Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham

Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham Brahmarishi Dr.Umar Alisha current head (9th Head) of Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham
(372)

“అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానం వైపు నడిపించే మార్గదర్శకుడు - గురువు”శిష్యుడిలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి, జ్ఞానం అనే...
30/07/2026

“అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానం వైపు నడిపించే మార్గదర్శకుడు - గురువు”

శిష్యుడిలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి, జ్ఞానం అనే వెలుగువైపు నడిపించే మార్గదర్శకుడు గురువు అని, గురువు కేవలం సమాచారం అందించడమే కాకుండా జీవన సత్యాన్ని అర్థం చేసుకునే దారిని చూపుతాడని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం పిఠాపురం
ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేసారు. సముద్రంలో ఉన్న అలలు వేర్వేరుగా కనిపించినా, అవన్నీ నీరే అయినట్లుగా మనుషులు వేర్వేరుగా కనిపించినా, వారి అసలు స్వరూపం ఒకే పరబ్రహ్మ చైతన్యమని పేర్కొన్నారు. నీవు మరియు పరమాత్మ వేర్వేరు కాదు ఇద్దరూ ఒకటే, ఆ పరబ్రహ్మ స్వరూపుడివి నీవే అనే విషయాన్ని గురువు శిష్యుడికి ప్రబోధిస్తాడని దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో తత్త్వమసి అంటారని తెలిపారు. జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని తత్త్వమసి అనే ఈ వాక్యం తెలియజేస్తుందని వెల్లడించారు.

మానవుడు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడంతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాలుపంచుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తుందని
తెలిపారు. సామాజిక నేత్రం, ఆధ్యాత్మిక నేత్రాలను వృద్ధిచేసుకుంటే, తాను కోరుకునే ముక్తికి మార్గం సుగమమౌతుందని అన్నారు. ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీ సాధనను అవలంబించడం ద్వారా మానవుడు తనలోని అరిషడ్వర్గాల ప్రభావాన్ని స్థాయి చేసుకోగలుగుతాడని తెలిపారు. మనస్సును, శరీరాన్ని ఏకీకృతం చేసే శక్తిని ధ్యాన సాధన కల్పిస్తుందని అన్నారు. ఆత్మ పరమాత్మగా పరిణామం చెందే విధానాన్ని ఈ ధ్యానశక్తి చూపుతుందని తెలిపారు. మానవునిలో ఆధ్యాత్మిక జీవన తత్త్వము ఏర్పడాలంటే జ్ఞానాన్ని ప్రసాదించే సద్గురువుల విశిష్టత సమాజంలో విస్తరింపబడాలని అన్నారు.

తదుపరి డాక్టర్ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి దంపతులు సభలో చేసిన అఖండ శంఖారావం సభను రంజింపచేసింది. గురు పౌర్ణమిని పురస్కరించుకొని పీఠం సభ్యులు పీఠాధిపతి ఉమర్ ఆలీషా సద్గురువర్యులకు పాదపూజ
నిర్వహించారు. అనంతరం అహ్మద్ ఆలీషా, ‘అవధాన కళాధర’ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, ఎన్.ఆర్.ఐ. కాకర్లపూడి ఉమా తపస్వి గురువు యొక్క విశిష్టతను తెలుపుతూ సభలో చేసిన ఆధ్యాత్మిక ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పీఠం సభ్యురాలు ఉమా ముకుంద సంగీత పర్యవేక్షణలో సభ్యులు ఆలపించిన కీర్తనలు రంజింప చేసాయి.

🙏

29/07/2026

ఏరువాక పౌర్ణమి సందర్భంగా పిఠాపురం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో సోమవారం (29-6-26)న సస్యవృద్ధి బీజారోపణోత్సవము సభలో  విశిష్ట అత...
06/07/2026

ఏరువాక పౌర్ణమి సందర్భంగా పిఠాపురం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో సోమవారం (29-6-26)న సస్యవృద్ధి బీజారోపణోత్సవము సభలో

విశిష్ట అతిథి రాజమహేంద్రవరం ఎంటమాలజీ కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ రైతు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి తగిన సూచనలు చేశారు.

మరొక విశిష్ట అతిథి పిఠాపురం హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీ వై. సోమశేఖర రావు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ప్రోత్సాహాలను రైతులు సద్వినియోగ పరుచుకోవాలని కోరారు.

