీ అభయాంజనేయస్వామి ఆశీస్సులతో
*కత్తులపల్లి మల్లిఖార్జునరెడ్డి గారు*
చెర్లోపల్లి గ్రామం
C S పురం మండలం ప్రకాశంజిల్లా

🎋వారి జత లాగిన దూరము 🎋
🌹3250 అడుగులు 🌹

🌴తొమ్మిదొవ స్థానం
శ్రీ బాలకొటేశ్వరస్వామి ఆశీస్సులతో
*ఆళ్ల పీయూష్ ధర్మ యాదవ్ గారు*
గుంటూరు టౌన్
గుంటూరుజిల్లా

🎋వారి జత లాగిన దూరము 🎋
🌹3241.3 అడుగులు 🌹

🌴పదోవ స్థానం
శ్రీ అంకమ్మతల్లి ఆశీస్సులతో
*బలిగిరి వెంకటేశ్వర్లు గారు*
కుంకులగుంట గ్రామం
నకరికల్లు మండలం
గుంటూరుజిల్లా

🎋వారి జత లాగిన దూరము 🎋
🌹3020.11అడుగులు 🌹

🌴పదకొండోవ స్థానం
శ్రీ అంకమ్మతల్లి ఆశీస్సులతో
*అబ్బూరి మశ్య చౌదరి గారు*

కంబైన్డ్

శ్రీ వీర్ల అంకమ్మతల్లి ఆశీస్సులతో
*సూదులగుంట్ల విజయ్ కుమార్ చౌదరి గారు*
పెద్దరెడ్డిపాలెం గ్రామం
నరసరావుపేట మండలం
గుంటూరుజిల్లా

🎋వారి జత లాగిన దూరము 🎋
🌹2912.5 అడుగులు 🌹

🌴పన్నెండోవ స్థానం
*దర్శనాల చెన్నకేశవులు గారు*
తొండపి గ్రామం
ముప్పాళ్ళ మండలం
గుంటూరుజిల్లా

🎋వారి జత లాగిన దూరము 🎋
🌹2755.9 అడుగులు 🌹

🌴పదముదోవ స్థానం
కృషి విధాన్ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయక్షేత్రం
*పెంట్యాల మస్తానరావు గారు*
బొబ్బేపల్లి గ్రామం
మార్టూరు మండలం
ప్రకాశంజిల్లా

కంబైన్డ్

*గరికపాటి రామాంజనేయులు గారు*
వేమవరం గ్రామం
బల్లికురవ మండలం
ప్రకాశం జిల్లా

🎋వారి జత లాగిన దూరము 🎋
🌹2250 అడుగులు 🌹

🌴10వ జతగా:
వీరంరెడ్డి మల్లిఖార్జునరెడ్డి మెమోరియల్
*వీరంరెడ్డి కార్తీక్ రెడ్డి గారు*
మేళ్ల చెరువు గ్రామం
మేళ్లచెరువు మండలం
సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం

కంబైన్డ్

బాలయేసు ఆశీస్సులతో
*ముచ్చు రాధిక గారు*
కేసానుపల్లి గ్రామం
నరసరావుపేట మండలం
గుంటూరుజిల్లా

🎋 *డ్రాప్ అయ్యారు* 🎋

🌴🎤 *వ్యాఖ్యాత:*🎤🌴
*గూడా శ్రీనివాసరావు గారు*
దుర్గి గ్రామం దుర్గి మండలం
గుంటూరు జిల్లా

*Sk హసన్ గారు*
*రఘునాధపాలెం గ్రామం*
*మఠంపల్లి మండలం* *సూర్యాపేట జిల్లా*
*తెలంగాణ రాష్ట్రం*

🛷 *Live ప్రచారకులు :-*🛷
*I 3 media*
*నాగార్జున గారు*
*కాకినాడ టౌన్ తూర్పు గోదావరి జిల్లా*

🌴 *లింగాల రేవంత్*🌴
⛳️ *దాసరి కృష్ణయ్య*⛳️
🌺 *S. కి. గణి*🌺

శ్రీ నందికుంట విఘ్నేశ్వర ఆలయంగుంటూరు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, నాదెండ్ల గ్రామంలో జాతీయ స్థాయి ఒంగ...
05/02/2021

శ్రీ నందికుంట విఘ్నేశ్వర ఆలయం
గుంటూరు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, నాదెండ్ల గ్రామంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బల ప్రదర్శన పోటీలలో రైతు సోదరులు అందరు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుకొంటున్నాము.

