23/10/2024
👉 దేవుడు మందిరాన్ని కట్టమని చెప్పాడు.
👉 దేవుడు మందిరానికి స్థలం చూపించాడు.
👉 దేవుని మందిరం కట్టడానికి ధనం కావాలి.
👉 దేవుని మందిరం అంగరంగ వైభవంగా కడదాం.
👉 దేవుని మందిరం కడుతున్నాము ధనం సహాయం చేయండి.
👉 దేవుని మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచండి.
👉 దేవుని మందిరంలో ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి.
👉 దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి సమర్పించుకోండి.
👉 దేవుని మందిరాన్ని గౌరవించండి.
👉 దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోండి.
👉 దేవుని మందిరంలో మౌనంగా ఉండండి.
👉 దేవుని మందిరాన్ని ప్రేమించండి.
👉 ఆయనకు దేవుని మందిరం అంటే ఎంతో ఇష్టం.
👉 ఆమె ఎల్లప్పుడూ దేవుని మందిరంలో ప్రార్థన చేసేది.
👆ఇలాంటి మాటలు కొత్త నిబంధనలో (పత్రికలలో, అపోస్తలుల బోధలో, వారి సంభాషణలలో) మనం ఎంత వెతికినా కనబడవు!
ఇటువంటి లేఖనాలు పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు సంబంధించి పుష్కలంగా కనబడతాయి. కానీ మనం ఇశ్రాయేలీయులము కాదు పాత నిబంధనకు చెందిన వారం అంతకంటే కాదు!
దానికి మించి దేవుని మందిరం అంటే సంఘం అని సంఘమంటే సజీవులమై ఉన్న మనమని, ఆయన జనులని 1 తిమోతి 3:15 లో స్పష్టంగా రాయబడింది.
మనం కూడుకునే స్థలం మందిరం కాదు, అదొక స్థలం అంత వరకే.
👍మన ప్రవర్తన ఎక్కడున్నా పవిత్రంగా కాపాడుకోవాలి.
👍దేవుని ప్రజలను మనం ఎల్లప్పుడూ ప్రేమించాలి.
👍ఎల్లప్పుడూ ఆయన ప్రజల అవసరాలలో పాలు పొందాలి.
👍ఎల్లప్పుడు బీదలకు సహాయం చేయాలి..
👍ఎల్లప్పుడు దేవుని వాక్యానికి లోబడి ఉండాలి.
👍ఎల్లప్పుడు ఆత్మలో ప్రార్థన చేయాలి.
👍ఎల్లప్పుడు దయగలవారమై ఉండాలి.
👍ఎల్లప్పుడు శరీరమును పవిత్రముగా కాపాడుకోవాలి.
👍మన పైనున్న నాయకులను గౌరవిస్తూ వారి వాక్యానుసారమైన బోధ వినాలి.
👍వారి అవసరాలలో (ఇబ్బందులలో) పాలు పొందాలి.
👍ఎల్లప్పుడూ నేర్చుకోవాలి.
👍ఎల్లప్పుడు లేఖనాలను క్షుణ్ణంగా ధ్యానించాలి.
👍ఎల్లప్పుడు సంఘముగా కూడుకోవడం మర్చిపోకూడదు.
*_సురేష్, నడిపల్లి_*