మరొక అతిథి నల్గొండ జిల్లా, పోలేపల్లి నుండి ఇన్నోవేటివ్ ఆర్గానిక్ ఫార్మర్ మరియు ఎల్ పి ఆర్ ఆర్గానిక్స్ సీఈవో శ్రీ లోకసాని పద్మా రెడ్డి మాట్లాడుతూ సేంద్రీయ ఉత్పత్తులతో ఆర్థిక అభివృద్ధి ఎలా సాధించాలో తెలియజేశారు.

పతంజలి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి శ్రీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రత్యామ్నాయంగా పంటల గురించి వివరించారు.

మరొక అతిథి రాజమహేంద్రవరం ఆగ్రోమోమీ డి ఏ ఏ టి టి సి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ సమీకృత వ్యవసాయ విధానం గురించి తెలిపారు.

మరొక అతిథి సంజీవి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సొసైటీ సెక్రటరీ, విశాఖపట్నం నుండి శ్రీ పచ్చారి దేవుళ్ళు మాట్లాడుతూ దేశీ విత్తనాల సంరక్షణ గురించి ప్రసంగించారు.

అనంతరం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శ్రీ డా. నడింపల్లి రామగోపాల వర్మ, డ్రోన్లతో వ్యవసాయం, బహుముఖ ప్రయోజనాలు, డ్రోన్ పైలెట్ శిక్షణ గురించి రైతులకు వివరించారు.

తదుపరి పీఠాధిపతుల సోదరులు, విశిష్ట అతిథి శ్రీ అహ్మద్ అలీషా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ప్రతి రైతు బాధ్యత కావాలని పీఠం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంచి ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు.

తదుపరి అతిథులను పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. తదుపరి విశిష్ట రైతులు, పురస్కార గ్రహీత, ముఖ్య అతిథులు పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులను ఘనంగా సత్కరించి పర్యావరణ పరిరక్షణ కొరకు పీఠాధిపతి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమ నిర్వాహకులు శ్రీ ఏ.వి.వి. సత్యనారాయణ సభా వ్యాఖ్యానం చేయగా, శ్రీ ఎన్. టి. వి. ప్రసాద వర్మ వందన సమర్పణతో సభ ముగిసింది. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, ప్రకృతి వ్యవసాయ పారిశ్రామిక వేత్త కెప్టెన్ మల్లిఖార్జున పాల్గొన్నారు మరియు వందలాదిగా రైతులు పాల్గొని, సద్గురు దివ్య బీజాలు పొంది, ఆధ్యాత్మిక వ్యవసాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

”ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదగాలి”“రైతే దేశానికి వెన్నెముక”, “ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్...
06/07/2026

”ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదగాలి”

“రైతే దేశానికి వెన్నెముక”, “ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదగాలి”, “రైతు రాజుగా బ్రతకాల”ని పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. పిఠాపురం స్థానిక శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో సోమవారం (29-6-26) ఏరువాక పౌర్ణమి సందర్భంగా పీఠాధిపతి Dr ఉమర్ అలీషా స్వామి వారు స్వయంగా నాగలి పట్టి పొలం దున్నారు అనంతరం నిర్వహించిన సస్యవృద్ధి బీజారోపణ మహోత్సవంలో అధ్యక్షత వహించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు రైతు సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి రోజున భారతీయ సంస్కృతిని అనుసరించి గోమాతను పూజించి, వ్యవసాయాన్ని రైతు ప్రారంభించే ఆచార పద్ధతిని కొనసాగిస్తూ, పీఠం గత ఏడు సంవత్సరాలుగా ఆధ్యాత్మిక వ్యవసాయం నిర్వహిస్తుందని అన్నారు.