18/08/2020

శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి ఆలయం విశేషాలు
నాదెండ్ల గ్రామం పేరు వినగానే ఎక్కువమందికి గుర్తుకు వచ్చేది వినాయకుని గుడి. ఈ స్వామిని నందికుంట విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. మహిమగల స్వామిగా అందరిచేత కొలువబడే దేవుడు. కొందరు విజయనగర రాజులచే ప్రతిష్టించబడిన స్వామి అని,కాదు రెడ్డి రాజులచే ప్రతిష్టించబడిన స్వామి అని మరికొందరు చెప్పుకునేవారు. కానీ ఈ రెండు నిజం కాదు స్వామి వారు ఇంకా పురాతన కాలంలోనే ప్రతిష్టించబడినారు.
స్థానికంగా ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం,ఒక వైశ్యుడు తన కోరిక నెరవేరితే వినాయకుని ప్రతిష్టించి పూజ జరిపిస్తామని మొక్కుకున్నారు. ఆయన కోరిక నెరవేరింది. స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన స్వామివారిని ప్రతిష్టించి,ఘనంగా అన్నసంతర్పణ చేశారు కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లి లెక్కలు వేసుకున్నారు అమ్మో ఎంత ఖర్చు అయిందో అనుకున్నారు. రాత్రి గడిచింది. మరునాడు ఉదయం ఆలయానికి వెళ్లి చూసేసరికి పీఠం మీద ఉండవలసిన స్వామి వారు ప్రతిష్ఠించిన ప్రదేశానికి ఎదురుగా ఉన్న కుంటలో ఉన్నారు. అది చూసి న భక్తునకు ఏమీ అర్థం కాలేదు అక్కడ మనుషులు తిరిగిన గుర్తులు కానీ, పీఠం వద్ద కదిలించినట్లుగా గుర్తులు గానీ ఏమి కనపడలేదు.కానీ స్వామి వారు పీఠం మీద లేరు. కొంతసేపటికి ఆయన ఆలోచించుకుంటే విషయం అర్థమైంది.ఎంతో భక్తితో కార్యక్రమం జరిపి,అయిన ఖర్చు లెక్క వేసుకున్న విషయం గుర్తుకు వచ్చి తన పొరపాటు గ్రహించాడు. స్వామి వారు తాను చేసిన తప్పుకు పీఠం దిగి కుంటలోకి వచ్చారని గ్రహించి, స్వామివారిని క్షమాపణ వేడుకున్నారు. స్వామి వారిని అక్కడ నుండి కదిలించలేదు. అక్కడే ఉంచి స్వామి వారిని పూజించారు.( ఈ కథ నాకు చెప్పినది గొల్లపాలెం మునసబు నారాయణ బాబు గారు.)

ఇక చరిత్ర విషయానికి వస్తే శాలివాహన శకం 1093వ సంవత్సరం కొండ పడమటి బుద్ధరాజు మరియు మండ రాజులు స్వామివారికి కానుక ఇచ్చినట్లు గుడి ఎదురుగా ఉన్న రాతి మీద శాసనం ఉంది శాసనంలో చాలా బాగం డామేజ్ అయింది.( కొండ పడమటి రాజులు రాణులు మూలస్థానేశ్వర స్వామివారికి, గోవర్ధన స్వామివారికి కి అనేక దానాలు చేసినట్లు శాసనాలు ఉన్నాయి.)

