05/02/2023
అంతర్వేది కళ్యాణం లో..పేరూరు వారికి ఎందుకంత ప్రాముఖ్యత.
✓ అంతర్వేది ఉత్సవాల ప్రత్యేక కథనం ✓
14వ శతాబ్దం లో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి....కళ్యాణ చక్రస్నానోత్సవంలో..అనగా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ వారి “చక్రపెరుమాళ్ళు"... సముద్రగామి అయినది... అనగా సముద్రం లో పడి కొట్టుకునిపోయినది... అప్పటి మొగల్తూరు మహారాజా వారు - ఊరురా.. చాటింపు వేయించారు... తపశ్శక్తితో ఎవరైతే శ్రీ వారి చక్రపెరుమాళ్ళని సముద్రం నుండి తీసుకుని వచ్చి..శ్రీ వారి కి సమర్పింస్తారో... వారికి కోరింది ఇస్తామని... చాటింపు వేయించారుట.. అప్పటికే స్వామి వారి చక్రం విషయం పేరూరు గ్రామంలో ని నారసింహేూపాసకులైన " బ్రహ్మ శ్రీ నేమాని సోమనాథ ఈ నృసింహ చైనులు " గారికి స్వామి వారు స్వప్నంలో కనబడి ఈ సంగతి ని వారికి తెలిపి..... చైనులూ! దీనికి నువ్వే సమర్ధుడవి.... అన్నారట... కనుక వారు అప్పటికే(చాటింపు కి ముందుగా నే) తపస్సు ప్రారంభించారుట...... అక్కడ గల జాలరి వారు ఈ విషయాన్ని రాజా వారికి కూడా
తెలిపినారుట.. ఈ విధంగా..మాఘ బహుళ విదియ నాటి లగాయతు...వైశాఖ శుద్ద ఏకాదశి నాడు వరకు తపస్సు కొనసాగినది..ఆ న ఒక కెరటం ద్వారా ఆ చక్ర పెరుమాళ్ళు.. వారి చెంతకు చేరిందట.. అనగా ఆ ఎండలో ఇసుక తిన్న పై ఒంటి కాలుపై తపస్సు.. సామాన్య మైన విషయం గాదుగదా!!
పైగా అన్ని రోజులు..
ఆ చక్రపెరుమాళ్ళు ని శ్రీ వారి కి సమర్పించారుట.. అప్పుడు రాజు గారు
అయ్యా.. విప్రోత్తమా
ఏమి కావలెనో కోరుకోండి... ఆస్తులా... అంతస్తులా....మణిమాణిల్యా
.. చెప్పండి అన్నారుట...
అప్పుడు.. బ్రహ్మ శ్రీ చైనులు గారు
మహారాజా!
అవేమి వద్దు.. ఆ చంద్ర తారార్కం గా శ్రీ వారి కళ్యాణం లో.. పేరూరు వారికి ఒక ప్రత్యేక స్థానం ఇప్పించండి అని కోరారుట... నాటి నుండి నేటి వరకు... కళ్యాణం లో... అన్ని రోజులు కూడా పేరూరు వారికి ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ వస్తోంది... చక్రస్నానము నాడు చక్రపెరుమాళ్ళు ని పేరూరు వారే నెత్తి మీద పెట్టుకుని.. భక్తులకు స్నానం చేయిస్తారు
For more info like & follow :-
Www.Fb.com/antarveditemple
http://www.instagram.com/antarveditemple
#అంతర్వేది
#అంతర్వేదికల్యాణం #అంతర్వేదినరసింహస్వామి #లక్ష్మీనరసింహస్వామి # #అంతర్వేదితీర్ధం #సఖినేటిపల్లి #రాజోలు