22/04/2026
🙏జై శ్రీమన్నారాయణ 🙏
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళా శాసనము లతో
మన విజయ కీలాద్రి దివ్య క్షేత్రం లో
ఈరోజు 22-04-2026
జగదాచార్యులు,
భగవద్రామానుజా చార్య స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవము ఎంతో ఘనంగా జరిగినది.
విశేషించి ఉదయం 9:00 గంటల కు రామానుజాచార్య స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం,
అలంకరణ, రామానుజ నూత్తందాది సేవకాలం, అష్టోత్తర శతనామార్చన, ఆలయ మర్యాద, మంగళా శాసనము,తీర్థ, ప్రసాద, గోష్టి.తో ఈ తిరునక్షత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది.
ఎంతో మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్రామానుజా చార్య స్వామి వారి అనుగ్రహాన్ని పొందారు.