ఆలయంలోని విగ్రహాలను పరిశీలించినట్లయితే, ఆలయ మండపంలో నలుగురు దేవతామూర్తులు ప్రతిష్ఠించబడి ఉన్నారు శివుడు, వినాయకుడు, అమ్మవారు, సూర్యుడు( ఎడమ నుండి కుడికి )సాధారణంగా ఈ నలుగురు దేవతామూర్తుల తో పాటు విష్ణుమూర్తి కూడా ఉండాలి .ఈ విధమైన ఆరాధన పంచాయతన ఆరాధన అంటారు. ఆది శంకరాచార్యుల వారిచే ప్రతిపాదించబడిన ఈ పంచాయతన ఆరాధన ప్రకారం ఈ ఆలయం ప్రతిష్టించబడి ఉంటుంది .శాలివాహన శకం 1093 లోనే ఇక్కడ శాసనం వేయబడి ఉన్నదంటే, అప్పటికీ ప్రసిద్ధి పొందిన ఆలయం అయి ఉండాలి. శంకరాచార్యుల వారు గాని వారి శిష్య కోటీలో ఎవరైనా గాని ఈ ఆలయాన్ని స్థాపించి ఉండవచ్చు మరి ఇక్కడ విష్ణుమూర్తి ఎందుకు లేరు అనే సందేహం రావాలి.
ముస్లింల దండయాత్ర లో నాదెండ్ల గ్రామంలో గోవర్ధన స్వామి ఆలయం, మూలస్థానేశ్వర స్వామి ఆలయం, గాదేయగట్టుపై ఉన్న శ్రీ సీతారామ స్వామి ఆలయం ,చలం కొండలపైన ఉన్న వీరభద్ర స్వామి ఆలయం( కాటంరాజు గుడి) ధ్వంసమైన గుర్తులు ఇప్పటికీ సజీవంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ దండయాత్ర లోనే ఇక్కడ ఉన్న విష్ణుమూర్తిని ధ్వంసం చేయడం జరిగి ఉంటుంది. 1970 దశకం లో కూడా ఇక్కడ గుడి బయట శివుని పానవట్టం ఉండేదని పెద్దలు చెప్తారు కేవలం స్వామి వారి మీద అమితమైన భక్తితో, ప్రేమతో స్వామి వారిని, మిగిలిన మూర్తులను ప్రతిష్ఠించుకున్నారు.ఆ విధంగానే స్వామి వారిని కొలుచుకుంటున్నారు. వాస్తవానికి పంచాయతన ఆరాధనలో విగ్రహాల అమరిక వేరే విధంగా ఉంటుంది (ఈ విషయం తెలిపినది శ్రీ పండా వెంకటప్పయ్య గారు.)

పురాతన కాలం నుండి స్వామివారిని చుట్టుపక్కల గ్రామాల వారే కాక దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. వినాయక చవితి నాడు ఇప్పుడంటే విగ్రహాలు పెడుతున్నారు కానీ, పురాతన కాలంలో వినాయక చవితికి గుడి వద్దకు ప్రభలు కట్టుకొని రావడం ఆనవాయితీ. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రభలు కట్టుకుని వస్తారు. సాధారణంగా నరసరావుపేట తాలూకాలోని అన్ని గ్రామాల నుండి కోటప్పకొండకు చిన్నా,పెద్ద ప్రభలు తరలి వెళతాయి. కానీ నాదెండ్ల గ్రామస్తులు ప్రభ కట్టడం అంటే ఒక్క నందికుంట విఘ్నేశ్వర స్వామి వారి వద్దకే.
పంటలు వేయడానికి ముందు చుట్టుపక్కల గ్రామాల రైతులు సామూహికంగా వచ్చి స్వామివారికి ఉండ్రాళ్లుపోసి, పొంగళ్ళు సమర్పిస్తారు. ఇక్కడికి వచ్చి ఉండ్రాళ్ళు, పొంగళ్ళు చెల్లించి వెళ్లేటప్పుడు వచ్చినవారు తప్పనిసరిగా వర్షంలో తడిసి వెళతారనే విషయం అందరికీ అనుభవమే. స్వామి వారి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే.

స్వామి వారిని సేవించు కున్న భక్తులు.
దేవభక్తుని కోటయ్య గారు,వారి సతీమణి తమ జీవిత పర్యంతం స్వామి వారిని సేవించుకున్నారు మరియు వారి ఆస్తిని స్వామివారికి సమర్పించుకున్నారు. నాదెండ్ల బుచ్చయ్య (మంగలి బుచ్చన్న) అనే భక్తుడు స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న తాటితోపును స్వామివారికి సమర్పించుకున్నారు. తర్వాత కాలంలో అనేక మంది భక్తులు భూరి విరాళాలు స్వామివారికి సమర్పించి ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు. స్వామి వారిని సేవించుకుంటున్నారు.

