06/02/2025
యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది.
కీర్తనలు 147:1 యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.
కీర్తనలు 92:1-3 It is a good thing to give thanks unto the LORD, And to sing praises unto thy name, O most High:To shew forth thy lovingkindness in the morning, And thy faithfulness every night,Upon an instrument of ten strings, and upon the psaltery; Upon the harp with a solemn sound.
Psalm 92:1-3. యేసయ్య మనకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి దేవుని స్తుతించుదాం. మనము ఇంత వరకు సజీవులుగా ఉన్నాము అంటే కారణం యేసయ్యనే కదా అందుకే కృతజ్ఞతతో స్తుతించుదాo 🙏🙏🙏 ప్రతి దినము ఒక్క పాటతో ఐన దేవుని ప్రతిఒక్కరు స్తుతించుట ఈ పేజీ ఉద్దేశ్యం . ప్రతిరోజు పంపించబడుతున్నటువంటి మీరు వింటూ లేక పాడుతూ దేవుని స్తుతించుచున్న మీరు ఈ పాటలను మీకు తెలిసిన అనేకులకు పంపించడం ద్వారా అనేక మంది పాటలు వినుట వల్ల పాటల్లో ఉన్న దేవుని మాటలు వారిని దేవుని వద్దకు నడిపిస్తాయి .దేవుని గూర్చిన పాటలు విని రక్షించబడిన వారు ఎంతో మంది ఉన్నారు అలా రక్షించబడిన వారు దేవునిసేవచేశారు . ఈ దినములలో కూడా సేవ చేస్తున్నవారు ఇప్పుడు కూడా ఉన్నారు. కనుక ప్రతిరోజూ పంపించ బడుచున్న ఈ పాటలను మీకు తెలిసిన వారికి పంపించడం వల్ల వారు ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఐనా వింటారు. దేవుడు వారిని ఆకర్షించు కుంటాడా మీరు సువార్త చెప్పలేకపోవచ్చు కనీసం పాటలు పంపించడం ద్వారా మీరూ అనేకమందిని దేవుని వద్దకు నడిపించిన వారవుతారు. నాకుదేవుడు ఇచ్చిన ప్రేరణతో (గుడ్ టు సింగ్ ప్రైజస్ అన్ టు అవర్ గాడ్ Good to sing praises unto our God )అనేఈ పేజీని ఏర్పాటు చేసాను. అలాగే ఆధ్యాత్మికమైన ఆత్మీయసందేశములు , చక్కని సాక్ష్యములు ఈ పేజీ ద్వారా పంపించడం జరుగుతుంది ఇవి మీకు మంచిగా ఆనిపిస్తే అనేకమందికి రక్షణార్థముగా మరియు మనకు అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరముగా వుండేట్లు పంపించండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక నా కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకోనుచున్నాను. అందరికి వందనాలు 🙏🙏 మీ సహోదరుడు . అనిల్ కుమార్. కాలింత Anilkumar.kalintha