ప్రతి రైతు ప్రకృతిని పరిరక్షించే విధంగా ఆరోగ్యకరమైన రీతిలో ఆధునిక సాధనాలను, ఉపకరణాలను ఉపయోగించుకుని, సేంద్రియ వ్యవసాయం చేసినట్లయితే మంచి ఉత్పత్తులు సాధించవచ్చు అని తెలిపారు. రసాయనాలు కలిపిన ఎరువులను వాడడం ద్వారా భూసారం దెబ్బతిని, క్యాన్సర్ వంటి రోగాలు వ్యాపిస్తున్నాయని అన్నారు. సేంద్రియ ఎరువును తయారు చేసుకుని, ఆధ్యాత్మిక భావనతో వ్యవసాయం చేసినట్లయితే, ఆరోగ్యకరమైన ఉత్పత్తుల ద్వారా ఆయుష్షును పొంది, ఆనందంగా జీవించవచ్చని పిలుపునిచ్చారు. ఎల్ నినో వంటి సంక్షోభాలు ఎదురైనా సద్గురు దివ్య బీజాలతో ఆధ్యాత్మిక వ్యవసాయం చేయడం ద్వారా భగవంతుని కృప ప్రసరింపబడి, ఏవిధమైన నష్టాలు లేకుండా అభౌతిక శక్తిని రక్షణగా పొందవచ్చు అని తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో స్వామివారు ముఖ్య అతిథులతో కలిసి పాల్గొన్నారు.

20/06/2026

Title - బాలల ప్రతిభా ప్రదర్శన - తాత్త్విక బాలవికాస్ వేసవి శిక్షణా శిబిరం 2-5-26

బాల వికాసుల అద్భుత ప్రతిభా ప్రదర్శన! 🎭✨
తాత్త్విక బాల వికాస్ వేసవి శిక్షణా శిబిరం - 2026 లో ప్రతిరోజూ రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు జరిగిన విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. వినోదం మరియు నూతనోత్సాహంతో శిబిరం మొదటి రోజు (2-5-26) ప్రతిభా ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థుల దృశ్యమాలికను వీక్షించండి.

“భగవంతుడిని స్మరిస్తూ దినచర్య ప్రారంభించాలి”పిల్లంకలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ పునః ప్రతిష్ఠలో పాల్గొన్న పీఠాధిప...
20/06/2026

“భగవంతుడిని స్మరిస్తూ దినచర్య ప్రారంభించాలి”

పిల్లంకలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ పునః ప్రతిష్ఠలో పాల్గొన్న పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణం చేస్తూ భగవంతుని స్మరించుకుంటూ దినచర్య ప్రారంభిస్తే, భగవంతుని కృప లభిస్తుందని అన్నారు. బుధవారం (17-6-26) కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంకలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో సద్గురు డా. ఉమర్ ఆలీషా స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పీఠాధిపతికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తదుపరి సద్గురువర్యులు ఆలయాన్ని, యాగశాలను దర్శించారు. ఈ సందర్బంగా వేద పండితులు ఆలయం యొక్క ప్రాముఖ్యాన్ని వివరించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో సద్గురువర్యులు మాట్లాడుతూ ఓంకార స్వరూపమే బ్రహ్మ స్వరూపము, బ్రహ్మ స్వరూపమే రస స్వరూపమని, అదే అహం బ్రహ్మాస్మిగా అనుభవంలో గ్రహించవచ్చు అన్నారు. శారీరక, మానసిక, ఆత్మ తత్త్వాలుగా, అనగా మంత్ర, జ్ఞాన, ధ్యాన తత్త్వాలుగా త్రయీ సాధన ఆచరించి, దేహానికి భుక్తి, మనస్సుకు తృప్తి, ఆత్మకు ముక్తిని పొంది మానవ జన్మకు సార్థకత కల్పించుకోవాలని సద్గురువర్యులు ప్రబోధించారు. ఈ సందర్భంగా శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి శక్తి కేంద్రాన్ని దర్శించి, భగవంతుని ఆశీస్సులు పొందాలని సద్గురువర్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు దాతలు శ్రీ వేలూరి కామేశ్వరశర్మ, దాట్ల బాబీరాజు, సాగి భీమేశ్వరరాజు, ధర్మకర్త సాగి శివరామరాజు, సాగి భీమేశ్వరరావు, సాగి జ్యోతికుమారి తదితరులు పాల్గొన్నారు.

12/06/2026

తాత్త్విక బాలవికాస్ వేసవి శిక్షణా శిబిరం - ప్రారంభోత్సవ సభ
🗓️ 02/05/2026

Address

11-3-42, Pithapuram
East Godavari
533450

Alerts

Be the first to know and let us send you an email when Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham:

Shortcuts

Share