స్వామివారి ఆలయంలో జరుగుతున్న పూజలు.
1. వినాయక చవితి నాడు వేలసంఖ్యలో భక్తులు వస్తారు
2. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ ఆదివారం నాడు స్వామివారి వార్షికోత్సవం ఘనంగా జరుపబడుతున్నది
3 ప్రతి మాసం శుక్ల చవితి ఉదయ ప్రదోషకాలంలో స్వామివారికి అభిషేకం
4 .సంకటహర చతుర్థి ప్రతి మాసం పౌర్ణమి తర్వాత వచ్చే చవితినాడు సాయంత్రం ప్రదోషకాలంలో స్వామివారికి అభిషేకం
5. కార్తీకమాసంలో దేవతామూర్తులకు అభిషేకం
6. రథసప్తమినాడు సూర్యభగవానునికి అర్చన
7 .దసరా నవరాత్రులలో అమ్మవారికి కుంకుమ పూజలు.

ప్రతి ఆదివారం బుధవారం ఎక్కువ సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని ఉండ్రాళ్ళు, పొంగళ్ళు నైవేద్యం సమర్పించుకుంటారు. మీరు ఎప్పుడు పూజ చేయించుకోవాలంటే అప్పుడు స్వామి వద్దకు రావచ్చు నిండు మనసుతో స్వామిని మొక్కితే చాలు. రుసుములు చెల్లించవలసిన అవసరం లేదు.
ముగింపు.
స్వామివారిని భక్తులు ఎంత సొంతం చేసుకున్నారు అంటే దగ్గర నుండి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.బహుశా స్వామిని తమ తండ్రి గానో, తల్లి గానో భావిస్తారు ఏమో అనిపిస్తుంది.స్వామి వారిని దర్శించుకోవడానికి, పూజించుకోవడానికి కఠినమైన నియమాలు లేవు. ఇక్కడ ఉన్నదంతా రైతు వర్గం వారు. పొలం వెళుతూ గుడి బయట అరక ఆపి,లోపలికి వెళ్లి గంట కొట్టి దండం పెట్టుకుని వస్తారు. పొలం నుండి తిరిగి వచ్చేటప్పుడు అంతే చేస్తారు మా స్వామి మనసులో భక్తిని బిడ్డల ఆర్తిని చూస్తాడు గాని వీడు స్నానం చేశాడా, మంత్రాలు చదువుతున్నాడా, జపం చేస్తున్నాడా అని చూడడు. వీడు కనీసం కాళ్ళు అయినా కడగలేదే అని అనుకోడు. ఇంతగా భక్తులకు దగ్గరైన మహిమగల స్వామిని దర్శించుకోండి. తరించండి.
మీలో ఎవరి వద్ద అయినా స్వామివారికి సంబంధించిన చారిత్రిక, సాంస్కృతిక విశేషాలు ఆధారాలతో ఉంటే మాతో పంచుకోగలరు.
మన్నె కుమార స్వామి మరియు సంగిశెట్టి శ్రీనివాస రావు.

25/03/2020

నాదెండ్ల శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి వారి భక్తులకు మనవి.
ఈరోజు నుండి ఏప్రిల్ 14వ వరకు స్వామి వారి ద‌ర్శనం నిలుపదల చేయుటమైనది.
కావున అందరు సహకరించవలసినదిగ మనవి🙏🏻

Address

Nadendla/Ganapavaram Road
Guntur
522234

Opening Hours

Monday 6am - 8pm
Tuesday 6am - 8pm
Wednesday 6am - 8pm
Thursday 6am - 8pm
Friday 6am - 8pm
Saturday 6am - 8pm
Sunday 6am - 9:30pm

Telephone

+919989791947

Website

Alerts

Be the first to know and let us send you an email when Nandikunta Vigneswara Alayam Nadendla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Nandikunta Vigneswara Alayam Nadendla:

Share