20/03/2020
పత్రికా ప్రకటన
KTBSS కార్యాలయంలో ఈ దినం అనగా 20.03.2020 శుక్రవారం ఉదయం 10 .30 ని.లకు పత్రికా సమావేశం నిర్వహించబడినది.
ఈ సమావేశంనకు KTBSS రాష్ట్ర నాయకులు శ్రీ జంగటి అమర్ నాధ్ గారు, టౌన్ బాంక్ అధ్యక్షులు శ్రీ J.L. మురళి గారు, KTBSS ఉపాధ్యక్షులు శ్రీ జంగటి రాంగోపాల్, Dr. M.V. చంద్రశేఖర్, కోశాధికారి శ్రీ K. విజయశేఖర్, కాపు కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ రాయల్ మురళి, రాపా ధనుంజయ, తుమ్మల సూరి, వెన్నెల కృష్ణ,రోల్ల భాస్కర్ ,మసలేటి సుబ్బారాయుడు తదితరులు విచ్చేసి తమ తదుపరి కార్యక్రమాలు విశదీకరించారు.
కొన్ని దశాబ్దాలుగా బలిజ జాతి సామాజిక ఆర్థిక అసమానత్వం నకు లోనై ఐదు శాతం కూడా లేని రెండు అగ్రవర్ణాల చేతిలో పూర్తిగా అనగ ద్రొక్క బడింది. రాజ్యాధికారం లేనందువలన మరియు ఐకమత్యం లోపించుట వలన బలిజ జాతి ఇతర కులాల కు కాపు కాస్తూ వారి మోచేతి నీళ్లు త్రాగే పరిస్థితులు ఏర్పడినాయి. అనంతపురం జిల్లాలో బలిజ సామాజిక వర్గం అధిక శాతంలో ఉన్నప్పటికీ రాజ్యాధికారాన్ని ఉన్నత పదవులను పొందలేకపోయింది.ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలోని 63 మండలాలలోని అనేక బలిజ సంఘాల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడానికి వాటిని ఒక తాటి మీదకు తీసుకురావడానికి KTBSS రాష్ట్ర నాయకులు శ్రీజంగటి అమర్నాథ్ మరియు అనంతపురం మరియు ఇతర మండలాలలోని కుల పెద్దల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా శ్రీ కృష్ణదేవరాయ బలిజ సంక్షేమ సంఘం ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అన్ని మండలాల నుండి అందరు సభ్యుల అభిప్రాయాలను సేకరించడాని కి కొంతమంది బలిజ నాయకులు ఒక షెడ్యూల్ ప్రకారం వారిని కలవడం జరుగుతుంది.
21 - 3 - 2020 - - -తాడిపత్రి
23 - 3 - 2020----- మడకశిర
24 - 3 - 2020---- కదిరి
27 - 3 - 2020----- సింగనమల
28 - 3 - 2020----- రాయదుర్గం, కళ్యాణ దుర్గం,కనేకల్
29 - 3 - 2020----- ఉరవకొండ, గుంతకల్
3 0 - 3 - 2020----- పెనుకొండ,
హిందూపురము
31 - 3 - 2020----- ధర్మవరం, పుట్టపర్తి
1 - 4 - 2020----- రాప్తాడు
2 - 4 - 2020----- అనంతపురము.
అన్ని మండలాల లోని బలిజ నాయకులు అందరూ పై కనపరిచిన షెడ్యూలు ప్రకారం ఆ రోజు నాటి కార్యక్రమమునకు సంఘ సభ్యులను అందరిని సమీకరించి ఈ టూర్ షెడ్యూల్ ను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
5 - 04 - 2020 వ తేదీ ఉదయం 9.30 గంటలకు SJR కన్వెన్షన్ A/c హల్, సత్యసాయి డిగ్రీ కాలేజి ఎదురుగా, బెంగళూర్ రోడ్, అనంతపురం నందు జరుగు *అనంతపురం జిల్లా శ్రీ కృష్ణదేవరాయ బలిజ సంక్షేమ సంఘం* ఆవిర్భావ సభకు అనంతపురం పట్టణంలోని బలిజ నాయకులు, 63 మండలాలలోని అన్ని బలిజ సంఘాల నాయకులు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.
ఇట్లు
శ్రీ జంగటి అమర్ నాథ్
ADSKBSS